Srimad Valmiki Ramayanam
Balakanda Sarga 42
Story of Sagara 5 ( contd )!
బాలకాండ
నలుబదిరెండవ సర్గము
( భగీరథ ప్రయత్నము)
కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీ జనాః |
రాజానం రోచయామాసుః అంశుమంతం సుధార్మికమ్ ||
స|| హే రామా! సగరే కాలధర్మం గతే జనాః ప్రకృతీ సుధార్మికం అంశుమంతం రాజానం రోచయామాసుః |
తా|| ఓ రామా ! సగరుడు కాలధర్మము చేసిన తరువాత జనులందరూ ధార్మికుడైన అంశుమంతుడు రాజు కావలెనని కోరుకొనిరి.
స రాజా సుమహానాసీత్ అంశుమాన్ రఘునందన |
తస్య పుత్త్రో మహానాసీత్ దిలీప ఇతి విశ్రుతః ||
స|| హే రఘునందన ! స అంశుమాన్ రాజా సుమహాన్ ఆశీత్. తస్య పుత్రః దిలీప మహనాశీత్ ఇతి విశ్రుతః |
తా|| ఓ రఘునందన ! ఓ రాజా అంశుమంతుడు రాజు అయ్యెను. అతనియొక్క పుత్రుడు దిలీపుడు గూడా రాజు అయ్యెనని ప్రసిద్ధి.
తస్మిన్ రాజ్యం సమావేశ్య దిలీపే రఘునందన |
హిమవత్ శిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణమ్ ||
స|| హే రఘునందన ! తస్మిన్ దిలీపే రాజ్యం సమావేశ్య పుణ్యే హిమవత్ శిఖరే సుదారుణం తః తేపే |
తా|| ఓ రఘునందన ! ఆ దిలీపునిమీద రాజ్యభరము వేసి అతడు హిమవత్ శిఖరములలో దారుణమైన తపస్సు గావించెను.
ద్వాత్రింశచ్చ సహస్రాణి వర్షాణి సుమహాయశాః |
తపోవనం గతో రాజా స్వర్గం లేభే తపోధనః ||
స|| ద్వాత్రింశత్ సహస్రాణి వర్షాణి తపోవనం గతో రాజా సుమహాయశాః తపోధనః స్వర్గం లేభే |
తా|| ముప్పదిరెండువేల సంవత్సరములు తపోవనమునకు వెళ్ళిన తరువాత ఆ తపోధనుడు స్వర్గస్తుడు అయ్యెను.
దిలీపస్తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధమ్ |
దుఃఖోప హతయా బుద్ధ్యా నిశ్చయం నాధ్యగచ్ఛత||
స|| దిలీపస్తు మహాతేజాః పితా మహం వధం శ్రుత్వా దుఃఖోప హతయా బుధ్యా నిశ్ఛయం నాధ్యగచ్చత |
తా|| దిలీప మహరాజు కూడా పితామహుల వధా వృత్తాంతము విని దుఃఖితుడాయెను కాని ఏమీ నిశ్చయము చేయలేకపోయెను.
కథం గంగావతరణమ్ కథం తేషాం జలక్రియా |
తారయేయం కథం చైతాన్ ఇతి చింతాపరోsభవత్ ||
స|| కథం గంగావతరణం ? కథం తేషాం జలక్రియా ? అయం కథం తారయేత్ చ ఇతి ఏతాన్ చింతాపరో అభవత్ |
తా|| గంగను ఏటుల తీసుకురావలెను ? వారికి తర్పణములు ఏట్లు విడవవలెను? వారికి ఏట్లు ముక్తి కలుగును అని చింతాగ్రస్తుడు అయ్యెను.
తస్య చింతయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః |
పుత్త్రో భగీరథో నామ జజ్ఞే పరమధార్మికః ||
స|| నిత్యం ధర్మేణ విదితాత్మనః తస్య చింతయతో భగీరథోనామ పుత్రో జజ్ఞే ! (సః) పరమధార్మికః |
తా|| నిత్యము ధర్మకార్యములు చేయుచూ అత్మనుగురించి తెలిసినవాడై భగీరథుడను పుత్రుని పొందెను. అతడు ( భగీరథుడు) పరమధార్మికుడు.
దిలిపస్తు మహాతేజా యజ్ఞైః బహుభిరిష్టవాన్ |
త్రింశద్వర్ష సహస్రాణి రాజా రాజ్యమకారయత్ ||
స|| మహాతేజా దిలీపస్తు యజ్ఞైః బహుభిః ఇష్టవాన్ , సః రాజా త్రింశద్వర్ష సహస్రాణి రాజ్యం అకారయత్ |
తా|| ఆ దిలీప మహారాజు యజ్ఞకార్యములపై ఇష్ఠము కలవాడు. అతడు ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసెను.
