Srimad Valmiki Ramayanam
Balakanda Sarga 51
Satananda tells the story of Viswamitra !!
బాలకాండ
ఏబదియొకటవ సర్గము
( శతానందుడు విశ్వామిత్రుని పూర్వ వృత్తాంతము చెప్పుట)
తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః |
హృష్టరోమా మహాతేజాః శతానందో మహతపాః ||
స||ధీమతః విశ్వామిత్రస్య తస్య తత్ వచనం శ్రుత్వా మహాతేజాః మహాతపాః శతానందః హృష్టరోమా (అభవత్) |
తా|| ధీమతుడైన విశ్వామిత్రుని యొక్క ఆ వచనములను విని మహాతేజోవంతుడు మహా తపోధనుడు( శతానందుడు) పులకితుడయ్యెను.
గౌతమస్య సుతో జ్యేష్ఠః తపసా ద్యోతిత ప్రభః |
రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః ||
స|| గౌతమస్య జ్యేష్టః సుతః తపసా జ్యోతిత ప్రభః రామసందర్శనాదేవ పరం విస్మయం ఆగతః |
తా|| తపశ్శోభలతో వెలుగొందుతున్నఅ గౌతమునియొక్క జ్యేష్ట పుత్రుడు ( శతానందుడు) రామ దర్శనము గురించి విని విస్మయము పొందెను.
స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ|
శతానందో మునిశ్రేష్ఠం విశ్వామిత్రమథాబ్రవీత్ ||
స|| శతానందః నిషణ్ణౌ సుఖాసీనౌ నృపాత్మజౌ సంప్రేక్ష్య మునిశ్రేష్ఠం విశ్వామిత్రం అథ అబ్రవీత్ |
తా|| శతానందుడు సమీపమునే సుఖాసీనిలైన రాజకుమారులను చూచి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రునితో ఇట్లనెను.
అపితే మునిశార్దూల మమ మాతా యశస్వినీ |
దర్శితా రాజపుత్త్రాయ తపో దీర్ఘముపాగతా ||
స|| మునిశార్దూల రాజపుత్రాయ దీర్ఘం తపః ఉపాగతా మమ మాతా తే దర్శితా అపి |
తా|| " హే మునిశార్దూల ! రాజపుత్రుల కోసము దీర్ఘముగా తపమొనరించిన మా అమ్మగారికి వారు దర్శనమిచ్చిరి గదా!"
అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ |
వన్యైరుపాహరత్ పూజాం పూజార్హే సర్వ దేహినామ్ ||
స|| మమ మాతా యశస్వినీ సర్వదేహినాం పూజార్హే మహాతేజా రామే వన్యైః పూజాం ఉపాహరత్ అపి |
తా|| "యశస్విని అగు మా తల్లి సమస్త ప్రాణులకూ పూజింపతగిన మహాతేజోవంతుడైన రాముని వనములో దొరకు సామాగ్రులతో పూజించెను గదా |"
అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం |
మమమాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితమ్ ||
స|| హే మహాతేజో ! మమ మాతుః పురాతనం దైవైన దురనుతిష్టితం యథావృత్తం రామాయ కథితమ్ అపి|
తా|| ఓ మహాతేజా ! మా అమ్మగారికి పూర్వము దైవవశాత్తు జరిగిన సంఘటన గురించి రామునకు చెప్పబడినది కదా |
అపి కౌశిక భద్రం తే గురుణా మమసంగతా |
మమ మాతా మునిశ్రేష్ఠ రామసందర్శనాదితః ||
స|| హే కౌశిక భద్రం తే ! హే మునిశ్రేష్ట మమమాతా రామసందర్శనాత్ ఇతః మమ గురుణా సంగతా అపి|
తా|| ఓ కౌశికా ! ఓ మునిశ్రేష్ఠా ! మా అమ్మ రామసందర్శనము తరువాత మా తండ్రితో ( గురువుతో) చేరినదికదా !
