||సుందరకాండ ||

||ఎభై తొమ్మిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 59 || with Slokas and meanings in Telugu

సుందరకాండ.
అథ ఏకోనషష్టితమస్సర్గః||

ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః|
భూయః సముపచక్రామ వచనం వక్తు ముత్తరమ్||1||

స|| హనుమాన్ మారుతాత్మజః ఏతత్ సర్వం ఆఖ్యాయ భూయః ఉత్తరం వచనం వక్తుం సముపచక్రమే||

మారుతాత్మజుడైన హనుమంతుడు అలాగ ( జరిగిన వృత్తాంతము) అంతా చెప్పి మళ్ళీ ఇలా చెప్పసాగెను

సఫలో రాఘవోద్యోగః సుగ్రీవస్య చ సంభ్రమః|
శీలమాసాద్య సీతాయా మమ చ ప్రవణం మనః||2||

స||రాఘవోద్యోగః సుగ్రీవస్య సంభ్రమః సఫలః | సీతాయాః శీలం ఆసాద్య మమ మనశ్చ ప్రవణం||

రాఘవుని కార్యము సుగ్రీవుని ప్రయత్నములు సఫలము అయినాయి. సీతాదేవి యొక్క శీలము చూచి నా మనస్సు భక్తితో నిండిపోయెను.

తపసా ధారయేల్లోకాన్ క్రుద్ధో వా నిర్దహేదపి|
సర్వధాతి ప్రవృద్ధోsసౌ రావణో రాక్షసాధిపః||3||
తస్య తాం స్పృశతో గాత్రం తపసా న వినాశితమ్|
న తదగ్నిశిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినా సతీ||4||
జనకస్యాత్మజా కుర్యాద్యత్క్రోధ కలుషీకృతా|

స||అసౌ రాక్షసాధిపః సర్వథా అతిప్రవృద్ధః తపసా లోకాన్ నిర్దహేత్ |కృద్ధోవాపి నిర్దహేత్ అపి||తామ్ స్పృశతః తస్య గాత్రం తపసా న వినాశితం | క్రోధకలుషీకృతా జనకస్య ఆత్మజా యత్ కుర్యాత్ తత్ పాణినా సంస్పృష్ట సతీ అగ్నిశిఖా నకుర్యాత్||

ఆ రాక్షసాధిపుడు మహాతపస్సంపన్నుడు. తన తపస్సుతో లోకములను దహించివేయగలవాడు. ఆమెను స్పృశించినప్పటికీ తనతపోశక్తి వలననే అతడు నాశనము అవలేదు. కొధముతో మండిపోతున్న జనకుని కూతురు ఏ పని చేయగలదో అది అగ్నిజ్వాలలు కూడా చేయలేవు.

జామ్బవత్ప్రముఖాన్ సర్వాననుజ్ఞాస్య మహాహరీన్||5||
అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే|
న్యాయం స్మ సహవైదేహ్యా ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ||6||

స||భవతామ్ నివేదితే అస్మిన్ కార్యే ఏవం గతే జాంబవత్ ప్రముఖాన్ మహాహరీన్ సమనుజ్ఞాయ వైదేహ్యా సహ తౌ పార్థివాత్మజౌ ద్రష్టుం న్యాయం స్మ||

జాంబవదాది ప్రముఖుల అనుమతితో ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతము నివేదించితిని. ఇప్పుడు మనము వైదేహి సమేతముగా రామలక్ష్మణుల దర్శనము చేయుట సముచితము అని భావిస్తున్నాను.

