||సుందరకాండ ||
||తొమ్మిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||
|| Sarga 9 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ నవమస్సర్గః
శ్లో|| తస్యాలయ వరిష్టస్య మధ్యే విపులమాయతమ్|
దదర్శ భవనం శ్రేష్టం హనుమాన్మారుతాత్మజః||1||
స|| మారుతాత్మజః హనుమాన్ తస్య ఆలయవరిష్ఠస్య మధ్యే విపులం ఆయతం భవనం శ్రేష్టం దదర్శ||
తా|| మారుతాత్మజుడగు హనుమంతుడు ఆ వరిష్ట ఆలయముల మధ్యలో పెద్ద విశాలమైన శ్రేష్టమైన భవనమును చూచెను.
శ్లో|| అర్థయోజన విస్తీర్ణమ్ ఆయతం యోజనం హి తత్|
భవనం రాక్షసేన్ద్రస్య బహుప్రాసాదసంకులమ్||2||
స|| రాక్షసేన్ద్రస్య భవనం తత్ బహుప్రాశాద సంకులం అర్థ యోజన విస్తీర్ణమ్ యోజనం ఆయతమ్ ( అస్తి)||
తా|| ఒక యోజనము పొడవు అర యోజనము వెడల్పు గల ఆ రాక్షసేంద్రుని భవనము అనేకమైన ప్రాసాదములతో కూడియున్నది.
శ్లో|| మార్గమాణస్తు వైదేహీం సీతాం ఆయతలోచనామ్|
సర్వతః పరిచక్రామ హనుమాన్ అరిసూదనః||3||
స|| అరిసూదనః హనుమాన్ ఆయతలోచనం వైదేహీం సీతాం మార్గమాణః తు సర్వతః పరిచక్రామ||
తా|| శత్రువులను మర్దించగల ఆ హనుమంతుడు విశాలమైన కళ్ళుగల ఆ సీతాదేవి వెదుకుతూ అన్నిచోట్లా తిరిగెను.
శ్లో|| ఉత్తమమ్ రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్|
అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్రనివేశనమ్||4||
చతుర్విషాణైర్ద్విరదైః త్రివిషాణైః తథైవ చ|
పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః ||5||
స|| అథ లక్ష్మీవాన్ హనుమాన్ ఉత్తమం రాక్షసావాసం అవలోకయన్ రాక్షసేంద్ర నివేశనం అససాద||( తత్ భవనం) చతుర్విషాణైః తథైవ త్రివిషాణైః ద్విరదైః గజైః పరిక్షిప్తం అసంబాధం ఉదాయుధైః రక్ష్యమాణం (అస్తి)||
తా|| అప్పుడు లక్ష్మీవంతుడైన హనుమంతుడు ఆ ఉత్తమమైన రాక్షస ఆవాసమును చూచి రాక్షసేంద్రుని భవనములోకి ప్రవేశించెను. ఆ భవనము రెండు , మూడు నాలుగు దంతములు ఉన్న ఏనుగుల తోను , అప్రమత్తముగానున్న ఆయుధములు ధరించి ఉన్న రాక్షసులచేతను రక్షింపబడి యున్నది.
శ్లో|| రాక్షసీభిశ్చ పత్నీభీ రావణస్య నివేశనమ్|
అహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతమ్||6||
తన్నక్రమకరాకీర్ణం తిమిఙ్గిలఝషాకులమ్|
వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరమ్||7||
స|| (తత్) రావణస్య నివేశనం పత్నీభిః విక్రమ్య ఆహృతాభిః రాజకన్యాశ్చ రాక్షసీభిశ్చ ఆవృతమ్|| (తత్ రావణస్య నివేశనమ్) నక్రమకరాకీర్ణం తిమిఙ్గిళఝుషాకులమ్ వాయువేగ సమాధూతం పన్నగైః సాగరం ఇవ (అస్తి)||
తా|| ఆ రాక్షసభవనము భార్యలతోనూ , జయించి తీసుకురాబడిన రాజకన్యలతోనూ నిండివుంది. ఆ భవనము మొసళ్ళు తిమింగిళములు పాములతో నిండి యున్న మహా సాగరము వలెనుండెను.
శ్లో|| యాహి వైశ్రవణే లక్ష్మీర్యా చన్ద్రే హరివాహనే|
సారావణగృహే సర్వా నిత్యమేవానపాయినీ||8||
యా చ రాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ|
తాదృశీ తద్విశిష్టా వా ఋద్ధీ రక్షోగృహే ష్విహ||9||
స|| యా లక్ష్మీ వైశ్రవణే యా హరివాహనే ఇన్ద్రే చ (అస్తి) సా సర్వా రావణగృహే నిత్యమేవ అనపాయినీ (అస్తి)||రాజ్ఞః కుబేరస్య యా వరుణస్య యా యమస్య ఋద్ధిః తాదృశీ తద్విశిష్ఠా వా (ఋద్ధిః) ఇహ రక్షో గృహే (అస్తి)||
తా|| కుబేరునికి ఎంత ఇశ్వర్యము ఉందో, ఆకుపచ్చని గుఱ్ఱముల రథము వాహనముగాగల ఇంద్రుని దగ్గర ఎంత ఇశ్వర్యము కలదో, అంత ఇశ్వర్యము ఆ రాక్షసరాజు భవనములో కలదు.
