||సుందరకాండ ||

|| ఏడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 7 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తమస్సర్గః

స వేశ్మజాలం బలవాన్ దదర్శ
వ్యాసక్త వైఢూర్యసువర్ణజాలమ్|
యథామహత్ప్రావృషి మేఘజాలమ్
విదుత్పినద్ధం సవిహంగజాలమ్||1||

స||బలవాన్ సః హనుమాన్ యథా ప్రావృషి విద్యుత్పినద్ధమ్ మహత్ మేఘజాలం తథా వ్యాసక్త వైఢూర్యసువర్ణజాలం సవిహంగజాలం వేశ్మజాలం దదర్శ ||

ఆ మహాబలవంతుడు వర్షాకాలములో విద్యుత్‍కాంతి తో మెరుస్తున్న మేఘసముదాయములవలె నున్న, వైడూర్యములతో కూడిన బంగారు గవాక్షములు విహంగజాలములు కల భవనసముదాయము ను చూచెను

నివేశనానాం వివిధాశ్చశాలాః
ప్రధానశంఖాయుధచాపశాలాః|
మనోహరాశ్చాపిపునర్విశాలాః
దదర్శ వేశ్మాద్రిషు చంద్రశాలాః||2||

స||(సః హనుమాన్) ప్రధానశంఖాయుథచాపశాలాః వివిధాః శాలాః నివేశనానామ్ దదర్శ|పునః వేశ్మాద్రిషు మనోహరాః విశాలాః చన్ద్రశాలాః చ దదర్శ||

ఆ హనుమంతుడు ఆ గృహములలో ముఖ్యమైన శంఖాయుధములు వుంచుటకు ఏర్పరచబడిన శాలలను చూచెను. మళ్ళీ ఆ శాలలో మనోహరములైన విశాలమైన చంద్రశాలలూ కూడా ఉన్నాయి.

గృహాణి నానావసురాజితాని
దేవాసురైశ్చాపి సుపూజితాని|
సర్వైశ్చ దోషైః పరివర్జితాని
కపిర్దదర్శ స్వబలార్జితాని||3||

స|| (సః మహా) కపిః (తత్) గృహాణి సర్వైశ్చ దేవాః సురైః చాపి సుపూజితాని స్వబలార్జితాని దోషైః పరివర్జితాని నానావసురాజితాని దదర్శ||

ఆ మహాకపి ఆ గృహములలో అందరు దేవతలూ సురులూ పూజింపతగిన, తన స్వంత బలములతో అర్జించిన, దోషములు లేని అనేకరకములైన సంపత్తులను చూచెను.

తాని ప్రయత్నాభిసమాహితాని ||
మయేవ సాక్షాదివ నిర్మితాని|
మహీతలే సర్వ గుణోత్తరాణీ
దదర్శ లంకాధిపతేర్గృహాణి||4||

స|| ప్రయత్నాభి సమాహితాని సర్వగుణోత్తరాణి లంకాధిపతేః గృహాణి సాక్షాత్ మయేవ నిర్మితాని భవనాని ఇవ హనుమాన్ దదర్శ||

ప్రయత్నముతో చక్కగా నిర్మితమైన అత్యుత్తమమైన గుణములతో తులతూగు ఆ రాక్షసాధిపతి భవనములు సాక్షాత్తు మయునిచే నిర్మింపబడిన భవనములలా వున్న భవనములను హనుమంతుడు దర్శించెను.

తతో దదర్శోచ్ఛ్రితమేఘరూపమ్
మనోహరం కాంచనచారురూపమ్|
రక్షోsధిప స్యాత్మబలానురూపమ్
గృహోత్తమం హ్యప్రతిరూపరూపమ్||5||

స|| (తత్) రక్షోధిపస్య ఉత్తమమ్ గృహమ్ దదర్శ | (తత్ గృహమ్) మనోహరం కాంచనచారురూపం అప్రతిరూపరూపం రక్షోధిపస్య ఆత్మబలానురూపం అస్తి| తత్ గృహం ఉచ్ఛ్రితమేఘరూపం ఇవ అస్తి||

ఆ రక్షోధిపతి భవనము స్వర్ణమయమై మనోహరము గా అతని ఆత్మబలమునకు అనుగుణముగా పైకిలేచిన మేఘములా వున్నది.

