||సుందరకాండ ||
||నలభై ఇదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||
|| Sarga 45 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ పంచచత్త్వారింశస్సర్గః||
తతస్తే రాక్షసేంద్రేణ చోదితా మంత్రిణస్సుతాః|
నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తసప్తార్చివర్చసః||1||
స|| తతః రాక్షసేంద్రేణ ఉదితాః మంత్రిణః సప్తార్తి వర్చసః సప్త సుతాః తస్మాత్ భవనా త్ నిర్యయుః||
అప్పుడు రాక్షసేంద్రునిచే అదేశించబడిన ఏడుగురు మంత్రికుమారులు అగ్నితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుచూఆ భవనము నుండి బయలుదేరిరి.
మహబలపరీవారా ధనుష్మంతో మహాబలాః|
కృతాస్త్రాస్త్రవిదాం శ్రేష్ఠాః పరస్పరజయైషిణః||2||
హేమజాలపరిక్షిప్తైర్ధ్వజవద్భిః పతాకిభిః|
తోయదస్వననిర్ఘోషై ర్వాజీయుక్తర్మహారథైః||3||
తప్తకాంచన చిత్రాణి చాపాన్యమిత విక్రమాః|
విష్ఫారయంతః సంహృష్టాః తటిత్వంత ఇవాంబుదాః||4||
స||మహాబలపరీవారాః శ్రేష్ఠాః మహాబలాః ధనుష్మంతః కృతాస్త్రవిదాం పరస్పరజైషిణః స్యాత్||హేమజాలపరిక్షిప్తైః ధ్వజద్భిః పతాకిభిః తోయదస్వన నిర్ఘోషైః వాజియుక్తైః మహారథైః నిర్యయుః||తప్తకాంచన చిత్రాణి చాపాని విష్ఫారయంతః తటిత్వంతః అంబుదా ఇవ అమిత విక్రమాః సంహృష్టాః నిర్యయుః ||
ఆ అమాత్యపుత్రులు మహాబలముతో వెళ్ళిరి. వారు శ్రేష్టులు. మహాబలము కలవారు. ధనుష్మంతులు. అశ్త్రవిద్యను నేర్చుకున్నవారు, తోటివారికన్నమిన్నగాఉండవలెనని కోరికగలవారు. బంగారపు జాలీలు కల, ధ్వజములు పతాకములు గల, రథముల కదలికతో మేఘముల ధ్వనులను పోలిన ధ్వనులను చేస్తూ వున్న రథములలో వెళ్ళిరి. మేలిమి బంగారపు పూతగల ధనస్సులతో టంకారము చేయుచూ , మెరుపులతో కూడిన మేఘములవలె విరాజిల్లుచూ అమితోత్సాహముతో వెళ్ళిరి.
జనన్యస్తు తతస్తేషాం విదితా కింకరాన్ హతాన్|
బభూవుశ్శోకసంభ్రాంతాః సబాంధవసుహృజ్జనాః||5||
స|| తతః తేషాం సబాంధవసుహృత్ జనాః జనన్యస్తు కింకరాన్ హతాన్ విదిత్వా కామసంభ్రాంతాః బభూవుః||
అప్పుడు వారి బంధువులు మిత్రులు , అమాత్య సుతుల తల్లులు కింకరులు హనుమంతునిచేత హతమార్చబడిరి అన్నవిషయము తెలిసినవారై చింతాక్రాంతులైరి.
తే పరస్పరసంఘర్షా తప్తకాంచనభూషణాః|
అభిపేతుర్హనూమంతం తోరణస్థ మవస్థితమ్||6||
సృజంతో బాణవృష్టిం తే రథగర్జిత నిస్స్వనాః|
వృష్టిమంత ఇవాంబోధా విచేరుర్నైరృతాంబుదాః||7||
అవకీర్ణస్తతస్తాభిర్హనుమాన్ శరవృష్టిభిః|
అభవత్సంవృతాకారః శైలారాడివ వృష్టిభిః||8||
స|| తప్తకాంచన భూషణాః పరస్పరసంఘర్షాత్ తోరణస్థం అవస్థితమ్ హనూమంతం అభిపేతుః||రథగర్జిత నిస్వనాః తే నైఋతాంబుదాః బాణవృష్టిమ్ సృజంతః వృష్టిమంతః అమ్బుదా ఇవ విచేరుః||తతః తాభిః శరవృష్టిభిః అవకీర్ణః హనుమాన్ వృష్టిభిః సంవృతాకారః శైలారాడివఅభవత్ ||
మేలిమి బంగారపు ఆభూషణములు ధరించిన ఆ మంత్రిపుత్రులు ఒకరిపై ఒకరు పోటీపడుతూ అశోకవనద్వార తోరణము మీద కూర్చునియున్న హనుమంతుని ఎదురుకొనిరి. రథముల గతితో మేఘ గర్జన చేయుచూ, వర్షిస్తున్న మేఘములవలె బాణ వృష్టి కురిపిస్తూ సంచరించిరి. అప్పుడు ఆ శరపరంపరతో కప్పబడిన హనుమంతుడు పర్వతరాజము వలె నుండెను.
