Srimad Valmiki Ramayanam
Balakanda ..బాలకాండ
Chapter 5 ..ఐదవ సర్గ . City of Ayodhya !!
With Sanskrit text in Devanagari , Telugu and Kannada
బాలకాండ
ఐదవ సర్గ
సర్వాపూర్వమియం యేషాం ఆసీత్ కృత్స్నా వసుంధరా |
ప్రజాపతిం ఉపాదాయ నృపాణాం జయశాలినామ్ ||
యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః |
షష్ఠిః పుత్ర సహస్రాణి యం యాంతం పర్యవారయన్ ||
తా|| ఈ సమస్త భూమండలము ప్రజాపతి మొదలుకుని చాలామంది జయశీలురైన రాజులు పరిపాలించిరి.వారిలో సగరుడు అను రాజు సుప్రసిద్ధుడు. అ సగరుని అరువదివేల కుమారులు సాగరము తవ్విరి
ఇక్ష్వాకూణాం ఇదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్|
మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతమ్ ||
తదిదం వర్తయిష్యావః సర్వం నిఖిలమాదితః |
ధర్మకామార్థ సహితం శ్రోతవ్యం అనసూయయా ||
తా|| అట్టి ఈ ఇక్ష్వాకు వంశములో పలువురు మాహాత్ములు జన్మించిరి. అట్టి రాజుల కథయే రామాయణము అనబదడినది. అది పూర్తిగా చెప్పుచున్నాము . అది ధర్మ కామర్థములను ప్రతిపాదించును . నిశ్చలమనస్సుతో వినతగినది.
కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్ఠః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ ||
అయోధ్యానామ నగరీ తత్రాస్సీల్లోకవిశ్రుతా |
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం ||
అయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణివిస్తీర్ణా సు విభక్తమహాపథా ||
తా|| సరయూనదీతీరములో కోసల అను పేరుగల దేశము కలదు. అది ధనధాన్యములతో సంతుష్ఠులైన జనులతో కలదు.
అచ్చట అన్ని లోకములలో ప్రసిద్దమైన అయోధ్యా అను పేరుగల నగరము కలదు. అది మానవేంద్రుడైన మను స్వయముగా నిర్మించెను. ఆ నగరము పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు గలగి మిక్కిలి విశాలముగా మహావీధులతో విలసిల్లు చున్నది.
రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా |
ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః ||
తాం తు రాజా దశరథో మహారాష్ట్ర వివర్థనః |
పురీమావాసయామాస దివం దేవపతిర్యథా ||
కవాటతోరణవతీం సువిభక్తాంతరాపణామ్ |
సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వ శిల్పిభిః ||
సూతమాగధ సంబంధాం శ్రీమతీం అతులప్రభామ్|
ఉచ్చాట్టాలధ్వజపతీం శతఘ్నీశతసంకులామ్ ||
తా||విడివిడిగా విశాలముగా నున్న పెద్ద రాజమార్గములు జలముతో తడిసిన పుష్పములతో నిండి శోభించుచున్నవి . అట్టి రాజ్యమును దశరథమహారాజు ఇంద్రుడు స్వర్గమును వృద్ధి చేసినటుల మరింత వృద్ధిచేసెను. ఆ పురము ద్వారములతోడనూ తోరణములతోడనూ , వరుసలుగా నిర్మించిన అంగళ్ళతోనూ శోభించుచుండెను. అచట అన్ని రకముల యంత్రములు ఆయుధములు కలవు. అన్ని కళలో నిపుణులైన శిల్పులు కలరు. అందు స్తుతి పాఠకులు వందిమాగధులు కలరు. ఆ నగరము లక్ష్మీ సంపదలతో శోభిల్లుచుండెను. ఏత్తైన కోట బురుజులతో , ధ్వజములతో , వందలకొలదీ శతఘ్నులతో విరాజిల్లుచుండెను.
వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీమ్|
ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలామ్ ||
దుర్గ గంభీర పరిఘాం దుర్గాం అన్యైః దురాసదామ్ |
వాజీ వారణ సంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా ||
సామంత రాజ సంఘైశ్చ బలికర్మభిరావృతామ్ |
నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్ ||
ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్ |
కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీమ్||
తా|| ఆ నగరము కళాకుశలురైన నటుల సంఘములతో శోభిల్లిచుండెను. అచట మామిడిపండుతోటలు, చుట్టూ వడ్డానమువలె ప్రాకారము గలవు. దుర్గము గంభీరమైన పరిఘతో కూడి శతృవులకు దుర్భేద్యముగా వుండెను. ఆ నగరము ఏనుగులు అశ్వములు వృషభములు ఒంటెలు తో నిండియుండెను. పన్నులు చెల్లించుటకు వచ్చిన సామంతరాజుల సంఘములతో నిండియుండెను. అనేక దేశములనుంచి క్రయవిక్రయముల కొ్రకై వచ్చిన వ్యాపరులతో నిండియుండెను. రత్నములతో నిండిన రాజగృహములతో, పర్వతములతో, అంతస్తులతోగూడిన మేడలతోను ఇంద్రునియొక్క అమరావతి వలే శోభిల్లుచుండెను.
చిత్రాం అష్టపదాకారాం వరనారీ గణైర్యుతామ్ |
సర్వ రత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్ ||
గృహగాఢానువిచ్చిద్రాం సమభూమౌ నివేశితామ్ |
శాలితండులసంపూర్ణాం ఇక్షుకాండరసోదకామ్ ||
దుందుభీభిః మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా |
నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్ ||
విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి |
సునివేశిత వేశ్మాంతం నరోత్తమ సమావృతమ్ ||
తా|| అష్టపదాకారములో నున్న గృహములతోనూ , అందమైన నారీమణులతోవున్న గృహములతోనూ, అన్నిరకములైన రత్నములతో ఆకాశము అంటుచున్నభవనములతో ఆ నగరము శోభిల్లుచుండెను. అచటి గృహస్థుల ఇళ్ళు ఎట్టి దోషములు లేకుండా సమస్థలముపై నిర్మింపబడియుండెను. మంచి వరిబియ్యముతో మధురమైన చెఱుకురసపు జలములతో సమృద్ధిగా శోభిల్లుచుండెను. దుందుభులనాదముతో మృదంగధ్వనులతో వీణానాదములతో మద్దెల ధ్వనులతో అ మహానగరము మాఱుమోగుచుండెను. సిద్ధపురుషులకు తపో ఫలముగా లభించిన దివ్యమైన భవనములవలె ఆ నగరమునందలి గృహములు బారులు తీరి ఉత్తములగు మనుష్యులతో నిండియుండెను.
యే చ బాణైర్న విధ్యంతీ వివిక్తం అపరాపరమ్ |
శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః ||
సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే |
హంతారో నిశితైః శస్త్రైః బలాద్బాహుబలాదపి ||
తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహరథైః |
పురీం ఆవాసయామాస రాజా దశరథస్తదా ||
తా|| ఆ నగరమందలి యోధులు శస్త్ర అస్త్ర విద్యలలో ఆరితేరినవారు. సమర్ఠులు . శబ్దభేధివిద్యా నిపుణులు. చేతితోనే యుద్ధముచేయగలవారు . కాని వారు నిస్సహాయులు , ఒంటరిగానున్నవారిని పారిపోవుచున్నవారిని చంపెడువారు కాదు. వనమునందు మత్తిల్లి గర్జించు సింహములను , పెద్దపులులను, అడవి పందులను , ఆ ధీరులు తమశస్త్రములతో బాహుబలములతో సంహరించుచుండిరి. అట్టి వేల కొలది యోధులతో నిండియున్న ఆ నగరమును ఆ దశరథమహారాజు పరిపాలించుచుండెను.
తామగ్నిమద్భిః గుణవద్భిరావృతాం
ద్విజోత్తమైః వేద షడంగ పారగైః |
సహస్రదైస్సత్య రతైర్మహాత్మభిః
మహర్షికల్పైః ఋషిభిశ్చ కేవలైః ||
తా|| అచటి ద్విజోత్తములు నిత్యాగ్నిహోతృలు, గుణసంపన్నులు , వేదవేదాంగములందు పండితులు. సత్యము పలుకుటలో నిరతులు. కొల్లలుగా దానము చేయువారు. మహర్షులతో సమానులు. వారు సాక్షాత్తుగా మహర్షులే !
|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే
ఆదికావ్యే బాలకాండే పంచమ సర్గః
సమాప్తం||
|| శ్రీమద్వాల్మీకి రామాయణములో ఇదవ సర్గ సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||
|| om tat sat ||