||సుందరకాండ ||

||పదమూడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 13 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రయోదశస్సర్గః

శ్లో|| విమానుత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూథపః|
హనుమాన్వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే||1||

స|| హరియూథపః విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం వేగవాన్ యథా విద్యుత్ ఘనాంతరే ఆసీత్||

తా|| ఆ వానరోత్తముడు విమానము నుంచి దిగి ప్రాకారము మీదకి మెఱుపు మెరిసినట్లు దూకెను.

శ్లో|| సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్|
అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీత్ వచనం కపిః||2||
భూయిష్టం లోళితా లఙ్కా రామస్య చరతా ప్రియమ్|
న హి పశ్యామి వైదేహీం సీతాం సర్వాఙ్గశోభనామ్||3||

స|| సీతాం జానకీం అదృష్ట్వా హనుమాన్ రావణస్య నివేశనాత్ సంపరిక్రమ్య కపిః (ఇదం) వచనం అబ్రవీత్ || రామస్య ప్రియం (కర్తుమ్) చరతా లఙ్కా భూయిష్ఠం లోళితా అపి సర్వాఙ్గశోభనామ్ వైదేహీం సీతాం న హి పశ్యామి||

తా|| సీత ఎక్కడా కనిపించకపోవడముతో రావణ భవనము బయట తిరుగుతూ ఇట్లా అనుకొనెను. 'రాముని కార్యము చేయుటకు సంచరిస్తూ లంక అంతా తిరిగితిని. కాని సర్వాంగములు శోభాయమానముగావుండు సీత మాత్రం కనపడలేదు".

శ్లో|| ప్లవనాని తటాకాని సరాంసి సరితస్తథా|
నద్యోఽనూపవనాంతాశ్చ దుర్గాశ్చ ధరిణీధరాః||4||
లోళితా వసుధా సర్వా న తు పశ్యామి జానకీమ్|
ఇహ సంపాతినా సీతా రావణస్య నివేశనే ||5||
ఆఖ్యాతా గృథ రాజేన న చ పశ్యామి తా మహమ్|

స|| లోళితా ప్లవనాని తటాకాని సరాంసి సరితః తథా నద్యాః అనూపవనాంతాశ్చ దుర్గాః ధరణీ ధరాః వసుధా సర్వాః (లోళితా) జానకీం న పశ్యామి తు || సీతా రావణస్య నివేశనే ఇహ ( అస్తి ఇతి) గృథరాజేన సంపాతినా ఆఖ్యాతా | (పరంతు) తాం (సీతాం) న హి పశ్యామి ||

తా|| కొండలూ తటాకములు సరస్సులు నదులూ అలాగే ఎక్కలేని పర్వతములు, దుర్గములు ఇక్కడ వున్న అన్ని ప్రదేశములను వెతికితిని. కాని జానకి కనపడలేదు. సీతా రావణుని భవనములో నున్నది అని గృథరాజు సంపాతి చెప్పాడు. కాని ఆ సీత ఇక్కడ కనపడుట లేదు.

శ్లో|| కిం ను సీతాఽథ వైదేహీ మైథిలీ జనకాత్మజా||6||
ఉపతిష్టేత వివశా రావణం దుష్టచారిణమ్|
క్షిప్ర ముత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః||7||
బిభ్యతో రామబాణానాం అన్తరా పతితా భవేత్ |
అథవా హ్రియమాణాయాః పథి సిద్ధనిషేవితే||8||
మన్యే పతితా మార్యాయా హృదయం ప్రేక్ష్య సాగరమ్|

స|| జనకాత్మజా వైదేహీ మైథిలీ వివశం దుష్టచారిణం రావణం కిం ను ఉపతిష్ఠేత ?సీతామ్ ఆదాయ రామబాణానాం బిభ్యతః క్షిప్రం ఉత్పతతః రక్షసః అన్తరః (సీతా) పతితా భవేత్ మన్యే|| || అథవా సిద్ధనిషేవితే పథి హ్రియమాణః ఆర్యాయాః హృదయం సాగరం ప్రేక్ష్య పతితా (ఇతి) మన్యే||

తా|| జనకాత్మజ వైదేహి అయిన మైథిలి దుష్టకర్మలు చేయు రావణునికి వశమయ్యనా ఏమి? సీతను తీసుకువస్తూ రామబాణములకు భయపడి తోందరగా ఎగిరిపోతున్న రాక్షసుని నుంచి సీత పడిపోయి ఉండవచ్చు. లేక సిద్ధులు సేవించి మార్గములో తీసుకుపోబడుతున్న ఆ ఆర్యురాలైన సీత హృదయము సాగరమును చూచి పతించినదా ?

