||భగవద్గీత ||

|| పదునాలుగవ అధ్యాయము ||

||గుణత్రయ విభాగయోగము - శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో !!

||ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్|
యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః||1||
"దేనిని తెలిసికొని మునులందఱూ ఈ సంసారబంధమునుంచి పరమోత్తమమగు మోక్షమును పొందిరో అట్టి శ్రేష్ఠమైన జ్ఞానములో ఉత్తమమైన జ్ఞానమును మఱల చెప్పుచున్నాను"

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
గుణత్రయవిభాగయోగము
చతుర్దశోధ్యాయః

మూడో అధ్యాయములో "గుణములయొక్క కర్మలయొక్క విభజన గురించి యదార్థము గ్రహించినవాడు సాత్వికతామస రజోగుణములు శబ్దాది విషయములందు ప్రవర్తించుచున్నవి అని గ్రహించి, ఆత్మస్వరూపుడగు తనకు వానితో సంబంధము లేదని గ్రహించి ( మోక్షసాధనకై )కర్మలయందు అభిమానము లేకుండ ఉండును (3.28)" అని చెపుతాడు. అదే ధోరణిలో మూడవ అధ్యాయములోనే అర్జుని ప్రశ్న "కృష్ణా! మనుజుడు బలాత్కారముగా నియోజింపబడినవాని వలే పాపము ఎందుకు చేయుచున్నాడు" అన్న మాటకి సమాధానముగా " దానికి హేతువు రజో గుణము వలన పుట్టిన కామము" ఆ కామమే మహాశత్రువు గా గ్రహించుము" అని చెపుతాడు. అంతకన్న గుణములగురించి ఎక్కువ చెప్పలేదు.

ఆ తరువాత నాలుగవ ధ్యాయములో - "చాతుర్వర్ణ్యం మయాసృష్ఠం గుణకర్మ విభాగశః" అంటే "గుణకర్మలవిభాగము అనుసరించి నాలుగు వర్ణములు నాచే సృష్ఠించబడినవి" అని చెప్పి గుణముల విభజనగురించి ఒక చిన్నమాట చెప్పివదిలేశాడు.

ఆత్మసంయమయోగము లో "శాంత రజసం" - రజోగుణ వికారములు లేని ధ్యానయోగికి శ్రేష్ఠమైన సుఖమును పోందుచున్నాడు అని చెప్పి ( రజో తామస)గుణములను అదుపులో ఉంచవలసిన సంగతి చెపుతాడు.

విజ్ఞానయోగములో - "త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్" అంటూ ఈ జగత్ సర్వము ఈ మూడు గుణములయొక్క స్వభావముచేత మోహములో పడి ఈ గుణాలకి అతీతుడైన బ్రహ్మ స్వరూపము తెలియజాలక ఉన్నాయి ( 7.13) అని చెప్పి ఈ గుణములవలన ప్రజలు దారితప్పి పోతారు అన్నమాట చెపుతాడు.

పదమూడో అధ్యాయములో మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణము ఈ గుణాలతో సంగమే అని కూడా( 13.21) లో కృష్ణ భగవానుడు చెపుతాడు. అయితే మళ్ళీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏగుణాలతో ఏమి సంబంధము ? ఈ గుణములు ఎలా బంధిస్తాయి ? గుణములనుండి ఎలా విముక్తిపొందవచ్చు. వాటికి సమాధానమే ఈ అధ్యాయము.

కృష్ణార్జునసంవాదములో అర్జునిడికి నిర్గుణ బ్రహ్మ తత్త్వము గురించి అంటే జ్ఞానసంబంధమైన విషయములగురించి అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి , జ్ఞానము జ్ఞేయము గురించి ప్రకృతి పురుషులగురించి చెపుతాడు . ప్రకృతి పురుషులగురించి విశదీకరిస్తూ మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణము ఈ గుణాలతో సంగమే అని కూడా( 13.21) లో కృష్ణ భగవానుడు చెపుతాడు. అయితే మళ్ళీ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏగుణాలతో ఏమి సంబంధము ? ఈ గుణములు ఎలా బంధిస్తాయి ? గుణములనుండి ఎలా విముక్తిపొందవచ్చు. వాటికి సమాధానమే ఈ అధ్యాయము.