అగత్వా నిశ్చయం రాజా తేషాముద్దరణం ప్రతి |
వ్యాధినా నరశార్దూల కాలధర్మం ఉపేయవాన్ ||
స|| తేషాం ఉద్ధరణం ప్రతి నిశ్చయం అగత్వా ,(సః) నరశార్దూల వ్యాధినా కాలధర్మం ఉపేయవాన్ |
తా|| ఓ నరశార్దూల ! తన పితామహుల ఉద్ధరణకోసము ఏమియూ నిశ్చయము చేయకుండా ( దిలీపమహరాజు) కాలధర్మము చెందెను.
ఇంద్రలోకం గతో రాజా స్వార్జితేనైవ కర్మణా |
రాజ్యే భగీరథం పుత్త్రమ్ అభిషిచ్య నరర్షభః ||
స|| నరర్షభ ! రాజ్యే భగీరథమ్ పుత్రం అభిషిత్య రాజా స్వార్జితెనైవ కర్మణా ఇంద్రలోకం గతః |
తా|| ఓ నరర్షభ ! రాజ్యమునకు భగీరథును పట్టాభిషేకము చేసి , ఆ మహరాజు తను సంపాదించిన కర్మతో ఇంద్రలోకము పొందెను.
భగీరథస్తు రాజర్షిః ధార్మికో రఘునందన |
అనపత్యో మహాతేజా ప్రజాకామః స చాప్రజః ||
స|| హే రఘునందన ! భగీరథః ధార్మికః రాజర్షిః అనపత్యో అస్తు | మహాతేజా ప్రజాకామః స చ అప్రజః |
తా|| ఓ రఘునందనా! భగీరథుడు ధార్మికుడు, రాజర్షి కాని సంతానము లేని వాడు అయ్యెను. ఆ మహారాజు పుత్రులపై కోరికగలవాడు కాని పుత్రులు లేనివాడు.
మంత్రిష్వాధాయ తద్రాజ్యం గంగావతరణే రతః |
స తపో దీర్ఘమాతిష్ఠత్ గోకర్ణే రఘునందన ||
స|| తత్ రాజ్యం మంత్రిష్వాధాయ గంగావతీర్ణే రతః స గోకర్ణే దీర్ఘం తపః ఆతిష్ఠత్ |
తా|| ఆ రాజ్యము మంత్రులకు ఇచ్చి గంగా అవతీర్ణముకోసము గోకర్ణములో ఘోరమైన తపస్సు చేసెను.
ఊర్ధ్వబాహుః పంచతపా మాసాహారో జితేంద్రియః |
తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిష్ఠతః ||
స|| ( సః) జితేంద్రియః ఊర్ధ్వబాహుః మాసాహారో పంచతపా తస్య ఘోరే తపసి వర్షసహస్రాణి తిష్ఠతః |
తా|| ఇంద్రియములను జయించినవాడు , బాహువులను పైకెత్తి, మాసములో ఒకసారి ఆహరము తీసుకొంటూ, పంచాగ్నులమధ్య ఘోరమైన తపస్సు వెయ్య సంవత్సరములు చేసెను.
అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః |
సుప్రీతో భగవాన్ బ్రహ్మ ప్రజానాం పతిరీశ్వరః ||
తతై స్సురగణైస్సార్థం ఉపాగమ్య పితామహః |
భగీరథం మహాత్మానం తప్యమానమథాబ్రవీత్ ||
స|| రాజ్ఞో మహాబాహో మహాత్మన్ః తస్య అతీతాని భగవన్ ప్రజానాం పతిః ఈశ్వరః బ్రహ్మ సుప్రీతః ( అస్తు)| తతః పితామహః సురగణైస్సార్థం ఉపాగమ్య తప్యమానం మహాత్మానం భగీరథం అథ అబ్రవీత్ |
తా|| మహాత్ముడు మాహాబాహువూ అయిన ఆ రాజుయొక్క అతీతమైన తపస్సుచే సృష్ఠికర్త అయిన బ్రహ్మ మిక్కిలి ప్రీతిచెందెను.
భగీరథ మహాభాగ ప్రీతస్తేsహం జనేశ్వర |
తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత ||
స|| హే మహాభాగ జనేశ్వర భగీరథ తే తపసా చ సుతప్తేన ప్రీతోహం ! హే సువ్రత వరం వరయ |
తా|| ఓ మహాభాగా ! జనేశ్వరా ! భగీరథా ! తీవ్రమైన నీ తపస్సుచే సంతోషపడితిని. ఓ సువ్రతా వరమును కోరుకొనుము .
తమువాచ మహాతేజాః సర్వలోకపితామహమ్ |
భగీరథో మహభాగః కృతాంజలిరుపస్థితః ||
స|| మహాతేజాః భగీరథో మహాభాగః కృతాంజలిః ఉపస్థితః సర్వలోక పితామహం తం ఉవాచ |
తా|| మహాతేజస్సుగల భగీరథుడు కృతాంజలి ఘటించి సర్వలోకములకు పితామహుడైన బ్రహ్మతో ఇట్లుపలికెను.