శ్లో|| రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ||9||
తయా మన్యే విశాలాక్ష్యా త్యక్తం జీవిత మార్యయా|
ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా||10||
వివేష్టమానా పతితా సముద్రే జనకాత్మజా|

స|| రావణస్య ఉరువేగేన భుజాభ్యాం పీడితేన చ వీశాలాక్షీ తయా జీవితా త్యక్తం మన్యే|| తదా సాగరం ఉపరి ఉపరి క్రమతః వివేష్టమానా జనకాత్మజా సముద్రే నూనం పతితా (ఏవ)||

తా|| రావణుని వేగమునకు, అతడి భుజముల ఒత్తిడికి తట్టుకోలేక ఆ విశాలాక్షి జీవితము త్యజించినదా ? అలా సాగరము పైకి పైకి పోవుచున్న రావణుని నించి విడివడానికి యత్నిస్తున్న సీత సముద్రములో బహుశ పడిపోయి ఉండవచ్చు.

శ్లో|| అహోక్షుద్రేణ వాఽనేన రక్షన్తీ శీలమాత్మనః||11||
అబన్ధుర్భక్షితా సీతా రావణేన తపస్వినీ|
అథవా రాక్షసేన్ద్రస్య పత్నీభి రసితేక్షణా||12||
అదుష్టా దుష్టభావాభిః భక్షితా సా భవిష్యతి|

స|| అహో ఆత్మనః శీలం రక్షన్తీ తపస్వినీ సీతా అబంధుః అనేన క్షుద్రేణ రావణేన భక్షితా ? అథవా అదుష్టా అసితేక్షణా సా (సీతా) రాక్షసేంద్రస్య పత్నీభిః దుష్టభావాభిః భక్షితా భవిష్యతి||

తా|| అయ్యో ! తన శీలము రక్షించుకుంటూ తనబంధువులనుంచి దూరమైన ఆ తపస్విని ఆ దుష్టునుచేత తినబడినదా? లేక ఆ అసితేక్షణ సజ్జనురాలైన సీత, దుష్టభావములు కల రాక్షసేంద్రుని పత్నులచేత తినబడి ఉండవచ్చు

శ్లో|| సంపూర్ణచన్ద్ర ప్రతిమం పద్మపత్రనిభేక్షణమ్||13||
రామస్య ధ్యాయతీ వక్త్రం పఞ్చత్వం కృపణా గతా|
హా రామ లక్ష్మణేత్యేవం హాఽయోధ్యే చేతి మైథిలీ||14||
విలప్య బహు వైదేహీ న్యస్త దేహా భవిష్యతి|

స|| కృపణా వక్త్రం సంపూర్ణచన్ద్ర ప్రతిమం పద్మపత్రనిభేక్షణం రామస్య ధ్యాయతీ పఞ్చత్వం గతా|| వైదేహీ మైథిలీ హా రామ హా లక్ష్మణా హా అయోధ్యా చ ఇతి ఏవం బహు విలప్య న్యస్త దేహా భవిష్యతి||

తా|| దీనురాలు పూర్ణచంద్రుని వంటి వదనము కల పద్మపత్రములవంటి కనురేకులు గల సీత రాముని ధ్యానిస్తూ పంచత్వము పొందినదేమో. వైదేహి అగు మైథిలి, 'ఓ రామా ఓ లక్ష్మణా ఓ అయోధ్యా', అని బహువిధములుగా విలపిస్తూ దేహమును త్యజించనేమో.

శ్లో|| అథవా నిహితా మన్యే రావణస్య నివేశనే||15||
నూనం లాలప్యతే సీతా పఞ్జరస్థేన శారికా|
జనకస్య సుతా సీతా రామపత్నీ సుమధ్యమా||16||
కథముత్పల పత్రాక్షీ రావణస్య వశం వ్రజేత్|

స|| అథవా రావణస్య నివేశనే నిహితా సీతా పఞ్జరస్థా శారికా ఇవ నూనం లాలప్యతే మన్యే|| జనకస్య సుతా రామపత్నీ సుమధ్యమా ఉత్పలపత్రాక్షీ సీతా రావణస్య వశం కథం వ్రజేత్?

తా|| లేక రావణుని భవనములో బంధించబడిన సీతా పంజరములోని శారీకము వలె విలపిస్తున్నదేమో. జనకుని సుత రామపత్నిసన్నని నడుముకల కమలరేకులవంటి కన్నుకుగల సీతా రావణుని వశము ఏట్లు అగును?