ఈ ప్రశ్నలు అర్జునుడు అడగపోయినా కృష్ణుడికి ప్రకృతి వలనకలిగే గుణములగురించి ఇంకా చెప్పాలని కుతూహలము తో "గుణత్రయ విభాగయోగము" తనే మొదలెడుతాడు.

ఈ పదునాలుగవ అధ్యాయము కూడా "యత్ జ్ఞాత్వా.." ఏది తెలిసికొంటే నీకు సంసారబంధనము నుంచి విడివడగలవో అట్టి జ్ఞానము " తత్ ప్రవక్ష్యామి " నీకు చెపుతాను అంటూ మొదలెడతాడు !

అంటే ఈ గుణత్రయ విభాగయోగము కూడా అంత ముఖ్యమన్నమాట.

అదే ఈ అధ్యాయములో మొదటి శ్లోకము:
శ్లోకము 1

శ్రీభగవానువాచ||

స|| యత్ జ్ఞాత్వా మునయః సర్వే ఇతః పరాం సిద్ధిమ్ గతాః (తత్) పరం జ్ఞానానాం ఉత్తమమ్ ( జ్ఞానం) భూయః ప్రవక్ష్యామి ||1||

||శ్లోకార్థాలు||

యత్ జ్ఞాత్వా మునయః సర్వే- ఏది తెలిసికొని మునులందరూ
ఇతః పరాం సిద్ధిమ్ గతాః - ఇక్కడ నుంచి పరమోత్తమమైన మోక్షసిద్ధిని పొందిరో
పరం జ్ఞానానాం ఉత్తమమ్ - పరమాత్మ సంబంధమైన, జ్ఞానములలో ఉత్తమమైన ( జ్ఞానమును)
భూయః ప్రవక్ష్యామి - మళ్ళీ చెపుచున్నాను.

||శ్లోక తాత్పర్యము||

"ఏది తెలిసికొని మునులందరూ ఇక్కడ నుంచి పరమోత్తమమైన మోక్షసిద్ధిని పొందిరో, పరమాత్మ సంబంధమైన,
జ్ఞానములలో ఉత్తమమైన జ్ఞానమును మళ్ళీ చెపుచున్నాను."||1||

"భూయః ప్రవక్ష్యామి - మళ్ళీ చెపుచున్నాను". అంటే ఇవి చెపుతూ వచ్చినవే్, కాని మళ్ళీ చెపుతున్నాను అని. ఏమిటి చెప్పుచున్నాడు ? "జ్ఞానానాం ఉత్తమమ్ జ్ఞానం" , జ్ఞానములలో ఉత్తమమైన జ్ఞానమును. అదే అధ్యాత్మ జ్ఞానము.

శ్లోకము 2

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః|
సర్గేఽపి నోపజాయన్తే ప్రళయే న వ్యధన్తి చ||2||

స|| ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః సర్గే అపి న ఉపజాయన్తే | ప్రళయే న వ్యధన్తి చ |

||శ్లోకార్థాలు||

ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య - ఈ జ్ఞానమును ఆశ్రయించి
మమ సాధర్మ్యం ఆగతాః - నాతో సమాన ధర్మమును పొందుచున్నారు
సర్గేఽపి నోపజాయన్తే - సృష్ఠి కాలమందు కూడా పుట్టరు
ప్రళయే న వ్యధన్తి చ- ప్రళయకాలములో నశింపరు

||శ్లోక తాత్పర్యము||

"ఈ జ్ఞానమును ఆశ్రయించి నాతో సమాన ధర్మమును పొందుచున్నారు.
( అట్టివారు) సృష్ఠి కాలమందు కూడా పుట్టరు. ప్రళయకాలములో నశింపరు."||2||

మొదట చెప్పుతాను అని చెప్పిన జ్ఞానము యొక్క ప్రయోజనము భగవంతునితో సమానమైన ధర్మము పోందటమే. భగవంతునితో సమానమైన ధర్మము అంటే శృష్థికాలములో పుట్టడము , ప్రళయకాలములో నశించడము అన్నమాట లేదు అని.

