||Purusha Suktam||

||పురుషసూక్తం - శ్లోక తాత్పర్యములు||

||పురుషసూక్తం||

||శాంతి మంత్రము||
ఓమ్ తచ్చం యోరావృణీమహే|గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే|
దైవీ స్వస్తిరస్తు నః| స్వస్తిర్మానుషేభ్యః | ఊర్థ్వం జిగాతు భేషజం|
శం నో అస్తు ద్విపదే | శం చతుష్పదే||
ఓమ్ శాంతిః శాంతిః శాంతిః||

తా|| ఎవరు మంగళకరమును ప్రసాదిస్తారో ఆ భగవంతుని ప్రార్థిస్తాము.
యజ్ఞము చక్కగా నెరవేర ప్రార్థిస్తాము.
యజ్ఞము నిర్వర్తించే వారికొఱకై ప్రార్థిస్తాము.
మనకు దేవతలు శుభము చేయుగాక.
మానవులందరికి మేలు జరుగు గాక.
చెట్టు చేమలు ఊర్ధ్వముఖముగా పెరుగుగాక.
మన వద్దవున్న ద్విపద జీవులకు మంగళమగు గాక.
చతుష్పాద జీవులకు మంగళమగుగాక.||

ఓమ్ సహస్ర శీర్షాపురుషః|
సహస్రాక్షః సహస్రపాత్|
సభూమిం విశ్వతో వృత్వా|
అత్యతిష్ఠత్ దశాంగుళమ్||1||

తా|| ఆ పురుషుడు వేయి తలలు కలవాడు.
వేలాది కన్నులు వేలాది పాదములు కలవాడు.
ఆయన భూమండలము అంతయూ వ్యాపించి,
పది అంగుళములు అధిగమించి నిలిచాడు.

పురుష ఏ వేదగ్‍ం సర్వమ్
యద్భూతం యచ్చభవ్యం|
ఉతామృతత్వస్యేశానః|
యదన్నేనాతిరోహతి||2||

తా|| మునుపు ఏది వున్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం ఆ పురుషుడే.
మరణము లేని ఉన్నతిస్థితికి అధిపతి అయినవాడు ఆయనే.
ఎందుకు అంటే ఆయన ఈ ప్రపంచాన్ని అధిగమించాడు కనక.

ఏతావానస్య మహిమా|
అతో జ్యాయాగ్‍శ్చ పూరుషః|
పాదోఽస్య విశ్వా భూతాని|
త్రిపాదస్యామృతం దివి||3||

తా|| ఇదంతా ఆయన మహిమ.
కాని ఆ పురుషుడే వీటికంటే శ్రేష్ఠుడు.
విశ్వములో ప్రాణులన్నీ ఆయనలో పావు భాగము.
ఆయన ముప్పావు భాగము మరణములేని దివిలో వున్నది.

త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః|
పాదోఽస్యేహాఽఽభవాత్పునః|
తతో విష్వజ్‍వ్యక్రామత్|
సాశనానశనే అభి||4||

తా|| పురుషుని ముప్పావువంతు భాగము పైన నెలకొని వున్నది.
తక్కిన పావు భాగము ఈ ప్రపంచముగా ఆవిర్భవించినది.
తరువాత ఆయన ప్రాణుల జడపదార్థాలన్నిటిలో వ్యాపించెను.

తస్మాత్ విరాట్ అజాయత|
విరాజో అధి పూరుషః|
స జాతో అత్యరిత్యత|
పశ్చాత్ భూమిమ్ అధో పురః||5||

తా|| ఆ అదిపురుషుని నుండి బ్రహ్మాండము సముద్భవించినది.
బ్రహ్మాండము తో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు.
తదనంతరము ఆయన భూమిని సృజించాడు.
పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.

యత్పురుషేణ హవిషా|
దేవా యజ్ఞమతన్వత|
వసంతో అస్యాసీదాజ్యమ్|
గ్రీష్మ ఇధ్మః శరత్ హవిః||6||

తా|| పురుషుని ఆహుతి వస్తువుగా తీసుకొని,
దేవతలు నిర్వహించిన యజ్ఞానికి
వసంతకాలము నెయ్యిగను, గ్రీష్మ కాలము వంట చెరుకు గను
శరత్కాలము నైవేద్యముగను అయినవి.

సప్తాస్యాన్ పరిధయః|
త్రిః సప్త సమిధః కృతాః|
దేవాయద్యజ్ఞం తన్వానాః|
అబధ్నున్పురుషం పశుమ్||7||

తా||ఈ యజ్ఞానికి పంచ భూతాలు రాత్రి పగలు కలిపి ఏడూ పరిథులైనవి.
ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలు అయినవి.
దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమపశువుగా కట్టారు.