శ్లో|| తస్య హర్మ్యస్య మధ్యస్థం వేశ్మ చాన్యత్సునిర్మితమ్|
బహునిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః||10||
బ్రహ్మణోఽర్థే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణా|
విమానం పుష్పకం నామ సర్వరత్నవిభూషితమ్||11||
పరేణ తపసా లేభే యత్కుబేరః పితామహాత్|
కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః||12||
స|| పవనాత్మజః తస్య హర్మ్యస్య మధ్యస్థం అన్యత్ బహునిర్యూహసంకీర్ణమ్ సునిర్మితం వేశ్మ దదర్శ||పుష్పకం నామ విమానం సర్వ రత్న విభూషితం దివ్యం యత్ బ్రహ్మణోర్థే విశ్వకర్మణా కృతం (అస్తి) || ( తత్ విమానం) కుబేరః పితామహాత్ పరేణ తపసా లేభే| కుబేరం ఓజసా జిత్వా తత్ రాక్షసేశ్వరః లేభే ||
తా|| ఆ పవనాత్మజుడు భనముల మధ్యలో ఇంకొక అందముగా నిర్మించబడిన అనేక ప్రాసాదములు గల భవనమును చూచెను. అది పుష్పకమనబడు విమానము. అన్నిరకముల రత్నములతో అలంకరింపబడిన దివ్యమైన ఆ విమానము బ్రహ్మకోసము నిర్మింపబడినది. అ పితామహుడు ఆ విమానమును కుబేరునికి ఇచ్చెను. కుబేరుని జయించి రాక్షసేస్వరుడు ఆ విమానమును సంపాదించెను.
శ్లో|| ఈహామృగ సమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః|
సుకృతైరాచితం స్తమ్భైః ప్రదీప్తమివ చ శ్రియా||13||
మేరుమన్దరసంకాశై రుల్లిఖద్భి రివ్వామ్బరమ్|
కూటాగారై శ్శుభాకారైః సర్వతః సమలంకృతమ్||14||
స|| ఈహామృగసమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః సుకృతైః స్తమ్భైః శ్రియా ప్రదీప్తం ఇవ మేరుమందర సంకాశైః ఉల్లిఖద్భిరివ అమ్బరం సర్వతః శుభాకారైః కూటాగారైః సమలంకృతం ( అస్తి)
తా|| ఆ భవనము బంగారముతోపూయబడిన ఈహామృగమల ప్రతిమలతో, స్తంభములతో శోభాయమానముగా జ్వలిస్తూ, మేరు మందర పర్వతములతో సమానముగా అకాశమునంటుతూ వున్న శుభకరమైన కూటాగారములతో నున్నది.
శ్లో|| జ్వలనార్క ప్రతీకాశం సుకృతమ్ విశ్వకర్మణా|
హేమసోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్||15||
జాలావాతాయనైర్యుక్తం కాంచనైస్స్పాటికైరపి|
ఇన్ద్రనీల మహానీల మణి ప్రవర వేదికమ్||16||
స|| విశ్వకర్మణా సుకృతం జ్వలనార్కప్రతీకాశం హేమసోపాన సంయుక్తం చారుప్రవర వేదికమ్ (అస్తి)||(తత్ విమానం) కాంచనైః స్ఫాటికైరపి జాలవాతాయనైః యుక్తం ఇన్ద్ర నీల మహానీల మణి ప్రవర వేదికమ్ అస్తి||
తా|| బంగారు సోపానములతో అందమైన శ్రేష్టమైన వేదికలతో, వెలుగుతున్న సూర్యకిరణములలా ప్రకాశించుచున్న ఆ విమానము విశ్వకర్మచేత చేయబడినది. బంగారముతో స్ఫటికముల జాలల తో గల కిటికీలతోనున్న, ఇంద్రనీల మహానీల మణులతో అలంకరింపబడిన వేదికలతో ఉన్నది ఆ విమానము.
శ్లో|| విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చమహాధనైః|
నిస్తులాభిశ్చ ముక్తాభిః తలేనాభి విరాజితమ్||17||
చన్దనేన చ రక్తేన తపనీయనిభేన చ|
సుపుణ్యగన్ధినాయుక్తం ఆదిత్యతరుణోపమమ్||18||
స||విచిత్రేణ విద్రుమేణ మహాధనైః మణిభిశ్చ నిస్తులాభిః ముక్తాభిః తలేన అభివిరాజితమ్ అస్తి || రక్తేన చన్దనేన తపనీయనిభేన చ సుపుణ్యగన్ధినా యుక్తం ఆదిత్య తరుణోపపమం (అస్తి)||
తా|| ఆ విమానములో నేల విచిత్రమైన పగడలతో అమూల్యమైన మణులతోనూ అలంకరింపబడి అద్భుతముగా విరాజిల్లుచున్నది. పుణ్యగంధములతో కూడి ఎఱ్ఱని చందనముతో, కరిగించిన బంగారముతో ఆలకబడి ఉదయిస్తున్న సూర్యుని కాంతితో ప్రకాశిస్తున్నది.
శ్లో|| కూటాగారైర్వరాకారైః వివిధైః సమలంకృతమ్|
విమానం పుష్పకం దివ్యం ఆరురోహ మహాకపిః||19||
తత్రస్థ స్స తదా గన్ధం పానభక్ష్యాన్నసంభవమ్|
దివ్యం సమ్మూర్ఛితం జిఘ్ర ద్రూపవంత మివానలమ్||20||
స గన్ధస్త్వం మహాసత్త్వం బన్ధుర్బన్ధుమివోత్తమమ్|
ఇత ఏహీ త్యువాచేన తత్ర యత్ర స రావణః||21||
స|| వివిధైః వరాకరైః కూటాగారైః సమలంకృతం దివ్యం పుష్పకం విమానం మహాకపిః ఆరురోహ|| సః తదా తత్రస్థః దివ్యం గంధం జిఘ్రత్ | తత్ పానభక్ష్యాన్నసంభవం సమ్మూర్ఛితం రూపవంతం అనిలమివ గంధం అస్తి || స గంధః తం మహాసత్త్వం యత్ర సరావణః తత్ర ఇతః ఏహి ఇతి ఉత్తమం బంధుం బంధురివ ఉవాచ ||
తా|| అనేరకములైన అద్భుతమైన ఆకారముగల కూటాగారములతో అలంకరింపబడిన దివ్యమైన విమానమును ఆ మహాకపి ఎక్కెను. అక్కడ దివ్యమైన సువాసనలను ఆఘ్రాణించెను. ఆ పానభక్ష్యాన్నములతో కూడిన వాసన చాలా కమ్మగా మూర్చింప చేయు నట్లు ఉన్నది. ఆ వాసన ఆ మహాకపిని ఒక బంధువు తన ఆప్తబంధువుని అహ్వానించినట్లు హనుమంతుని రావణుడున్నచోటికి అహ్వానిస్తున్నట్లుండెను.
