||సుందరకాండ ||

||పదకొండవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 11 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకాదశస్సర్గః

అవధూతాయ చ తాం బుద్ధిం బభూవాస్థిత తదా|
జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః||1||

స|| మహాకపిః తాం బుద్ధిం అవధూయ అవస్థితః బభూవ| సీతాం ప్రతి అపరం చింతాం జగామ||

ఆ మహాకపి అ అలోచన తిరస్కరించి అక్కడ ఆగిపోయెను. సీత గురించి ఇంకొక విధముగా అలోచనలో పడెను

న రామేణ వియుక్తా సా స్వప్తు మర్హతి భామినీ|
న భోక్తుం నాప్యలంకర్తుం న పానముపసేవితుమ్||2||
నాన్యం నరముపస్థాతుం సురాణామపి చేశ్వరీమ్|
న హి రామః సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి||3||

స|| భామినీ రామేణా వియుక్తా స్వప్తుం న అర్హతి | భోక్తుం న | న అలంకర్తుం | న పానం ఉపసేవితుమ్|| న అన్యం నరం ఉపస్థాతుం సురాణాం ఈశ్వరమ్ అపి న | రామః సమః త్రిదశేష్వపి న కశ్చిత్ విద్యతే||

రాముని విరహముతో ఆ దేవి నిద్రపోలేదు. భుజింపలేదు. అలంకరించుకొనలేదు. పానములు గైకొనలేదు. సురలలోని ఈశ్వరుడైన గాని ఇంకొక నరుని సమీపించదు. రాముని తో సమానులు దేవులలో కూడా లేరు.

అన్యేయమితి నిశ్చిత్య పానభూమౌ చచార సః|
క్రీడితే నాపరాః క్లాంతా గీతేన చ తథాsపరాః||4||
నృత్తేన చాపరాః క్లాంతాః పాన విప్రహతస్తథా|
మురజేషు మృదంగేషు పీఠికాసు చ సంస్థితాః||5||

స|| సః అయం అన్యః ఇతి నిశ్చిత్య పానభూమౌ చచార| అపరాః క్లీడితేన క్లాంతాః తథా అపరాః గీతేన (క్లాంతాః)|| అపరాః నృత్తేన చ క్లాంతాః |తథా పానవిప్రహతాః (క్లాంతాః అపారాః)| ( అపరాః స్త్రియః) మురజేషు మృదంగేషు పీఠికాసు చ సంస్థితాః ||

ఈమె ఇంకెవరో అని నిశ్చయించుకొని ఆ హనుమంతుడు పానభూమిలో తిరగసాగెను. అక్కడ కొందరు స్త్రీలు కామక్రీడలతో అలిసిపోయిరి. కోందరు నృత్యముతో అలిసిపోయిరి. కొందరు మద్యపానముతో మత్తిల్లిపడిరి. ఇంకోదరు మురజముల మీద మృదంగముల మీద పీఠములమీద నిద్రించుచున్నారు

తథాస్తరణ ముఖ్యేషు సంవిష్ఠా శ్చాపరా స్త్రియః |
అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణైః||6||
రూపసల్లాపశీలేన యుక్తగీతార్థ భాషిణా|
దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిదాయినా||7||
రతాభిరతసంసుప్తం దదర్శ హరియూథపః|

స|| తథా అపరాః స్త్రియః ఆస్థరణ ముఖ్యేషు సంస్థితాః | హరియూథపః విభూషణేన భూషితైః రూపసల్లాపశీలేన యుక్తగీతార్థభాషిణా దేశకాలాభియుక్తేన యుక్తవాక్యాభిధాయినా రతాభిరతసంసుప్తం సహస్రేణ అంగనానాం దదర్శ||

కొందరు మెత్తని పరుపులపై నిద్రిస్తున్నారు. ఆ వానరోత్తముడు అందమైన ఆభరణములతో అలంకరింపబడి రూపసల్లాపములతో తగిన భాషగల పాటలతో, దేశకాలానుగుణముగా ఉన్నవారు , రతిని అనుభవించి నిద్రిస్తున్నవారు అలాగ వేలకొలదీ స్త్రీలను చూచెను.

