||సుందరకాండ ||

||నలభై ఒకటవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 41 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకచత్వారింశస్సర్గః

స చ వాగ్భిః ప్రశస్తాభిః గమిష్యన్ పూజితస్తయా|
తస్మాద్దేశాదపక్రమ్య చింతయామాస వానరః||1||

స|| సః వానరః ప్రశస్థాభిః వాగ్భిః పూజితః తస్మాత్ దేశాత్ అపక్రమ్య గమిష్యన్ చింతయామాస||

ఆ వానరుడు మాటలతో ప్రశంశించబడి పూజింపబడి ఆదేశమునుండి బయలుదేరి వెళ్ళుటకు అలోచించెను.

అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణా|
త్రీన్ ఉపాయానతిక్రమ్య చతుర్థ ఇహ విద్యతే||2||
న సామ రక్షస్సు గుణాయ కల్పతే న దానమర్థోపచితేషు యుజ్యతే|
నభేదసాధ్యా బలదర్పితా జనాః పరాక్రమస్త్వేవ మమేహ రోచతే||3||
న చాస్య కార్యస్య పరాక్రమా దృతే వినిశ్చయః కశ్చిదిహోపపద్యతే|
హతప్రవీరాహి రణేహి రాక్షసాః కథంచిదీయుర్యదిహాద్య మార్దవమ్||4||

స|| ఇదం కార్యం అల్పశేషం (అస్తి)| అయం అసితేక్షణా దృష్టా| త్రీన్ ఉపాయాన్ అతిక్రమ్య ఇహ చతుర్థ విద్యతే|| రక్షస్సు సామ గుణాయ న కల్పతే| అర్థోపచితేషు దానం న యుజ్యతే| బలదర్పితాః జనాః భేద సాధ్యాః న | ఇహ మమ పరాక్రమస్త్వేవ రోచతే||ఇహ అస్య కార్యస్య పరాక్రమాత్ ఋతే వినిశ్చయః కశ్చిత్ న ఉపపద్యతే| యత్ రణే హతప్రవీరాః రాక్షసాః అద్య ఇహ కథంచిత్ మార్దవం ఈయుః||

'ఈ అశితేక్షణ చూడబడినది. ఇక్కడ చిన్నవిషయము మిగిలింది. మూడు ఉపాయములగు సామదాన భేదములను దాటి నాలుగో ఉపాయము దండన ఒకటి ఉన్నది. రాక్షసుల మీద సామము పనికిరాదు. ధనము ఉన్నవారు కనక దానము పనిచేయదు. బలదర్పము వారి మధ్యలో భేదోపాయమునకు తావులేదు. ఇక్కడ నా పరాక్రమమే పనికివచ్చును. ఇక్కడ ఉన్న పరిస్థితిలో పరాక్రమము వినా మరేది పనిచేయదు. ఇక్కడ రణములో చంపబడిన రాక్షసులు వలన మిగిలినవారు మెత్తబడెదరు.

కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్|
పూర్వకార్యావిరోధేన స కార్యం కర్తు మర్హతి||5||
న హ్యేక సాధకో హేతుః స్వల్పస్యాపీహ కర్మణః|
యోహ్యర్థం బహుధా వేద స సమర్థోsర్థ సాధనే||6||

స|| కార్యే కర్మణి నిర్దిష్టే యః పూర్వకార్యా విరోధేన బహూణ్యపి సాధయేత్ సః కార్యం కర్తుం అర్హతి|| ఇహ స్వల్పస్య అపి కర్మణః సార్ధకః హేతుః ఏకః న హి | యః అర్థం బహుధా వేద సః అర్థసాధనే సమర్థః ||

'ఇవ్వబడిన కార్యము సాధించినవాడు, ముందు సాధించిన కార్యము చెడకుండా ఎవడు అనేక ఇతర కార్యములు సాధించగలడో అట్టివాడు సాధకుడు అనబడును. లోకములోఎంత చిన్నపని చేయవలను అన్నా ఉపాయము ఒకటే చాలదు. ఈ మాట తెలిసినవాడే సమర్థుడు".

ఇహైవ తావత్కృతనిశ్చయో హ్యహం
యది వ్రజేయం ప్లవగేశ్వరాలయమ్|
పరాత్మ సమ్మర్థవిశేషతత్త్వవిత్
తతః కృతం స్యాన్ మమభర్తృశాసనమ్||7||

స|| అహం ఇహైవ తావత్ పరాత్మసమ్మర్దవిశేషతత్త్వవిత్ ప్లవగేశ్వరాలయంవ్రజేయం యది తతః మమ భర్తృ శాసనం కృతం స్యాత్ ||

'నేను ఇక్కడనుంచి వారి బలాబలములు విశేష తత్త్వములను ఎరిగిన పిమ్మట వానరాధిపతి ఆలయమునకు వెడితే అది నా ప్రభువు ఆదేశాన్ని పూర్తిగా చేసినవాడను అగుదును".

