||సుందరకాండ ||
||ఇరువదియవ సర్గ తెలుగులో||
|| Om tat sat ||
||ఓమ్ తత్ సత్||
శ్లో|| స తాం పరివృతామ్ దీనాం నిరానన్దాం తపస్స్వినీమ్|
సాకారైర్మథురైర్వాక్యైః న్యదర్శయత రావణః||1||
స|| తాం పరివృతాం దీనాం నిరానందాం తపస్స్వినీం సాకారైః మధురైః వాక్యైః న్యదర్శయత||
తా|| (రావణుడు) చుట్టబడియున్నదీనమైన ఆనందములేని తవస్విని అయిన సీతకు హావభావచేష్ఠలతో మధురమైన మాటలతో కూడిన వాక్యములతో రావణుడు తన మనోభావమును వెల్లడించెను.
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ వింశస్సర్గః
(రావణుడు) చుట్టబడియున్నదీనమైన ఆనందములేని తవస్వినినకి హావభావచేష్ఠలతో మధురమైన మాటలతో కూడిన వాక్యములతో తన మనోభావమును వెల్లడించెను.
"ఓ ఏనుగు తొండమువంటి తొడలు కలదానా! నన్ను చూచి స్తనములను ఉదరమును దాచుకోని నీవు భయముతో నా చూపుల నుంచి మరుగుపరుచు కోవాలనుకుంటున్నావు. ఓ విశాలాక్షీ సర్వలోక మనోహరి నిన్ను నేను వాంచిస్తున్నాను. ఓ ప్రియా నన్ను కోరుకో. ఇక్కడ మనుష్యులుకాని కామరూపులైన రాక్షసులుకాని లేరు. ఓ సీతా నా గురించి కలిగిన భయమును వదిలుము. ఓ భయస్థురాలా ! పరస్త్రీలను అపహరించడము, వారితో రమించడము అన్ని విధములుగా రాక్షసుల స్వధర్మము.అందులో సంశయము లేదు. ఈ విధముగా ఈ కామము నా శరీరములో ప్రవర్తించును. ఓ మైథిలీ నన్ను కోరని నిన్ను నేను తాకను. ఓదేవి ! ప్రియురాలా ! నన్ను విశ్వశించు. ఇక్కడ భయమునకు తావులేదు. నిజముగా ప్రేమించుము. ఈ విధముగా శోకలాలసవు కావద్దు. ఓక జడతో భూమియే శయ్యగాచేసుకొని మలినమైన వస్త్రములతో ఉపవాసము చేయుట ఇవన్నీ నీకు తగని పనులు. ఓ మైథిలీ నన్ను పొంది మాలలు అగరు చందనము వివిధరకములైన వస్త్రములు దివ్యమైన ఆభరణములను పొందుము. శ్రేష్టములైన పానీయములను, ఆసనములను, గీత నృత్య వాద్యములను పొందుము".
"ఓ దేవీ! నీవు స్త్రీలలో రత్నము. ఈ విధముగా నువ్వు ఉండకూడదు. నీ గాత్రములలో ఆభరణములను ధరించుము. మంచి విగ్రహము కలదానా ! నన్ను పొంది నీవు ఏమి పొందకుండా వుండగలవు ? ఈ సుందరమైన నీ యౌవ్వనము గడిచిపోవును. ఇది సీఘ్రముగా పారుచున్న నీరు వలె మరల వెనుకకు రాదు. ఓ అద్భుతమైన రూపము కలదానా ! నిన్ను చేసిన తరువాత సృష్టికర్త సౌదర్యము సృజించదాన్ని విరమింఛాడు కాబోలు. నీతో సమానమైన సౌందర్యవతి లేదు".
" ఓ వైదేహీ రూపయౌవ్వనశాలియగు నిన్ను చూసిన తరువాత ఏ పురుషుడు ముందుకు పోగలడు. సాక్షాత్తు బ్రహ్మకూడా పోలేడు. చంద్రబింబము తో సమానమైన అందము కలదానా అందమైన కటిప్రదేశము కలదానా నీ అవయవములను ఎక్కడ చూసిన అక్కడే నా కళ్ళు ఆగిపోతాయి".
" ఓ మైథిలీ ! నా భార్య అవుము. నీ మోహమును వదులుము. బాహుబలముతో తీసుకురాబడిన అనేక ఉత్తమస్త్రీలందరికి పెద్ద పట్టపురాణివి అగుము. నీకు మంగళము కూరును. ఓ భయస్థులారా లోకములో జయించి తీసుకువచ్చిన రత్నములన్నీ , వస్తువులన్నీ , నా రాజ్యము నీవే . నేనూ కూడా నీ వాడనే".
