||సుందరకాండ ||

||ముప్పది తొమ్మిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 39 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకోనచత్వారింశస్సర్గః

మణిం దత్వా తతః సీతా హనుమంతమథాsబ్రవీత్|
అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతత్ రామస్య తత్త్వతః||1||
మణిం తు దృష్ట్వా రామో వై త్రయాణాం సంస్మరిష్యతి|
వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ||2||

స||తతః మణిం దత్త్వా సీతా హనుమంతం అథ అబ్రవీత్| ఏతత్ రామస్య అబిజ్ఞాత తత్త్వతః అభిజ్ఞానం|| రామః మణిం దృష్ట్వా త్రయాణాం సంస్మరిష్యతి.| వీరః మమ జనన్యా రాజ్ఞః దశరథస్య చ||

పిమ్మట ఆ మణిని ఇచ్చి సీత హనుమంతునితో ఇట్లు పలికెను."అనవాలుగా ఇచ్చిన ఈ అభిజ్ఞానము రామునికి బాగా తెలుసు. రాముడు మణిని చూచి ముగ్గురను సంస్మరించును. నన్ను, తన తల్లిని, దశరథ మహారాజుని."

స భూయః త్వం సముత్సాహే చోదితో హరిసత్తమ|
అస్మిన్ కార్య సమారంభే ప్రచింతయ యదుత్తరమ్||3||
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ|
హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ||4||
తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరో భవేత్|
స తథేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమవిక్రమః||5||
శిరసాఽఽవన్ద్య వైదేహీం గమనాయోపచక్రమే|

స|| హరిసత్తమ సః భూయః సముత్సాహే ఉదితః అస్మిన్ కార్య సమారంభే యదుత్తరం తత్ త్వం ప్రచింతయ||హరిసత్తమ అస్మిన్ కార్యనియోగే త్వం ప్రమాణం| హనుమాన్ యత్నం అస్థాయ దుఃఖక్షయకరః భవ | తస్య యత్నః చింతయతః దుఃఖక్షయకరః భవేత్ || స మారుతిః భీమవిక్రమః తథః ఇతి ప్రతిజ్ఞాయ శిరసా వంద్యా వైదేహీం గమనాయ ఉపచక్రమే ||

ఓ హరిసత్తమ ! ఆయన మరల ఉత్సాహముతో నిలబడి ఈ కార్యము సాధించుటకు ఎది ఉత్తమమో అది సాగునట్లు నీవు అలోచించుము. హరిసత్తమ ఈ కార్యము సాధించుటకు నీవే కీలకము. హనుమాన్ నీ ప్రయత్నముతో నా దుఃఖమును క్షీణింపచేయువాడవు కమ్ము. నీ ప్రయత్నముతో అలోచనతో ఈ దుఃఖము క్షీణించిపోవును." ఆ ప్రచండ విక్రమముగల మారుతి అలాగే అని ప్రతిజ్ఞ చేసి శిరస్సుతో వైదేహికి వందనము చేసి వెళ్ళుటకు సంక్రమించెను.

జ్ఞాత్వా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజమ్||6||
భాష్పగద్గదయా వాచా మైథిలీ వాక్యమబ్రవీత్|

స|| సంప్రస్థితం వానరం మారుతాత్మజం జ్ఞాత్వా దేవి మైథిలి భాష్పగద్గదయ వాచా (పునః) వాక్యం అబ్రవీత్||

వెళ్ళుటకు సిద్ధముగానున్న మారుతాత్మజుడగు హనుమంతునితో మైథిలి గద్గద స్వరముతో మరల ఇట్లు పలికెను.

కుశలం హనుమాన్ బ్రూయాః సహితౌ రామలక్ష్మణౌ||7||
సుగ్రీవం చ సహామాత్యం వృద్ధాన్ సర్వాంశ్చ వానరాన్|
బ్రూయాస్త్వం వానరశ్రేష్ఠ కుశలం ధర్మసంహితమ్||8||
యథా స చ మహాబాహుః మాం తారయతి రాఘవః|
అస్మాత్ దుఃఖాంబుసంరోధాత్ త్వం సమాధాతుమర్హసి||9||
జీవంతీం మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్|
తత్తథా హనుమాన్ వాచ్యం వాచా ధర్మమవాప్నుహి||10||