మహీతలే స్వర్గమివ ప్రకీర్ణమ్
శ్రియాజ్వలంతం బహురత్న కీర్ణమ్|
నానాతరూణాం కుసుమావకీర్ణమ్
గిరేరివాగ్రం రజసావకీర్ణమ్||6||

స|| శ్రియా జ్వలంతం (తత్ గృహమ్) మహీతలే ప్రకీర్ణమ్ స్వర్గమివ (అస్తి)| నానాతరూణాం కుసుమావకీర్ణం రజసా గిరేః అగ్రం ఇవ (తత్ గృహమ్ అస్తి)||

మహీతలము పై స్వర్గములాగ అనేక రత్నములతో ఇశ్వరముతో తులతూగుచూవున్న ఆ రాక్షసాధిపతి గృహము, అనేక విరబూచిన వృక్షముల రజస్సుతో నిండిన పర్వత శిఖరమువలె నుండెను.

నారీప్రవేకైరివ దీప్యమానమ్
తటిద్భి రంభోదవ దర్చ్యమానమ్|
హంసప్రవేకైరివ వాహ్యమానమ్
శ్రియాయుతం కే సుకృతాం విమానమ్||7||

స|| తత్ సుకృతాం విమానమ్ అర్చమానమ్ నారీప్రవేకైః శ్రియా యుతం (అస్తి)| అమ్భోదవత్ దీప్యమానం తటిద్భిః ఇవ అస్తి| ఖే హంసప్రవైకైః వాహ్యమానమ్ ఇవ అస్తి||

ఆ సుకృతమైన విమానము అత్యుత్తమమైన స్త్రీలు సిరులతో పూజించతగినదిగా వున్నది. నీటితో కూడి విద్యుత్కాంతితో మెరుస్తున్న మేఘములులా వున్నది. హంసలసముదాయము తో ఆకాశములో మోయబడినదా అన్నట్లు తేలియాడుచున్నది.

యథా నగాగ్రం బహుధాతుచిత్రమ్
యథా నభశ్చ గ్రహచంద్రచిత్రమ్|
దదర్శయుక్తీకృత మేఘచిత్రమ్
విమానరత్నం బహురత్న చిత్రమ్||8||

స|| తత్ విమానరత్నం బహురత్న చిత్రం అస్తి| (తత్ విమానమ్) యథా బహుధాతుచిత్రమ్ నగాగ్రం ఇవ యథా యుక్తీకృత మేఘచిత్రం ఇవ యథా నభశ్చ గ్రహచన్ద్ర చిత్రం ఇవ అస్తి ||

ఆ విమానరత్నము అనేకమైన రత్నములతో అలంకరింపబడియున్నది.అనేకమైన ధాతువులతో నిండిన నగాగ్రము పోలియున్నది , అనేక మేఘముల సముదాయమువలెనున్నది. చంద్రుడు తదితర గ్రహములో నిండిన ఆకాశమువలెనున్నది.

మహీకృతా పర్వతరాజిపూర్ణా
శైలాః కృతా వృక్షవితానపూర్ణా|
వృక్షాః కృతా పుష్పవితానపూర్ణాః
పుష్పం కృతం కేసర పత్ర పూర్ణమ్||9||

స|| యత్ర పర్వత రాజి పూర్ణా మహీ (చిత్రీ) కృతా | యత్ర వృక్ష వితానపూర్ణా శైలాః (చిత్రీ) కృతా | యత్ర వృక్షాః పుష్పవితానపూర్ణా (ఇవ చిత్రీ ) కృతా | యత్ర పుష్పమ్ కేసరపత్రపూర్ణమ్ చిత్రీకృతా | (తత్ విమానం హనుమాన్ దదర్శ) ||

అక్కడ మహీతలము పర్వతరాజములతో, పర్వతములు వృక్షసంపత్తితో, వృక్షములు పుష్పములతో, పుష్పములు కేసరపత్రములతో చిత్రీకరింపబదియున్నది .

