||సుందరకాండ ||

||నలభైతొమ్మిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 49 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకోనపంచాశస్సర్గః||

తతః స కర్మణా తస్య విస్మితో భీమవిక్రమః|
హనుమాన్రోషతామ్రాక్షో రక్షోధిపమవైక్షత||1||

స|| తతః సః భీమవిక్రమః హనుమాన్ రోషతామ్రాక్షః తస్య కర్మణా విస్మితః రక్షోధిపం అవైక్షత||

తా|| అప్పుడు ఆ భయంకరమైన పరాక్రమము గల హనుమంతుడు రోషముతో కూడిన ఎఱ్ఱని కళ్లతో ఆ రాక్షసాధిపతిని చూసెను.

భ్రాజమానం మహార్హేణ కాంచనేన విరాజతా|
ముక్తజాలావృతే నాథ మకుటేన మహాద్యుతిమ్||2||
వజ్రసంయోగసంయుక్తై ర్మహర్హమణివిగ్రహైః|
హైమై రాభరణైశ్చిత్రై ర్మనసేవ ప్రకల్పితైః||3||
మహర్హక్షౌమసంవీతం రక్తచందనరూషితం|
స్వనులిప్తం విచిత్రాభిర్వివిధాభిశ్చ భక్తిభిః||4||

స|| మహార్హేన కాంచనేన విరాజితా అథ ముక్తాజాలవృతేనముకుటేన భ్రాజమానం మహాద్యుతిమ్||వజ్రసంయోగ సంయుక్తైః మహార్హమణివిగ్రహైః మనసా ప్రకల్పితైరివ చిత్రైః హేమైః ఆభరణైః ||మహార్హక్షౌమ సంవీతం రక్తచందన రూషితం విచిత్రాభిః వివిధాబిశ్చ భక్తిభిః స్వానులిప్తం ||

తా|| మేలిమి బంగారముతో చేయబడిన ముత్యములచే పొదగబడిన కిరీటమును ధరించి యుండెను. వజ్రములతో కూడిన మణులతో కూడిన మనసా నిర్మితమైన చిత్రవిచిత్రమైన ఆభరణములను ధరించి ( భాసించు చుండెను). అతి మూల్యమైన పట్టు వస్త్రములను ధరించి , ఎఱ్ఱని చందనము రాసుకొని విచిత్రమైన అనేక రకముల ఆ భరణములవంటి బొమ్మలు రాసికొని ఉన్నవాడు.

వివృతైర్దర్శనీయైశ్చ రక్తాక్షైర్భీమదర్శనైః|
దీప్త తీక్ష్ణమహాదంష్ట్రైః ప్రలంబదశనచ్ఛదైః||5||
శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం|
నానావ్యాళసమాకీర్ణైః శిఖరైరివ మందరమ్||6||

స|| దర్శనీయైః రక్తాక్షైః భీమదర్శనైః దీప్తతీక్ష్ణమహాదంష్ట్రైః ప్రలంబదసనచ్ఛదైః దశభిః శిరోభిః విచిత్రైః ననావ్యాలసమాకీర్ణైః శిఖరైః మందరం ఇవ భ్రాజమానం మహౌజసం వీరం (దదర్శ)||

తా|| దర్శనీయమైన భయము కలిగించు ఎఱ్ఱని కళ్లతో, వెలుగుతూవున్న వాడి దంతములతో, వేలాడుతూ వున్నపెదవులు గల వాడు. కౄరమృగములతో నిండిన మందరపర్వత శిఖరములవలె నున్న పది తలలతో విరాజిల్లు తున్న మహత్తరమైన ఔజస్సు కల వీరుని చూచెను.