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్|
పురుషం జాతమగ్రతః|
తేనా దేవా అజయంత|
సాధ్యా ఋషయశ్చ యే||8||

మొదట ఉద్భవించిన ఆ యజ్ఞపురుషుడైన బ్రహ్మపై నీళ్ళు జల్లారు.
పిదప దేవతలూ సాధ్యులు, ఋషులు ఎవరెవరున్నారో
ఆ యావన్మందీ యాగము కొనసాగించారు.

తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః|
సంభృతం వృషద్రాజ్యమ్|
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్|
అరణ్యాన్గ్రామ్యాశ్చ యే||9||

తా|| ప్రపంచ యజ్ఞమైన ఆ యాగములో నుంచి
పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించినది.
పక్షులను, మృగాలనుసాధు మృగాలను (బ్రహ్మ) సృజించెను.

తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః|
ఋచః సామాని జజ్ఞిరే|
ఛందాగ్‍ంసి జజ్ఞరే తస్మాత్ |
యజుః తస్మాదజాయత|| 10||

తా|| ప్రపంచ యజ్ఞమైన ఆ యాగములో నుంచి
ఋగ్వేద మంత్రాలు సామవేద మంత్రాలు,
గాయత్రీ మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి.
దానినుండే యజుర్వేదము సముద్భవించినది

తస్మాదశ్వా అజాయంత|
యే కే చోభయాదతః|
గావో హ జజ్ఞిరే తస్మాత్|
తస్మాత్ జ్జాతా అజావయః||11||

తా|| అందులో నుండే గుర్రాలు,
రెందువరసల దంతాలు గల మృగములు,
పశువులు, గొర్రెలు గేదలు ఉద్భవించాయి.

యత్పురుషం వ్యద్ధుః|
కతిధా వ్యకల్పయన్|
ముఖం కిమస్య కౌ బాహూ|
కావూరూ పాదావుచ్యేతే||12||

తా|| బ్రహ్మను దేవతలు బలి ఇచ్చినప్పుడు
ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు?
ఆయన ముఖము ఏదిగా అయినది?
చేతులుగా ఏది చెప్పబడినది?
తొడలుగా పాదాలుగా ఏవి చెప్పబడినవి?

బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్|
బాహూ రాజస్య కృతః|
ఊరూ తదస్య యద్వైశ్యః|
పద్భ్యా‍గ్‍ం శూద్రో అజాయత||13||

తా|| ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది.
చేతులు క్షత్రియుడిగా అయినవి.
తొడలు వైశ్యునిగా అయినవి.
ఆయన పాదాలనుండి శూద్రుడు ఆవిర్భవించెను.

చంద్రమా మనసో జాతః |
చక్షోః సూర్యో అజాయత|
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ|
ప్రాణాద్వాయురజాయత||14||

తా|| మనస్సునుండి చంద్రుడు ఆవిర్భవించెను.
కంటినుండి సూర్యుడు, ముఖమునుండి ఇంద్రాగ్నులు ఉద్భవించారు.
ప్రాణమునుండి వాయువు ఉత్పన్నమైనాడు.

నాభ్యాదాసీత్ అంతరిక్షమ్|
శీర్షో ద్యౌః సమవర్తత|
పద్భ్యాం భూమిర్దిశః శ్రోతాత్|
తథా లోకాగ్‍ం అకల్పయన్||15||

తా|| నాభినుండి అంతరిక్షము , శిరస్సునుండి స్వర్గము ఉద్భవించినవి.
పాదాలనుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్నమైనవి.
అట్లే లోకాలన్నీ ఉద్భవించినవి.

వేదాహమేతం పురుషం మహాంతమ్|
అదిత్యవర్ణం తమసస్తుపారే|
సర్వాణి రూపాణి విచిత్య ధీరః |
నామాని కృత్వాఽభివదన్ యదాస్తే||16||

తా|| సమస్త రూపాలను సృష్ఠించి , పేర్లను కూర్చి,
ఏ పురుషుడు క్రియా శీలుడై వుంటూ,
మహిమాన్వితుడు, సూర్యునివలే ప్రకాశించు,
అంధకారమునకు సుదూరుడు అయిన పురుషుని,
నేను తెలిసికొన్నాను.

దాతా పురస్తాత్ యముదాజహార|
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః|
తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి|
నాన్యః పంథా అయనాయ విద్యతే||17||

తా|| ఏ పురుషుని ( భగవంతుని) బ్రహ్మ ఆదిలో పరమాత్మఅని గ్రహించి చెప్పాడో,
ఇంద్రుడు నాలుగు దిశలలో చక్కగా దర్శించాడో,
ఆయనను తెలిసికొనిన వాడు,
ఇక్కడే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
మోక్షానికి ఇంకో మార్గము లేదు.

