మా తెలుగు సంచిక !!
సెప్టెంబరు 1, సేమ్యా పరమాన్నము 2019
||కలగాపులగం లో సేమ్యాపరమాన్నము ||
"కలగాపులగం లో సేమ్యాపరమాన్నము"
మళ్ళీ సెప్టెంబరు 1 వచ్చింది.
అంటే ఈ రోజు అమ్మ చేసే సేమ్యాపరమాన్నము రోజు.
చిన్నతనములో ఆ సేమ్యా పరమాన్నమే ముఖ్యముగా వున్నా,
ఇప్పుడు అందరము ఆ సేమ్యాపరమాన్నము కన్నా
దాని లానే ఆనందము కలిగించేది ఏమీటా అనే అలోచనలో ఉంటాము.
ప్రతిసంవత్సరము సేమ్యాపరమాన్నము ఎదో రూపములో కనపడేది
ఈ సారి పరమాన్నము గురుంచి అలోచిస్తున్న సమయములో మనస్సులో చాలా కదిలాయి.
ఈ సంవత్సరమంతా జరుగుతున్న సుందరకాండ తత్త్వదీపిక ఒకటి.
ఇంకోటి దాదాపు ఆరునెలలనుంచి ప్రయత్నరూపముమలో ఉండి ,
ఈ సంచికలో వస్తున్న కథ,
సంతోషము కలిగించిన కథ,
రఘువంశములోని కథ, అదే గురుదక్షిణ.
హిమాలయాలలో ఎవరెస్ట్ శిఖరపాదాలదగ్గరకి వెళ్ళేబేస్ కేంపు ట్రెక్ లో
హిమాలయాలతో సంభాషణ అది మరింకోటి.
వీటన్నిటితో బాటు కాసరబాద ట్రస్టు ద్వారా పదిహేనుమంది విద్యార్థులకు
పారితోషిక మూల్యాలు ఇవ్వగలగడము ఇంకోటి.
ఇవన్నీ ఏదో కలగాపులగము లాగా వున్నా
ఇవేనా ఈ సారి మా సేమ్యా పరమాన్నము అనిపించింది.
సంవత్సరమంతా జరిగిన సుందరకాండ తత్త్వదీపిక.
ఇప్పుడు తత్త్వదీపిక ఏభైఏడవ సర్గలో వుంది
ఈ సర్గలో సన్నివేశము ఎంతో సంతోషకరము.
వానరులందరూ సంతోషముతో గంతులు వేశిన సర్గ
హనుమ దక్షిణ దిక్కునుంచి వెనక్కి తిరిగి ఉత్తర దిశలోపోయి,
మళ్ళీ మహేంద్ర పర్వతము చేరి,
వేచి యున్న వానరులకి చెపుతాడు శుభ వార్త.
సీతమ్మను చూశాను అని .
అంతే వానరుల సంతోషభరిత కుప్పిగంతులకు ఆ మాటే చాలు.
అది చూస్తూ మా మనస్సుకూడా కుప్పిగంతులు వేసింది.
హనుమ సీతమ్మకి రామకథ వినిపించినపుడు,
హనుమ తోకకి నిప్పుపెట్టి లంకలో తిప్పినపుడు,
తత్త్వదీపికలో మనస్సు కుప్పిగంతులు వేసింది.
తెలుగు ఎప్పుడూ చదవకపోయినా
తెలుగులో ఎప్పుడూ రాయకపోయినా
తత్త్వదీపిక లో రాసినవాటిని చదివి
మళ్ళీచదివాలనిపించి
ఆనందము పొందిన రోజులున్నాయి.
ఇదేనా మాసేమ్యాపరమాన్నము అన్న మాటకి సమాధానము
అవును ఈ సంవత్సరపు తత్త్వదీపికే మా సేమ్యాపరమాన్నము అని.
ఈ వారము అందరూ చూసే కథ "గురుదక్షిణ".
ధరణీసుడు రఘుమహరాజు, వరతంతుడనే గురువు, బ్రహ్మచారి కౌత్సుడు అనే శిష్యుడు
వారి ముగ్గిరి కథ.
దాంట్లో ధనము యొక్క మూట మీద వస్తాయి వాగ్విదాలు.
అప్పుడు వశిష్ఠ మహాముని చిన్నరాయబారము చేస్తాడు.