అహమేకోపి పర్యాప్తః సరాక్షసగణాం పురీ|
తాం లంకాం తరసా హన్తుం రావణం చ మహాబలమ్||7||
కిం పునస్సహితో వీరైర్బలవద్భిః కృతాత్మభిః|
కృతాస్త్రైః ప్లవగైః శూరైః భవద్భిర్విజయైషిభిః||8||

స|| అహ ఏకః అపి సరాక్షసగణాం తాం లంకాపురీం మహాబలం రావణం చ తరసా హన్తుం పర్యాప్తః||బలవద్భిః కృతాత్మభిః శూరైః విజయైషిభిః ప్లవగైః భవద్భిః సహితః కిం పునః ||

నేను ఒక్కడినే రాక్షసబలములతో కూడిన లంకాపురమును రావణుని కూడా నాశనము చేయగలను. బలవంతులు విజయకాంక్షగల నిశ్చయమైన మనస్సుగలవారు ఆకాశములో ఎగరకలవారు మీ అందరితో కూడితే ఇక చెప్పవలసినదేమి?

అహం తు రావణం యుద్ధే ససైన్యం సపురస్సరమ్|
సహపుత్త్రం వధిష్యామి సహోదరయుతం యుధి||9||

స|| అహం తు యుద్ధే ససైన్యం సపురస్సరం సహపుత్త్రం సహోదరయుతం రావణం వధిష్యామి ||

నేను యుద్ధములో రావణుని అతని సైన్యముతో సహా , పుత్రులతో సహా, సహోదరులతో సహా వధించగలను.

బ్రాహ్మమైన్ద్రం చ రౌద్రం చ వాయువ్యం వారుణం తథా|
యది శక్రజితోsస్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే||10||
తాన్యహం విధమిష్యామి హనిష్యామి చ రాక్షసాన్|

స|| బ్రహ్మం ఇన్ద్రం చ రౌద్రం చ వాయవ్యం తథావారుణం శక్రజితః అస్త్రాణి దుర్నిరీక్షాణి యది తాని సంయుగే వధిష్యామి రాక్షసాన్ హనిష్యామి చ||

ఇంద్రజిత్తు చే ప్రయోగింపబడిన బ్రహ్మస్త్రము, ఇంద్రుడు రుద్రుడు వాయువు వరుణు దేవుల అస్త్రములు చూచుటకు కష్టమైనప్పటికీ యుద్దములో ఆ రాక్షసులందరినీ జయించి వధించెదను.

భవతామభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితమ్||11||
మయాsతులా విసృష్టా హి శైలవృష్టిర్నిరన్తరా|
దేవానపి రణే హన్యాత్ కిం పునః తాన్ నిశాచరాన్||12||

స|| భవతామ్ అభ్యనుజ్ఞాతః మే విక్రమః తం రుణాద్ధి| మయా విసృష్టా అతులా నిరన్తరా శైలవృష్టిః రణే దేవాన్ అపి హన్యాత్ | తాన్ నిశాచరాన్ కిం పుఅనః||

మీ ఆజ్ఞతో నా పరాక్రమము తో వారిని బంధించెదను. నా చేత ప్రయోగింపబడిన నిరంతరమైన శిలావృష్టి తో యుద్ధములో దేవతలు కూడా హతులు అవుతారు. అ రాక్షసుల సంగతి చెప్పనేల.

సాగరోsప్యతియాద్వేలాం మన్దరః ప్రచలేదపి|
న జామ్బవన్తం సమరే కమ్పయే దరివాహినీ||13||

స|| సాగరం వేలాం అతియాదపి మన్దరః ప్రచలేదపి సమరే అరివాహిని జామ్బవతం న కమ్పయేత్ ||

సాగరము తన అవధి దాటవచ్చు. మందర పర్వతము చలించవచ్చు. కాని యుద్ధములో జాంబవంతుని ఎవరూ చలింపచేయలేరు

సర్వరాక్షస సంఘానాం రాక్షసా యే చ పూర్వకా|
అలమేకో వినాశాయ వీరో వాలిసుతః కపిః||14||
పనస స్యోరువేగేన నీలస్య చ మహాత్మనః|
మన్దరోsప్యవసీర్యేత కిం పునర్యుధి రాక్షసాః||15||
స దేవాసుర యక్షేషు గన్ధర్వోరగ పక్షిసు|
మైన్దస్య ప్రతియోద్ధారం శంసత ద్వివిదస్య వా||16||