స|| హనుమాన్ రామలక్ష్మణ సహితౌ సుగ్రీవం చ కుశలం బ్రూయాః అమాత్యం సహ వృద్ధాన్ వానరాన్ సర్వాంశ్చధర్మసంహితం కుశలం బ్రూయాః||త్వం మహాబాహుః రాఘవః మాం అస్మాత్ దుఃఖాంబుసంరోధాత్ యథా తారయతి (తథా) సమాధాతుం అర్హసి || హనుమాన్ కీర్తిమాన్ రామః జీవంతీం మాం యథా సంభావయతి తత్ వాచ్యం తథా వాచా ధర్మం అవాప్నుహి ||

' హనుమాన్ రామలక్ష్మణులతో కూడిన సుగ్రీవుని కుశలములు అడుగుము. అతని మంత్రులు, వృద్ధులైన వానరులు అందరిని ధర్మసహితమైన కుశలములను అడుగుము. ఓ వానరశ్రేష్ఠ మహాబాహువులు కల రాఘవుడు నన్ను ఈ దుఃఖ సంకటమునుంచి ఎట్లు రక్షించునో అట్లు నీవు చూడుము. హనుమాన్ కీర్తిమంతుడైన రాముడు నేను జీవించియుండగనే ఎట్లు తీసుకుపోవునో అట్టి మాటలను చెప్పి ధర్మము సాధించుము'.

నిత్యముత్సాహ యుక్తాశ్చ వాచః శ్రుత్వా త్వయేరితాః|
వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మదవాప్తయే||11||
మత్సందేశయుతా వాచస్త్వత్తః శ్రుత్వా చ రాఘవః|
పరాక్రమవిథిం వీరో విధివత్ సంవిధాస్యతి||12||

స|| త్వయా ఈరితః ఉత్సాహయుక్తాః వాచః నిత్యం శ్రుత్వా మత్ అవాప్తయే దాశరథేః పౌరుషం వర్దిష్యతే||వీరః రామః త్వత్ మత్ సందేశయుతాః వాచః శ్రుత్వా విధివత్ పరాక్రమవిధిం సంవిధాస్యతి ||

నీచే చెప్పబడిన ఉత్సాహముతో కూడిన మాటలు విని నన్ను పొందటకు రాఘవుని పౌరుషము వర్ధిల్లును. వీరుడైన రాముడు నీద్వారా నా సందేశముతో కూడిన మాటలను విని విధివత్ తన పరాక్రమముతో చేయవలసిన కార్యములను మొదలెట్టును'.

సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః|
శిరస్యంజలి మాథాయ వాక్య ముత్తరమబ్రవీత్||13|

స|| హనుమాన్ మారుతాత్మజః సీతాయాః వచనం శ్రుత్వా శిరస్య అంజలిం ఆథాయ వాక్యం ఉత్తరం అబ్రవీత్ ||

సీతయొక్క మాటలను విని మారుతాత్మజుడగు హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి జవాబుగా ఇట్లు పలికెను.

క్షిప్రమేష్యతి కాకుత్‍స్థో హర్యృక్షప్రవరైర్వృతః|
యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి||14||
న హి పశ్యామి మర్త్యేషు నాసురేషు సురేషు వా|
యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతు ముత్సహతేsగ్రతః||15||
అప్యర్కమపి పర్జన్యమపి వైవస్వతం యమమ్|
స హి సోఢుం రణే శక్తస్తవ హేతోర్విశేషతః||16||
సహి సాగరపర్యంతాం మహీం శాసితు మీహతే|
త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని||17||

స|| కాకుత్‍స్థః హర్యక్షు ప్రవరైః వృతః క్షిప్రం ఏష్యతి | యుధి అరీన్ విజిత్య తే శోకంవ్యపనయిష్యతి ||యః బాణాన్ క్షిపతః తస్య అగ్రతః స్థాతుం ఉత్సహతే (తం) మర్త్యేషు అసురేషు వా సురేషు న పశ్యామి హి ||సః రణే అర్కమపి పర్జన్యం అపి వైవస్వతం అపి యమం విశేషతః తవ హేతోః శోఢుం శక్తః|| సః సాగరపర్యంతాం మహీం శాసితుం అర్హతి హి | జనకనందిని రామస్య జయః త్వన్నిమిత్తః హి||