కథం ను ఖల్వద్య భవేత్సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమరాక్షసైః సహ|
తథైవ ఖల్వాత్మబలం చ సారవత్ సమ్మానయేన్మాం చ రణే దశాననః||8||
తతః సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబలప్రయాయినమ్|
హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహ మితః పునర్వ్రజే||9||

స|| అద్య మమ రాక్షసైః సహ ప్రసహ్య యుద్ధం కథం ను సుఖాగతం భవేత్| తథైవ ఆత్మబలం చ సారవత్ సః దశాననః చ మామ్ రణే మానయేత్ || తతః సమంత్రివర్గం సబలప్రయాయినం దశాననం రణే సమాసాద్య తస్య హృది స్థితం మతం బలం చైవ మత్త్వా అహమ్ ఇతః సుఖేన పునః వ్రజే ||

'ఈ దినమున యుద్ధము జరుగుటకు రాక్షసులను ఎట్లు పురిగొల్పగలను? అప్పుడు అ దశాననుడు తన బలములను నన్ను ఎదురుకొనుటకు పంపును. అప్పుడు మంత్రివర్గముతో కూడిన రావణ సైన్యమును రణములో ఎదురుకొని అతని హృదయములో ఉన్నఆశను బలమును తెలిసికొని నేను ఇక్కడనుంచి సుఖముగ వెళ్ళిపోవచ్చును'.

ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం|
వనం నేత్రమనః కాంతం నానాద్రుమలతాయుతమ్||10||
ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానలః|
అస్మిన్ భగ్నే తతః కోపం కరిష్యతి దశాననః||11||

స|| నృశంసస్య అస్య ఇదం నేత్రమనః క్రాంతం నానాద్రుమలాయుతం ఉత్తమం వనం నందనోపమం ||శుష్కం వనం అనలః ఇవ ఇదం విధ్వంసయిష్యామి| అస్మిన్ భగ్నే తతః దశాననః కోపం కరిష్యతి||

'నందనోద్యానముతో సమానముగా వున్న దుష్టుడి ఉత్తమ వనము చూడడానికి అందముగా నున్న అనేక మైన వృక్షములతో కూడిఉన్నది. శుష్కమైన వనమును అగ్ని దహించినటుల ఈ వనమును ధ్వంశించెదను. ఈ వనము భగ్నము అయినచో దశాననుడికి కోపము వచ్చును".

తతోమహత్ సాశ్వమహారథద్విపం బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః|
త్రిశూలకాలాయసపట్టి సాయుధమ్ తతోమహత్ యుద్ధమిదం భవిష్యతి||12||
అహం తు తైః సంయతి చండవిక్రమైః సమేత్య రక్షోభిరసహ్యవిక్రమః|
నిహత్య తద్రావణచోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయమ్||13||

స|| తతః రాక్షసాధిపః సాశ్వమహారథద్విపం మహత్ త్రిశూలకాలాయసపట్టి సాయుధం బలం సమాదేక్ష్యతి | తతః ఇదం మహత్ యుద్ధం భవిష్యతి|| అహం తు చణ్డవిక్రమైః తైః రక్షోభిః సంయతి సమేత్య అసహ్యవిక్రమః రావణచోదితం తత్ బలం నిహత్య సుఖమ్ కపీశ్వరాలయం గమిష్యామి||

' అప్పుడు ఆ రాక్షసాధిపుడు అశ్వములు మహారథములు కల, త్రిశూలములు పట్టిశములు మున్నగు ఆయుధములు గల, బలములను పంపించును. అప్పుడు మహత్తరమైన యుద్ధము జరుగును. నేను కూడా అ చండ పరాక్రమము గల రాక్షసులతో యుద్ధముచేసి అ దురాక్రముడగు రావణుని బలములను హతమార్చి సుఖముగా వానరాధిపతి వద్దకు పోయెదను'.

తతో మారుతవత్ క్రుద్ధో మారుతిర్భీమవిక్రమః|
ఊరువేగేన మహతా ద్రుమాన్ క్షేప్తు మథారభత్||14||
తతస్తు హనుమాన్ వీరో బభంజ ప్రమదావనం|
మత్తద్విజసమాఘుష్టం నానాద్రుమలతాయుతమ్||15||

స|| తతః భీమవిక్రమః మారుతిః కృద్ధః అథ మహతా ఊరువేగేన మారుతవత్ ద్రుమాన్ క్షేప్తుం ఆరభత్ ||తతః వీరః హనుమాన్ మత్తద్విజసమాఘుష్టం నాద్రుమలాయుతం ప్రమదావనం బభంజ||

' అప్పుడు అమిత పరాక్రమము గల మారుతి కోపముతో వాయువేగముతో తన తొడలబలముతో వృక్షములను పడగొట్టసాగెను. అప్పుడు ఆ వీరుడు అగు హనుమంతుడు మదించిన పక్షుల కిలకిలారావములతో నిండిన అనేకమైన వృక్షములతో కూడిన ప్రమదావనమును ధ్వంసము చేసెను'.