స|| వీరః వాలిసుతః కపిః ఏకః సర్వరాక్షసంఘానాం పూర్వకాః యే వినాసాయ అలమ్||పనసస్య మహాత్మనః నీలస్య ఊరువేగేన మన్దరో అపి అవశీర్యతే | యుధి రాక్షసాః కిమ్ పునః|| సదేవాసుర యక్షేషు గన్ధర్వోరగపక్షిషు మైన్దస్య ద్వివిదస్య ప్రతియోద్ధారం శంసత||

వీరుడైన వాలి సుతుడు ఒక్కడే ఆ రాక్షస సమూహములన్నిటినీ వినాశము చేయుటకు చాలును. పనసుని, నీలుని ఊరువేగమునకు మందర పర్వతము కూడా చూర్ణమై పోవును. ఇంక యుద్ధములో రాక్షసుల సంగతి చెప్పనేల. దేవాసుర గంధర్వ ఊరగ పక్షులలో ఎవరు మందుడు ద్వివిదులతో ప్రతి యుద్ధము చేయగలరు?

అశ్విపుత్రౌ మహాభాగౌ వేతౌ ప్లవగసత్తమౌ|
ఏతయోః ప్రతియోద్ధారం న పశ్యామి రణాజిరే ||17||
పితామహవరోత్సేకాత్ పరమం దర్పమాస్థితౌ|
అమృతప్రాశనా వేతౌ సర్వవానర సత్తమౌ||18||

స|| అశ్విపుత్రౌ ఏతౌ మహాభాగౌ ప్లవగసత్తమౌ రణాజిరే ఏతయోః ప్రతియోద్ధారం న పశ్యామి || పితామహవరోత్సేకాత్ పరమం దర్పం ఆస్థితౌ ఏతౌ వానరసత్తమౌ అమృతపాశినౌ ||

ఈ అశ్వినీ పుత్రులిద్దరూ వానర శ్రేష్ఠులు, మహబలశాలురు. వీరికి ఎదురుగా పోరాడగలవారు నాకు కనపడుటలేదు. వీరు పితామహుని వరముతో ఉత్సాహము కలవారు. ఈ వానరసత్తములిద్దరూ అమృతము తాగినవారు.

అశ్వినోర్మాననార్థం హి సర్వలోకపితామహః|
సర్వావధ్యత్వమతులం అనయోర్దత్తవాన్పురా||19||
వరోత్సేకేన మత్తౌ చ ప్రమథ్య మహతీమ్ చమూమ్|
సురాణామమృతం వీరౌ పీతవన్తౌ ప్లవంగమౌ||20||
ఏతావేవ హి సంక్రుద్ధౌ సవాజిరథకుంజరామ్|
లంకాం నాశయితుం శక్తా సర్వే తిష్ఠన్తు వానరాః||21||

స|| పురా సర్వలోకపితామహః అశ్వినోః మానార్థం అనయోః అతులం సర్వ అవధ్వత్వం దత్తవాన్ ||వరోత్సేకేన మత్తౌ చ వీరౌ ప్లవంగమౌ సురాణాం మహతీం చమూం ప్రమథ్య అమృతం పీతవన్తౌ || సంకృద్ధౌ ఏతావేవ సవాజిరథకుంజరాం లంకాం నాసయితుం శక్తౌ | సర్వే వానరాః తిష్టన్తు||

పూర్వము బ్రహ్మదేవుడు అశ్వినీ దేవతలను సంతృప్తి పరచుటకు వీరు ఎవరిచేతులో చావు లేకుండునట్లు వరము పొందిరి. ఆ వరముచేత మదించినవారై ఆ వానరసత్తముల్లిద్దరూ దేవతాసైన్యములను జయించి అమృతను సేవించితిరి. కృద్ధులైన వీరిద్దరూ గుర్రాలు రథములు ఏనుగులు కల సైన్యములతో సహా లంకానగరమును నాశనము చేయగలరు. మిగిలిన వానరులందరూ అవసరమే లేదు.

మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృతా పునః|
రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా||22||

స|| లంకా మయైవ నిహతా పునః భస్మీకృతా రాజమార్గేషు సర్వత్ర మయా నామ విస్రావితమ్ ||

నాచేత లంకానగరము పూర్తిగాధ్వంసము చేయబడి భస్మము చేయబడినది. అన్నిచోటలా నా పేరు చాటాను.

జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||23||
అహం కోసలరాజస్య దాసః పవనసంభవః|
హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా||24||

స|| అతిబలః రామః జయతి| మహాబలః లక్ష్మణః చ| రాఘవేణ అభిపాలితః రాజా సుగ్రీవః జయతి | పవనసంభవః అహం కోసలరాజస్య దాసః| హనుమాన్ ఇతి మయా నామ విశ్రావితమ్||

"మహాబలవంతుడైన రామునకు జయము. మహాబలుడగు లక్ష్మణునికి జయము. రాఘవుని పాలనలో ఉన్న సుగ్రీవునకు జయము. వాయుపుత్రుడనైన నేను కోసలరాజు రాఘవుని దాసుడను.హనుమాన్ అని పేరు గలవాడను' అని అన్ని చోటలా చాటించితిని.

అశోకవనికా మధ్యే రావణస్య దురాత్మనః|
అధస్తాచ్ఛింశుపావృక్షే సాధ్వీ కరుణమాస్థితా||25||
రాక్షసీభి పరివృతా శోకసన్తాపకర్శితా|
మేఘలేఖాపరివృతా చన్ద్రలేఖేవ నిష్ప్రభా||26||
అచిన్తయన్తీ వైదేహీ రావణం బలదర్పితమ్|

స|| దురాత్మనః రావణస్య అశోకవనికామధ్యే శింశుపావృక్షే అధస్తాత్ సాధ్వీ రాక్షసీభిః పరివృతా శోకసంతాప కర్శితా మేఘలేఖాపరివృతా చంద్ర లేఖం ఇవ నిష్ప్రభా బలదర్పితం రావణం అచిన్తయన్తీ వైదేహీ కరుణం ఆస్థితా||

దురాత్ముడైన రావణుని అశోకవనిక మధ్యలో శింశుపావృక్షము క్రింద ఆ సాధ్వి ఆ రాక్ష రాక్షస స్త్రీలచేత చుట్టబడి శోకసంతాపములతో నిండినదై మేఘములతో కప్పబడిన చంద్రుని వలె వున్న, బలదర్పము తో విర్రవీగుతున్న రావణుని గురించి ఆలోచించకుండా, కరుణమైన స్థితిలో ఉన్నది.

పతివ్రతా చ సుశ్రోణీ అవష్టబ్ధా చ జానకీ||27||
అనురక్తా హి వైదేహీ రామం సర్వాత్మనా శుభా|
అనన్యచిత్తా రామే చ పౌలోమీవ పురన్దరే||28||

స|| పతివ్రతా సుశ్రోణీ జానకీ అవష్టబ్ధా శుభా వైదేహీ సర్వాత్మనా రామం అనురక్తా పురన్దరే పౌలోమి ఇవ రామే అనన్యచిత్తా (అస్తి)||

పతివ్రతా, సుందరమైన కటిప్రదేశము కలది, నిర్బంధములో ఉన్నది అగు ఆ వైదేహి మనస్సులో రామునే ధ్యానిస్తూ, పౌలోమికి ఇంద్రునిమీద అనురాగమున్నట్లు ఇతర ధ్యాస లేకుండా రామునిపై మనస్సుగలది అయి వున్నది.

తదేకవాసః సంవీతా రజోధ్వస్తా తథైవ చ|
శోకసన్తాప దీనాంగీ సీతా భర్తృహితే రతా||29||

స|| తదేకవాససంవీతా రజొధ్వస్థా శోకసంతాపదీనాంగీ సీతా భర్తృహితే రతా ||

ఒకటే వస్త్రము ధరించి, ధూళిచేత కప్పబడి , శోకసంతాపములతో దీనముగా వున్న ఆమె భర్త హితమునే కోరుకొనుచున్నది.

