||సుందరకాండ ||

||అరువది ఎనిమిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 67 || with Slokas and meanings in Telugu

 

సుందరకాండ.
అథ అష్టషష్టితమస్సర్గః||

శ్లో|| అథాహ ముత్తరం దేవ్యా పునరుక్తః ససంభ్రమః|
తవ స్నేహాన్నరవ్యాఘ్ర సౌహార్దాదనుమాన్యవై||1||

స|| నరవ్యాఘ్ర ! తవ స్నేహాత్ సౌహార్దాత్ ససంభ్రమః దేవ్యాః అనుమాన్య దేవ్యా ఉత్తరం పునః ఉక్తః ||

తా|| ' ఓ పురుషులలో పులి వంటి వాడా! నీ పై ప్రేమానురాగములతో బయలుదేరుతున్ననాతో సీతా దేవి తన మాటలు మళ్ళీ చెప్పెను'.

శ్లో|| ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా|
యథా మామాప్నుయాత్ శీఘ్రం హత్వా రావణమాహవే||2||

స|| శీఘ్రం రావణం హత్వా యథామాం అప్నుయాత్ ( తథైవ) రామః దాశరథిః త్వయా బహువిధం వాచ్యః |

తా|| '( ఓ హనుమా!) శీఘ్రముగా రావణుని హతమార్చి ఏ విధముగా నన్ను పొందునో ఆ విధమును దాశరథి కి బహువిధములుగా చెప్పుము'.

శ్లో|| యది వా మన్యసే వీర వసైకాఽహ మరిందమ|
కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతః శ్వోగమిష్యసి||3||
మమచాల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వీర్యవాన్|
అస్య శోకవిపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణమ్||4||
గతే హిత్వయి విక్రాంతే పునరాగమనాయవై|
ప్రాణానామపి సందేహో మమస్యాన్నాత్ర సంశయః||5||
తవాదర్శనజ శ్శోకో భూయో మాం పరితాపయేత్|
దుఃఖాద్దుఃఖ పరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీమ్||6||

స|| అరిందమ ! వీర ! యది మన్యసే (తది) కస్మింస్విత్ ఏకాహం సంవృతే ప్రదేశే విశ్రాన్తః శ్వః (త్వం) గమిష్యసి ||తవ సాన్నిధ్యాత్ మమ చ అల్పభాగ్యాయాః అస్య శోకవిపాకస్య ముహూర్తం విమోక్షణం స్యాత్||విక్రాంతే త్వయి గతే పునరాగమనాయ వై మమ ప్రాణానాం అపి సందేహాః స్యాత్ | అత్ర న శంసయః || దుఃఖాత్ దుఃఖభాగినీం దుర్గతాం మాం తవ అదర్శనజః శోకం భూయః మాం పరితాపయేత్||

తా|| "ఓ అరిందమ! వీరుడా ! అది తగును అనుకొనినట్లయితే, ఒక నిరాటంకమైనచోట విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము. నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు ఈ శోకసముద్రమునుంచి ఒక క్షణము విముక్తి కలిగినది. ఓ విక్రాంతుడా నీవు వెళ్ళిన పిమ్మటమళ్ళీ వచ్చువరకు నాప్రాణములు ఉండునో లేదో సందేహమే. దానిలో ఏమీ సంశయము లేదు. దుఃఖములో వున్నఈ దురదృష్ఠవంతురాలగు నాకు నీవు కనపడక మళ్ళీ శోకము కలుగును."