"అనేక నగరములతో కూడిన పృథివీ మండలము అంతా జయించి నీ కొఱకు జనకునకు సమర్పిస్తాను. ఈ లోకములో నాతో సమానమైన బలము కలవాడులేడు. యుద్ధరంగములో కూడా నాకు ప్రతిద్వంది లేని వీర్యమును చూడుము. నాతో అసమానులైన సురాసురులు యుద్ధములో విరిగిన ధ్వజములతో భగ్నులైనారు. నాముందు నిలబడడానికి అశక్తులు అయ్యారు. నా యొక్క ఇచ్ఛ నీవు ఉత్తమమైన అలంకరణలు చేసికొనుము. నీ అంగములలో కాంతి గల ఆభరణలు ధరించబడుగాక. ఆ విధముగా అలంకరింపబడిన నీ సాధురూపము చూచెదను. ఓ భీరు సుందరాంగీ ! నీకు ఇష్టమైనట్లు అలంకరించుకొని భోగములు అనుభవించు మధుపానము సేవించు రమింఛు. నువ్వు పృథివినీ ధనమును ఈ కోరికప్రకారము దానము చేయుము భయము లేకుండా లాతో రమించు. ధైర్యముగా నన్ను ఆజ్ఞాపించు. ఓ మంగళస్వరూపిణీ ! నన్ను ప్రసాదించి సుఖసంతోషములు పొంది నీ బంధువులను కూడా సంతోషపెట్టు. నా బుద్ధినీ యశస్సును చూడు".
" ఓ సుందరీ చీరవస్త్రములు ధరించే రామునితో ఏమి చేస్తావు. విజయము ఐశ్వర్యము లేని వనములో చరించు తాపసిక వ్రతములను అనుసరించుభూమిపై నిద్రించు రాముడు జీవిస్తున్నాడో లేదో అన్నది శంకయే. ఓ వైదేహీ నిన్ను ఎగురుతూ వెనకవున్న మేఘములతో కప్పివేయబడిన చంద్రుని ఏలాచూడలేవో అలాగే రాముడు నిన్ను చూడలేడు. హిరణ్యకశిపుడు ఇంద్రునిచే అపహరింపబడిన (తన భార్య) కీర్తిని పొందగలగాడు. కాని నాహస్తమునుంచి రాముడు నిన్ను పొందలేడు. ఓ చారుస్మితి చారుదతి చారునేత్రీ ! విలాసినీ ! నీవు గరుత్మంతుడు స్వర్పమును హరించినట్లుగా నామనస్సుని అపహరించినావు".
"ఓ తన్వీ ! నలిగిపోయిన పట్టువస్త్రము ధరించిన, అలంకారములతో లేకపోయినా కాని నిన్ను చూచిన తరువాత నా భార్యలతో రతి పొందలేకపోతున్నాను. ఓ జానకీ నా అంతః పురములో ఉన్న స్త్రీలు సర్వగుణ సంపన్నులు. నీవు వారిపై అధిపత్యము వహించుము".
"ఓ నల్లని కేశములు కలదానా! నా యొక్క ముల్లోకములలో శ్రేష్టులైన స్త్రీలు, అప్సరస స్త్రీలు లక్ష్మి ని సేవించినట్లు నీకు పరిచర్యలు చేస్తారు. ఓ చక్కని కనుబొమ్మలు, చక్కని కటి ప్రదేశము కలదానా ! నేను కుబేరుని జయించి తీసుకువచ్చిన రత్నములు ధనములు ఆన్నీ నన్నుకూడా యథాసుఖముగా అనుభవింపుము. ఓ దేవీ రాముడు తపస్సులో నాతో సమానుడు కాడు. బలములో సమానుడు కాడు. ధనములో తేజస్సులో యశస్సులో కూడా సమానుడుకాడు".
"ఓ లలనా ! కుప్పలుగా ధనము బంగారము నీకు ప్రసాదిస్తాను. తిని తాగి విహరించి రమించు. భోగములను నీకు తోచినట్లు నాతో అనుభవించు. నీ బంధవులు తో కలిసి అనుభవించు".
"ఓ భీరు ! బంగారు కుసుమముల హారములతో అలంకరించుకో. బాగుగాపుష్పించిన చెట్లు కల, భ్రమరములు కల సముద్ర తీర ఉద్యానవనములలో నాతో కలిసి విహరించు".
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువదియవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||
శ్లో|| కుసుమిత తరుజాల సంతతాని
భ్రమరయుతాని సముద్రతీరజాని|
కనక విమల హారభూషితాఙ్గి
విహర మయా సహ భీరు కాననాని||36||
స|| భీరు కనక విమల హారభూషితాంగీ కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్రతీరజాని కాననాని మయా సహ విహర||
తా|| "ఓ భీరు ! బంగారు కుసుమముల హారములతో అలంకరించుకో. బాగుగాపుష్పించిన చెట్లు కల, భ్రమరములు కల సముద్ర తీర ఉద్యానవనములలో నాతో కలిసి విహరించుము".
||ఓమ్ తత్ సత్||