శ్లో|| వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజా||17||
రామస్య ప్రియ భార్యస్య న నివేదయితుం క్షమమ్|
నివేద్యమానే దోషః స్యాత్ దోష స్స్యా దనివేదనే||18||
కథం ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే |
అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిమ్||19||
భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్|

స|| రామస్య ప్రియభార్యస్య జనకాత్మజా వినష్టా వా ప్రణష్టా వా మృతా వా నివేదయితుం న క్షమమ్|| నివేద్యమానే దోషః స్యాత్| అనివేదనే దోషః స్యాత్ | కథం కర్తవ్యం ను ఖలు మే విషమం ప్రతిభాతి || అస్మిన్ కార్యే ఏవం గతే ప్రాప్తకాలం క్షమమ్ కిం భవేత్ ఇతి మతం భూయః హనుమాన్ ప్రవిచారయత్||

'తా|| 'రాముని ప్రియమైన భార్య చంపబడినను,చిత్రవధచేయబడినను , మరణించిననూ ఆ విషయము చెప్పుట భావ్యము కాదు. చెప్పుటచే దోషము కలుగును. చెప్పకపోయిననూ కూడా దోషమే. ఇప్పుడు కర్తవ్యము ఏమిటో నాకు విషమము గా కానవస్తున్నది. ఈ కార్యములో ఏది శ్రేయస్కరము', అని మళ్ళీ హనుమంతుడు విచారణలో పడెను.

శ్లో|| యది సీతా మదృష్ట్వాఽహం వానరేన్ద్రపురీ మితః||20||
గమిష్యామి తతః కోమే పురుషార్థో భవిష్యతి |
మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి||21||
ప్రవేశశ్చైవ లఙ్కాయా రాక్షసానాం చ దర్శనమ్|

స|| అహమ్ సీతామ్ అదృష్ట్వా వానరేంద్రపురీం ఇతః యది గమిష్యామి తతః మే కో పురుషార్థః భవిష్యతి|| మమ ఇదం సాగరస్య లంఘనం లంకాయా ప్రవేశనం రాక్షసానాం చ దర్శనం వ్యర్థం భవిష్యతి||

తా|| నేను సీతను చూడకుండా ఇక్కడనుంచి వానరేంద్ర పురికి పోయినచో అప్పుడు నేను చేసిన పుషకార్యము ఏమిటి? నా సాగరలంఘనము , లంకాప్రవేశము రాక్షసుల దర్శనము ఇవన్నీ వృధా అవుతాయి.

శ్లో|| కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః||22||
కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ|
గత్వాతు యది కాకుత్థ్సం వక్ష్యామి పరమప్రియమ్||23||
న దృష్టేతి మయా సీతా తతస్తక్ష్యతి జీవితమ్|
పరుషం దారుణం క్రూరం తీక్ష్ణ మిన్ద్రియతాపనమ్|| 24||
సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి |

స|| కిష్కింధం సమనుప్రాప్తం మాం సుగ్రీవః వా సమాగతాః హరయః వా దశరథాత్మజౌ కిం మాం వక్ష్యతి || గత్వా కాకుత్‍స్థం సీతా మయా నదృష్టా ఇతి పరం అప్రియం వక్ష్యామి యది తతః (సః రామః) జీవితం త్యక్ష్యతి|| పరుషం దారుణం కౄరం ఇంద్రియతాపనం సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సః రామః న భవిష్యతి||

తా|| కిష్కింధ చేరగానే నన్ను సుగ్రీవుడు , తోడ వున్న వానరులు , దశరధాత్మజులు నన్ను ఏమి అంటారు ? వెళ్ళి కాకుస్థునకు సీత కనపడలేదు అన్న అప్రియమైన మాట చెప్పినచో అప్పుడు తప్పక ( ఆ రాముడు) జీవితము త్యజించును. పరుషమైన దారుణమైన కౄరమైన ఇంద్రియములను తపించు ఈ దుర్వాక్యములను విని ఆ రాముడు ఇక బ్రతికి ఉండడు.

శ్లో|| తం తు కృచ్ఛగతం దృష్ట్వా పంచత్వగతమానసమ్||25||
భృశాను రక్తో మేధావీ న భవిష్యతి లక్ష్మణః|
వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోఽపి మరిష్యతి||26||
భరతం చ మృతం దృష్ట్వా శతృఘ్నో న భవిష్యతి|
పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాథ న భవిష్యతి మాతరః||27||
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః|

స|| పంచత్వగతమానసం తం దృష్ట్వా కృచ్ఛగతం భృశానురక్తః మేధావీ లక్ష్మణః తు న భవిష్యతి|| భ్రాతరౌ వినష్టౌ (ఇతి) శ్రుత్వా భరతః అపి న భవిష్యతి| భరతం చ మృతం దృష్ట్వా శతృఘ్నో న భవిష్యతి|| అథ మృతాన్ పుత్రాన్ సమీక్ష్య మాతరః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ తథా న భవిష్యతి | న సంశయః||