శ్లో|| అయం చ వీర సందేహః తిష్ఠతీవ మమాగ్రతః|
సుమహాంస్త్వత్ సహాయేషు హర్యృక్షేషు హరీశ్వర||7||
కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిమ్|
తాని హర్యృక్షసైన్యాని తౌ వా నరవరాత్మజౌ||8||
త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే|
శక్తిః స్యాద్వైనతేయస్య తవ వా మారుతస్య వా||9||

స|| వీర హరీశ్వర త్వత్ సుమహాన్ సహాయేషు హర్యక్షేషు అయం సందేహః చ మమ అగ్రతః తిష్ఠతి||దుష్పారం మహోదధిం తాని హర్యక్ష సైన్యాని కథం ను తరిష్యంతి ఖలు ||అస్య సాగరస్య లంఘనే భూతానాం త్రయాణాం ఏవ శక్తిః స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా||

తా|| "ఓ వీరుడా ! వానరేశ్వరుడా ! నీకు గల మహా సమర్థకుల మీదా నాకు ఈ సందేహము కలదు. దుష్కరమైన ఈ మహోదధిని ఆ వానరసైన్యములు ఎలా దాటెదరు? ఆ సాఘర లంఘనము నకు తగిన శక్తి భూతములలో ముగ్గురికే కలదు. వారు వైనతేయుడు, మారుతీ మరియు నీవు మాత్రమే.

శ్లో|| తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే|
కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాం వర||10||
కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే|
పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః||11||

స|| వీర ! కార్యవిదాం వర ! తత్ ఏవం దురతిక్రమే కార్యనిర్యోగే కిం సమాధానం పశ్యసి బ్రూహి| పరవీరజ అస్య కార్యస్య పరిసాధనే త్వం ఏక ఏవ పర్యాప్తః కామమ్ | తే ఫలోదయః యశస్యః ( భవేత్)

తా|| "ఓ వీరుడా ! కార్యము సాధించువారిలో శ్రేష్ఠుడా !అలాంటి ఈ దుష్కరమైన కార్యము సాధించుటకు సమాధానము కనపడు చున్నదా చెప్పుము. శత్రువులను క్షితించువాడా ! ఈ కార్యము సాధించుటకు నీవొక్కడివే తగినవాడివి. నీవు ఈ కార్యము సాధించినచో యశస్సు పొందెదవు."

శ్లో|| బలైః సమగ్రైర్యది మాం హత్వా రావణమాహవే|
విజయీ స్వాం పురీం రామో నయేత్ తస్యాద్యశస్కరమ్||12||
యథాఽహం తస్య వీరస్య వనాదుపథినా హృతా|
రక్షసా తద్భయా దేవ తథా నార్హతి రాఘవః||13||
బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః|
మాం నయేద్యది కాకుత్‍స్థః తత్ తస్య సదృశం భవేత్||14||

స|| రామః రావణం సమగ్రైః బలైః ఆహవే హాత్వా విజయీ స్వాం పురీం (మాం) నయేత్ యది తత్ యశస్కరం స్యాత్ ||అహం రక్షసా వీరస్య ఉపాధినా యథా హృతా తథా తత్ భయాదేవ రాఘవః న అర్హతి|| పరబలార్దనః కాకుత్‍స్థః లంకాం శరైః సంకులం కృత్వా మామ్ నయేత్ యది తత్ తస్య సదృశం భవేత్||

తా|| "ఆ రాముడు రావణుని రావణుని సమస్త బలములతో యుద్ధములో జయించి తనపురమునకు నన్ను తీసుకొనిపోయినచో అది ఆయనకు యశస్కరము గా వుండును. నేను రాక్షసవీరుని చే ఏవిధముగా అపహరింపబడితినో ఆ విధముగా రహస్యముగా రాఘవుడు తీసుకొనిపోవుట తగదు. శత్రువులను మర్దించు కాకుత్‍స్థుడు లంకానగరమును తన శరములతో సంకులము చేసి నన్ను తీసుకు పోయినచో అది ఆయనకు తగును".

శ్లో|| తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః|
భవత్యాహవశూరస్య తథా త్వముపపాదయ||15||

స|| తత్ మహాత్మనః ఆహవశూరస్య తస్య అనురూపం విక్రాన్తం యథా భవేత్ తథైవ త్వం ఉపపాదయ||

తా|| "ఆ మహాత్ముడు యుద్దవీరుని యొక్క శక్తి కి అనుగుణముగా ఏది తగునో అది నీవు ప్రతిపాదించుము".