' కాకుత్‍స్థుడు వానరభల్లూక ప్రవరులతో సమేతుడై త్వరలోనే వచ్చును. యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తొలగించును. రాముని బాణముల ధాటికి ముందు నిలబడగల వాడు మనుష్యులలోగాని సురాసురులలో గాని నాకు కానరావడము లేదు. నీ కొరకై యుద్ధములో సూర్యుని పర్జన్యుని వైవస్వతుని యముని సహితము అందరిని జయించ గలడు. ఆయన సాగరములతో చుట్టబడిన ఈ భూమి యావత్తును శాసించ గలవాడు. ఓ జనకనందిని రాముని జయము నీకొఱకే గదా.'

తస్య తద్వచనం శ్రుత్వా సమ్యక్సత్యం సుభాషితమ్|
జానకీ బహు మేనేsథ వచనం చేద మబ్రవీత్||18||
తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః|
భర్తృ స్నేహాన్వితం వాక్యం సౌహార్దాదనుమానయత్||19||

స|| జానకీ తస్య సత్యం సమ్యక్ సుభాషితం తత్ వచనం శ్రుత్వా బహుమేనే అథ ఇదం వచనం చ అబ్రవీత్ ||తతః సీతా ప్రస్థితం తం పునః పునః వీక్షమాణా భర్తృస్నేహాన్వితం వాక్యం సౌహార్దాత్ అనుమానయత్ ||

జానకి హనుమంతుని సత్యమైన బాగుగా చెప్పబడిన మాటలను విని అత్యంత గౌరవభావముతో ఈ మాటలను చెప్పెను. అప్పుడు అలా వెళ్ళుటకు సిద్ధముగానున్న వానిని మళ్ళీ మళ్ళీ చూస్తూ భర్తపై స్నేహపూర్వకముగా చెప్పబడిన మాటలతో ఆనందముపొందెను.

యదివా మన్యసే వీర వసైకాహ మరిందమ|
కస్మింశ్చిత్సంవృతే దేశే విశ్రాంతః శ్వో గమిష్యసి||20||
మమచేదల్పభాగ్యాయాః సానిధ్యాత్తవ వానర|
అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్||21||
గతే హి హరిశార్దూల పునరాగమానాయ తు|
ప్రాణానా మపి సందేహో మమస్యాన్నత్ర సంశయః||22||

స|| వీర అరిందమ మన్యసే యది కస్మింశ్చిత్ సంవృతే దేశే ఏకాహం వస | విశ్రాంతః స్వః గమిష్యసి||వానర తవ సాన్నిధ్యాత్ అల్పభాగ్యాయాః మమ మహత్ అస్య శోకస్య ముహూర్తం మోక్షణం భవేత్ చేత్ ||హరిశార్దూల పునరాగమనాయ గతే మమ ప్రాణానాం అపిసందేహః స్యాత్ | అత్ర సందేహః న ||

' ఓ వీరుడా ఒకవేళ తగును అనుకుంటే ఒక క్షేమమైన ప్రదేశములో ఒకరోజు గడుపుము. విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము. ఓ వానరా నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు మహత్తరమైన ఈ శోకమునుంచి ఒక క్షణమైనా ఉపశమనము లభించకలదు. ఓ హరిశార్దూల నీ పునరాగమనము వఱకూ నాప్రాణములు సంకతములో నుండును. అందులో సందేహము లేదు'.

తవా దర్శనజః శోకో భూయో మాం పరితాపయేత్|
దుఃఖా దుఃఖపరామృష్టాం దీపయన్నివ వానర||23||
అయం చ వీర సందేహాః తిష్టతీవ మమాగ్రతః|
సుమహాం స్త్వత్సహాయేషు హర్యృక్షేషు హరీశ్వర||24||
కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిమ్|
తాని హర్యృక్షసైన్యాని తౌ వా నరవరాత్మజౌ||25||
త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే|
శక్తిస్స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా||26||