తా|| పంచత్వము పొందిన ఆయనను చూచి భ్రాతానురక్తుడైన మేధావి లక్ష్మణుడు కూడా ఉండడు. అన్నదమ్ములిద్దరూ పోయిరి అన్నమాట విన్న భరతుడు కూడా ఉండడు. భరతుడు మరణించుట చూసిన శతృఘ్నుడు ఉండడు. ఆ విధముగా పుత్రుల స్థితిని చూచి తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి కూడా ఉండరు. ఇందులో సందేహము లేదు

శ్లో|| కృతజ్ఞః సత్యసన్ధశ్చ సుగ్రీవః ప్లవగాధిపః||28||
రామం తథా గతం దృష్ట్వా తతస్త్య క్ష్యతి జీవితమ్|
దుర్మనా వ్యథితా దీనా నిరానన్దా తపస్వినీ||29||
పీడితా భర్తృశోకేన రుమా త్యక్ష్యతి జీవితమ్|
వాలిజేన తు దుఃఖేన పీడితా శోకకర్శితా||30||
పఞ్చత్వం గతే రాజ్ఞే తారాఽపి న భవిష్యతి|

స|| సుగ్రీవః కృతజ్ఞః సత్యసన్ధః ప్లవగాధిపః తథా గతం రామం దృష్ట్వా తతః జీవితం త్యక్ష్యతి|| భర్తృశోకేన పీడితా నిరానన్దా తపస్వినీ వ్యథితా దుర్మనా రుమా జీవితం త్యక్ష్యతి|| వాలిజేన దుఃఖేన పీడితా శోకకర్శితా తారా అపి రాజ్ఞి పఞ్చత్వం గతే న భవిష్యతి||

తా|| కృతజ్ఞుడు సత్యసంధుడు వానరులరాజు అయిన సుగ్రీవుడు ఆ విధముగా పోయిన రాముని చూచి తన జీవితము వదులును. భర్తుశోకము చే పీడింపబడు అనందములేని తపస్విని రుమా తన జీవితము త్యజించును. వాలిశోకముతో కృశించిపోయిన తార, వానర రాజు పంచత్వము పొందగా నిస్సందేహముగా ప్రాణములు త్యజించును.

శ్లో|| మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవవ్యసనేన చ||31||
కుమారోఽప్యఙ్గదః కస్మాద్ధారయిష్యతి జీవితమ్|
భర్తృజేన తు దుఃఖేన హ్యభిభూతా వనౌకసః||32||
శిరాం స్యభిహనిష్యన్తి తలైర్ముష్టిభిరేవ చ |
సాన్త్వే నానుప్రదానేన మానేన చ యశస్వినా||33||
లాలితాః కపిరాజేన ప్రాణాం స్తక్ష్యన్తి వానరాః |

స|| కుమారః అంగదః అపి మాతాపిత్రోః వినాశేన సుగ్రీవస్య వ్యసనేన జీవితం కస్మాత్ ధరిష్యతి? వనౌకసః భర్తృజేన దుఃఖేన అభిభూతాః తలైః ముష్టిభిరేవచ సిరాంసి అభిహనిష్యన్తి || యశస్వినా కపిరాజేన మానేన సాత్వేన అనుప్రదానేన లాలితాః వానరాః ప్రాణాన్ త్యక్ష్యన్తి||

తా|| అంగద కుమారుడు తన తల్లితండ్రుల మరణాలతో, సుగ్రీవుని మరణముతో ఎట్లు జీవించును ? వానరులు రాజుయొక్క మరణముతో దుఃఖితులై తలలను పిడికలతో కొట్టుకొని బలవన్మరణము పొందెదరు. యశోవంతుడు అగు కపిరాజుచే గౌరవముతో సాంత్వముతో కానుకలతో లాలింపబడిన వానరులు ప్రాణములను త్యజించెదరు.