శ్లో|| తత స్థాం ప్రస్థితశ్శాలామ్ దదర్శ మహతీం శుభామ్|
రావణస్య మనః కాన్తాం కాన్తామివ వరస్త్రియమ్||22||
మణిసోపానవికృతాం హేమజాలవిభూషితామ్|
స్పాటికైరావృతతలాం దన్తాన్తరితరూపికామ్||23||
స|| తతః ప్రస్థితః మహతీం శుభాం తత్ వరస్త్రియ కాంతామివ మనః కాంతాం రావణస్య శాలాం హనుమాన్ దదర్శ ||మణిసోపానవికృతాం హేమజాల విభూషితామ్ స్ఫాటికైరావృతతలాందన్తాన్తరిత రూపికాం (శాలాం దదర్శ)||
తా|| అక్కడకి బయలుదేరిన హనుమంతుడు రావణునికి ప్రీతికలిగించు కాంతామణి లాగా ప్రియమైన విశాలమైన అందమైన శాలను చూచెను. ఆ శాలలో మణులచే అలంకరింపబడిన సోపానములు కలవు. బంగారు జాలలతో అలంకరింపబడిన కీటికీలు , స్ఫటికముతో మణులతో దంతములు కల ఏనుగుల బొమ్మలతో అలంకరింపబడిన నేల కలవు.
శ్లో|| ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి|
విభూషితాం మణిస్తమ్భైః సుబహూస్తమ్భభూషితామ్||24||
నమ్రైః రృజుభిరత్యుచ్చైః సమంతాత్సువిభూషితైః |
స్తమ్భైః పక్షైరివాత్యుచ్చైర్దివం సంప్రస్థితామివ ||25||
స|| ( తత్ శాలా) ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్యచామీకరైరపి మణిస్తంభైః విభూషితాం సుబహు స్తంభైః భూషితం (అస్తి)||(తత్ శాలాయాం) నమ్రైః ఋజుభిః అత్యుచ్చైః సమన్తాత్ సువిభూషితైః స్తమ్భైః అత్యుచ్చైః పక్షైః దివం సమ్ప్రస్థితామివ (సంతి) ||
తా|| ఆ శాల ముత్యాలతోనూ పగడాలతోనూ బంగారముతోనూ అలంకరింపబడిన స్తంభములతో అలంకరింపబడిన అనేక స్తంభములతో ఉన్నది. వంకరటింకరలేని అతుత్తమమైన ఉన్నతమైన స్తంభాలపై అ విమానము విరాజిల్లుచూ రెక్కలు చాపి ఆకాశములోకి ఎగురుటకు సిద్ధముగా వున్నట్లు వుండెను.
శ్లో|| మహత్యా కుథయాస్తీర్ణాం పృథివీ లక్షణాఙ్కయా|
పృథివీమివ విస్తీర్ణం సరాష్ట్ర గృహమాలినీమ్||26||
నాదితాం మత్తవిహగైః దివ్యగన్ధాదివాసితామ్|
పరార్థ్యాస్తరణో పేతాం రక్షోధిపనిషేవితామ్||27||
స|| తత్ శాలా పృథివీ లక్షణాంకయా కుథయా ఆస్తీర్ణం సరాష్ట్ర గృహమాలినీం పృథివీమివ విస్తీర్ణమ్ (అస్తి) || మత్తవిహగైః నాదితాం దివ్యగంధాధివాసితామ్ పరార్ధ్యాస్తరణోపేతాం రక్షోధిపేన నిషేవితాం తం శాలాం దదర్శ||
తా|| ఆ శాలలో భూమియొక్క లక్షణములతో దేశములతో గృహములతో చిత్రీకరింపబడిన భూమిలాగవున్నతివాసీ ఉండెను. రాక్షసేంద్రునిచే తరచు ఆతిధ్యము స్వీకరింపబడిన ఆ శాల
మత్తెక్కిన పక్షుల కిలకిలారావముతో నిండి, దివ్యమైన గంధముల వాసనలతో నిండి , అమూల్యమైన ఆసనములతో కూడి ఉన్నది.
శ్లో|| ధూమ్రాం అగరుధూపేన విమలాం హంసపాణ్డురామ్|
చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీ మివ సుప్రభామ్||28||
మనసంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీమ్|
తాం శోకనాశినీం దివ్యాం శ్రియః సంజననీమివ||29||
స|| విమలాం హంసపాణ్డురామ్ (శాలా) అగరుధూపేన ధూమ్రాం ఇవ అస్తి | పుష్పోపహారేణ చిత్రామ్ సుప్రభామ్ కల్మషాం కామధేనుం ఇవ సంతి || మనః సంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం శోకనాశినీం శ్రియం సంజననీం ఇవ దివ్యాం తామ్ దదర్శ||
Though white like a swan it was smokey because of agaru smoke. Because of the offering of flowers it was radiant like wish fulfilling Kamadhenu. The mansion was generating delight to the heart , pleasing with color and complexion, demolishing sorrow as it were it looked like the source of prosperity.
తా|| ఆ శాల హంస వలె తెల్లగానున్నప్పటికి అగరు ధూపము వలన ధూమము రంగు కలిగి యున్నది. చిత్రమైన పుష్పములతో కామధేనువు వలె మంచి వర్చస్సు తో వెలుగుతోంది. మనస్సుకు ఆహ్లాదము కలిగిస్తూ, రంగును పెంపొందిస్తూ, శోకము నాశనము చేస్తూ , శ్రియమును పెంపొందిస్తూ నట్లుగా దివ్యముగానున్నది.