శ్లోకము 3

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్|
సమ్భవస్సర్వ భూతానాం తతో భవతి భారత ||3||

స|| హే భారత ! మహత్ బ్రహ్మ మమ యోనిః | తస్మిన్ అహమ్ గర్భం దధామి | తతః సర్వభూతానామ్ సమ్భవః భవతి |

||శ్లోకార్థాలు||

మహత్ బ్రహ్మ- మహత్తరమైన మూలప్రకృతి
మమ యోనిః - నా ఉత్పత్తి క్షేత్రము
తస్మిన్ అహమ్ - దాని యందు నేను
గర్భం దధామి - బీజమును ఉంచుచున్నాను
తతః సర్వభూతానామ్ - అందువలన సమస్త ప్రాణుల యొక్క
సమ్భవః భవతి - ఉత్పత్తి కలుగుచున్నది.

||శ్లోక తాత్పర్యము||

"ఓ భారత, మహత్తరమైన మూలప్రకృతి నా ఉత్పత్తి క్షేత్రము. - దాని యందు నేను బీజమును ఉంచుచున్నాను.
అందువలన సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి కలుగుచున్నది".||3||

శంకరాచార్యులవారు - "మదీయ మాయా త్రిగుణాత్మికా ప్రకృతిః యోని సర్వభూతానాం కారణమ్" , " త్రిగుణములు కల ప్రకృతి నా మాయ , అదే సర్వ భూతముల ఉత్పత్తికి కారణము, అదే ఉత్త్పత్తి స్థానము.(గర్భస్థానము)" అని.

శ్లోకము 4

సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సంభవన్తియాః|
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా||4||

స||హే కౌన్తేయ ! సర్వయోనిషు యాః మూర్తయః సంభవన్తి తాసామ్ మహత్ బ్రహ్మ యోనిః ( మాతా) | అహం బీజప్రదః పితా|

||శ్లోకార్థాలు||

సర్వయోనిషు యాః మూర్తయః సంభవన్తి - సమస్త జీవులలో ఏ శరీరములు పుట్టు చున్నవో
తాసామ్ మహత్ బ్రహ్మ యోనిః - వాటికి మూలప్రకృతి కారణము.
అహం బీజప్రదః పితా- నేను బీజమునుంచు తండ్రి ని

||శ్లోక తాత్పర్యము||

"ఓ కౌన్తేయ , సమస్త జీవులలో ఏ శరీరములు పుట్టు చున్నవో వాటికి మూలప్రకృతి కారణము. నేను బీజమునుంచు తండ్రి ని"

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో కృష్ణుడు, "క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత", "సమస్త క్షేత్రములలో వుండు క్షేత్రజ్ఞుడను నేనే" (భ 31.3)అని చెప్పాడు. అదే ఇక్కడ మళ్ళీ చెప్పబడుతున్నది.

శ్లోకము 5

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః |
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||5||

స|| మహాబాహో! ప్రకృతి సమ్భవాః సత్త్వం రజః తమః ఇతి గుణాః అవ్యయమ్ దేహినమ్ ( ఆత్మన్) దేహే నిబధ్నన్తి||

||శ్లోకార్థాలు||
ప్రకృతి సమ్భవాః - ప్రకృతి వలన పుట్టిన
సత్త్వం రజః తమః ఇతి గుణాః - సత్త్వ రజ తమో గుణములు
అవ్యయమ్ దేహినమ్ - నాశరహితుడైన దేహములో ఉండువానిని ( ఆత్మని)
దేహే నిబధ్నన్తి- దేహములో బంధించు చున్నవి

||శ్లోక తాత్పర్యము||

"ప్రకృతి వలన పుట్టిన సత్త్వ రజ తమో గుణములు, నాశరహితుడైన దేహములో ఆత్మని
దేహములో బంధించు చున్నవి".||5||

సత్త్వ రజ తమో గుణములు , దేహమే ఆత్మ అని భ్రాంతి కలిగించి, జీవునకు బంధములు కలిగించును అని రెందవ అధ్యాయము నుంచి వింటున్నాము. సత్త్వ గుణము కూడా బంధనమే. అందుకనే కృష్ణుడు అర్జునుని ఈ మూడు గుణములు దాటి వెళ్ళు అని చెప్పాడు.