అపి మే గురుణా రామః పూజితః కుశికాత్మజః |
ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః ||
స|| హే కుశికాత్మజః ! మే గురుణా రామః పూజితః | పూజాం ప్రాప్తో మహాతేజాః మహాత్మనః ఇహాగతో అపి|
తా|| ఓ కుశికాత్మజ ! మా తండ్రిగారు రాముని పూజించెనుకదా ! పూజలు అందుకున్న మహతేజోవంతుడు మహాత్ముడు( శ్రీరాముడు) అనుగ్రహించెనా( మాతండ్రిని) !
అపి శాంతేన మనసా గురుర్మే కుశికాత్మజః |
ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః ||
స|| హే కుశికాత్మజః ఇహాగతేన రామేణ మే గురుః శాంతేన మనసా ప్రయతేన అభివాదితః |
తా|| ఓ కుశికాత్మజ ! అనుగ్రహించిన రాముడు మాతండ్రిగారిని ప్రశాంతమైన మనస్సుతో అభివాదమొనర్చెనా !
తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః|
ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్య కోవిదమ్ ||
స|| తస్య తత్ వచనం శ్రుత్వా మహామునిః విశ్వామిత్రః వాక్యజ్ఞో వాక్య కోవిదం శతానందం ప్రతువాచ |
తా|| వాక్యజ్ఞుడు వాక్యకోవిదుడూ అయిన శతానందుని యొక్క ఆ వచనములను విని మహాముని విశ్వామిత్రుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
నాతిక్రాంతం ముని శ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా |
సంగతా మునినా పత్నీ భార్గవేణ రేణుకా||
స|| హే మునిశ్రేష్ఠ ! యత్ కృతా మయా (తత్)కర్తవ్యం నాతిక్రాంతం ! యథా భార్గవేణ రేణుకా తథా మునినా పత్నీ సంగతా |
తా|| ఓ మునిశ్రేష్ఠా ! నేను చేశినపని నా కర్తవ్యము. అంతకు మించి ఏమీలేదు . ఏవిధముగా భార్గవుడు రేణుకతో చేరెనో అదే విధముగా( గౌతమ) ముని తన పత్నితో ( అహల్యతో) చెరెను .
తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితమ్|
శతానందో మహతేజా రామం వచనమబ్రవీత్ ||
స|| తస్య విశ్వామిత్రస్య భాషితం వచనం తత్ శ్రుత్వా శతానందః మహాతేజా రామం వచన్ం అబ్రవీత్ |
తా|| ఆవిశ్వామిత్రుని చే చెప్పబడిన ఆ వచనములను విని శతానందుడు మహాతేజోవంతుడైన రామునితో ఇట్లు పలికెను.
స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తో సి రాఘవ |
విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితమ్ ||
స|| హే నరశ్రేష్ఠ ! స్వాగతం |హే రాఘవ ! అపరాజితం మహర్షిం విశ్వామిత్రం పురస్కృత్య దిష్ట్యా ప్రాప్తోసి |
తా|| ఓ నరశ్రేష్ఠా ! స్వాగతము . ఓ రాఘవా! ఆపరాజితుడైన మహర్షి విశ్వామిత్రుని అనుసరించి భాగ్యఫలము పొందితివి..
అచింత్య కర్మా తపసా బ్రహ్మర్షితులప్రభః |
విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిమ్ ||
స|| మహాతేజా విశామిత్రః అచింత్య కర్మా తపసా బ్రహ్మర్షి తుల ప్రభః ఏనం పరమాం గతిం వేత్స (సః) |
తా|| మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు ఊహించలేని కర్మలతో తపస్సుతో బ్రహ్మర్షి అయినవాడు. ఆయన యొక్క మార్గములను తెలిసుకొన తగును.
నాస్తి ధన్యతరో రామ త్వత్తోsన్యోభువి కశ్చన |
గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః ||
స||రామ త్వత్ అన్యః ధన్యతరో నాస్తి భువి కశ్చన | కుశికపుత్రస్తే యేన మహత్తపః తప్తం గోప్తా |
తా|| ఓ రామా ! నీ కన్న ధన్యమైన వాడు ఈ భువిలో లేడు. ఈ కుశికపుత్రుడు మహత్తరమైన తపస్సుచేసినవాడు . నీ రక్షకుడు .