శ్లో|| న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః||34||
క్రీడామనుభవిష్యన్తి సమేత్య కపికుఞ్జరాః|
సపుత్త్ర దారాస్సామత్యా భర్తృవ్యసనపీడితాః||35||
శైలాగ్రేభ్యః పతిష్యన్తి సమేషు విషమేషు చ|
విషముద్భన్ధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా||36||
ఉపవాస మధో శస్త్రం ప్రచరిష్యన్తి వానరాః|

స|||కపికుంజరాం సమేత్య వనేషు శైలేషు న నిరోధేషు వా పునః క్రీడాం న అనుభవిష్యన్తి|| సపుత్రదారాః స అమాత్యాః భర్తృర్వ్యసన పీడితాః శైలాగ్రేభ్యః సమేషు విషమేషు చ పతిష్యన్తి|| వానరాః విషం ఉద్బన్ధనం వాపి జ్వలనస్య ప్రవేశం వా ఉపవాసం అథో శస్త్రం ప్రచరిష్యన్తి||

తా|| కపికుంజరులు కలిసి వనములలో, కోండలలో , గృహములలో మళ్ళీ క్రీడలు అనుభవించలేరు. పుత్రులతో భార్యలతో అమాత్యులు రాజుపోయిన శోకముతో పీడింపబడి శైలాగ్రములనుంచి సమప్రదేశములలో పడి మరణించెదరు. వానరులు విషము తాగికాని ఉరిపోసికొని కాని అగ్నిప్రవేశము చేసి కాని శస్త్రములతో కాని ప్రాణములు విడిచెదరు

శ్లో|| ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి||37||
ఇక్ష్వాకుకులనాశశ్చ నాశశ్చైవ వనౌకసామ్|
సోఽహం నైవ గమిష్యామి కిష్కిన్ధాం నగరీ మితః||38||
న చ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా|

స|| మయి గతే ఇక్ష్వాకుకులనాశస్చ వనౌకసాం నాశశ్చ ఏవ ఘోరం ఆరోదనమ్ భవిష్యతి (ఇతి) మన్యే|| అహం కిష్కింధాం నగరీం న గమిష్యామి ఏవ | అహం మైథిలీ వినా సుగ్రీవం న చ ద్రక్ష్యామి ||

తా|| నేను వెళ్ళితే ఇక్ష్వాకుకులనాశనము వానరులనాశము అయి భయంకరమైన రోదనములు అగును. నేను కిష్కింధనగరము వెళ్ల కూడదు. నేను మైథిలి చూడకుండా సుగ్రీవుని చూడను.

శ్లో|| మయ్యగచ్ఛతి చేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ||39||
ఆశయా తౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః|
హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః||40||
వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజామ్|
సాగరానూపజే దేశే బహుమూలఫలోదకే||41||

స|| మయి అగచ్ఛతి ఇహస్థే తౌ ధర్మాత్మానౌ మహారథౌ ఆశయా ధరిష్యేతే | మనస్వినః వానరాః చ || జనకాత్మజామ్ అదృష్ట్వా హస్తదానః ముఖదానః నియతా బహుమూలఫలోదకే సాగరానూపజే దేశే వృక్షమూలికః వానప్రస్థః భవిష్యామి||

తా|| నేను వెళ్ళక ఇక్కడే ఉంటే ధర్మాత్ములు మహారథులగు రామలక్ష్మణులు మానవంతులు అగు వానరులు ఆశతో ఉండెదరు. జనకాత్మజను చూడక చేతికి దొరికినది నోటికి దొరికినది అనేక మూలఫలములతో చెట్లకింద నివసిస్తూ వానప్రస్థ జీవనము గడిపెదను.

శ్లో|| చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ద మరణీసుతమ్|
ఉపవిష్టస్య వా సమ్యగ్లిఙ్గినీం సాధయిష్యతః||42||
శరీరం భక్షయిష్యన్తి వాయసా శ్శ్వాపదాని చ|
ఇదం మహర్షిభి ర్దృష్టం నిర్యాణ మితి మే మతిః||43||
సమ్యగాపః ప్రవేక్ష్యామి న చే త్పశ్యామి జానకీమ్|

స|| చితాం కృత్వా సమిద్ధమ్ అరణీసుతం ప్రవేక్ష్యామి వా ఉపవిష్టస్య లింగినీం సాధయిష్యతః శరీరం వాయసాః శ్వపదాని చ భక్షయిష్యన్తి|| జానకీం న పశ్యామి చేత్ ఆపః ప్రవేక్ష్యామి | ఇదం మహర్షిభిః దృష్టం సమ్యక్ నిర్యాణం ఇతి మే మతిః ||

తా|| అరణిలచేత మండింపబడిన చితిని చేసి ప్రవేశించెదను . లేక ఇక్కడే కూర్చుని ఉపవాసము చేస్తున్న నా శరీరము వాయసములు కుక్కలు భక్షించుగాక. మహర్షులు చెప్పిన నిర్యాణ మార్గము ఇదే అని నాకు అనిపిస్తుంది.