యజ్ఞేన యజ్ఞమజయంత దేవాః|
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్|
తే హ నాకం మహిమానః సచంతే|
యత్రపూర్వే స్వాధ్యాః సంతి దేవాః||18||

తా|| దేవతలు ఈ యజ్ఞము ద్వారా భగవంతుని ఆరాధించారు.
అవి ప్రప్రధమ ధర్మాలుగా రూపొందాయి.
ప్రారంభములో ఎక్కడ యజ్ఞము ద్వారా భగవంతుని అరాధించిన దేవతలు వశిస్తున్నారో,
ధర్మమును ఆచరించే మహాత్ములు ఆ వున్నత లోకాన్ని పొందుతారు.

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ|
విశ్వకర్మణః సమవర్తతాధి|
తస్య త్వష్ఠా విదధత్ రూపమేతి|
తత్ పురుషస్య విశ్వమాజానమగ్రే||19||

తా|| నీటినుండి భూమియొక్క సారమునుంచి ప్రపంచము ఉద్భవించినది.
ప్రపంచమును సృష్టించిన భగవంతుని నుండి శ్రేష్టుడు ( బ్రహ్మ) ఉద్భవించెను.
భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని రూపొందించి దానిలో వ్యాపించి వున్నాడు.
బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి ఆదిలో ఉద్భవించినది.

వేదాహమేతం పురుషం మహాన్తం|
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్|
తమేవం విద్వానమృత ఇహ భవతి|
నాన్యః పంథా విద్యతేఽయనాయ||20||

తా|| మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు ,
అంధకారమునకు సుదూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును.
ఆయనను ఇలా తెలుసుకొనువాడు ఇక్కడ ముక్తుడు అవుతాడు.
ముక్తికి ఇంకొక మార్గము లేదు.

ప్రజాపతిశ్చరతి గర్భే అంతః|
అజాయమానో బహుథా విజాయతే|
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్|
మరీచీనాం పదమిచ్చంతి వేధసః|| 21||

తా||భగవంతుడు ప్రపంచములో క్రియాశీలుడై వరలు తున్నాడు.
జన్మలేనివానిగా వుంటు అనేక రూపములతో ఉద్భవిస్తున్నాడు.
ఆయన నిజస్వరూపమును మహాత్ములు ఎరుగుదురు.
బ్రహ్మవంటివారు మరీచి మొదలగు మహాత్ముల పదవిని అభిలషిస్తున్నారు.

యో దేవేభ్య అతపతి|
యో దేవానాం పురోహితః|
పూర్వో యో దేవేభ్యో జాతః|
నమో రుచాయ బ్రాహ్మయే||22||

తా|| ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో,
ఎవరు దేవతల గురువుగా భాసిస్తున్నాడో,
ఎవరు దేవతలకంటే పూర్వమే ఉద్భవించాడో,
అ ప్రకాశమైన భగవంతునికి నమస్కారము.

రుచం బ్రాహ్మం జనయంతః|
దేవా అగ్రే తదబ్రువన్|
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్|
తస్య దేవా అసన్ వసే||23||

తా|| భగవంతుని గురించి సత్యాన్ని తెలిపేటప్పుడు,
దేవతలు ఆదిలో ఇలా అన్నారు.
భగవంతుని అన్వేషించే వాడు ఎవరైనప్పటికి,
ఇలా తెలిసికొన్నాడంటే, అతడికి దేవతలు వశవర్తులై ఉంటారు.

హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ|
అహో రాత్రే పార్శ్వే|
నక్షత్రాణి రూపమ్|
అశ్వినౌ వ్యాత్తమ్| 24||

తా|| హ్రీ దేవి , లక్ష్మీ దేవి పత్నులు.
రేయింబవళ్ళు నీ పార్స్వాలు .
నక్షత్రాలు నీ దివ్య రూపము.
అశ్వినీ దేవతలు నీ వికసిత వదనము.

ఇష్టం మనిషాణ|
అముం మనిషాణ|
సర్వం మనిషాణ|| 25||

మా కోరికలను ప్రసాదించి కటాక్షించు.
ఈ ప్రపంచ సుఖాన్ని ప్రసాదించి కటాక్షించు.
(ఇహపరాలలో) సమస్తాని ప్రసాదించి కటాక్షించు.

ఓమ్ |
తచ్చం యోరావృణీ మహే|
గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే|
దైవీ స్వస్తిరస్తు నః|
స్వస్తిర్ మానుషేభ్యః|
ఊర్ధ్వం జిగాతు భేషజమ్|
శం నో అస్తు ద్విపదే|
శం చతుష్పదే|
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

|| Om tat sat ||