స శరాన్మోఘయామాస తేషా మాశుచరః కపిః|
రథవేగం చ వీరాణాం విచరన్విమలేంబరే||9||
స తైః క్రీడన్ ధనుష్మద్భిర్వ్యోమ్ని వీరః ప్రకాశతే|
ధనుష్మద్భిర్యథా మేఘైర్మారుతః ప్రభురంబరే||10||
స|| ఆశుచరః సః కపిః విమలే అంబరే విచరన్ తేషాం వీరాణాం శరాన్ రథవేగం చ మోఘయామాస||వ్యోమ్ని ధనుష్మద్భిః తైః క్రీడన్ సః వీరః అమ్బరే ధనుష్మద్భిః మేఘైః ప్రభుః మారుతిః యథా ప్రకాశతే||
ప్రచండవేగముతో వెళ్లగల ఆ వానరుడు ఆ నిర్మలాకాశములో తిరుగుచూ ఆ వీరుల శరములను రథవేగమును నిర్వీర్యము చేసెను. ఆకాశములో వుండి ఆ ధనుర్ధారులను ఆటలాడిస్తూ మేఘముల ప్రభువు మారుతి వలె శోభించెను.
సకృత్వా నినదం ఘోరం త్రాసయం స్తాం మహాచమూమ్|
చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్||11||
తలేనాభ్యహనత్కాంశ్చిత్ పాదైః కాంశ్చిత్పరంతపః
ముష్టినాభ్యహనత్కాంచిన్ నఖైః కాంశ్చిద్వ్యదారయత్||12||
స||వీర్యవాన్ సః ఘోరం నినదం కృత్వా తామ్ మహాచమూం త్రాసయన్ తేషు రక్షస్సు వేగం చకార||పరంతః కాంశ్చిత్ తలేన అభ్యహనత్ | కాశ్చి పాదైః | కాశ్చిత్ ముష్టినా | కాశ్చిత్ నఖైః వ్యదారయత్ ||
ఈ వీరుడు ఘోరమైన గర్జనచేయుచూ ఆ మహాసేనకి భీతి కలిగించునట్లు తిరిగెను. ఆ శత్రుమర్దనడు కొందరిని చేతితో కొట్టి హతమార్చెను. కొందరిని పాదములతో, కొందరిని పిడికిలితో, కొందరిని గోళ్లతో సంహరించెను.
ప్రమమాథోరసా కాంశ్చిదూరూభ్యాం అపరాన్ కపిః|
కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి||13||
తతస్తేష్వవసన్నేషు భూమౌ నిపతితేషు చ|
తత్సైన్యమగమత్ సర్వం దిశోదశ భయార్దితమ్||14||
స||కపిః కాంశ్చిత్ ఉరసా | అపరాన్ ఊరుభ్యాం ప్రమాథ | కేచిత్ తస్య నినాదేన తత్రైవ భువి పతితాః||తేషు అవసన్నేషు భూమౌ నిపతితేషు చ | తతః సర్వం సైన్యం భయార్దితం దశ దిశః అగమత్||
ఆ వానరుడు కొందరిని తన రొమ్ముతో, మరికొందరిని తొడలతో మధించి వధించెను. కొందరు అతని సింహనాదము విని భూమిపై పడిరి. అప్పుడు ఆ సైన్యము అంతా భయపడినవారై పది దిక్కులలో పారిపోయిరి.
వినేదుర్విస్వరం నాగా నిపేతుర్భువి వాజినః|
భగ్ననీడధ్వజచ్చత్రైర్భూశ్చ కీర్ణాsభవ ద్రథైః||15||
స్రవతారుధిరేణాథ స్రవంత్యో దర్శితాః పథి|
వివిధైశ్చ స్వరైర్లంకా ననాద వికృతం తదా||16||
స||నాగాః విస్వరమ్ వినేదుః | వాజినః భువి నిపేతుః| భూశ్చ భగ్ననీడధ్వజచ్ఛత్రైః రథైః కీర్ణా అభవత్||అథా స్రవతా రుధిరేణ పథి స్రవంత్యః దర్శితాః తదా లంకా వివిధైః స్వరైః వికృతం ననాద||
ఏనుగులు వికృతముగా ఘీంకరించెను .గుఱ్ఱములు నేలపై పడెను. భూమికూడా రథమునుంచి విరిగి ముక్కలై పడిన రథముల పైకప్పులు, ధ్వజములు, చత్రముల తో నిండిపోయెను . మార్గములన్నీ స్రవించుచున్న రక్తముతో నిండినవై ఆ లంక అంతా అనేక వికృతమైన నాదములతో మారుమోగెను.
సతాన్ప్రవృద్దాన్విహత్య రాక్షసాన్
మహాబలశ్చండపరాక్రమః కపిః|
యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః
తమేవ వీరోsభిజగామ తోరణమ్||17||
స|| వీరః మహాబలః చణ్డ పరాక్రమః స కపిః ప్రవృద్ధాన్ తాన్ రాక్షసాన్ వినిహృత్య అన్యైః యుయుత్సుః పునరేవ తం తోరణమేవ అభిజగామ||
ఆ వీరుడు మహాబలుడు చండపరాక్రమము గల వానరుడు వీరాగ్రేసరులైన ఆ రాక్షసులను హతమార్చి ఇంకా ఇతరులతో యుద్ధము చేయవలెననే ఉత్సాహముతో మళ్ళీ ఆ అశోక వనద్వార తోరణముఫైకి ఎక్కెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచచత్త్వారింశస్సర్గః ||
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఇదవ సర్గ సమాప్తము
||ఓమ్ తత్ సత్||