శ్లో|| సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్వినీ||44||
ప్రభగ్నా చిరరాత్రీయం మమ సీతామపశ్యతః|
తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికా||45||
నేతః ప్రతి గమిష్యామి తామదృష్ట్వాఽసితేక్షణామ్|
యదీతః ప్రతిగచ్ఛామి సీతా మనధిగమ్యతామ్||46||
అఙ్గదః సహ తైః సర్వైః వానరైః నభవిష్యతి|

స|| సీతామ్ అపశ్యతః మమ చిరరాత్రీయం సుజాతమూలా సుభగా యశస్వినీ కీర్తిమాలా ప్రభగ్నా|| నియతః వృక్షమూలికః తాపసో వా భవిష్యామి | తాం అసితేక్షణామ్ అదృష్ట్వా ఇతః న ప్రతి గమిష్యామి || తాం సీతాం అనధిగమ్య ఇతః యది ప్రతిగచ్ఛామి అఙ్గదైః తే సర్వైః వానరైః సహ న భవిష్యతి||

తా|| సీతను చూడకపోవడముతో ఈ దీర్ఘమైన రాత్రి శుభముగా సానుకూల ఘటనలతో మొదలై నిరర్థకముగా పరిణమిస్తున్నది. ఆ సీతను కను గొనకుండా ఇక్కడనుంచి నేను వెళ్ళను . ఆ సీతను కనుగొనకుండా ఇక్కడనుంచి వెళ్ళినచో అంగదునితో కూడి వానరులందరూ మరణించెదరు.

శ్లో|| వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి||47||
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసఙ్గమః|
ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహుః||48||
నాధ్యగచ్చత్ తదా పారం శోకస్య కపికుఞ్జరః|

స|| వినాశే బహవః దోషాః | జీవన్ భద్రాణి పశ్యతి | తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి జీవిత సఙ్గమః ధృవః|| కపికుఞ్జరః ఏవం బహువిథం దుఃఖం ముహుః మనసా ధారయన్ తదా శోకస్య పారం నాధ్యగచ్ఛత్||

తా|| 'మరణము అనేక దోషములకు కారణము. బ్రతికి జీవి అనేక శుభములు చూడవచ్చు. అందువలన ప్రాణములను తప్పక ధరించెదను'.ఆ కపికుంజరుడు ఇలాగ అనేక విధములుగా ఆలోచించి మనస్సులో దుఃఖపడిననవాడై శోకసముద్రానికి అవతలి తీరము చేరలేక పోయెను.

శ్లో|| రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలమ్|| 49||
కామ మస్తు హృతా సీతా ప్రత్యాచీర్ణం భవిష్యతి|
అథ వైనం సముత్‍క్షిప్య ఉపర్యుపరి సాగరమ్||50||
రామా యోపహరిష్యామి పశుం పశుపతేరివ|
ఇతి చిన్తాం సమాపన్నః సీతామనధిగమ్యతామ్||51||
ధ్యానశోకపరీతాత్మా చిన్తయామాస వానరః|

స|| దశగ్రీవం మహాబలం రావణం వధిష్యామి | హృతా సీతా కామమ్ అస్తు| ప్రత్యాచీర్ణమ్ భవిష్యతి అపి|| అథవా ఏనం సాగరం ఉపర్యుపరి సముత్‍క్షిప్య పశుపతేః పశుం ఇవ రామాయ ఉపహరిష్యామి|| వానరః తాం సీతాం అనధిగమ్య ఇతి చిన్తాం సమాపన్నః ధ్యానశోకపరీతాత్మా చిన్తయామాస||

తా|| 'దశగ్రీవుడైన మహాబలుడు అగు రావణుని వధించెదను. చనిపోయిన సీత కోరిక తీరును. ప్రతిక్రియకూడా అగును. లేక పశుపతికి ఇవ్వబడు పశువు వలె రావణుని సాగరముపై తీసుకొని పోయి రాముని కి సమర్పించెదను'. వానరుడు సీతజాడను కనుగొనలేక చింతాశోకపరాయణుడై మరింక ఆలోచించ సాగెను.

శ్లో|| యావత్సీతాం న పశ్యామి రామపత్నీం యశస్వినీమ్||52||
తావ దేతాం పురీం లఙ్కాం విచినోమి పునః పునః|
సంపాతి వచనాచ్చాపి రామం యద్యానయా మహ్యమ్||53||
అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేత్ సర్వ వానరాన్|
ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేన్ద్రియః||54||
న మత్కృతే వినశ్యేయుః సర్వేతే నరవానరాః|

స|| రామపత్నీం యశస్వినీం సీతాం యావత్ న పశ్యామి తావత్ ఏతాం లంకాం పునః పునః విచినోమి || సంపాతి వచనాత్ అహం రామం ఆనయామి యది రాఘవః భార్యాం అపశ్యన్ సర్వ వానరాన్ నిర్దహేత్ ||నియత ఆహరః నియ త ఇంద్రియః ఇహైవ వత్స్యామి | మత్కృతే తే నరవానరాః న వినశ్యేయుః ||