తాసాం మధ్యే మహాబాహుః శుశుభే రాక్షసేశ్వరః||8||
గోష్ఠేమహతి ముఖ్యానాం గవాం మధ్యే యథా వృషః|
స రాక్షసేంద్ర శుశ్శుభే తాభిః పరివృతః స్వయమ్||9||
కరేణుభిర్యథారణ్యే పరికీర్ణో మహాద్విపః|

స|| తాసాం మధ్యే మహాబాహుః రాక్షసేశ్వరః యథా మహతి గోష్ఠే గవాం మధ్యే వృషః ఇవ శుశుభే || తాభి పరివృతః సః రాక్షసేంద్రః స్వయం యథా మహారణ్యే కరేణుభిః పరికీర్ణః ద్విపః ఇవ శుశుభే||

వారిమధ్యలో మహాబాహువులు కల రాక్షస రాజు గోశాలలో గోవుల మద్య విరాజిల్లుచున్న ఆంబోతు వలె శోభిస్తున్నాడు. వారిచే చుట్టబడి ఆ రాక్షసేంద్రుడు మహారణ్యములో ఆడ ఏనుగుల మధ్యలో నున్న మదపుటేనుగు వలె శోభిస్తున్నాడు.

సర్వకామైరుపేతాం చ పానభూమిం మహాత్మనః||10||
దదర్శ హరిశార్దూలః తస్య రక్షః పతేర్గృహే|
మృగాణాం మహిషాణాం చ వరాహాణాంచ భాగశః||11||
తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శ సః|

స|| మహాత్మనః హరిశార్దూలః సర్వ కామైః ఉపేతాం పానభూమిం చ తస్య రక్షః పతేః గృహే దదర్శ|| తత్ర పానభూమౌ భాగశః న్యస్తాని మృగాణాం మహిషాణాం చ వరాహాణాం చ మాంసానిదదర్శ||

ఆ వానరులలో శార్దూలము వంటి మహాత్ముడు అన్నికోరికలకి తగు పానములున్న పానభూమిని ఆ రాక్షసరాజు గృహములో చూచెను. ఆ పానభూమిలో విడివిడిగా అమర్చబడిన లేళ్ళ మాంసము, దున్నలమాంసము , వరాహముల మాంసము చూచెను.

రౌక్మేషు చ విశాలేషు భజనేష్వర్థ భక్షితాన్||12||
దదర్శ హరిశార్దూలో మయూరాన్ కుక్కుటాంస్తథా|
వరాహవార్థ్రాణసకాన్ దధిసౌవర్చలాయుతాన్||13||
శల్యాన్మృగమయూరాంశ్చ హనుమానన్వవైక్షత|

స|| హరిశార్దూలః రౌక్మేషు విశాలేషు భాజనేషు అర్థభక్షితాన్ మయూరాన్ తథా కుక్కుటాన్ దదర్శ||శల్యాన్ దధిసౌవర్చలాయుతాన్ వరాహవార్ధ్రాణసకాన్ మృగమయూరాంశ్చ హనుమాన్ అన్వవైక్షత||

ఆ వానరోత్తముడు పెద్దపెద్ద బంగారు పాత్రలలో సగము తిని విడిచిపెట్టిన నెనలి మాంసము, కోడిమాంసము చూచెను. పెరుగు సౌవర్చమనే లవణముతో ఊరిపోసిన ఎముకలను, వరాహము వార్ద్రాణసకాలనే పక్షుల లేళ్ళ నెమళ్ళ మాంసాలను కూడా చూచెను.

క్రకరాన్ వివిధాన్ సిద్ధాం శ్చకోరానర్థభక్షితాన్||14||
మహిషాన్ ఏకశల్యాంశ్చ ఛాంగాంశ్చ కృతనిష్ఠితాన్|
లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధానిచ||15||
తథాssమ్లలవణోత్తం సైర్వివిధైరాగషాడబైః|
హారనూపూర కేయూరై రపవిద్ధై ర్మహాధనైః||16||
పానభాజన విక్షిప్తైః ఫలైశ్చ వివిధైరపి|
కృతపుష్పోపహారా భూరధికం పుష్యతి శ్రియమ్||17||

వివిధాన్ సిద్ధాన్ క్రకరాన్ చకోరాన్ మహిషాన్ ఏకశల్యాంస్చ ఛగాంశ్చ ఉచ్చవచాన్ లేహ్యాన్ పేయాన్ వివిధాని భోజ్యాని చ (హనుమాన్ అన్వవైక్షత)|| తథా ఆమ్లలవణోత్తంసైః వివిధైః రాగషాడభైః అపవిద్ధైః మహాధనైః హారనూపురకేయూరైః పానభాజనవిక్షిప్తైః వివిధైః ఫలైశ్చ కృతపుష్పోపహారా భూః అధికం శ్రియం పుష్యతి||