శ్లో|| తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతుసంహితమ్|
నిశమ్యాహం తతశ్శేషం వాక్య ముత్తరమబ్రువన్||16||
దేవీ హర్యృక్ష సైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః|
సుగ్రీవః సత్త్వసంపన్నః తవార్థే కృత నిశ్చయః||17||

స|| తతః అర్థోపహితం ప్రశ్రితం హేతుసంహితం వాక్యం నిశమ్య అహం శేషం ఉత్తరం అబ్రువన్ ||దేవీ హర్యక్షుసైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః సత్త్వ సంపన్నః తవ అర్థే కృతనిశ్ఛయః||

తా|| "ఆ అర్థసహితమైన హేతువులతో కూడిన వాక్యములను విని నేను ఈ విధముగా మాట్లాడితిని. 'ఓ దేవీ వానర సైన్యములకు అధిపతి , ఆకాశములో ఎగురువారిలో శ్రేష్ఠుడు, సత్వ సంపన్నుడు అగు సుగ్రీవుడు నిన్ను రక్షించుటకు కృత నిశ్చయుడై ఉన్నాడు"

శ్లో|| తస్య విక్రమసంపన్నాః సత్త్వవంతో మహాబలాః|
మనః సంకల్పసంపాతా నిదేశే హరయః స్థితాః||18||
యేషాం నోపరినాధస్తాన్ నతిర్యక్ సజ్జతే గతిః|
న చ కర్మసు సీదంతి మహత్స్వమిత తేజసః||19||

స|| విక్రమసంపన్నాః సత్త్వవన్తః మహాబలాః మనః సంకల్ప సంపాతాః తస్య నిదేశే స్థితాః||యేషాం గతిః ఉపరి న సజ్జతే| అధస్తాత్ న| తిర్యక్ న | అమిత తేజసః మహత్ సు కర్మసు న సీదన్తి||

తా|| "అమితమైన పరాక్రమము కలవారు, వీరులు మనోనిశ్చయము కలవారు ఆయన పాలనలో ఉన్నారు. వారు పైకి ఎగరకలరు. క్రిందకి పోగలరు. వారు ఏదిశలొనైన పోగలరు. వారు ఎట్టి కార్యమైన సాధించ కల శక్తి కలవారు".

శ్లో|| అసకృత్తైర్మహాభాగైః వానరైర్బలదర్పితైః|
ప్రదక్షిణీకృతా భూమి ర్వాయుమార్గానుసారిభిః||20||
మద్విశిష్ఠాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః|
మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ||21||

స|| మహాభాగైః బలదర్పితైః వాయుమార్గానుసారిభిః తైః వానరైః భూమిః ప్రదక్షిణీ కృతా||సుగ్రీవ సన్నిధౌ తత్ర మత్ విశిష్ఠాశ్చ తుల్యాశ్చ సంతి | మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి||

తా|| "ఆ మహాభాగులు బలదర్పము కలవారు వారు వాయుమార్గములో భూమి ని ప్రదక్షణము చేయగలవారు. సుగ్రీవుని సన్నిధిలో నాకన్నా విశిష్ఠులు, నాతో సమానులు ఉన్నారు. కాని నాకన్నా తక్కువ వారు లేరు".

శ్లో|| అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః|
నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః||22||
తదలం పరిపాతేన దేవి మన్యుర్వ్యపైతు తే|
ఏకోత్పాతేన వై లంకా మేష్యంతి హరియూథపాః||23||

స|| అహం తావత్ ఇహ అనుప్రాప్తః| మహబలాః తే కిం పునః | ప్రకృష్టాః న ప్రేత్యన్తే హి | ఇతరే జనాః ప్రేత్యన్తే హి|| దేవీ తత్ పరితాపేన అలం | తే శోకః వ్యపైతు| తే హరియూథపాః ఏకోత్పాతేన లంకాం ఏష్యంతి||

తా|| "నేనే ఇక్కడి కి రాగలిగితిని. మహాబలురైన వారి సంగతి చెప్ప నేల. మహాబలవంతులను ఇట్టి కార్యమునకు పంపరు. ఇతర జనులనే పంపెదరు. ఓ దేవీ ఆ విషయము గురించి చింతించ వద్దు. నీ శోకము చాలును. ఆ వానర యోధులు ఒక్క గంతులో ఇచటికి చేరెదరు".