తద్వనం మథితైర్వృక్షైః భినైశ్చ సలిలాశయైః|
చూర్ణితైః పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనమ్||16||
నానా శకుంతవిరుతైః ప్రభిన్నైః సలిలాశయైః|
తామ్రైః కిసలయైః క్లాంతైః క్లాంతద్రుమలతాయుతమ్||17||
న బభౌ తద్వనం తత్ర దావానలహతం యదా|
వ్యాకులావరణా రేజుః విహ్వలా ఇవ తా లతాః||18||
లతాగృహైః చిత్రగృహైశ్చ నాశితైః మహోరగైర్వ్యాళ మృగైశ్చ నిర్దుతైః|
శిలాగృహైరున్మధితైః తథా గృహైః ప్రణష్టరూపం తదభూన్మహత్ వనమ్||19||

స|| తత్ వనం మథితైః వృక్షైః భిన్నైః సలిలాశయైః చూర్ణితైః పర్వతాగ్రైశ్చ అప్రియదర్శనం బభూవ||క్లాంతద్రుమలతాయుతం తత్ వనం నానాశకుంతవిరుతైః ప్రభిన్నైః సలిలాసయైః క్లాంతైః తామ్రైః కిసలయైః దావానలహతం యదా తాః లతాః విహ్వలాః ఇవ రేజుః||మహత్ తత్ వనం నాశితైః లతాగృహైః చిత్రగృహైః నిర్ధుతైః మహోరగైః వ్యాలమృగైశ్చతథా ఉన్మథితైః శిలాగృహైః గృహైః ప్రణష్ట రూపం అభూత్ ||

ఆ వనము పడగొట్టబడిన వృక్షములతో ధ్వంసము చేయబడిన సలిలాశయములతో , చూర్ణము చేయబడిన శిఖరములుగల పర్వతముతో వికృత స్వరూపము ధరించెను. వాడిపోయిన చిగుళ్ళుకల ధ్వంసము చేయబడిన వృక్షములతో కల ఆ వనము, అనేకమైన పక్షుల ధ్వనులతో, ధ్వంసించబడిన తామ్రపూవులతో నిండిన జలాశయములతోనూ దావానలముచేత దగ్ధమైన అరణ్యము వలె నుండెను. ఆ అరణ్యములోని లతలు భయపడిన స్త్రీలవలె కానవచ్చెను. మహత్తరమైన ఆ వనము నాశనము చేయబడిన లతా గృహములతో చిత్రగృహములతో మహత్తరమైన చితకగొట్టబడిన పాములతో జంతువులతో, విరిగిన శిలాగృహములతో శిథిలమైపోయెను.

సా విహ్వలాఽశోకలతాప్రతానా వనస్థలీశోకలతాప్రతానా|
జాతా దశాస్యప్రమదావనస్య కపేర్బలాద్ది ప్రమదావనస్య||20||

స||దశాస్య ప్రమదావనస్య కపేః సా వనస్థలీ బలాత్ విహ్వలా శోకలతాప్రతానా జాతా||

కపి బలముతో నాశనమైన ఆ దశాననుని స్త్రీల ప్రమదావనములోని లతలు తమ విధిని తలచుకొని దుఃఖిస్తున్నవా అన్నట్లు అధారము లేకుండా వేలాడుతున్నాయి.

స తస్య కృతార్థపతేర్మహాకపిః మహద్వ్యళీకం మనసో మహాత్మనః|
యుయుత్సురేకో బహుభిః మహాబలైః శ్రియా జ్వలన్ తోరణమాస్థితః కపిః||21||

స|| సః మహాకపిః మహాత్మనః తస్య అర్థపతేః మనసః మహత్ వ్యలీకం కృత్వా మహాబలైః బహుభిః ఏకః యుయుత్సుః శ్రియాజ్వలన్ తోరణమ్ ఆస్థితః||

ఆ మహాకపి ఆ లంకాధిపతి మనస్సును క్షోభించునట్లు చేసి, అనేకమంది రాక్షసులతో ఒంటరిగా యుద్ధము చేయగోరి ఉత్సాహముతో ప్రజ్వరిల్లుచూ ఆ వనము యొక్క తోరణద్వారము ఎక్కి కూర్చునెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకచత్వారింశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఒకటవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||