||సుందరకాండ ||
||ఇరువది తొమ్మిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||
|| Sarga 29 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ ఏకోనత్రింశస్సర్గః
తథా గతాం తాం వ్యధితామనిందితామ్
వ్యపేతహర్షాం పరిదీన మానసామ్|
శుభాం నిమిత్తాని శుభాని భేజిరే
నరం శ్రియా జుష్ట మిహోప జీవినః||1||
స||తథాగతాం వ్యథితాం అనిందితాం వ్యపేత హర్షాం పరదీనమానసామ్ శుభామ్ తాం శ్రియా జుష్టం నరం ఉపజీవనః ఇవ శుభాని నిమిత్తాని భేజిరే ||
అనుకోకుండా ఇశ్వర్యము లభించినవాని దగ్గరకు ఆశ్రితులు చేరినట్లు దుఃఖముతో బాధలో నున్న, నిందింపబడలేని, కించిత్తు కూడా హర్షములేని, ఆ సీతాదేవిని శుభసూచనలు చుట్టు ముట్టినవి.
తస్యా శ్శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణవిశాలశుక్లమ్|
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మామివాభితామ్రం|| 2||
స|| సుకేశ్యాః తస్యాః శుభం అరాలపక్ష్మ రాజీవృతమ్ కృష్ణవిశాలశుక్లమ్ వామనయనమ్ మీనాహతం అభితామ్రం ఏకం పద్మమివ ప్రాస్పందత||
అందమైన కేశములు గల ఆ సీత యొక్క నడుమ నల్లగా చుట్టూ తెల్లగా వున్నవిశాలమైన ఎడమ కన్ను, కొలనులో చేపచేత కొట్టబడి కదిలిన పద్మము వలె స్పందించెను.
భుజశ్చ చార్వంచిత పీనవృత్తః
పరార్థ్యకాలాగరుచందనార్హః|
అనుత్తమే నాధ్యుషితః ప్రియేణ
చిరేణ వామః సమవేపతాఽశు||3||
స|| చార్వంచిత పీన వృత్తః వామ భుజశ్చ పరార్థ్యకాలా అగరు చందన అర్హః అనుత్తమేన ప్రియేన చిరేణ అధ్యుషితః ఆశు సమవేపత||
గుండ్రముగా పుష్ఠముగా వున్న ఆమె ఎడమ భుజము, అగరు చందనములకు తగినట్టి చాలాకాలము ప్రియునికి తలగడలాగ ఒప్పారిన ఆమె ఎడమభుజము కూడా అప్పుడు కంపించినది.
గజేంద్రహస్తప్రతిమశ్చ పీనః
తయోః ద్వయోః సంహతయోః సుజాతః|
ప్రస్పందమానః పున రూరు రస్యా
రామం పురస్తాత్ స్థిత మాచచక్షే ||4||
స|| సంహతయోః ద్వయోః అస్యాః ఊరుః పీనః సుజాతః గజేంద్రహస్తప్రతిమః ప్రస్పందమానః రామం పురస్తాత్ స్థితం ఆచచక్షే||
ఏనుగు తోండములా లావైన పరిపుష్ఠమైన అందమైన ఒకదానికొకటి దగ్గరగా ఉన్న ఆమె తొడలలో ఎడమ తొడ చలించి రాముడు ముందు నిలచినట్లు సూచించెను.
శుభం పునర్హేమసమానవర్ణ
మీషద్రజో ధ్వస్తమివామలాక్ష్యాః|
వాసస్థ్సితాయాః శిఖరాగ్రదంత్యాః
కించిత్పరిస్రంసత చారుగాత్ర్యా||5||
స|| పునః అమలాక్షయాః శిఖరాగ్రదంత్యాః చారుగాత్ర్యాః స్థితాయాః శుభం హేమసమానవర్ణం ఈర్షత్ రజోధ్వస్తమ్ ఇవ వాసః కించిత్ పరిసంస్రత||
మళ్ళీ అమలమైన కళ్ళు , మంచిదంతముల వరుస, అందమైన అవయములు కల, బంగారముతో సమానమైన వర్ణముకల ఆ సీత నిలబడగా ధూళిచే కప్పబడిన ఆమె వస్త్రము శుభసూచకముగా కొంచెము పక్కకి జారెను.
ఏతైర్నిమిత్తైః అపరశ్చ సుభ్రూః
సంబోధితా ప్రాగపి సాధు సిద్ధైః|
వాతాతప్లకాంత మివ ప్రణష్టమ్
వర్షేణ బీజం ప్రతిసంజహర్ష||6||
స|| ప్రాగపి సాధు సిద్ధైః గతైః నిమిత్తైః అపరైశ్చ సంబోధితా సుభౄః వాతప్రక్లాంతం ప్రణష్టం బీజం వర్షేణ ఇవ ప్రతిసంజహర్ష||
ముందుకూడా సాధువులు సిద్ధులచే చెప్పబడి ఇదివరకు అనుభవపూర్వకముగా ఫలములను ఇచ్చిన ఈ శుభసూచనములచేత చక్కని కనుబొమ్మలు కల సీత, ఎండిపోయిన విత్తనము వర్షము పడగానే అంకురించిన రీతిలో, ఆనందపడెను.
తస్యాం పునర్బింబఫలాధరోష్టమ్
స్వక్షిభ్రు కేశాంత మరాళ పక్ష్మ|
వక్త్రం బభాసే సితశుక్లదంష్ట్రమ్
రాహోర్ముఖాః చంద్ర ఇవప్రముక్తః||7||
స|| పునః తస్యాః బింబఫలాధరోష్ఠం స్వక్షిభృకేశాంతం అరాళపక్ష్మ సితచారుదంతం వక్త్రం రాహోః ముఖాత్ ప్రముక్తః చంద్ర ఇవ బభాసే||
బింబాఫలములాంటి పెదవులు కల, అందమైన దంతములు, వంకర తిరిగిన కనురెప్పల తో విశాలమైన కళ్ళు కల ముఖముతో సీత , రాహు ముఖము నుండి విడివడిన చంద్రుని వలె ప్రకాశించెను.
సా వీత శోకా వ్యపనీత తంద్రీ
శాంతజ్వరా హర్షవివృద్ధసత్వా|
అశోభతార్యా వదనేన శుక్లే
శీతాంశునా రాత్రి రివోదితేన ||8||
స|| అర్యా సా వీతశోకా వ్యపనీతతంద్రీ శాంతజ్వరా హర్షవిశుద్ధసత్త్వా వదనేన శుక్లే ఉదితేన శీతాంశునా రాత్రిః ఇవ అశోభత||
అప్పుడు పూజ్యురాలైన , శోకమునుండి విడివడినట్టున్న, అలసత్వము పోయి హర్షముతో నిండి శుద్ధమైన మనస్సుతో ఉన్న ఆ సీత శుక్లపక్షము నాటి చల్లని చంద్రుని వలె శోభించెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకోనత్రింశస్సర్గః||
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది తొమ్మిదవ సర్గ సమాప్తము.
||ఓం తత్ సత్||