కృతాని వేశ్మానిచ పాండురాణి
తథా సుపుష్పాణ్యపి పుష్కరాణి|
పునశ్చ పద్మాని స కేసరాణి
ధన్యాని చిత్రాణి తథా వనాని||10||

స|| యస్మిన్ పాండురాణి వేశ్మాని చ (చిత్రీ) కృతాని | తథైవ యస్మిన్ పుష్పాణి సహ పుష్కరాణి (చిత్రీకృతాని)| పునః యస్మిన్ కేసరాణి సః పద్మాని (చిత్రీ కృతాని) | యస్మిన్ ధన్యాని వనాని చిత్రాణి చిత్రీకృతాని (తత్ విమానమ్ దదర్శ)||
\
అచటి తెల్లని భనములలో రమణీయమైన పూలతో వున్న సరోవరములు, పూలరేకులతో వున్న పద్మములు, దట్టముగా పెరిగిన వృక్షసముదాయముతో కూడిన అరణ్యములు చిత్రీకరింపబడి యున్నాయి.

పుష్పాహ్వయం నామ విరాజమానం
రత్నప్రభాభిశ్చ వివర్థ మానమ్|
వేశ్మోత్తమానా మపి చోచ్చమానమ్
మహాకపిస్తత్ర మహావిమానమ్||11||

స|| మహాకపిః తత్ర పుష్పాహ్వయం నామ విరాజమానం మహా విమానం (దదర్శ)| తత్ విమానం రత్న ప్రభాభిః చ వివర్ధమానం | తత్ విమానం వేశ్మోత్తమానాం అపి ఉచ్చ్యమానం అస్తి|

ఆ మహాకపి అక్కడ విరాజిల్లు చున్న పుష్పకము అను పేరుగల మహావిమానము చూచెను. ఆ విమానము రత్న ప్రభలతో విరాజిల్లుచున్నది. ఆ విమానము ఉత్తమమైన భవనముల కన్న అత్యుత్తమమైనది.

కృతాశ్చ వైఢూర్యమయా విహంగాః
రూప్యప్రవాళైశ్చ తథా విహంగాః|
చిత్రాశ్చ నానావసుభి ర్భుజంగాః
జాత్యానురూపాస్తురగా శ్శుభాంగాః||12||

స|| వైఢూర్యమానాః విహంగాః కృతాః | తథైవ రూప్యప్రవాళైశ్చ కృతాః విహాంగాః | చిత్రాః భుజంగాః నానావసుభిః కృతాః | తురంగాః జాత్యానురూపాః శుభాంగాః అపి కృతాః||

The birds were made of Vaiduryas. Similarly the birds were made of silver and corals. Colorful serpents were made with gems. Well bred horses with auspicious limbs were drawn.

అక్కడ పక్షులు వైడూర్యములతో, వెండితో పగడాలతో చిత్రీకరింపబడినవి. అలాగే అనేకవిధములైన మణులతో రంగురంగుల సర్పాలు, శుభాంగములు కల ఉత్తమజాతి అశ్వములు చిత్రీకరింపబడినవి.

ప్రవాళజాంబూనదపుష్పపక్షాః
సలీల మావర్జితజిహ్మపక్షాః|
కామస్య సాక్షాదివ భాంతి పక్షాః
కృతావిహంగా స్సుముఖాస్సుపక్షాః||13||

స|| విహంగాః సుపక్షాః ప్రవాలజామ్బూనదపుష్పపక్షాః స లీలం ఆవర్జితజిహ్మ పక్షాః కృతాః| సా విహంగాః సాక్షాత్ కామస్య పక్షాః ఇవ బాన్తి||

విహంగములు అందమైన రెక్కలతో, ఆ రెక్కలు బంగారపు పూతతో పగడాలతో కోంచెము లీలగా వంచబడినవి. ఆ విహంగములు సాక్షాత్తు మన్మధుని రెక్కలు లాగా ఉన్నవి.