అక్కడ సిద్ధముగానున్న కొక్కెర మరియు చకోర పక్షుల , దున్నపోతుల, ఒకే ఎముక గల మత్స్యముల, మేకల మాంసమును, లేహ్యములను , పేయములను, భోజింపతగిన అనేక రకముల పదార్థములను చూచెను. అలాగే ఆమ్ల లవణములు ముఖ్యముగా గల వివిధరకముల రసములతో చేసిన భక్ష్యములతో, అమూల్యమైన హరములతో కేయూరములతో, పెద్ద పానపాత్రలలో ఉంచబడిన అనేకరకములైన ఫలములతో, పుష్పములతో వెదజల్లబడిన ఆ పానశాల భూమి ఎంతో శోభను సంతరించుకున్నది.

తత్ర తత్ర చ విన్యస్తై శుశ్లిష్టై శ్శయనాసనైః|
పానభూమిర్వినా వహ్నిః ప్రదీప్తే వోపలక్ష్యతే||18||
బహుప్రకారైర్వివిధైః వరసంస్కారసంస్కృతైః|
మాంశైః కుశలసంపృక్తైః పానభూమిగతైః పృథక్||19||

స||పానభూమిః తత్ర తత్ర విన్యస్తైః సుశ్లిష్ఠైః శయనాసనైః వినా వహ్నిం ప్రదీప్తేవ ఉపలక్ష్యతే || బహుప్రకారైః వివిధైః నరసంస్కారసంస్కృతైః కుశల సంపృక్తైః పృథక్ పానభూమి గతైః మాంసైః ||

దివ్యాః ప్రపన్నా వివిధాః సురాః కృతసురా అపి |
శర్కరాssసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాః||20||
వాసచూర్ణైశ్చ వివిధైః ద్రృష్టాః తైః తైః పృథక్ పృథక్|
సంతతా శుశుభే భూమిర్మాల్యైశ్చ బహుసంస్థితైః||21||
హిరణ్మయైశ్చ వివిధైర్భాజనైః స్ఫాటికైరపి|
జాంబూనదమయై శ్చాన్యైః కరకైరభిసంవృతా||22||

స|| దివ్యాః ప్రసన్నాః వివిధాః సురాః శర్కరాssసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాః కృతసురాః అపి తైస్తైః వివిధైః వాసచూర్ణైః పృథక్ పృథక్ మృష్టాః||బహుశంస్థితైః మాల్యైశ్చ సంతతా హిరణ్మయైః స్ఫాటికైరపి వివిధైః భాజనైః జామ్బూనదమయైః అన్యైః కరకైః అభిసంవృతా భూమిః శుశుభే||

దివ్యమైన ప్రసన్నాత్మకమైన అనేకరకముల పానీయములు చక్కెర తేనెపువ్వులు ఫలముల తో చేయబడిన పానీయములు వివిధములైన వాసనగల చూర్ణములతో కలపబడినవి. మాలలతోనూ, బంగారు స్ఫటికములతో చేయబడిన పాత్రలతోనూ, బంగారుమయమైన ఇతర పాత్రలతో నిండి ఆ పానభూమి శోభించుచుండెను.

రాజతేషు చ కుంభేషు జాంబూనదమయేషు చ |
పానశ్రేష్ఠం తదా భూరి కపిః తత్ర దదర్శ హ ||23||
సోపశ్య చ్చాతకుంభాని శీధోర్మణిమయాని చ|
రాజతాని చ పూర్ణాని భాజనాని మహాకపిః||24||

స|| కపిః తదా రాజతేషు జామ్బూనదమయేషు కుంభేషు భూరి పానశ్రేష్ఠం తత్ర దదర్శ హ|| స మహాకపిః పూర్ణాని శీధోః భాజనాని శాతకుమ్భాని మణిమాయాని చ రజతాని చ అపశ్యత్||

ఆ వానరుడు వెండి బంగారు పాత్రలలో నింపబడిన శ్రేష్ఠమైన మద్యమును చూసెను. ఆ మహాకపి మద్యముతో నింపబడిన బంగారు పాత్రలను, మణిమయమైన వెండి పాత్రలను చూచెను.