స|| వానర దుఃఖాత్ దుఖపరామృష్టాం మామ్ తవ అదర్శనజః శోకః దీపయన్ ఇవ భూయః పరితాపయేత్ ||వీర హరీశ్వరత్వత్ సహాయేషు హర్యక్షేషు అయం సుమహాన్ సందేహః మమ అగ్రతః తిష్ఠతీవ||తాని హర్యక్షు సైన్యాని తౌ నరవరాత్మజౌ దుష్పారం మహోదధిం కథం ను తరిష్యంతి ఖలు||అస్య సాగరస్య లంఘనే భూతానాం తవ వా వైనతేయస్య వా మారుతస్య శక్తిః స్యాత్ ||

'ఓ వానరా దుఖపరంపరలో మునిగియున్న నాకు నీవు కానరాకపోవడముచే కలిగే దుఃఖము మరింత తాపమును కూర్చును. ఓ వీర హరీశ్వర నీ సహాయకుల అగు వానర భల్లుక గణముల పై నాకు మహత్తరమైన సందేహము కలుగుచున్నది. ఆ వానరభల్లూక సైన్యములు ఆ నరవరులిద్దరూ దుష్కరమైన ఆ సాగరమును ఎట్లు దాటగలరు. ఈ సాగరము దాటుటలో నీకు గరుత్మంతునికి వాయుదేవునకు మాత్రమే సాధ్యము కదా.'

తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే|
కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాం వరః||27||
కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే|
పర్యాప్తః పరవీరఘ్న యశస్య స్తే ఫలోదయః||28||

స|| వీర తత్ ఏవం దురతిక్రమే అస్మిన్ కార్యనిర్యోగే కిం సమాధానం పశ్యసి | త్వం కార్యవిదాం వరః హి ||పరవీరఘ్న అస్య కార్యస్య పరిసాధనే త్వం ఏక ఏవ పర్యాప్తః | కామం తే ఫలోదయః యశస్యః||

' ఓ వీరుడా ఈ కష్ఠమైన పని సాధించుటకు ఏమి ఉపాయము చూస్తున్నావు. నీవు కార్యములు సాధించుటలో దక్షత కలవాడవు. ఓ వీరా ఈ కార్యము సాధించుటకు నీవు ఒక్కడివే తగినవాడవు. ఈ కార్యసాధనయొక్క కీర్తి నీదే అగును'.

బలైః సమగ్రైః యది మాం రావణం జిత్య సంయుగే|
విజయీ స్వపురం యాయాత్తత్తు మే స్యాత్ యశస్కరమ్||29||
శరైస్తు సంకులాం కృత్వా లంకా పరబలార్దనః|
మాం నయేద్యది కాకుత్‍స్థః తత తస్య సదృశం భవేత్||30||
తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః|
భవేదావహశూరస్య తథా త్వముపపాదయ||31||

స|| సంయుగే సమగ్రైః బలః రావణం జిత్య మాం విజయీ స్వపురం యయాత్ యది తత్ తస్య సదృశం భవేత్ ||పరబలార్దనః కాకుత్‍స్థః లంకాం శరైః సంకులం కృత్వా మామ్ నయేత్ యది తత్ తస్య సదృశం భవేత్ ||తత్ మహాత్మనః ఆహవశూరస్య తస్య అనురూపం విక్రాంతం యథా భవేత్ తథా త్వం ఉపపాదయ ||

' యుద్ధములో రావణుని తన బలములతో సహా జయించి, ఆ విజయముతో నన్ను తన పురమునకు తీసుకుపోయినచో అది ఆయనకు తగినపని. శత్రువులను తపించు కాకుత్‍స్థుడు లంకానగరమును తన శరపరంపరతో సంకులము చేసి నన్ను తీసుకుపోయినచో అది ఆయనకు తగును. ఆ శూరుడు అగు మహాత్ముని పరాక్రమమునికి తగునట్లు కార్యాచరణము అగుటకు నీవు చేయుము'.

తదర్థోపహితం వాక్యం సహితం హేతుసంహితమ్|
నిశమ్య హనుమాన్ శేషం వాక్యముత్తరమబ్రవీత్||32||

స|| హనుమాన్ అర్థోపహితం ప్రశ్రితం హేతుసంహితం తత్ వాక్యం నిశమ్య శేషం వాక్యం అబ్రవీత్ ఉత్తరం||

హనుమంతుడు అర్థముతో కూడిన సందర్భోచితమైన మాటలను విని హనుమంతుడు మిగిలిన మాటలను ఇట్లు చెప్పెను.