నియుజ్యమానాస్తు గజాస్సుహస్తాః
స కేసరాశ్చోత్పలపత్త్రహస్తాః|
బభూవ దేవీ చ కృతా సుహస్తా
లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా||14||

స|| లక్ష్మీః పద్మినీ పద్మహస్తా సుహస్తా చ సకేసరాశ్చ దేవీ చ కృతా బభూవ| తథా ఉత్పలపత్రహస్తాః నియుజ్యమానాః గజాః అస్తు ||

Goddess Lakshmi in lotus pond having beautiful hands holding lotus in her hands along with filaments was seen. Elephants carrying blue lotuses with their trunks as offerings to the Goddess were seen too.

అచట సరోవరములో లక్ష్మీ దేవి పద్మములు ఉన్న శుభమైన పద్మహస్తములతో ఆ పద్మములు రేకులతో వున్నవి. అచట గజములు నీలికమలములతో గల తొండములతో పూజిస్తున్నవా అనట్లు నియోజింపబడినవి.

ఇతీవ తద్గృహమభిగమ్య శోభనమ్
సవిశ్మయో నగమివ చారు శోభనమ్|
పునశ్చ తత్పరమసుగంధి సుందరమ్
హిమాత్యయే నగమివ చారుకందరమ్||15||

స|| హనుమాన్ ఇతీవ శోభనమ్ చారుశోభనమ్ నగమివ తత్ గృహం అభిగమ్య సవిస్మయః భవతి|| (తతః) పునశ్చ తత్ (గృహం) హిమాత్యయే నగమివ పరమసుగంధి సుందరమ్ చారుకందరం దదర్శ||

హనుమంతుడు హిమఋతువులో సుందరమైన గుహలతో ఒప్పారు పర్వతమువలెనున్న సుందరముగా శుభప్రదము గా ఉన్న, పర్వతము వలెనున్న ఆగృహమును చూచి అశ్చర్యచకితుడాయెను.

Thus Hanuman reached the auspicious and beautiful palace appearing like a mountain and was wonder struck. Again he saw the palace as a mountain in spring time with beautiful caves filled with wonderful fragrance.

తతః స తాం కపి రభిపత్య పూజితాం
చరన్ పురీం దశముఖబాహుపాలితామ్ |
అదృశ్యతాం జనకసుతాం సుపూజితామ్
సుదుఃఖితః పతిగుణవేగవర్జితామ్||16||

స|| తతః స కపిః దశముఖబాహుపాలితాం పూజితాం తాం పురీం అభిపత్య చరన్ పతిగుణవేగవర్జితాం సుపూజితాం తాం జనకసుతాం అదృశ్యతాం సుదుఃఖితః బభూవ||

ఆప్పుడు ఆ హనుమంతుడు రావణాసురినిచే పాలింపబడు , ఆ నగరము లో తిరుగుచూ భర్తయొక్క గుణసంపత్తిచే జయింపబడిన పూజనీయమైన ఆ జనక సుతను కానక అత్యంత దుఃఖము కలవాడయ్యెను.

తతస్తదా బహువిధభావితాత్మనః
కృతాత్మనో జనకసుతాం సువర్త్మనః|
అపశ్యతోsభవ దతిదుఃఖితం మనః
సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః||17||

స|| తతః జనకసుతాం అపశ్యతః బహువిధభావితాత్మనః కృతాత్మనః సుచక్షుషః సువర్త్మనః మహాత్మన: మనః అతిదుఃఖితం అభవత్ ||

ఆ జనకసుతను చూడలేక అనేకవిధములైన ఆలోచనలు కల, అనుకున్నపని సాధింపగల, సునిశిత దృష్టికల, మహాత్ముడి మనస్సు అతి దుఃఖముకలదాయెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తమస్సర్గః||

|| ఈ విధముగా వాల్మీకి రామాయణములోని సుందరకాండలో ఏడవ సర్గ సమాప్తము||.

|| ఓమ్ తత్ సత్||

 

 

 

 

 

 

 


 

 

 

 

 

 

 

||ఒమ్ తత్ సత్||