||భగవద్గీత ||
||దశమోధ్యాధ్యాాయము||
||క్లుప్తముగా విభూతి యోగము
||
|| ఓమ్ తత్ సత్||
శ్రీమద్ భగవద్గీత
విభూతి యోగము
పదియవ అధ్యాయము
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
విభూతి యనగా ఐశ్వర్యము మహిమాతిశయము
నిరంతరాత్మ దృష్టికొరకు భగవద్విభూతి గూర్చిన విజ్ఞానము సహాయకారిగా నుండగలదు . అర్జునుడు భగవంతుని వాక్యము అత్యంత శ్రద్ధతో వినుటవలన భగవంతుడుపరమప్రీతితో పరమార్ధ జ్ఞానము బోధించెను.
శీకృష్ణుడు బోధించిన విషయము
- భగవద్విభూతి గురించి అందరికీ తెలియదు
- ఏందుకు అంటే పరమాత్మ ఆ దేవతలకు మహర్షులకు కూడా మొదటివాడు
- బుద్ధి జ్ఞానము మోహరాహిత్యము ఓర్పు సత్యము ఇన్ద్రియ నిగ్రహము సుఖము దుఃఖము పుట్టుక నాశము భయము భయములేకుండుట అహింస సమత్వము సంతుష్టి తపస్సు జ్ఞానము ననావిధములైన గుణములు నా వలననే కలుగుచున్నవి
- సప్త మహర్షులు సనకాదులు మనువులు పదునలుగురున్నూ తన వలననే పుట్టిరి సమస్త ప్రజలున్నూ తాము అల్పజాతికి చెందిన వారనిదిగులుపడనవసరము లేదు ఏ జాతికి మతము నకు వర్ణమునకు చెందినవారైనను మహర్షులసంతానమని మహర్షుల రక్తము అందరియందు ప్రవహించు చున్నదనీ పరమసంతిని పొందవలెను నాపూర్వీకులు మహర్షులు మనువులు సనకాదులని ఘంటాపధముగా చెప్పవలెను తాను పవిత్రుడనీ శుద్ధుడనీ ప్రతిదినము తలచుకొనీ సంసార బంధ విముక్తికొరకు ప్రయత్నము చేయవలెను
- పరమాత్మవలననే జగత్తంతయూ నడచు చున్నది. భగవంతుని యందు మనస్సు అర్పించినవారు ప్రాణములు ఇంద్రియములూ అర్పించినవారు ఒకరికొకరు బోధించుకొనుచూ ఎల్లకాలమూ పరమానందమును పొందుదురు "
- అట్టి వారికి " నేను ( పరమాత్మయే) బుద్ధి యోగమును ఇచ్చుచున్నాను". అనగా భగవానుడు తన కరకమలములతో గొప్ప పురస్కారము అంటే బుద్ధి యోగమును ప్రసాదించు చున్నాడు . బుద్ధియోగము ద్వారా జనులు ఆత్మా అనాత్మ విచారణ ద్వారా జ్ఞానయోగము పొంది శరీరము ఉపాధిని ఆత్మ నుండి వేరుచేయు యోగము . ఆత్మపంచకోశాంతర్గతముకదా.
అర్జునుడు అడుగుతాడు.
- బాహ్యముగా విగ్రహమును పూజ చేయుచున్నమాకు అంతరంగమున కల పరమాత్మ ను ఎట్లు పొందగలము ?
- ఏ ప్రకారముగా ధ్యానము చేయుచూ పరమాత్మని తెలిసికొనగలము
అని ప్రశ్నలన్నిటికి భగవానుడు సమాధానము చెప్పుతాడు.
- ఓ జీవుడా ! కొంతకాలము ఏదియో రూపము సేవింపుము ప్రీతితో భక్తితో శ్రద్ధగా సేవింపుము నేను సంతుష్టుడనై ఆత్మానాత్మ విచారణకు ప్రజ్ఞాపాటవమును ఒసంగెదను నన్నుతప్పక పొందగలవు అని చెప్పెను. అంటే మోక్షమునకు భక్తి యోగము జ్ఞానము రెండు అవసరమే. దాసోహం అనిన కొన్నాళ్లకి సోహమగును.
అర్జునుడు అడుగుచున్నాడు "ఓ యోగేశ్వరా దివ్యమగు నీ మహిమలను తెలియగోరుచున్నాను అది నీవే చెప్పగలవు" అని.