తా|| ' రామపత్నీ యసస్వినీ అగు సీతజాడ కనపడువరకు ఈ లంకానగరమును మళ్ళీ మళ్ళీ వెదకెదను. సంపాతి వచనములను నమ్మి రాముని ఇక్కడకు తీసుకు వచ్చినచో రాఘవుడు తన భార్య కనపడక వానరులందరినీ దహించివేసెడివాడు. ఇక్కడే నియమిత ఆహారముతో ఇంద్రియ నిగ్రహముతో ఉండిపోయెదను. నా కారణముగా నరవానరులు నశింపరాదు'.

శ్లో|| అశోక వనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా||55||
ఇమాం అధిగమిష్యామి నహీయం విచితా మయా|
వసూన్ రుద్రాం స్తథాఽఽదిత్యాన్ అశ్వినౌ మరుతోఽపి చ||56||
నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్థనః|
జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకులనన్దినీమ్||57||
సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే|
స ముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేన్ద్రియః|
ఉదతిష్టన్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః||58||

స|| ఇయం మహాద్రుమా అశోకవనికా దృశ్యతే ఇమాం మయా న విచితాహి |ఇమాం అధిగమిష్యామి || వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా రక్షసాం శోకవర్ధనః గమిష్యామి|| సర్వాన్ రాక్షసాన్ జిత్వా తు ఇక్ష్వాకుకులనన్దినీం తపస్వినే సిద్ధిం యథా రామాయ సంప్రదాస్యామి|| మహాతేజాః మారుతాత్మజః సః హనుమాన్ చింతావగ్రథితేన్ద్రియః ముహూర్తమివ ధ్యాత్వా ఉదతిష్ఠన్ ||

తా|| ' ఈ మహావృక్షములతో నున్న అశోకవనము కనపడు చున్నది. ఇంతవరకు ఈ వనము లో వెదకలేదు. దానిలోకి వెళ్ళెదను. వసువులకు రుద్రులకు అలాగే అదిత్యులకు అశ్వినీ దేవతలకు నమస్కరించి రాక్షసుల శోకము అధికము చేయుటకు వెళ్ళెదను. రాక్షసులందరినీ జయించి తపస్వికి సిద్ధి చేరినట్లు ఇక్ష్వాకుకులనందినీ ని రామునికి చేర్చెదను'. మహాతేజోవంతుడు మారుతాత్మజుడు అగు హనుమంతుడు కాసేపు ధ్యానము చేసి దుఃఖమనే బంధమును తెంచుకొని నిలబడెను.

శ్లో|| నమోఽస్తు రామాయ సలక్ష్మణాయై
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై|
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోఽస్తు చన్ద్రార్క మరుద్గణేభ్యః||59||

స|| స లక్ష్మణాయ రామాయ నమః అస్తు| దేవ్యై తస్యై జనకాత్మజాయై చ | రుద్ర ఇంద్ర యమ అనిలః ఏతేభ్యో నమః అస్తు| చన్ద్రార్కమరుత్ గణేభ్యః నమః అస్తు||

తా|| ' లక్ష్మణునితో కూడిన రామునకు నమస్కారము. దేవి అయిన జనకాత్మజకు నమస్కారము. రుద్రుడు ఇంద్రుడుయముడు అనిలిడు వీరందరికీ నమస్కారములు.చంద్రుడుసూర్యునకు మరుత్ గణములకు నమస్కారము'.

శ్లో|| సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయచ మారుతిః|60||
దిశస్సర్వా స్సమాలోక్య హ్యశోకవనికాం ప్రతి |
స గత్వా మనసా పూర్వ మశోకవనికాం శుభామ్||61||
ఉత్తరం చిన్తయామాస వానరో మారుతాత్మజః|
ధ్రువం తు రక్షోబహుళా భవిష్యతి వనాకులా||62||
అశోకవనికకాఽచింత్యా సర్వసంస్కారసంస్కృతా|

స|| సః మారుతిః తేభ్యః నమస్కృత్య సుగ్రీవాయ చ సర్వాః దిశాః సమాలోఖ్య అశోకవనికామ్ ప్రతి ||మారుతాత్మజః సః వానరః మనసా పూర్వం శుభాం అశోకవనికామ్ గత్వా ఉత్తరం చిన్తయామాస|| అశోకవనికా బహుళా వనాకులా ధృవం రక్షో సర్వసంస్కారసంస్కృతా పుణ్యా భవిష్యతి||

తా|| ఆ మారుతి వారందరికీ ప్రణమములు అర్పించి సుగ్రీవునకు కూడా నమస్కరించి, నలువంకలాచూచి అశోకవనముపై తన దృష్టి సారించెను. మారుతాత్మజుడగు ఆ వానరుని మనస్సు ముందరే అశోకవనిక చేరి, తదనంతర కర్తవ్యము గురించి ఆలోచింపసాగెను. 'అనేకమైన వృక్షములతో సర్వసంస్కారములతో సుందరమైన ఆ అశోకవనికా తప్పక రాక్షసులతో వుండును'.