క్వచిత్ అర్థావశేషాణి క్వచి పీతాని సర్వశః|
క్వచిన్నైవ ప్రపీతాని పానాని స దదర్శ హ||25||
క్వచిదృక్ష్యాం శ్చ వివిధాన్ క్వచిత్పానాని భాగశః|
క్వచిదర్థావ శేషాణి పశ్యన్ వై విచచార హ||26||

స|| క్వచిత్ అర్థావశేషాణి క్వచిత్ సర్వశః పీతాని క్వచిత్ నైవ ప్రపీతాని పానాని దదర్శ హ|| క్వచిత్ వివిధాన్ భక్ష్యాంశ్చ క్వచిత్ పానానిభాగశః క్వచిత్ అవశేషాణి పశ్యన్ విచచార హ||

మద్యముతో కొన్ని సగమే నింపబడి వున్నవి. కొన్ని పూర్తిగా తాగివేయబడివున్నవి, కొన్ని ముట్టుకోబడినట్లు లేనివి. అట్టివాటిని చూచెను. ఒకచోట అనేకరకములైన భక్ష్యములను, ఒక చోట విడిగా ఉంచబడిన పానీయములను, ఒకచోట మిగిలిపోయిన వాటినీ చూస్తూ ఆ వానరుడు తిరుగసాగెను.

క్వచిప్రభన్నైః కరకైః క్వచిదాలోళితైర్ఘటైః|
క్వచిత్సంపృక్తమాల్యాని జలాని ఫలాని చ||27||

స|| క్వచిత్ ప్రభిన్నైః కరకైః క్వచిత్ ఆలోలితైః ఘటైః క్వచిత్ సంప్రుక్తమాల్యాని జలాని చ ఫలాని చ (హనుమాన్ దదర్శ)||

ఒక చోట పగిలన పాత్రలను, ఒక చోట దొర్లుతున్నపాత్రలను, ఒకచోట తడిసిన పుష్పమాలలను, ఫలములను చూచెను.

శయనాన్ యత్ర నారీణాం శుభ్రాణి బహుధా పునః|
పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ సుప్తా వరాంగనాః||28||
కాశ్చిచ్చ వస్త్రం అన్యస్యాస్స్వపంత్యాః పరిధాయ చ|
ఆహృత్య చ అబలాః సుప్తా నిద్రా బలపరాజితాః||29||

స|| అత్ర నారీణాం శయనాని పునః బహుధా శుభ్రాణి కాశ్చిత్ వరాంగానాః పరస్పరం సమాశ్లిష్య సుప్తాః హనుమాన్ దదర్శ|| కాశ్చిత్ నిద్రాబలపరాజితాః అన్యస్యాః స్వపంత్యాః వస్త్రం ఆహృత్య పరిధాయా సుప్తాః అబలాః (హనుమాన్ దదర్శ)||

అక్కడ కొన్ని నారీమణుల శయనములు శుభ్రముగా వున్నాయి. కొందరు నారీమణులు ఒకరినొకరు కౌగలించుకొని నిద్రపోతున్నారు. కోందరు నిద్రావశులై పక్కనే నిద్రిస్తున్న ఇతర స్త్రీల వస్త్రములను లాగుకొని గాఢనిద్రలో ఉన్నారు.

తాసాం ఉచ్చ్వాసవాతేన వస్త్రం మాల్యం చ గాత్రజమ్|
నాత్యర్ధం స్పందతే చిత్రం ప్రాప్య మందమివానలమ్||30||

స|| తాసాం గాత్రజం వస్త్రం మాల్యాంశ్చ ఉఛ్ఛ్వాసవాతేన మందం అనిలం ప్రాప్య ఇవ నాత్యర్థం చిత్రం స్పందతే||

వాళ్ళ శరీరము మీద వున్న వస్త్రములు పూలమాలలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసముల పిల్ల మారుతముతో కొంచెము కదులుతూ వున్న దృశ్యము స్పందించుచున్నది.

చందనస్య చ శీతస్య శీథోర్మధురసస్య చ|
వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ||31||
బహుధా మారుతః తత్ర గంధం వివిధముద్వహన్|
స్నానానాం చందనానాం చ ధూపానాం చైవ మూర్చితః||32||
ప్రవవౌ సురభిర్గంధో విమానే పుష్పకే తదా|

తత్ర మారుతః శీతస్య చందనస్య శీథోః మధురస్య చ వివిధస్య మాల్యస్య వివిధస్య ధూపస్య చ వివిధం గంధం బహుధా ఉద్వహన్||స|| తదా పుష్పకే విమానే స్నానానామ్ చందనానాం చ ధూపానాం చైవ సురభిః గంధః మూర్చితః ప్రవవౌ||

అప్పుడు చల్లని చందనము , మధురమై న పానీయములు వివిధ రకముల పూలమాలల ధూపముల సువాసనలతో కూడిన వాయువు అన్ని చోట్ల వీచ సాగెను. అప్పుడు పుష్పక విమానములో స్నాన యోగ్యమైన చందనము ధూపముల సుగంధవాసనలు మూర్ఛింప చేస్తూ వీచ సాగాయి.