శ్లో|| ఇన్ద్రియాణీన్ద్రియార్థైస్తు పఞ్చపఞ్చభిరుత్తమైః|
తర్పయామాస మాతేవ తదా రావణపాలితా||30||
స్వర్గోఽయం దేవలోకోఽయం ఇన్ద్రస్యేయం పురీ భవేత్|
సిద్ధిర్వేయం పరాహిస్యా దిత్యమన్యత మారుతిః||31||
స|| రావణపాలితా (శాలా) తదా మాతాఇవ పంచభిః ఇన్ద్రియార్థైః పంచ ఇన్ద్రియాణి తర్పయామాస ||అయం స్వర్గః అయం దేవలోకః అయం ఇంద్రస్యపురీ భవేత్ | ఇయం పరాసిద్ధిః స్యాత్ మారుతిః అమన్యత ||
తా|| ఆ శాల తల్లి లాగా పంచేంద్రియాలకు తగు పదార్ధములను తర్పణములాగా సమకూర్చుచున్నది. ఆ శాల వైభవమును చూచి ఇది స్వర్గమా ? దేవలోకమా? ఇంద్రుని రాజధాని అయిన అమరావతి యా? అని హనుమంతుడు చూచి అనుకొనెను.
శ్లో|| ప్రధ్యాయత ఇవాపస్యత్ ప్రదీపాం స్తత్ర కాంచనాన్|
ధూర్తానివ మహాధూర్తై ర్దేవనేన పరాజితాన్||32||
దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ|
అర్చిర్భిః భూషణానాం చ ప్రదీప్తేత్యభ్య మన్యత||33||
స|| కాంచనాన్ ప్రదీపాన్ దేవనేన మహాధూర్తైః పరాజితం ధూర్తానివ సంతి| ప్రధ్యాయత ధూర్తాం ఇవ సంతి || దీపానాం ప్రకాశేన రావణస్య తేజసా చ భూషణానాం అర్చిభిః ప్రదీప్తా ఇతి అమన్యత||
తా|| అక్కడవెలుగుతూవున్న బంగారు దీపములు జూదములో నిపుణులైన జూదరి చేతులలో ఓడిపోయి, మౌనముగా నున్న జూదరులులాగా నిశ్చలముగా వున్నాయి. ఆ దీపముల ప్రకాశము వలన, రావణుని తేజస్సు వలన, ఆ అభరణముల కాంతి వలన, ఆశాల ప్రజ్వలిస్తున్నట్లు ఉండెను.
శ్లో|| తతోఽపశ్యత్కుథాఽఽసీనాం నానావర్ణామ్బరస్రజమ్|
సహస్రం వరనారీణాం నానావేష విభూషితమ్ ||34||
పరివృత్తఽర్థరాత్రే తు పాననిద్రావశం గతమ్|
క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తదా||35||
తత్ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దాన్తరభూషణమ్|
నిశ్శబ్దహంస భ్రమరం యథా పద్మవనం మహత్||36||
స|| తత్ః కుథాసీనమ్ నానావర్ణాంబరస్రజమ్ నానావేషభూషితమ్ వరనారీణామ్ సహస్రం అపశ్యత్ ||రాత్రౌ క్రీడిత్వా ఉపరతం పాననిద్రావశం గతం తదా అర్థరాత్రే పరివృత్తే బలవత్ సుష్వాప||నిఃశబ్దాంతర భూషణమ్ ప్రసుప్తమ్ నిఃశబ్ధాంతర భ్రమరం మహత్ పద్మవనం యథా విరురుచే||
తా|| అప్పుడు హనుమంతుడు తివాచీలపై కూర్చుని ఉన్న అనేక రంగుల వస్త్రములు ధరించిన, అనేక రకములైన వేషములు ధరించిన, వేలకొలదీ వరనారీమణులను చూచెను. ఆ స్త్రీలు రాత్రి క్రీడలలో పాల్గొని పానము వలన కలిగిన నిద్రకు వశులై, అర్ధరాత్రి గడిచిన తరువాత గాఢనిద్రలో వున్నారు. నిశ్శబ్దముగా వున్న ఆభరణములు కల ఆ స్త్రీలతూ నున్న ఆ శాల , నిశ్శబ్దముగా వున్న భ్రమరములు హంసలు ఉన్న పద్మవనము లాగా విరాజిల్లెను.
శ్లో|| తాసాం సంవృతదంతాని మీలితాక్షాణి మారుతిః|
అపశ్యత్ పద్మగన్ధీని వదనాని సుయోషితామ్||37||
ప్రబుద్ధానివ పద్మాని తాసాం భూత్వాక్షపాక్షయే|
పునస్సంవృతపత్త్రాణి రాత్రావివ బభుస్తదా||38||
స|| మారుతిః తాసాం సుయోషితామ్ సంవృతదన్తాని మీలితాక్షాణి పద్మసుగంధిని వదనాని అపస్యత్ || తాసాం క్షపాక్షయే ప్రబుద్ధాని పద్మానివ భూత్వా పునః రాత్రౌ సంవృతపత్రాణివ తదా వభుః||
తా|| మీలితాక్షములతో దంతములు కనపడకుండా వున్న, పద్మగంధము వెదజల్లుతున్న ఆ వర స్త్రీల ముఖములను మారుతు చూచెను. సూర్యోదయమునుండి పద్మముల వలె నున్నా ఆ స్త్రీలు రాత్రి ముడుచుకున్న పద్మములవలె ఉన్నారు.
