||సుందరకాండ ||

||అరువది సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 60 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షష్టితమస్సర్గః||

శ్లో|| తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూనురభాషత|
అయుక్తం తు వినా దేవీం దృష్టవద్భిశ్చ వానరాః||1||
సమీపం గన్తుమస్మాభీ రాఘవస్య మహాత్మనః|

తా|| హనుమంతునియొక్క ఆ వచనములను విని వాలిపుత్రుడు ఇట్లు పలికెను." ఓ వానరులారా మనచేత చూడబడినా కాని, ఆ సీతాదేవి లేకుండా మహత్ముడైన రాఘవుని సమీపమునకు పోవుట యుక్తముకాదు

శ్లో|| దృష్టాదేవీ న చాఽఽనీతా ఇతి తత్ర నివేదనమ్||2||
అయుక్తమివ పశ్యామి భవద్భిః ఖ్యాతవిక్రమైః|

తా|| 'ప్రఖ్యాతి చెందిన మీ అందరిచేత దేవి ని చూచితిమి కాని తీసుకురాలేదు అని చెప్పుట అయుక్తము అని తోచుచున్నది.'

శ్లో|| న హి నః ప్లవనే కశ్చిన్నాపి కశ్చిత్పరాక్రమే||
తుల్యః సామరదైత్యేషు లోకేషు హరిసత్తమాః||3||

తా||'ఓ వానరోత్తములారా, అకాశసంచారములో గాని పరాక్రమము లో గాని దేవతలూ దైత్యులూ కూడిన లోకాలలో మనతో సమానులు ఎవరూ లేర".

శ్లో|| జిత్వా లంకాం సరక్షౌఘాం హత్యా తం రావణం రణే
సీతామాదాయ గఛ్ఛామఃసిద్ధార్థా హృష్టమానసా ||4||

తా|| రాక్షససమూహమములతో కలిపి లంకను జయించి, యుద్ధములో రావణుని హతమార్చి, సీతను తీసుకొని కార్యము సిద్ధించుకొని ఆనందోత్సాహములతో వెళ్ళుదాము.

శ్లో|| తేష్వేవం హతవీరేషు రాక్షసేషు హనూమతా|
కిమన్యదత్ర కర్తవ్యం గృహీత్వా యామ జానకీం||5||

తా|| వారిలోనే అనేక మైన రాక్షసవీరులను హనుమంతుడు హతమార్చాడు. జానకీ దేవిని తోడ్కొని రావడము తప్ప అక్కడ మిగిలిన కార్యక్రమము ఏమి వుంది?

శ్లో|| రామలక్ష్మణయోర్మధ్యే న్యస్యామ జనకాత్మజామ్|
కింవ్యలీకైస్తు తాన్ సర్వాన్ వానరాన్ వానరర్షభాన్||6||

తా|| రామలక్ష్మణుల మధ్య సీతమ్మను చేర్చుదాము. ఇన్నిమాటలు ఎందుకు? మిగిలిన వానరుల అవసరములేదు.

శ్లో|| వయమేవ హి గత్వా తాన్ హత్వా రాక్షసపుంగవాన్|
రాఘవం ద్రష్టుమర్హామః సుగ్రీవం సహ లక్ష్మణమ్||7||

తా|| మనమే వెళ్ళి ఆ రాక్షసపుంగవులను హతమార్చి, లక్ష్మణ సుగ్రీవులతో కూడి రాఘవుని దర్శించుదాము.

శ్లో|| తమేవం కృతసంకల్పం జామ్బవాన్ హరిసత్తమః|
ఉవాచ పరమప్రీతో వాక్యమర్థవదర్థవిత్||8||

తా|| ఈ విధముగా సంకల్పించిన హరిసత్తమునికి, పరమప్రీతితో అర్థవంతమైన మాటలు జాంబవంతుడు పలికెను.

శ్లో|| నైషా బుద్ధిర్మహాబుద్ధే యద్బ్రవీషు మహాకపే|
విచేతుం వయమాజ్ఞప్తా దక్షిణాం దిశముత్తమామ్||9||

తా|| 'ఓ మహా కపి సత్తమా, నీవు చెప్పుచున్న అట్టి ఆలోచన సముచితము కాదు. మనము దక్షిణ దిశలో అన్వేషణకు పంపబడిన వారము'.

శ్లో|| నానేతుం కపిరాజేన నైవ రామేణ ధీమతా|
కథంచిన్నిర్జితాం సీతాం అస్మాభిర్నాభిరోచయేత్||10||

తా||'ఆమెను తీసుకు రమ్మని ధీమంతుడైన రాముడు గాని కపిరాజుకాని చెప్పలేదు. మనము జయించి సీతను తీసుకు పోవుట వారికి నచ్చక పోవచ్చు'.

శ్లో|| రాఘవో నృపశార్దూలః కులం వ్యపదిశన్ స్వకమ్|
ప్రతిజ్ఞాయ స్వయం రాజా సీతా విజయమగ్రతః||11||

తా|| రాజ సింహుడైన రాఘవుడు స్వయముగా సీతతో విజయము సాధించెదనని ప్రతిజ్ఞ చేసినవాడు.

శ్లో|| సర్వేషాం కపిముఖ్యానాం కథం మిథ్యా కరిష్యతి|
విఫలం కర్మ చ కృతం భవేత్ తుష్టిర్న తస్య చ||
వృథా చ దర్శితం వీర్యం భవేద్వానరపుంగవాః||12||

తా|| 'ఆ మాటకి విరుద్ధముగా వానర ముఖ్యులు ఎలా చేయగలరు? అలా చేసిన కర్మవిఫలమగును , దానితో సంతోషము కూడా వుండదు. చూపించిన ధైర్య సాహసములు వృథా అగును'.

శ్లో|| తస్మాద్గచ్ఛామ వై సర్వే యత్ర రామః స లక్ష్మణః|
సుగ్రీవశ్చ మహాతేజాః కార్యస్య నివేదనే||13||

తా|| 'అందుకని మనము అందరము రామలక్ష్మణులు ఎక్కడ వున్నారో అక్కడికి వెళ్ళి, మహాతేజోవంతులైన రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, చేసిన కార్యము నివేదించెదము'.

శ్లో|| న తావదేషా మతి రక్షమానో యథా భవాన్పశ్యతి రాజపుత్త్ర|
యథా తు రామస్య మతిర్నివిష్టా తథా భవాన్పశ్యతు కార్యసిద్ధిమ్||14||

తా|| 'ఓ రాజపుత్రా ! నీ సూచన సముచితమైనప్పటికీ, నా బుద్ధి అంగీకరించుట లేదు. రాముని మనస్సు ఎలావున్నదో తెలిసికొని ఆవిధముగా కార్యసిద్ధి కలిగించుటకు విధానము చూడతగినది'.

||ఓమ్ తత్ సత్||