శ్యామావదాతా స్తత్రాన్యాః కాశ్చిత్ కృష్ణా వరాంగనాః||33||
కాశ్చి కాంచన వర్ణాంగ్యః ప్రమదా రాక్షసాలయే|
తాసాం నిద్రావశత్వాచ్చ మదనేన విమూర్ఛితమ్||34||
పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీద్యథైవ చ|

స|| తత్ర రాక్షసాలయే అన్యాః శ్యామావదాతాః కాశ్చిత్ వరాంగనాః కృష్ణాః కాశ్చిత్ ప్రమదాః కాంచనవర్ణాంగ్యః || నిద్రావశత్వాచ్చ మదనేన చ విమూర్ఛితమ్ ప్రసుప్తానాం తాసాం రూపం యథా ప్రసుప్తానాం పద్మినీనాం ఇవ ఆసీత్ ||

ఆ రాక్షసాలయములో ఇంకొందరు శ్యామ వర్ణపువారు , కొంతమంది కృష్ణ వర్ణమువారు , కొందరు సువర్ణవర్ణము కలవారు కలరు. నిద్రావశులై కామక్రీడలవల మూర్ఛితులైన నిద్రపోతున్న వారిరూపములు చూస్తే వారు ముకుళించిన పద్మములు వలే ఉన్నారు.

ఏవం సర్వం అశేషేణ రావణాంతఃపురం కపిః||35||
దదర్శ సుమహాతేజా న దదర్శ జానికీమ్|

స|| సుమహాతేజః కపిః ఏవం సర్వం రావణాంతః పురం అశేషేణ దదర్శ | జానకీం చ నదదర్శ||

ఆ మహాతేజోవంతుడైన వానరుడు ఇదంతా శేషములేకుండా రావణాంతఃపురములో చూచెను. కాని జానకిని మాత్రము చూడలేదు.

నిరీక్షమాణశ్చ తదా తాః స్త్రియః స మహాకపిః||36||
జగామ మహతీం చింతాం ధర్మసాధ్వసశంకితః |
పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణమ్||37||
ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి|

స|| తథా స్త్రియః నిరీక్షమాణః సః మహాకపిః ధర్మసాధ్వసశంకితః మహతీం చింతాం జగామ|| ప్రసుప్తస్య పరదారావరోధస్య ఇదం మమ నిరీక్షణమ్ అత్యర్థం ధర్మలోపం కరిష్యతి ||

అలాగ స్త్రీలను నిరీక్షించిన ఆ మహాకపి ధర్మలోపము జరిగెనా అని శంకతో గొప్ప ఆలోచనలో పడెను. 'నిద్రించుచున్న పరులభార్యలు ఈ విధముగా చూచుట వలన ధర్మలోపము కలిగినద".

న హి మే పరదారాణాం దృష్ఠిర్విషయవర్తినీ||38||
అయం చాత్ర మయాదృష్టః పరదార పరిగ్రహః|
తస్య ప్రాదురభూచ్చింతా పునరన్యా మనస్వినః ||39||
నిశ్చితైకాంతచిత్తస్య కార్య నిశ్చయ దర్శినః|

స|| మే దృష్టిః పరదారాణాం విషయవర్తినీ న హి అత్ర మయా పరదారాపరిగ్రహః దృష్టశ్చ || మనస్వినః నిశ్చితైకాంతచిత్తస్య తస్య పునః కార్యనిశ్చయదర్శినీ అన్యా చింతా ప్రాదురభూత్ ||

'ఇప్పుడు నా చేత పరులభార్యలు చూడబడిరి. కాని ఆదృష్టి విషయాను రూపము కాదు". మనోబలసంపన్నుడు , నిశ్చయముగా ఏకాగ్ర చిత్తము కలవాడు కార్యనిర్ణయము చక్కగా తెలినవాడు అయిన హనుమంతుడు ఇంకొవిధముగా అలోచించ సాగెను.