శ్లో|| ఇమాని ముఖపద్మాని నియతం మత్తషట్పదాః|
అమ్బుజానీవ పుల్లాని ప్రార్థయన్తి పునః పునః||39||
ఇతిచామన్యత శ్రీమాన్ ఉపపత్యా మహాకపిః|
మేనే హి గుణతస్తాని సమాని సలిలోద్భవైః||40||
స|| మత్తషట్పదాః ఇమాని ముఖ్పద్మాని ఫ్హుల్లాని అమ్బ్బుజానివ పునః పునః నియతమ్ ప్రార్థయన్తి ఇతి శ్రీమాన్ మహాకపిః అమన్యత | తాని గుణతః ఉపపత్త్యా సలిలోద్భవైః సమాని మేనే హి ||
తా|| ఆ మహాకపి గుణములు ఆధారముగా ఆ స్త్రీల ముఖములు సలిలములో జనించిన పద్మముల సమానముగా ఎంచి మత్తెక్కిన తుమ్మెదలు మళ్ళి మళ్ళీ ఆ ముఖారవిందములను పద్మములని భ్రమతో నిశ్చయముగా వాలగోరతాయి అని అనుకొనెను.
శ్లో|| సా తస్య శుశుభేశాలా తాభిస్త్రీభి ర్విరాజితా|
శారదీవ ప్రసన్నా ద్యౌః తారాభిరభిశోభితా||41||
స చ తాభిః పరివృతః శుశుభే రాక్షసాధిపః|
యథా హ్యుడు పతిః శ్రీమాం స్తారాభిరభిసంవృతః||42||
స|| తస్య సా శాలా తాభిః స్త్రీభిః విరాజితా | తారాభిః అభిశోభితా ప్రసన్నా శారదీ ద్యౌ ఇవ శుశుభే|| తాభిః పరివృత్తః సః రాక్షసాధిపః తారాభి అభిసంవృత్తః శ్రీమాన్ హ్యుడుపతిః ఇఅవ శుశుభే||
తా|| ఆ రాక్షసేంద్రుని యొక్క ఆ శాల ఆలాగ స్త్రీలతో్, తారలతో కూడి శోభిస్తున్న నిర్మలమైన శరత్ రాత్రివలె, విరాజిల్లెను. ఆ స్త్రీలతో చుట్టబడి ఆ రావణుడు తారలతో చుట్టబడి వెలుగుచున్న చంద్రుడిలా వెలుగుచుండెను.
శ్లో|| యాశ్చ్యవన్తేఽమ్బరాత్తారాః పుణ్యశేష సమావృతాః|
ఇమా స్తా స్సంగతాః కృత్స్నా ఇతి మేనే హరిస్తదా||43||
తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషామ్|
ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితామ్||44||
స|| యాః తారాః పుణ్యశేష సమవృత్తాః అమ్బరాత్ చ్యవన్తే తాః కృత్స్నాః ఇమాః సంగతాః ఇతి తదా హరిః మేనే || తత్ర యోషితామ్ ప్రభావర్ణ ప్రసాదః చ శుభార్చిషామ్ మహతీనామ్ తారాణామివ సువ్యక్తమ్ విరేజుః||
తా|| ఆ స్త్రీలు పుణ్యము క్షీణించిపోగా భూమి మీద పడిన తారలవలె నున్నారని హనుమంతుడు తలచెను. అక్కడ ఆ వరస్త్రీల రంగులు, కాంతి, ప్రసన్నతా, శుభమైన కాంతి ని ప్రసరించే మహత్తరమైన తారల వలె ప్రకాశిస్తున్నవి.
శ్లో|| వ్యావృత్తగురు పీనస్రక్ప్రకీర్ణ వరభూషణాః|
పానవ్యాయమకాలేషు నిద్రాపహృతచేతసః||45||
వ్యావృత్త తిలకాః కాశ్చిత్ కాశ్చిదుద్భ్రాన్తనూపురాః|
పార్శ్వే గళితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితాః||46||
స|| ( సా) పానావ్యాయమ కాలేషు వ్యావృత్త గురుపీన స్రక్ప్రకీర్ణ వర భూషణాః నిద్ర అపహృత చేతసః సన్తి|| కశ్చిత్ పరమయోషితః వ్యావృత్త తిలకాః కశ్చిత్ ఉద్భ్రాన్తనూపురాః కశ్చిత్ పార్శ్వే గళితహారాః చ ||
With jewels displaced and garlands scattered after drinking and sexual exercise they had minds dazed in slumber. A few had their Vermilion marks smudged, a few had anklets let loose and a few had necklaces one one side.
తా|| పానక్రీడల సమయములో ధరించిన ఆభరణములు చెల్లాచెదరై వున్న ఆ స్త్రీలు అదమరచి నిద్రిస్తున్నారు. కొందరు వరస్త్రీల తిలకము రేగి పోయి ఉన్నది. కొందరి నూపురములు స్థానము తప్పాయి. కొందరి హారములు పక్కకి జారి పడి ఉన్నాయి.
శ్లో|| ముక్తాహారాఽవృతా శ్చాన్యాః కాశ్చిత్ విస్రస్తవాససః|
వ్యావిద్దరశనాదామాః కిశోర్య ఇవ వాహితాః||47||
సుకుణ్డలధరాశ్చాన్యా విచ్ఛిన్నమృదితస్రజః|
గజేన్ద్రమృదితాః పుల్లా లతా ఇవ మహాననే||48||
స|| అన్యాః ముక్తాహారావృతాః కాశ్చిత్ విస్తత్రవాససః వ్యావిద్ధరశనాదామాః వాహితాః కిశోర్యాః ఇవ ఆసీత్|| సుకుణ్డలధరాః అన్యాః విచ్ఛిన్నమృదితస్రజాః మహావనే గజేంద్రమృదితాః ఫ్హుల్లాః లతా వ ఆసీత్ ||
తా|| మరికోందరు తెగిన ముత్యాలహారముల కలవారై ఉన్నారు. కొందరి వస్త్రములు జారిపోయి ఉన్నాయి. కొందరి మొలనూళ్ళు తెగి పోయిఉన్నాయి. కొందరు అలసటతీర్చుకోడాఅనికి శయినిస్తున్న ఆడ గుఱ్ఱములవలె నున్నారు. మంచికుండలములను ధరించిన అస్త్రీలు కొందరు మహారణ్యములో గజేంద్రునిచే చెల్ల చెదరు చేయబడినా కాని వికసిస్తున్న లతల వలె నున్నారు.