దేవీ హర్యృక్షసైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః|
సుగ్రీవః సత్త్వసంపన్నః తవార్థే కృతనిశ్చయః||33||
స వానర సహస్రాణాం కోటిభిరభిసంవృతః|
క్షిప్రమేష్యతి వైదేహి రాక్షసానాం నిబర్హణః||34||
తస్య విక్రమసంపన్నాః సత్త్వవంతో మహాబలాః|
మనః సంకల్పసంపాతా నిదేశే హరయః స్థితాః||35||
యేషాం నోపరి నాధస్తాన్ నతిర్యక్సజ్జతే గతిః|
న చ కర్మసు సీదంతి మహత్స్వమిత తేజసః||36||

స|| దేవీ హర్యక్షు సైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః సత్త్వసంపన్నః సుగ్రీవః తవ అర్థే కృతనిశ్చయః||వైదేహి సః వానరసహస్రాణాం కోటిభిః అభిసంవృతః రాక్షసానాం నిబర్హనః క్షిప్రం ఏష్యతి ||విక్రమసంపన్నాః సత్త్వవంతః మహాబలాః మనః సంకల్పసంపాతాః హరయః తస్య నిదేశే స్థితాః||యేషాం గతిః ఉపరి న సజ్జతే అధస్తాత్ న తిర్యక్ న| అమిత తేజసః మహత్సు కర్మసు నసీదంతి ||

' ఓ దేవీ ! వానర హల్లూక సైన్యములకు అధిపతి వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు నిన్ను ఆదుకోవలననే నిశ్చయములో ఉన్నవాడు. ఓ వైదేహీ ! అతడు వేలకొలదీ వానర సైన్యములతో కలిసి రాక్షసులను తుదముట్టించుటకు త్వరలో ఇక్కడికి వచ్చును. పరాక్రమమే సంపదగా గల, శ్రమ ఎఱగని మహాబలులు మనస్సులో తలచిన విధముగా పోగలవారు అయన అదేశమునకు తయారుగా వున్నారు. వారి ఊర్ధ్వ అధో తిర్యక్ గమనములకు అడ్దులేదు. అమిత తేజస్సుగల వారు ఎంతకష్ట మైన పని అయినా సాధించగలరు.'

అసకృతైర్మహోత్సాహైః స సాగరధరాహరా|
ప్రదక్షిణీకృతా భూమిః వాయుమార్గానుసారిభిః||37||
మద్విశిష్ఠాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః|
మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ||38||
అహం తావదిహ ప్రాప్తః కింపునస్తే మహాబలాః|
న హి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః||39||

స|| మహోత్సాహైః వాయుమార్గానుసారిభిః తైః అసకృత్ ససాగరధరాధరా భూమిః ప్రదక్షిణీకృతాః||తత్ర సుగ్రీవ సన్నిధౌ మత్ విశిష్ఠాశ్చ తుల్యాః చ వనౌకసః సంతి|| మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి || అహం తావత్ ఇహ అనుప్రాప్తః మహబలాః తే కిం పునః | ప్రకృష్టాః న ప్రేష్యంతే హి ఇతరే జనాః ప్రేష్యంతే హి||

' మహోత్సాహము కల వారు వాయుమార్గానుసారులై సాగరములతో కూడిన భూమిని పలుసార్లు ప్రదక్షిణము చేసినవారు. అక్కడ సుగ్రీవుని సన్నిధిలో నా కన్నా విశిష్ఠమైనవారు సమానులూ అయిన వనవాసులు కలరు. నా కన్న తక్కువ వారు లేనే లేరు. నేనే ఇక్కడికి రాగలిగితే మహాబలము కల వారి సంగతి చెప్పనేల ? విశిష్ఠమైనవారిని గాక సామాన్యులనే ఇట్టిపనులకు పంపెదరు కదా'.