అప్పుడు కృష్ణ భగవానుడు తన విభూతులకి అంతము లేదు అని , కాని ప్రాధాన్యత ప్రకరము చెపుతాను అని తన్ విభూటులను గురించి చెపుతాడు. :
" ఓ అర్జునా | సమస్త ప్రాణులయందు ప్రత్యగాత్మను నేనే. సమస్త ప్రాణుల ఆదిమధ్య అంతము నేనే.
- విష్ణువు మరీచి చంద్రుడు సామవేదము ఇంద్రుడు మనస్సు ప్రాణులలో చైతన్యము శంకరుడు కుబేరుడు అగ్ని మేరువు బృహస్పతి కుమారస్వామి సముద్రమును భృగుమహర్షి ని ప్రణవమును జపయజ్ఞమును హిమాలయపర్వతము రావి చెట్టు నారదుడను గంధర్వులలో చిత్ర రధు డను సిద్ధులలో కపిల మునిని నేనే అయి ఉన్నాను. ఉచ్చైశ్రవమను గుర్రమును ఐరావతమును మనుష్యులలో రాజుగ నున్న నన్ను తెలిసికొనుము. వజ్రాయుధము కామధేనువు ధర్మ బద్ధమగు సంతానోత్పత్తికి కారణమగు మన్మధుడను సర్పములలో వాసుకి అయి ఉన్నాను. ఇంకను నాగులలో అనంతుడు, వరుణుడు, పితృదేవతలలో ఆర్యముడు, యముడును నేనే. అసురులలో ప్రహ్లాదుడను లెక్కపెట్టువారిలో కాలము. సింహము గరుత్మంతుడు వాయువును శ్రీరామచంద్రుడను మొసలిని గంగానది నేనే. ఆది మధ్య అంతము నేనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్య వాదించువారిలో రాగద్వేషరహిత వాదము అకారమును ద్వంద్వ సమాసము సర్వకర్మప్రదాతను నేనే. మృత్యువు పుట్టుక స్త్రీలలొ కీర్తి సంపద వాక్కు స్మృతి ధారణాశక్తి జ్ఞానము బుద్ధి ధైర్యము ఓర్పుఅను గుణములు నేనే అయి ఉన్నాను. సామవేద గానములలో బృహత్సామము చంధస్సులలో గాయత్రియును మాసములలొ మార్గశిర్షము ఋతువులలో వసంతఋతువు నేనే. పంచక వ్యాపరములలో జూదము తేజోవంతులలో తేజస్సు జయమును ప్రయత్నమును సత్వగుణము నేనే అయిఉన్నాను.
- వృష్ణి వంశీయులలో వాసుదేవుడను పాండవులలో అర్జునుడు వేదవ్యాస మునిని శుక్రా చార్యుడను నేనే.
- దండనము నీతియు మౌనము జ్ఞానవంతులలో జ్ఞానము సమస్త ప్రాణి కోట్లకీ మూలకారణము నేనే.
చివరి మళ్ళీ చెప్పిన మాట:
" ఓ అర్జునా| నావిభూతులకు అంతము లేదు ఐశ్వర్యయుక్తమైనది కాంతివంతమైనదీ ఉత్సాహముతో కూడుకొనినదీ అన్నియూ నాతేజస్సువలననే కలిగినవి అనీ తెలుకొనుము"
అన్వయము:
సమస్త ప్రాణికోట్ల లో వ్యాపించిన ప్రత్యగాత్మను నేనే. అనగా జీవాత్మయే పరమాత్మ అనుఅఖండ జ్ఞానబోధ మహావాక్యము చెప్పబడినది. అనగా పంచకోశములనుండి తనను వేరుచేసుకొని దేహేంద్రియమనోబుద్ధులకు సాక్షిగానున్న ప్రత్యగాత్మను సాక్షాత్కరించుకొనవలెను. తాను అల్పుడకాననీ పర బ్రహ్మస్వరూపుడననీ విశ్వాసము డృఢపరచుకొనీ పరప్రాణిసేవమాధవ సేవయే యని భావించవలెను. పరమాత్మ భక్తుని నిర్మలభక్తి చే అతని బుద్ధిలో జ్ఞానబీజము నాటును. మన భావనలు ఎంతోనిర్మలముగా యుండవలెను. ప్రతి చెడు ఆలోచనలకీ చెడు వ్యవహారములకు ఎన్నియో సమస్యలూ ఆపదలూ కర్మఫలముగా అనుభవించవలసివచ్చును. భగవర్నిర్ణయమును ఎవ్వరూ మార్చలేరు. ధర్మముననుసరించి ఫలితములు నొసగున్యాయస్థానము భగవంతుడే అని మనము తెలుసుకొని ధర్మముననుసరించీ చిత్తశుద్ధికై తపింపవలెను.
||ఓం తత్ సత్ ||