శ్లో|| చన్ద్రాంశుకిరణాభాశ్చ హారాః కాసాంచిదుత్కటాః|
హంసా ఇవ బభుః సుప్తాః స్తనమధ్యేషు యోషితామ్||49||
అపరాసాం చ వైఢూర్యాః కాదమ్బా ఇవ పక్షిణః|
హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవాభవన్||50||
కాసాంచిత్ యోషితాం స్తనమధ్యేషు ఉత్కటాః చంద్రాంశుకిరణాభాః చ హారాః సుప్తాః హంసా ఇవ బభుః|| పరాసాంశ్చ వైడూర్యాః పక్షిణః కాదమ్బాః ఇవ అన్యాసామ్ హేమసూత్రాణి పక్షిణః చక్రవాకా ఇవ||
తా|| కొందరు వరస్త్రీలు స్థనముల మధ్య వెలుగుచున్న హారములతో చంద్రకిరణముల కాంతిలో నిద్రిస్తున్న హంసల వలె ఉన్నారు. కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్యములు కాదంబపక్షుల వలెను, కొందరు ధరించిన సువర్ణ సూత్రాలు చక్రవాక పక్షులవలెను కనిపిస్తున్నాయి.
శ్లో|| హంసకారణ్డవాకీర్ణాః చక్రవాకోపశోభితాః|
ఆపగా ఇవ తా రేజుర్జఘనైః పులినైరివ||51||
కిఙ్కిణీ జాల సంకోశాస్తా హైమవిపులాంబుజాః|
భావగ్రాహా యశస్తీరాః సుప్తానద్య ఇవాఽఽబభుః||52||
స|| జఘనైః పులినైః ఇవ తాః హంసకారణ్డవాకీర్ణాః చక్రవాకోపశోభితాః ఆపగా ఇవ రేజుః|| సుప్తాః కింకిణీజ్వాలసంకోశాః హైమవిపులామ్బుజాః భావగ్రాహాః యశస్తీరాః నద్యా ఇవ ఆబభుః||
తా|| ఇసుకతిన్నెలవలె విశాలమైన జఘనములు కల ఆ స్త్రీలు హంసకారండవ చక్రవాక పక్షులచే విరాజిల్లు నదులవలె శోభిస్తున్నారు. చిరుమువ్వలుగల మొలతాళ్ళను, బంగారు ఆభరణములు ధరించి నిద్రిసున్న ఆ స్త్రీలు పెద్ద పద్మములు లాగా, శృంగార చేష్టలలో ఏర్పడ్డ నఖగాట్లే మొసళ్ల గా, వారి యశస్సులే తీరాలుగా, గలిగిన నదులవలె ఒప్పారు.
శ్లో|| మృదుష్వఙ్గేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః|
బభూవుర్భూషణా నీవ శుభా భూషణరాజయః||53||
అంశుకాన్తాశ్చ కాసాంచిన్ ముఖమారుతకంపితాః|
ఉపర్యుపరివక్త్రాణాం వ్యాధూయన్తే పునః పునః||54||
స|| కాసాంచిత్ మృదుషు అంగేషు కుచాగ్రేషు చ సంస్థితాః శుభాః భూషణరాజయః భూషణానీవ బభూవుః || కాసాంచిత్ ముఖమారుతకంపితాః అంశుకాంతాశ్చ వక్త్రాణాం ఉపరి ఉపరి పునః పునః వ్యాధూయన్తే||
తా|| మృదువైన అంగములు కల కొందరు వారి అంగముల మీద కుఛములమీద పడిన ఆభరణముల ముద్రలతో వారే ఆభరణముల వలె ఒప్పారుచున్నారు. కొందరు స్త్రీల ముఖములపై శ్వాస నిశ్వాసల గాలితో వారి పయ్యెద కొంగులు మళ్ళీ మళ్ళీ పడుతున్నాయి.
శ్లో|| తాః పతాకాఇవోద్ధూతాః పత్నీనాం రుచిరప్రభాః|
నానావర్ణ సువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే||55||
వవల్గుశ్చాత్ర కాసాంచిత్ కుణ్డలాని శుభార్చిషామ్|
ముఖమారుత సంసర్గాన్ మన్దం మన్దం సుయోషితామ్||56||
స|| నానావర్ణసువర్ణానాం పత్నీనామ్ వక్త్రమూలేషు తాః రుచిరప్రభాః ఉధ్దూతాః పతాకాః ఇవ రేజిరే|| శుభార్చిషామ్ కాసాంశ్చిత్ యోషితాం కుణ్డలాని అత్ర ముఖ మారుత సంసర్గాత్ మన్దం మన్దం వవల్గుశ్చ||
తా|| అనేకమైన మంచి రంగులు కల అ స్త్రీల ముఖములపై వస్త్రాంతములు రెపరెపలాడుచూ ఎగురుచున్న పతాకములవలె నున్నవి. కోందరి స్త్రీల కర్ణాభరణములు ఊచ్చ్వాస నిశ్వాసాలతో మెల్లిగా మెల్ల్లిగా ఊగుచూఉన్నాయి.