శ్రూయతాంచాభిదాస్యామి కౌశికస్య మహాత్మనః |
యథాబలం యథావృత్తం తన్మే నిగదతః శృణు ||
స|| మహాత్మనః కౌశికస్య యథా బలం యథా వృత్తం తన్ మే అభిదాస్యామి శ్రూయతాం నిగదతః శ్రుణు |
తా|| అ మహాత్ముడైన కౌశికుని యొక్క బలము జరిగిన వృత్తాంతముగురించి నేను మీకు సమగ్రముగా వినిపించెదను వినుడు.
రాజాsభూదేష ధర్మాత్మా దీర్ఘకాలమరిందమః |
ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః ||
స|| ఏష ధర్మాత్మా అరిందమః దీర్ఘకాలం రాజా అభూత్ | ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం హితే రతః |
తా|| ఈయన ధర్మాత్ముడు. శత్రువులను అణిచినవాడు. దీర్ఘకాలము రాజుగా వుండెను. ధర్మజ్ఞుడు. సమస విద్యలను నేర్చినవాడు . ప్రజలహితము కోరువాడు.
ప్రజాపతిసుతశ్చాసీత్ కుశో నామ మహీపతిః |
కుశస్య పుత్త్రో బలవాన్ కుశనాభ స్సుధార్మికః ||
స|| కుశోనామ మహీపతిః ప్రజాపతిసుతః ఆసీత్ | కుశస్య పుత్రః బలవాన్ కుశనాభః సుధార్మికః |
తా|| కుశు డను మహీపతి ప్రజాపతి యొక్క సుతుడు. కుశునియొక్క పుత్రుడు బలవంతుడైన ధార్మికుడైన కుశనాభుడు.
కుశనాభసుతశ్చాసీత్ గాధిరిత్యేవ విశ్రుతః |
గాధేః పుత్త్రో మహాతేజాః విశ్వామిత్రో మహామునిః ||
స|| కుశనాభస్య సుతః గాధిః ఇతి ఏవ విశ్రుతః | గాధేః పుత్రః మహాతేజాః విశ్వామిత్రః మాహామునిః ఆసీత్ |
తా|| కుశనాభునియొక్క సుతుడు గాధి అని వినికిడి. ఆ గాధియొక్క పుత్రుడు మహాతేజోవంతుడైన మాహాముని విశ్వామిత్రుడు.
విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీమ్ |
బహువర్ష సహస్రాణి రాజా రాజ్య మకారయత్ ||
స|| విశ్వామిత్రః మహాతేజాః మేదినీమ్ పాలయామాస | రాజా బహువర్ష సహస్రాణి రాజ్యం అకారయత్ |
తా || మహాతేజోవంతుడైన విశామిత్రుడు భూమిని పాలించెను. ఆ రాజు వేలకొలదీ సంవత్సరములు రాజ్యమును పరిపాలించెను.
కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీమ్|
అక్షౌహిణీపరివృత్తః పరిచక్రామ మేదినీమ్ ||
స|| కదాచిత్ మహాతేజః అక్షౌహిణీ పరివృత్తః వరూధినీ యోజయిత్వా మేదినీం పరిచక్రామ |
తా|| ఒకసారి ఆ మహా తేజోవంతుడు ఒక అక్షహౌణి బలముతో కలిసి భూమండలము జయించి చుట్టూ తిరిగెను.
నగరాణి స రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ |
ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామ హ ||
స|| హే రామ ! సః నగరాణి రాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ క్రమశో విచరన్ ఆశ్రమాన్ జగామ హ |
తా|| ఓ రామా అతడు నగరములను, రాష్ట్రములను, నదులనూ అదేవిథముగా పర్వతములను తిరుగుచూ ఒక ఆశ్రమమునకు చేరెను.