శ్లో|| మమపృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యావివోదితౌ|
త్వత్సకాశం మహాభాగే నృశింహవాగమిష్యతః||24||
అరిఘ్నం సింహసంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం|
లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితమ్||25||

స|| మహాభాగే నృసింహౌ తౌ చ మమ పృష్ఠగతౌ ఉదితౌ చన్ద్రసూర్యావివ త్వత్ సకాశం ఆగమిష్యతః||లంకాద్వారం ఉపస్థితం అరిఘ్నం సింహసంకాశం తం రాఘవం ధనుష్పాణిం లక్ష్మణం చ క్షిప్రం ద్రక్ష్యసి||

తా|| "ఓ పూజ్యురాలా ! నరసింహులగు రామలక్ష్మణులు ఇద్దరూ నా పృష్ఠము మీద కూర్చుని ఉదయించిన చంద్ర సూర్యులవలె త్వరలో ఇచటికి వచ్చెదరు. లంకాద్వారము దగ్గర ధనస్సు చేతిలో పట్టుకొని నిలబడిన సింహస్వరూపులైన రాముని లక్ష్మణుని త్వరలో చూచెదవు".

శ్లో|| నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూలవిక్రమాన్|
వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్||26||
శైలాంబుదనికాశానాం లంకామలయసానుషు|
నర్దతాం కపిముఖ్యానాం అచిరాచ్ఛ్రోష్యసి స్వనమ్||27||
నివృత్త వనవాసం చ త్వయా సార్థ మరిందమం|
అభిషిక్త మయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్||28||

స|| నఖదంష్ట్రాయుధాన్ సింహశార్దూలవిక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ సంగతాన్ క్షిప్రం ద్రక్ష్యసి||శైలామ్బుదనికాశానామ్ లంకామలయమానుషు నర్దతాం కపిముఖ్యానాం స్వనం అచిరాత్ శ్రోష్యసి||నివృత్తవనవాసం అరిన్దమం అయోధ్యాయామ్ త్వయా సార్థం అభిషిక్తం రాఘవం క్షిప్రం ద్రక్ష్యసి||

తా|| "నఖములు దంతములు ఆయుధములుగా గల, సింహ శార్దులములతో సమానమైన పరాక్రమము గల, వానరులను వానరేంద్రులను త్వరలో చూచెదవు. లంకా మలయ పర్వతములపై తిరుగుచున్నకొండలతో మేఘములతో సమానులైన వానరులను నీవు త్వరలో చూచెదవు. వనవాసమునుంచి తిరిగివచ్చిన శత్రుమర్దనుడు, అయోధ్యలో అభిషిక్తుడైన రాఘవుని నీవు త్వరలో చూచెదవు".

శ్లో|| తతో మయావాగ్బిరదీనభాషిణా
శివాభిరిష్టాభిరభిప్రసాదితా|
జగామ శాంతిం మమమైథిలాత్మజా
తవాపి శోకేన తదాఽభిపీడితా||29||

స|| తతః తవ శోకేనాపి తదా అభిపీడితా మైథిలాత్మజా మయా అదీనభాషిణా శివాభిః ఇష్టభిః మమ వాగ్భిః అభిప్రసాదితా శాంతిం జగామ||

తా|| "అప్పుడు నీ శోకముతో పీడించబడి దుఃఖములో నున్న మిథిలాకుమారి నా సంప్రీతికరమైన శుభకరమైన సముచితమైన మాటలతో ఊరడిల్లి శాంతిని పొందెను"

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టషష్టితమస్సర్గః||
శ్రీసుందరకాండః సమాప్తః||
హరి ఓమ్ తత సత్||
సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు||

ఆ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఎనిమిదవ సర్గ సమాప్తము

|| ఓమ్ తత్ సత్||