శ్లో|| శర్కరఽసన గన్ధైశ్చ ప్రకృత్యా సురభిస్సుఖః|
తాసాం వదననిశ్వ్యాసః సిషేవే రావణం తదా||57||
రావణాననశఙ్కాశ్చ కాశ్చిత్ రావణయోషితః|
ముఖాని స్మ సపత్నీనాం ఉపాజిఘ్రన్ పునః పునః||58||
స||తదా ప్రకృత్యా శర్కరాసవగంధైశ్చ సురభిః సుఖః తాసామ్ వదననిఃశ్వాసః రావణం శిషేవే|| కశ్చిత్ రావణ యోషితాః రావణానన శంకాశ్చ పునః పునః సపత్నీనామ్ ముఖాని ఉపాజిఘ్రన్||
తా|| అప్పుడు స్వాభావికముగా పరిమళభరితమైన ముఖమునుంచి వచ్చువారి శ్వాసలు రావణుని కి సేవచేస్తున్నాయి. కోందరు రావణ స్త్రీలు రావణుడే అనుకొని మళ్ళీ మళ్ళీ సపత్నుల ముఖములను ముద్దుపెట్టుకొనసాగిరి.
శ్లో|| అత్యర్థం సక్తమనసో రావణే తా వరస్త్రియః|
అస్వతన్త్రాః సపత్నీనాం ప్రియమేవాఽఽచరం స్తదా||59||
బాహూన్ ఉపవిధాయాన్యాః పారిహార్యవిభూషితాన్|
అంశుకాని చ రమ్యాణి ప్రమదాస్తత్ర శిశ్యిరే||60||
స|| రావణే అత్యర్థం సక్త మనసః తా వరస్త్రియః అస్వతంత్రాః తదా సపత్నీనామ్ ప్రియమేవ ఆచరన్ ||అన్యాః ప్రమదాః పరిహార్య విభూషితాన్ బాహూన్ రమ్యాణి అంశుకాని ఉపనిధాయ శిశ్యిరే||
తా|| రావణునిపై అమితమైన ప్రేమగల ఆ వర స్త్రీలు భ్రమతో చెంతనున్న సపత్నులకు ప్రేమను చేకూర్చారు. ఇంకా కొందరు ఆభరణములతో నున్న తమ బాహువులను తలగడగా చేసుకొని నిద్రిస్తున్నారు.
శ్లో|| అన్యావక్షసి చాన్యస్యాః తస్యాః కాశ్చిత్ పునర్భుజమ్|
అపరాత్వఙ్క మన్యస్యాః తస్యాశ్చాప్యపరాభుజౌ||61||
ఊరుపార్శ్వకటీ పృష్ఠం అన్యోన్యస్య సమాశ్రితాః|
పరస్పరనివిష్టాఙ్గ్యో మదస్నేహవశానుగాః||62||
అన్యోన్యభుజసూత్రేణ స్త్రీమాలాగ్రథితా హి సా|
మాలేన గ్రథితా సూత్రే శుశుభే మత్తషట్పదా||63||
స|| అన్యాః అన్యస్యాః వక్షసి కాచిత్ పునః తస్యాః భుజం అపరా అన్యస్యాః అంకం అపరా తస్యాః భుజౌ శిశ్యిరే|| మదస్నేహవశానుగాః అన్యోన్యస్య ఉరుపార్శ్వకటీపృష్ఠం సమాశ్రితాః పరమనివిష్టాంగ్యః శిశ్యిరే|| అన్యోన్య భుజసూత్రేణ గ్రథితా సా స్త్రీమాలా సూత్రే గ్రథితా మత్తషట్పదాః మాలేవ శిశ్యిరే ||
తా|| ఒకరు ఇంకొకరి వక్షస్తలముపై , కొందరు మళ్ళీ ఇంకొకరి భుజముపై, ఇంకొకరు ఇంకొకరి తోడపై తల పెట్టి నిద్రిస్తున్నారు. మద్యపానము వలన స్నేహము కలవారై, స్త్రీలు ఒకరికొకరి తలలు ఇతరుల వక్షములు భుజములు తోడలపై ఆన్చి చేతులు పెట్టి పడుకుని ఉన్నారు. ఒకరికొకరి భుజములు మాలలాగా కట్టబడినట్లున్న ఆ స్త్రీలు మదించిన తుమ్మెదలతో దారముతో గుచ్చబడిన పుష్పహారము వలె ప్రకాశిస్తున్నారు.
శ్లో|| లతానాం మాధవే మాసి పుల్లనాం వాయుసేవనాత్ |
అన్యోన్యమాలాగ్రథితం సంసక్త కుసుమోచ్చయమ్||64||
వ్యతివేష్టిత సుస్కన్ధం అన్యోన్యభ్రమరాకులమ్|
ఆసీద్వన మివోద్ధూతమ్ స్త్రీవనం రావణస్య తత్||65||
స|| అన్యోన్యమాలాగ్రథితమ్ సంసక్త కుసుమోచ్చయమ్ వ్యతివేష్టిత సుస్కంధం అన్యోన్య భ్రమరాకులమ్ రావణస్య తత్ స్త్రీవనం మాఘవే మాసి వాయుసేవనాత్ ఫుల్లానామ్ లతానామ్ అన్యోన్యమాలాగ్రథితమ్ అన్యోన్యభమరాకులమ్ ఉద్ధతమ్ వనమ్ ఇవ ఆసీత్ ||
తా|| ఒకరిపైనొకరు పెనవేసికొనిన కుసుమముల వలె భుజములు పరస్పరము చుట్టుకొని భ్రమరములవలె నున్న అ రావణుని స్త్రీల వనము మాఘమాసములో వాయుసంచారముచే పుష్పించిన భ్రమరములతో నిండిన, లతావనములో కలిసిన తీగలవలెనున్న వనమును తోపింపచేయుచున్నది.