సమస్య తీర్చిన వశిష్ట మహాముని ఆనతిన
"పూర్ణాను మోదంబుగా నరనాధుండు కొలువు దీర్చి
ధనము న్యాయార్హమౌ శాశనంబున నిధిగా నిల్పుటకై ఏర్పాటు చేసె.
ఈ సత్కార్యము పొందె పురప్రజల మెప్పు".
అంటే వశిష్టమహాముని రాజు చేత ఒక ట్రష్టు ఏర్పాటు చేశాడన్నమాట.
ఇది అమ్మకి నచ్చిన కథ.
ఇది అమ్మచెప్పిన కథ
సుబ్బులక్కయ్య ద్వారా వచ్చిన కథ.
ఈ కథ చదివి చదివి ఇదే మా సేమ్యాపరమాన్నము అనిపించిన కథ.
హాస్యస్పదముగా ఎవరెస్ట్ బేస్ కేంప్ వెళ్దామనుకోవడము నిజం అవడము,
పిల్లలిద్దరితో బయలుదేరి హిమాలయాలలో వాళ్ళకేవో చెపుదామనుకొని,
మధ్యలో ఆగిపోయి హిమాలయాలతో సంభాషణ అయింది.
అగిన చోట ఒక స్తూపము,
దాని చుట్టూ నూట ఎనిమిది మంత్రాలు గల చక్రాలు వున్నాయి.
ఆగిన ఐదు రోజులూ రోజూ జయమంత్రము చదువుతూ ఆ చక్రాలు తిప్పుతూ
మూడు సార్లు ప్రదక్షిణము చేసి హిమాలయ శిఖరాల మధ్యలో కూర్చుని తెలిసికున్నది,
ఇప్పుడు ఇది నిజమైన వానప్రస్థము అని.
ఎవరికీ చెప్పవలసినది ఏమీ లేదు అని.
మనము తెలుసుకోవలసినవి చాలావున్నాయి అని.
పరీక్షిత్తు వేసిన ప్రశ్న దాని సమాధానము మనకోసమే అని.
అంతా అర్థము చేసికున్నా,
పిల్లలు ఎవరెస్ట్ శిఖరప్రాంగళము చేరుతున్నారు, చేరారు అనే
మాటలు వింటూ మనస్సు కుప్పిగంతులు వేసింది.
ఇది కూడా మా సేమ్యాపరమాన్నమే.
ఈ సంవత్సరము కాసరబాద ట్రస్టుద్వారా
పదహరుమంది విద్యార్థులకు ఒక ఆచార్యులవారికి
పారితోషిక మూల్యములు ఇవ్వబడుతున్నాయి.
ఇది జరగడమునకు వెనకాతల ఎంతో మంది వున్నారు.
గత సంవత్సరములో ఒకరు లక్షరూపాయలు,
ఒకరు డెబ్బైరెండువేలు ,ఇంకొకరు ముప్పైఆరువేలు ఇచ్చి
ఫౌండేషను పునాదులు ఇంకా పటిష్ఠము చేశారు
గురుదక్షిణ చదువుతూ , ఇదే అమ్మానాన్నగారికి మనందరి గురుదక్షిణ.
ఇదే ఈ సంవత్సరపు సేమ్యా పరమాన్నము అనిపించింది
సుందరకాండలో హనుమ అదృష్టము అనే మాట అనేక సార్లు ప్రయోగిస్తాడు.
అదృష్టము కొలదీ వానరులకు రాజ్యము లభించినది
అదృష్టము కొలదీ సీతమ్మ కనపడినది.
అదృష్టము కొలదీ ఆమె క్షేమముగా వున్నది.
అదృష్టము కొలదీ లంక దహింపబడినా ఆమె క్షేమమే.
చేసినది తనే అయినా జరిగినది అదృష్టము అనుకోవడములో
కర్మ భగవానుడికి అర్పించాడన్నమాట.
అలాగే ఓబామా ఒకసారి మాట్లాడుతూ
తనకు చాలా సార్లు అదృష్టము కలిసివచ్చినది.
అది తనకన్న తక్కువ అదృష్టవంతులను ఆదరించమని చెప్పిందన్నాడు.
ఈ కాసరబాద కథనములో అయినవన్నీ అదృష్టమే
అదే మా అసలు సిశలు సేమ్యా పరమాన్నము.
|| ఓమ్ తత్ సత్||
|| ఓమ్ తత్ సత్||
||ఓమ్ తత్ సత్||
.
|