తదలం పరితాపేన దేవి శోకోవ్యపైతు తే|
ఏకోత్పాతేన తే లంకామేష్యంతి హరియూథపాః||40||
మమపృష్ఠగతౌ తౌ చంద్ర సూర్యావివోది తౌ|
త్వత్సకాశం మహాసత్త్వౌ నృశింహావాగమిష్యతః|| 41||
తౌ హి వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ|
ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధమిష్యతః||42||

స|| దేవి తత్ అలం పరితాపేన | తే శోకః వ్యపైతు | తే హరియూథపాః ఏకోత్పాతేన లంకాం ఏష్యంతి ||మహసత్త్వౌ నృసింహౌ తౌ చ మమ పృష్ఠగతౌ ఉదితౌ చంద్రసూర్య ఇవ త్వత్సకాసం అభిగమిష్యతః||తతః వీరౌ నరవరౌ రామలక్ష్మణౌ సహితౌ ఆగమ్య లంకాం నగరీం సాయకైః విధమిష్యతః||

' ఓ దేవీ అందువలన ఈ పరితాపము చాలును. నీ శోకము నశించుగాక. ఆ వానర సేనలు ఒక్కగంతులో లంకను చేరెదరు. నరసింహులు మహా సత్త్వము గల రామలక్ష్మణులు ఇద్దరూ నా పృష్ఠము పై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రులవలె నీ దగ్గరకు వచ్చెదరు. ఆ నరవరులైన వీరులు రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఈ లంకానగరమును శరపరంపరలతో నాశనము చేసెదరు.'

సగణం రావణం హత్వా రాఘవో రఘునందనః|
త్వా మాదాయ వరారోహే స్వపురం ప్రతి యాస్యతి||43||
తదాశ్వసిహి భద్రం తే భవ త్వం కాలకాంక్షిణీ|
న చిరాత్ ద్రక్ష్యసే రామం ప్రజ్వలంత మివాలనమ్||44||
నిహతే రాక్షసేంద్రేsస్మిన్ సపుత్రామాత్యబాంధవే|
త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణీ||45||
క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలి|
రావణం చైవ రామేణ నిహతం ద్రక్ష్యసేsచిరాత్||46||

స|| రఘునందనః రాఘవః రావణం సగణం హత్వా త్వాం ఆదాయ స్వపురం ప్రతి యాస్యతి ||తత్ ఆశ్వాసిహి | తే భద్రం| త్వం కాలకాంక్షినీ భవ| ప్రజ్వలంతం అనలం ఇవ రామం న చిరాత్ ద్రక్ష్యసే||అస్మిన్ సపుత్రబాంధవే రాక్షసేంద్రే నిహతే త్వం రోహిణీ శశాంకేన్ ఇవ రామేణ సమేష్యసి||దేవి మైథిలీ త్వం క్షిప్రం శోకస్య పారం యాస్యసి | అచిరాత్ రామేణ రావణం నిహతం చ ద్రక్ష్యసి ||

' రఘునందనుడగు రాఘవుడు రావణుని తన గణములతో సహా హతమార్చి నిన్ను తీసుకొని తన పురమునకు పోవును. అది నానమ్మకము. నీకు భద్రము అగు గాక. నీవు మంచి కాలముకోసము వేచియుండుము. ప్రజ్వలిస్తున్న అగ్ని వలె ఉన్న రాముని త్వరలో చూడగలవు. ఈ రాక్షసుడు తన బంధువర్గముతో హతమార్చబడిన పిమ్మట రోహిణి చంద్రుని చేరినట్లు నీవు రామునితో కలిసెదవు. అచిరకాలములో రామునిచేత రావణుడు హతమార్చబడడము చూచెదవు'.

ఏవ మాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః|
గమనాయ మతిం కృత్వా వైదేహీం పునరబ్రవీత్||47||

స|| హనుమాన్ మారుతాత్మజః వైదేహీం ఏవం ఆశ్వాస్య గమనాయ మతిం కృత్వా వైదేహీం పునః అబ్రవీత్ ||

మారుతాత్మజుడైన హనుమంతుడు వైదేహి కి ఇలా అశ్వాసము ఇచ్చి వెళ్ళుటకు నిశ్చయించుకొనిన వాడై వైదేహితో మరల ఇట్లు పలికెను.

తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం|
లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితమ్||48||
నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూలవిక్రమాన్|
వానరాన్ వానరనేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్||49||
శైలాంబుదనికాశానాం లంకామలయసానుషు|
నర్దతాం కపిముఖ్యానాం ఆర్యే యూథాన్ అనేకశః||50||

స|| లంకాద్వారముపాస్థితం అరిఘ్నం కృతాత్మానం తం రాఘవం ధనుష్పాణిం లక్ష్మనం చ క్షిప్రం ద్రక్ష్యసి||నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూలవిక్రమాన్ వారణేంద్రాభాన్ సంగతాన్ వానరాన్ క్షిప్రం ద్రక్ష్యసి||ఆర్యే శైలాంబుదనికాసానాం నర్దతాం కపిముఖ్యానాం అనేకశః యూధాని లంకామలయమానుషు (ద్రక్ష్యసి)||

' కృతనిశ్చయులై లంకాద్వారము దగ్గర ధనుర్ధారులై ఉపస్థితులైన శత్రుమర్దనులు అగు రామ లక్ష్మణులను త్వరలో చూచెదవు. నఖములు దంతములు ఆయుధములుగా గల వీరులను సింహ శార్దూలములతో సమానమైన పరాక్రమము గల వానరేంద్రులను తండోప తండములుగా వున్న వానరులను త్వరలో చూసెదవు. ఓ పూజనీయురాలా మేఘములతో కూడిన పర్వత సమానులు అగు అనేక మంది కపిముఖ్యులను త్వరలోనే లంకా మలయ పర్వతములలో చూచెదవు'.

స తు మర్మణి ఘోరేణ తాడితో మన్మథేషుణా|
నశ్రమ లభతే రామః సింహార్దిత ఇవద్విపః||51||
మారుదో దేవీ శోకేన మాభూత్తే మనసోsప్రియం|
శచీవ పత్యా శక్రేణ భర్త్రా నాథవతీ హ్యసి||52||
రామాద్విశిష్ఠః కఽన్యోఽస్తి కశ్చిత్ సౌమిత్రిణా సమః|
అగ్నిమారుతకల్పౌ తౌ భ్రాతరౌ తవ సంశ్రయౌ||53||

స|| సః రామః ఘోరేన మన్మథేషుణా మర్మణి తాడితః సింహార్దితః ద్విపః ఇవ న శర్మ లభతే||దేవి శోకేన మారుదః | తే మనసః అప్రియం మాభూత్ | పత్యా శక్రేణ శచీ ఇవ నాథవతీ అసి హి ||రామాత్ విశిష్ఠః అన్యః కః అస్తి| సౌమిత్రిణా సమః కశ్చిత్ | అగ్నిమారుతకల్పౌ తౌ భ్రాతరౌ తవ సంశ్రయౌ||

'రాముడు మన్మధుని బాణములచే కొట్టబడిన హృదయాంగములు కలవాడై సింహముచే అడ్డగింపబడిన ఏనుగవలె శాంతి లేనివాడు. ఓ దేవి శోకముతో దుఃఖించకు. నీ మనస్సు అప్రియము కాకుండు గాక. శక్రుని శచీదేవి వలె నీవు కూడా అట్టి నాథుడు గలదానవు. ఓ దేవి రాముని కంటె విశిష్ఠుడు ఎవరు? లక్ష్మణునితో సమానుడు ఎవరు? అగ్ని వాయువు వలెనున్న అన్నతమ్ములిద్దరూ నీకు అండ.'

నాస్మిం శ్చిరం వత్స్యసి దేవి దేశే
రక్షోగణైరధ్యుషితేsతి రౌద్రే|
న తే చిరాదాగమనం ప్రియస్య
క్షమస్వ మత్సంగమకాలమాత్రమ్||54||

స|| దేవి రక్షోగణైః అధ్యుషితే అతిరౌద్రౌ అస్మిన్ దేశే చిరం న వత్స్యసి |తే ప్రియస్య ఆగమనం న చిరాత్ | మత్సంగమకాలమాత్రం క్షమస్వ||

' ఓ దేవి రాక్షసగణముల నివాసస్థానమైన భయంకరమైన ఈ ప్రదేశములో నువ్వు ఎక్కువ కాలము ఉండవు. నీ ప్రియుడు త్వరలోనే వచ్చును. నే వెళ్ళి సందేశము ఇచ్చువఱకు ఓర్చుకొనుము.'

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకోనచత్వారింశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది తొమ్మిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||