శ్లో|| ఉచితేష్వపి సువ్యక్తం న తాసాం యోషితాం తదా|
వివేకశ్శక్య ఆధాతుం భూషణాఙ్గామ్బరస్రజామ్||66||
రావణేసుఖసంవిష్టే తా స్స్త్రియో వివిధ ప్రభాః|
జ్వలన్తః కాఞ్చనా దీపాః ప్రైక్షంతాఽనిమిషా ఇవ||67||
స||తదా తాసాం యోషితామ్ భూషణాంగాంబర స్రజామ్ వివేకః సంయుక్తం ఆధాతుమ్ ఉచితేష్వపి న శక్యః|| రావణే సుఖసంవిష్టే వివిధప్రభాః తాః స్త్రియః జ్వలంతః కాంచనాః దీపాః ఇవ అనిమిషాః ప్రేక్షంత ఇవ ఆసీత్||
తా|| అప్పుడు ఆ వరాంగనల ఆభరణములు అంగములు వస్త్రములు వివేకముకలవాడు కూడా ఎవరివో ఏవో చెప్పడానికి శక్యము కాదు. రావణుడు సుఖముగా నిద్రిస్తూ ఉన్నప్పుడు జ్వలిస్తున్న ఆదీపములు తదేకముగా ఆ స్త్రీలను చూస్తున్నవా అన్నట్లు ఉన్నవి.
శ్లో|| రాజర్షిపితృదైత్యానాం గన్ధర్వాణాం చ యోషితః|
రాక్షసానాం చ యాః కన్యాః తస్య కామవశం గతాః||68||
యుద్ధకామేన తా స్సర్వా రావణేన హృతా స్త్రియః|
సమదా మదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః||69||
స||రాజర్షి పిత్రుదైత్యానామ్ గంధర్వాణాం యోషితః రాక్షసానామ్ యాః కన్యాః తస్య కామవశానుగతాః || సర్వాః తాః స్త్రియః యుద్ధకామేన రావణేన హృతాః సమదాః కాశ్చిత్ మదనేన మోహితాః ఏవ ఆగతాః||
రాజర్షుల స్త్రీలు, పితరుల అతివలు, దైత్యాంగనలు, గంధర్వ కాంతలు, రాక్షస కన్యలు అతని పై కామము చే వశులై ఉన్నారు. ఆ స్త్రీలు యుద్దములో జయించి తీసుకు రాబడిన వారు, కొందరు మదనోన్మత్తముచే ప్రేరేపింపబడినవారు ఉన్నారు.
శ్లో|| న తత్ర కాచిత్ ప్రమదా పసహ్య
వీర్యోపపన్నేన గుణేన లబ్ధా|
న చాన్యకామాపి న చాన్యపూర్వా
వినా వరార్హం జనకాత్మజాం తామ్||70||
స|| వరార్హం తాం జనకాత్మజాం వినా తత్ర కాశ్చిత్ ప్రమదా వీర్యోపపన్నేన ప్రసహ్య లబ్ధా న గుణేన అన్యకామాపి చ న అన్యపూర్వాచ న ||
తా|| అత్యుత్తమురాలైన సీత తప్ప ఆ స్త్రీ సమూహములో తన పరాక్రమముచే బలాత్కారముగా తీసుకువచ్చినవారు ఎవరూ లేరు, ఇతరులపై కామము ఉన్నవారు ఎవరూ లేరు, పూర్వమే ఇంకొకరి ప్రియురాలిగా ఉన్నవారు ఎవరూ లేరు.
శ్లో|| న చాకులీనా న చ హీనరూపా
నాదక్షిణా నానుపచారయుక్తా|
భార్యాభవత్తస్య న హీనసత్త్వా
న చాపి కాన్తస్య న కామనీయా||71||
స|| తస్య భార్యా అకులీనా న చ అభవత్ | హీనరూపాచ న | అదక్షిణా చ న | అనుపచారయుక్తా చ న || హీనసత్త్వా చ న | కాన్తస్య న కామనీయా||
తా|| అతని భార్యలలో అకులీనులు లేరు. రూపము లేని వారు లేరు. యోగ్యతలేని వారు లేరు. ఉపచారము చేయతగని వారు లేరు. బుద్ధిహీనులు లేరు. ఆకాంతలలో ఎవరూ కామించతగని వారు లేరు.
శ్లో|| బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య
యదీదృశీ రాఘవ ధర్మపత్నీ|
ఇమా యథా రాక్షసరాజ భార్యాః
సుజాతమస్యేతి హి సాదుబుద్ధేః||72||
స|| ఇమాః రాక్షసరాజభార్యాః యథా రాఘవపత్నీ ఈదృశీ అస్య సుజాతమ్ ఇతి సాధుబుద్ధేః హరీశ్వరస్య బుద్ధిస్తు బభూవ ||
తా|| ఈ రాక్షస భార్యలలాగా రాఘవపత్ని కూడా ఇలాగే ఉంటే ఎంత శుభకరముగా నుండునో అని ఆ వానరోత్తముని మదిలో ఆలోచన వచ్చెను.
శ్లో|| పునశ్చ సోఽచింతయ ధార్తరూపో
ధ్రువం విశిష్టా గుణతో హి సీతా|
అధాయ మస్యాం కృతవాన్ మహాత్మా
లఙ్కేశ్వరః కష్ట మనార్యకర్మ||73||
స||సః ఆత్తరూపః పునశ్చ అచిన్తయత్ సీతా ధ్రువం గుణతః విశిష్ఠా అథ మహాత్మా అయం లఙ్కేశ్వరః అస్యాం అనార్యం కృతవాన్ కష్టమ్||
తా||హనుమంతుడు మళ్ళీ దుఃఖిస్తూ ఇలా అనుకొన్నాడు." సీతాదేవి నిస్సంశయముగా సద్గుణ సంపన్నురాలు. అయినప్పటికీ లంకాధిపతి అయిన రావణుడు ఆమె విషయములో హీనముగా వ్యవహిరించెను.ఎంత కష్టము"
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే నవమస్సర్గః||
||ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో తొమ్మిదవ సర్గ సమాప్తము||
||ఓమ్ తత్ సత్||