నీలాంజనచయప్రఖ్యం హారేణోరసి రాజతా|
పూర్ణ చంద్రాభవక్త్రేన సబలాకమివాంబుదమ్||7||
బాహుభిర్బద్ధకేయూరైః చందనోత్తమరూషితైః|
భ్రాజమానాంగదైః పీనైః పంచశీర్షైరివోరగైః||8||

స||నీలాంజనచయప్రఖ్యం ఉరసి రాజతా హారేణ పూర్ణచంద్రాభవ వక్త్రేణ బలాకం అంబుదం ఇవ ||బద్ధకేయూరైః బాహుభిః చందనోత్తమరుషితైః భ్రాజమానాంగదైః పీనైః పంచశీర్షైః ఉరగైరివ ||

తా|| నల్లని కాటుక పర్వతములావున్న అతని వక్షః స్థలముపై ముత్యాలహారము పూర్ణచంద్రుని బోలి ముఖము తో కొంగలతో కూడిన నల్లని మేఘముల వలె నుండెను. కేయూరములతో కట్టబడి న బాహువులతో , ఉత్తమచందన పూతలతో అలరారుతున్న అంగములు కల ఆ రావణుడు ఇదు తలలు గల సర్పము వలెనుండెను.

మహతి స్ఫాటికే చిత్రే రత్నసంయోగసంస్కృతే|
ఉత్తమాస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాననే||9||
అలంకృతాభిరత్యర్థం ప్రమదాభిః సమంతతః|
వాలవ్యజనహస్తాభి రరాత్సముపసేవితమ్||10||

స|| రత్నసంయోగ సంస్కృతే చిత్రే ఉత్తమాస్తరణాస్తీర్ణే శ్ఫాటికే మహతి వరాసనే సూపవిష్టం ||అత్యర్థం అలంకృతాభిః వ్యాలవ్యజనహస్తాభిః ప్రమదాభిః సమంతతః ఆరాత్ సముపసేవితం||

తా|| రత్నములతో పొదగబడిన రత్నకంబళము మీద వున్న ఉత్తమమైన ఆసనము మీద కూర్చుని ఉండెను. అలంకరింపబడిన అత్యంత సుందరీమణులు వింజామరలు చేతిలో పుచ్చుకొని వీచుచూ అతనిని సేవిస్తున్నారు.

దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షసా|
మంత్రిభిర్మంత్రతత్త్వజ్ఞై ర్నికుంభేన చ మంత్రిణా||11||
సుఖోపవిష్టం రక్షోభిః చతుర్భిః బలదర్పితైః|
కృత్స్నః పరివృతోలోకః చతుర్భిరివసాగరైః||12||
మంత్రిభిర్మంత్రతత్త్వజ్ఞై రన్యైశ్చ శుభబుద్ధిభిః|
అన్వాస్యమానం రక్షోభిః సురైరివ సురేశ్వరమ్||13||

స|| దుర్ధరేణ ప్రహస్తేన రక్షసా మహాపార్శ్వేన మంత్రిణా నికుంభేన మంత్రతత్వజ్ఞైః మంత్రిభిః బలదర్పితైః చతుర్భిః రక్షోభిః సుఖోపవిష్టం చతుర్భిః సాగరైః పరివృతం కృత్స్నం లోకమ్ ఇవ||మంత్ర తత్వజ్ఞైః శుభబంధుభిః మంత్రిభిః అన్యైః రక్షోభిః సురైః సురేశ్వరం ఇవ అన్వాస్యమానం ||

తా|| దుర్ధరుడు ప్రహసుడు మహాపార్శ్వుడు నికుంభుడు అనబడు నలుగురు బలదర్పిత రాక్షసులు మంత్రులు తత్వజ్ఞులు చే పరివేష్టింపబడిన రావణుడు నాలుగు సముద్రములతో ఆవృతమైవున్న భూమండలము వలె భాసించుచుండెను. మంత్ర తత్వజ్ఞులు శుభము కోరు బంధువులు మంత్రులు ఇతర రాక్షసులచే పరివేష్టితుడైన రావణుడు సురలచేత సేవింపబడు సురేశ్వరుని వలె కానరావచ్చెను.