శ్లో|| రక్షిణ శ్చాత్ర విహితా నూనం రక్షన్తి పాదపాన్ ||63||
భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై|
సంక్షిప్తఽయం మయాఽఽత్మా చ రామార్థే రావణస్య చ ||64||

స|| అత్ర విహితాః రక్షిణశ్చ పాదపాన్ నూనం రక్షన్తి సర్వాత్మా భగవానపి నాతిక్షోభం ప్రావాతివై మయా రామార్థే రావణస్య చ అయం అత్మా సంక్షిప్తః||

తా|| 'ఇక్కడ వృక్షములు తప్పక రాక్షసులు చేత రక్షింపబడివుండును. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మెల్లగా వీచుచున్నాడు. నేను కూడా రామకార్యముకొఱకు రావణునికి కనపడకుండా ఉండుటకు నా రూపము చిన్నదిగా చేసుకొంటిని".

శ్లో|| సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ|
బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతుమే ||65||
సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్|
వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ ||66||
అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవచ|
సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః|
దాస్యన్తి మమయే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః|67||

స|| స ఋషిగణాః దేవాః ఇహ మే సిద్ధిం సంవిధాస్యన్తి |స్వయంభూః భగవాన్ బ్రహ్మా దేవాశ్చైవ అగ్నిశ్చ వాయుశ్చ వజ్రభూత్ పురుహూతశ్చ పాశహస్తః వరుణశ్చ సోమాదిత్యౌ మహాత్మానౌ అశ్వినౌ మరుతః సర్వఏవ చ మే సిద్ధిం దిశన్తు | సర్వాణి భూతాన్ యః భూతానామ్ ప్రభుః అన్యే యే అదృష్టాః పథి గోచరాః మమ సిద్ధిం దాస్యన్తి||

తా|| 'ఇక్కడ ఋషిగణములతో కూడిన దేవులు నాకు సిద్ధి కలిగించుగాక. స్వయంభు బ్రహ్మ దేవతలందరూ అగ్ని వాయువు ఇంద్రుడు , పాశము చేతులో కలవాడు, వరుణుడు, చంద్రుడు , సూర్యుడు,అశ్వినులు , మరుత్గణములు అందరూ నాకు సిద్ధిని కలుగించుదురు గాక. సమస్త భూతములు , ఆ భూతముల ప్రభువు , ఇంకా కనపడని దేవతలూ కూడా నాకు సిద్ధి కలిగించుగాక'.

శ్లో|| తదున్నసం పాణ్డురదన్తమవ్రణమ్
శుచిస్మితం పద్మపలాశ లోచనమ్|
ద్రక్షే తదార్యావదనం కదాన్వహం
ప్రసన్న తారాధిపతుల్య దర్శనమ్||68||
క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా
సుదారుణాలంకృత వేషధారిణా|
బలాభిభూతా హ్యబలా తపస్వినీ
కథం ను మే దృష్టిపథేఽద్య సా భవేత్ ||69||

స|| ఉన్నసం పాణ్డురదన్తం అవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం తత్ తదార్యవదనం అహం కదా ద్రక్ష్యే ను || క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా సుదారుణాలంకృతవేషధారిణా బలాభిభూతా తపస్వినీ సా అబలా అద్య మే దృష్టిపథే కథం భవేత్ ను||

తా|| ' ఉన్నత వంశములో జనించిన, తెల్లని దంతములు కల, శుచిస్మితయు, పద్మరేకుల వంటి కళ్ళు గల, ప్రసన్న చంద్రుని తో సమానమైన దర్శనము కలది అగు సీతని ఎప్పుడు చూచెదనో? క్షుద్రుడు పాపి దుష్టకర్మలు చేయు అలంకారములచే ప్రసన్న వేషధారణలో ఉండెడి రావణుని చేత బలాత్కారముగా ఎత్తుకుపోబడిన అబలా తపస్విని నా దృష్టిపథములో ఎప్పుడు ఎలా వచ్చునో '||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సున్దరకాండే త్రయోదశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదమూడవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||