సా మయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః|
రాక్షసీభిర్విరూపాభిః దృష్టా హి ప్రమదావనే||30||
ఏకవేణీధరా దీనా భర్తృచిన్తాపరాయణా|
అథశ్శయా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే||31||
రావణాద్వినివృత్తార్థా మర్తవ్యకృత నిశ్చయా|

స|| విరూపాభిః రాక్షసీభిః ముహుర్ముహుః తర్జ్యమానా ,దీనా భర్తృచిన్తాపరాయణా అథః శయ్యా , హిమాగమే పద్మినీమివ వివర్ణాంగీ, రావణాత్ వినివృత్తార్థా, మర్తవ్యకృతనిశ్చయా సా మయా రాక్షసీమధ్యే ప్రమదావనే దృష్టా||

విరూపులైన రాక్షసస్త్రీల బంధములో మళ్ళీ మళ్ళీ భయపెట్టబడుతూ, దీనమైన ఆమె భర్తపై చింతనలోమునిగియుండి నేలపై పడుకొని , మంచుతో కప్పబడిన పద్మము వలెనున్న ఆమె రావణుని నుండి విముఖతతో మరణించుటకు నిశ్చయించుకున్న , రాక్షస స్త్రీల మధ్యనున్న సీతను చూచితిని.

కథంచిన్ మృగశాబాక్షీ విశ్వాస ముపపాదితా||32||
తతః సంభాషితా చైవ సర్వమర్థం చ దర్శితా|
రామసుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగతా||33||

స||మృగశాబాక్షీ కథంచిత్ ఉపపాదితా తతః సంభాషితా సర్వం అర్థం చ దర్శితా రామసుగ్రీవసఖ్యం చ శ్రుత్వా ప్రీతిం ఉపాగతా||

ఆ లేడిపిల్లకనులవంటి కనులు గల ఆమెకి ఎలాగో విశ్వాసము కలిగించితిని. పిమ్మట సంభాషణ చేసి, ఆన్నివిషయములు విడమరిచి తెలిసికొని, రామసుగ్రీవుల మైత్రి గురించి విని ఆమె ప్రీతిని పొందెను.

నియతః సముదాచారో భక్తిర్భర్తరి చోత్తమా|
యన్నహన్తి దశగ్రీవం స మహాత్మా కృతాగసమ్||34||

స|| మహాత్మా సా కృతాగసమ్ దశగ్రీవం న హన్తి ఇతి యత్ (తత్) నియతః సముదాచారః భర్తరి ఉత్తమా భక్తిః ||

అపరాధముచేసిన ఆ దశకంఠుడు ఇంకనూ చంపబడలేదు అంటే దాని కారణము ఆమె యొక్క నియమపాలనా , భర్తపై నున్న అచంచల భక్తియే.

నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి|
సా ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాత్ చ కర్శితా||35||
ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా|

స|| రామస్తు తస్య వధే నిమిత్తమాత్రం భవిష్యతి| ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాత్ కర్శితా చ సా ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుమతాం గతా|

రాముడు రావణవధకు నిమిత్త మాత్రుడు. ప్రకృతిరీత్యా సన్నని నడుము కల వియోగ దుఃఖమువలన కృశించిపోయి వేదాధ్యనము చేసిన వాని వలె మరీ సన్నబడిపోయినది.

ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణా|
యదత్ర ప్రతికర్తవ్యంతత్ సర్వం ఉపపద్యతామ్||36||

స|| మహాభాగా సీతా అస్తే ఏవం శోకపరాయణా | అత్ర యత్ ప్రతికర్తవ్యం తత్ సర్వం ఉపపద్యతామ్||

ఆ మహానుభావురాలు ఈ విధముగా శోకములో మునిగిఉన్నది. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము మనందరము అలోచించవలెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకోనషష్టితమస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎభై తొమ్మిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

 


|| Om tat sat ||