వశిష్ఠస్యాశ్రమపదం నానా వృక్షసమాకులమ్ |
నానామృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితమ్ ||
స|| నానా వృక్ష సమాకులం నానామృగగణాకీర్ణమ్ సిద్ధచారణ సేవితం వశిష్ఠస్య ఆశ్రమపదం ( జగామ)|
తా|| నానా వృక్షములతో కలిసివున్న అనేక మృగములతో నిండియున్న సిద్దులచే చారణులచే సేవింపబదుచున్న వశిష్ఠాశ్రమపదమునకు చేరెను.
దేవదానవ గంధర్వైః కిన్నరైరుపశోభితమ్ |
ప్రశాంతహరిణాకీర్ణం ద్విజసంఘనిషేవితమ్ ||
స||( తత్ ఆశ్రమపదం) దేవ దానవ గంధర్వైః కిన్నరైః ఉపశోభితం ప్రశాంత హరిణా కీర్ణం ద్విజసంఘ నిషేవితం|
తా|| ఆ ఆశ్రమపదము దేవ దానవ గంధర్వ కిన్నరులచే అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగా లేళ్ళ గుంపులతో నిండియుండెను. పక్షులగుంపులతో నిండియుండెను.
బ్రహ్మర్షిగణ సంకీర్ణం దేవర్షిగణ సేవితమ్ |
తపశ్చరణ సంసిద్ధైః అగ్నికల్పైర్మహాత్మభిః ||
స|| ( తత్ ఆశ్రమపదం) బ్రహ్మర్షి గణ సంకీర్ణం దేవర్షి గణ సేవితం తపశ్చరణ సంసిద్ధైః అగ్ని కల్పైః మహాత్మభిః.
తా|| ఆ అశ్రమపదము బ్రహ్మర్షి గణములతో, దేవర్షి గణములతో సేవింపబడుచుండెను. అచటి ఋషులు తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలె తేజోమూర్తులు.
అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా |
ఫలమూలాశనైర్దాంతైః జితరోషైర్జితేంద్రియైః ||
స|| (తత ఆశ్రమపదం) అభక్షైః వాయుభక్షైశ్చ తథా శీర్ణ పర్ణా శనైః ఫలమూలాశనైః దాంతైః జితరోషైః జితేంద్రియైః ( సేవితం)
తా || ఆ ఆశ్రమపదము నిరాహార దీక్షలో నున్నవారు, వాయువుమాత్రము భక్షించువారు, పండి రాలిన పత్రములను భక్షించువారు, ఫలములు మూలములను ఆహారము గా గలవారు, దూమ్పలే తినువారు , రోషమును జయించినవారు, ఇంద్రియములను జయించినవారు కలరు.
ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమ పరాయణైః |
అన్యైర్వైఖానసైశ్చైవ సమంతా దుపశోభితమ్ ||
స|| ఋషిభిః వాలఖిల్యైశ్చ అన్యైః వైఖానసైశ్చ జప హోమ పరాయణైః సమంతాత్ ఉపశోభితమ్ |
తా|| ఆ ఆశ్రమపదము ఋషులు, వాలఖిల్యులు, వైఖానసులు , జపహోమపరాయణులతో శోభిల్లుచుండెను.
వశిష్ఠాశ్రమపదం బ్రహ్మలోకమివాపరం |
దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహబలః ||
స|| వశిష్టాశ్రమపదం అపరం బ్రహ్మలోక మివ ( అస్తి) (తం) జయతాం శ్రేష్ఠః మహాబలః విశ్వామిత్రః దదర్శ
తా|| ఆ వశిష్ఠాశ్రమపదము ఇంకొక బ్రహ్మలోకమువలే నుండెను. అట్టి ఆశ్రమమును విజేతలలో శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు దర్శించెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకపంచాశ స్సర్గః ||
సమాప్తం||
||ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో యాభైయొకటవ సర్గ సమాప్తము||
|| ఓమ్ తత్ సత్ ||
|| om tat sat ||