యది మే భగవన్ ప్రీతో యద్యస్తి తపసః ఫలమ్ |
సగరస్యాత్మజా స్సర్వే మత్త సలిల మాప్నుయుః ||
గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనామ్|
స్వర్గం గచ్ఛేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః ||
స|| యది మే భగవన్ ప్రీతః అస్తి యది తపసః ఫలం అస్తి మత్త సర్వే సగరాత్మజా సలిలమాప్నుయుః | ఏషాం మహాత్మనాం భస్మన్ గంగాయాః సలిలక్లిన్నే సర్వే మే ప్రపితామహః అత్యంతం స్వర్గం గచ్చేయుః |
తా|| హే భగవన్ నాతపస్సుతో తృప్తి చెందినచో ఆ తపో ఫలముగా సగరాత్మజులందరికీ జలములుఅందుగాక. ఆ మహాత్ముల భస్మములు గంగాజలములచేత తడిసిన పిమ్మట మా పితామహులందరూ స్వర్గము పొందుదురు.
దేయా చ సంతతి ర్దేవ నావసీదేత్ కులం చ నః |
ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమే అస్తు వరః పరః ||
స|| దేవ ! నావసీదేత్ నః కులః చ , ఇక్ష్వాకూణాం కులే దేయా చ సంతతి | ఏషః మే అస్తు అపరః వరః |
తా|| ఓ దేవా ! మా కులము ఉండదు , ఇక్ష్వాకు కులములో సంతతి ప్రసాదింపుము. ఇది నా ఇంకొక కోరిక .
ఉక్తవాక్యం తు మహాన్ ఏష భగీరథ మహారథ |
ప్రత్యువాచ శుభాం వాణీం మథురాం మథురాక్షరామ్|
మనోరథో మహానేష భగీరథ మహారథ |
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకుకుల వర్ధన ||
స|| ఏష భగీరథ మహారథ రాజానం ఉక్త వాక్యం తు ప్రత్యువాచ మథురాం మథురాక్షరామ్ | మహారథ భగీరథ ఏష మనోరథః మహాన్ | ఇక్ష్వాకు కులవర్థన ఏవం భవతు | భద్రం తే |
తా|| ఈ విధముగా చెప్పబడిన భగీరథుని మాటలకు మధురముగా మధురాక్షరములతో బ్రహ్మ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. " మహారథ భగీరథ నీ మనోరథము ఉత్తమమైనది. ఇక్ష్వాకు కులము వర్థిల్లుని. నీకు శుభమగును.
ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠా హిమవత్సుతా |
తాం వై ధారయంతుం శక్తో హరస్తత్ర నియుజ్యతామ్ ||
స|| జ్యేష్ఠా హిమవత్ సుతా హైమవతీ గంగా , తాం ధారయంతుం హరః శక్తో , తత్ర నియుజ్యతామ్ !
తా|| హిమవంతుని జ్యేష్ఠపుత్రిక గంగ . ఆమెను ధరించు శక్తి శివునకే గలదు. కనుక ఆయనను ఆశ్రయించవలెను.
గంగాయాః పతనం రాజన్ పృథివీ న సహిష్యతి ||
తాం వై ధారయితుం వీర నాన్యం పశ్యామి శూలినః ||
స|| హే రాజన్ గంగాయాః పతనం పృథివీ న సహిష్యతి | హే వీర తాం ధారయితుం న అన్యం శూలినః పశ్యామి |
తా|| ఓ రాజన్ గంగా ప్రవాహమునకు భూమి తట్టుకొనలేదు. ఓ వీరా ఆమెను భరించుటకు ఇంకో శక్తిమంతుడు నాకు కనపడుటలేదు.
తమేవముక్త్వా రాజానం గంగాం చాభాష్య లోకకృత్ |
జగామ త్రిదివం దేవస్సహ దేవైః మరుద్గణైః ||
స|| తం రాజనం ఏవం ఉక్త్వా గంగాం చ లోకకృత్ చ అభాష్య త్రిదివమ్ దేవస్సహ దెవైః మరుద్గణైః సః జగామ |
తా|| ఈ విధముగా ఆ రాజునకు చెప్పి , గంగకు కూడా లొకహితము చెప్పి దేవతలతోనూ మరుద్గణములతో కూడి బ్రహ్మదేవుడు తిరిగివెళ్ళెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విచత్వారింశ స్సర్గః ||
సమాప్తం ||
|| ఈ విధముగా ఆదికావ్యమైన శ్రీమద్వాల్మీకి రామాయణములోని బాలకాండలో నలుబదిరెండవ సర్గ సమాప్తము ||.
||ఓమ్ తత్ సత్ ||
|| Om tat sat ||