అపశ్యత్ రాక్షపతిం హనుమానతితేజసం|
విష్ఠితం మేరుశిఖరే సతోయమివ తోయదమ్||14||

స|| హనుమాన్ అతితేజసం మేరుశిఖరే విష్ఠితం సతోయం తోయదం ఇవ రాక్షసపతిం అపశ్యత్ ||

తా|| హనుమంతుడు అతి తేజస్సుకల రావణుడు సమున్నత సింహాసనము మీద కూర్చుని మేరు శిఖరము మీద నున్న జలముతో నిండిన మేఘము వలె కానరావచ్చిన రావణుని చూచెను.

సతైసంపీడ్యమానోఽపి రక్షోభిర్భీమవిక్రమైః|
విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత||15||
భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్రాక్షసేశ్వరమ్|
మనసా చింతయామాస తేజసా తస్య మోహితా||16||

స|| సః భీమవిక్రమైః రక్షోభిః సంపీడ్యమానోఽపి పరమం విస్మయం గత్వా రక్షోధిపం అవైక్షత|| తతః హనుమాన్ భ్రాజమానం తస్య తేజసా రాక్షసేశ్వరం దృష్ట్వా తస్య తేజసా మోహితః మనసా చింతయామాస||

తా|| ఆ వానరుడు భయంకరమైన పరాక్రమము గలవారి చే పీడింపబడినప్పటికీ, అతి విస్మయముతో ఆ రాక్షసాధిపతిని చూచెను. ఆప్పుడు ఆ హనుమంతుడు తేజస్సుతో వెలిగిపోతున్న రాక్షసాధిపతిని చూచి అతని తేజస్సుతో మోహపడి మనస్సులో అలోచించసాగెను.

అహో రూప మహోధైర్య మహోసత్త్వ మహోద్యుతిః|
అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తతా||17||
యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః|
స్యా దయం సురలోకస్య సశక్రస్యాపి రక్షితా||18||

స||| రాక్షసరాజస్య రూపం అహో| ధైర్యం అహో| సత్త్వం అహో| ద్యుతిః అహో| సర్వలక్షణయుక్తతా అహో||అయం అధర్మః బలవాన్ న స్యాత్ యది అయం రాక్షసేశ్వరః సశక్రస్య సురలోకస్యాపి రక్షితా స్యాత్ ||

తా|| ' అహా ఈ రాక్షసాధిపతికి ఏమి రూపము ! ఏమి ధైర్యము ! ఏమి సత్త్వము ! ఏమి కాంతి ! అన్ని లక్షణములు కలవాడు కదా ! ఇతని అధర్మము బలీయముగా లేకుండు న చో, ఈ రాక్షసాధిపతి ఇంద్రుని సురలోకముకూడా పాలించువాడయ్యెడివాడు'.

అస్య క్రూరైర్నృశంసైశ్చ కర్మభిర్లోకకుత్సితైః|
తేన బిభ్యతి ఖల్వస్మాల్లోకాః సామరదానవాః||19||
అయం హ్యుత్సహతే క్రుద్ధః కర్తుమేకార్ణవం జగత్|

స|| క్రూరైః నృశంసైశ్చ లోకకుత్సితైః అస్యకర్మభిః సామరదానవాః సర్వే లోకాః అస్మాత్ బిభ్యతి హి| అయం కృద్ధః జగత్ ఏకార్ణవమ్ కర్తుం ఉత్సహతే హి |

తా|| 'కౄరమైన కర్మలతో లోకనిందితమైన ఇతని కర్మల వలన అమరులు దానవులు వున్న లోకములన్నీభయపడుతున్నాయి. ఈ కృద్ధుడు ఒక్కడే లోకములను ప్రళయములో ముంచెత్తగలడు'.

ఇతిచింతాం బహువిధా మకరోన్మతిమాన్ కపిః||
దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావమమితౌజసః||20||

స|| అమితౌజసః రాక్షసరాజస్య ప్రభావం దృష్ట్వా మతిమాన్ హరిః ఇతి బహువిధాం చింతాం అకరోత్||

తా|| అలాగ రాక్షసరాజు యొక్క అమిత ప్రభావము చూచి బుద్ధిమంతుడైన హనుమంతుడు అనేక విధములుగా చింతించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకోనపంచాశస్సర్గః ||

తా|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైతొమ్మిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||