కామం దృష్టా మయాసర్వా విశ్వస్తా రావణస్త్రియః||40||
న హి మే మనసః కించిత్ వైకృత్యం ఉపపద్యతే|
మనో హి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే||41||
శుభా శుభా స్వవస్థాసు యచ్చ మే సువ్యవస్థితమ్|

స|| విశ్వస్తాః సర్వాః రావణస్త్రియః మయా కామం దృష్టాః మే మనసః కించిత్ వైకృత్యం ఉపజాయతే హి||శుభ అశుభాః అవస్థాసు సర్వేషామ్ ఇంద్రియాణాం ప్రవర్తనే మనః హేతుః | మే మనః తచ్చ సువ్యవస్థితమ్||

' రావణుని పై విశ్వాసము గల రావణ స్త్రీలు నాచేత తప్పక చూడబడిరి. కాని నా మనస్సులో ఏవిధమైన వికారము కలగలేదు. శుభ అశుభ అవస్థలలో అన్ని ఇంద్రియముల ప్రవర్తనకి మనసే కారణము. అక్కడ నా మనస్సు స్థిరముగా నున్నది'.

నాన్యత్ర హి మయా శక్యా వైదేహీ పరిమార్గితుమ్||42||
స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే|
యస్య సత్త్వస్య యా యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే||43||
న శక్యా ప్రమదా నష్టా మృగీషు పరిమార్గితుమ్|

స|| వైదేహీ అన్యత్ర పరిమార్గితుం మయా న శక్యా హి సదా సంపరిమార్గనే స్రియః స్త్రిషు దృశ్యంతే || యస్య సత్వస్య యా యోనిః తత్ తాస్యామ్ పరిమార్గ్యతే నష్టా ప్రమదా మృగీషు పరిమార్గితుం న శక్యా||

' వైదేహి ని ఇంకొకచోట వెదుకుట నాకు శక్యము కాదు ఎందుకనగా స్త్రీలను స్త్రీలమధ్య వెదుకుట సమంజసము. ఏ జాతి యొక్క ప్రాణిని ఆ జాతి వారలో వెదకవలసినదే. వెదకబడుచున్న స్త్రీని లేళ్ల మధ్యలో వెదుకుట కుదరదు.

తదిదం మార్గితం తావచ్చుద్ధేన మనసా మయా||44||
రావణాంతః పురం సర్వం దృశ్యతే న చ జానకీ|
దేవగంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్||45||
అవేక్షమాణో హనుమాన్ నైవాపశ్యత జానికీమ్|
తా మపశ్యన్ కపిః తత్ర పశ్యం శ్చాన్యా వరస్త్రియః ||46||
అపక్రమ్య తదా వీరః ప్రధ్యాతుముపచక్రమే|

స||తత్ మయా శుద్ధేన మనసా ఇదం సర్వం రావణాంతః పురం మార్గితుం | జానకీ తు నదృశ్యతే|| దేవగంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ అవేక్షమాణః హనుమాన్ వీర్యవాన్ జానకీం నైవ అపశ్యత|| వీరః కపిః తత్ర తాం అపశ్యన్ అన్యాః వరస్త్రియః పశ్యశ్చ తదా అపక్రమ్య ప్రద్యాతుం ఉపచక్రమే||

' ఆ రావణ అంతః పురము శుద్ధమైన మనస్సుతో నాచే వెదకబడినది. కాని జానకి కనపడలేదు'. దేవగంధర్వ కన్యలు నాగకన్యలు చూస్తున్న హనుమంతునికి జానకి కనపడలేదు. వీరుడైన ఆ వానరుడు సీతను చూడక వరస్త్రీలను చూచి అప్పుడు అన్వేషణ చాలించి మళ్ళీ అలోచనాపరుడయ్యెను.

సభూయ స్తాం పరం శ్రీమాన్ మారుతిర్యత్న మాస్థితః|
అపానభూమి ముత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే||47||

స|| శ్రీమాన్ సః మారుతిః ఆపానభూమిం ఉత్సృజ్య భూయః పరం యత్నం ఆస్థితః తత్ విచేతుం ఉపచక్రమే||

ఆ శ్రీమంతుడైన హనుమంతుడు పానశాలనుంచి బయటకు వచ్చి మళ్ళీ యత్నపూర్వకముగా సీతను వెదుకుటకు మొదలుపెట్టెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకాదశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదకొండవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||