శ్లోకము 6

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా||6||

స|| హే అనఘ ! తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన జ్ఞానసంగేన చ బధ్నాతి ||

||శ్లోకార్థములు||

తత్ర సత్త్వం - అందులో సత్త్వగుణము
నిర్మలత్వాత్ ప్రకాశకం - నిర్మలత్వము వలన ప్రకాశము కలుగచేయునది
అనామయం - దుఃఖము లేనిది
సుఖసంగేన - సుఖమునందలి ఆసక్తితో
జ్ఞానసంగేన చ - జ్ఞానము మీద ఆసక్తి తో
బధ్నాతి- బంధించునది.

||శ్లోక తాత్పర్యము||

"ఓ అనఘా, అందులో సత్త్వగుణము నిర్మలత్వము వలన ప్రకాశము కలుగచేయునది. దుఃఖము లేనిది.
సుఖమునందలి ఆసక్తితో జ్ఞానము మీద ఆసక్తి తో బంధించునది."||6||

సత్త్వగుణము వాంఛనీయమే. కాని త్రిగుణములలో ఒకటి కావున అది కూడా మాయ తో కూడినదే. ఇది కూడా గమ్యము చేరడానికి దాటవలసిన అడ్డంకి.

జీవుడు ప్రయత్నపూర్వకముగా సత్వగుణమును దాటి ఆత్మస్థితికి చేరవలయును.

శ్లోకము 7

రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సఙ్గసముద్భవమ్|
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినామ్ ||7||

స||హే కౌన్తేయ ! రజః రాగాత్మకమ్ (తథైవ) తృష్ణ ఆసంగసముద్భవమ్ విద్ధి | తత్ ( రజో గుణః) కర్మసంగేన దేహినమ్( ఆత్మన్) దేహే నిబధ్నాతి ||

||శ్లోకార్థములు||

రజః రాగాత్మకమ్ - రజో గుణము అనురాగము కలుగ చేయు ప్రకృతి కలది
( విషయాత్మక విషయములందు ప్రీతిని కలుగ చేయునది)
తృష్ణ ఆసంగ సముద్భవమ్ విద్ధి - కోరికలు బంధముల వలన జనించినది అని తెలుసుకొనుము.
తత్ ( రజో గుణః) కర్మసంగేన - ఆ ( రజో గుణము) కర్మబంధములమీదా ఆసక్తితో
దేహినమ్( ఆత్మన్) దేహే నిబధ్నాతి - దేహములో వుండు ఆత్మని దేహములో బంధించును.

||శ్లోక తాత్పర్యము||

"ఓ కౌన్తేయా, రజో గుణము విషయాత్మక విషయములందు ప్రీతిని కలుగ చేయునది.
ఇది కోరికలు బంధముల వలన జనించినది అని తెలుసుకొనుము.
ఆ ( రజో గుణము) కర్మబంధములమీదా ఆసక్తితో, దేహములో వుండు ఆత్మని బంధించును."||7||

రజోగుణము కోరికలను ఆసక్తియును కలుగజేయును అనేక బాహ్యాడంబరమైన కర్మలచేత ఖ్యాతి ఆర్జించవలెనని దృశ్యసంబంధమైన వివిధ కార్యకలాపముల చేత జీవుని బంధించును (14.7)

శ్లోకము 8

తమ స్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత||8||

స|| భారత! తమః తు అజ్ఞానజమ్ సర్వదేహినామ్ మోహనం | తత్ ( తమసః గుణః) ప్రమాదాలస్య నిద్రాభిః నిబధ్నాతి ||

||శ్లోకార్థములు||

తమః తు అజ్ఞానజమ్ విద్ధి - తమస్సు అజ్ఞానము వలన కలుగునది
సర్వదేహినామ్ మోహనం - సమస్త పాణులకు మోహమును కలుగ చేయును.
ప్రమాదాలస్య నిద్రాభిః - మతి మరపు, సోమరితనము నిద్ర మొదలగు వాని చే
తన్నిబధ్నాతి- అది బంధించును

||శ్లోక తాత్పర్యము||

"ఓ భారత, తమస్సు అజ్ఞానము వలన కలుగునది. సమస్త పాణులకు మోహమును కలుగ చేయును
మతి మరపు, సోమరితనము నిద్ర మొదలగు వాని చే అది బంధించును".||8||

శ్లోకము 9

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత|
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||9||

స|| భారత ! సత్త్వం సుఖే సంజయతి | రజః కర్మణి సంగయతి| తమః తు జ్ఞానం ఆవృత్య ప్రమాదే సంజయతి ఉత ||

||శ్లోకార్థములు||
సత్త్వం సుఖే సంజయతి - సత్త్వము సుఖములో చేర్చును.
రజః కర్మణి - రజో గుణము కర్మలయందు
తమః తు జ్ఞానం ఆవృత్య - తమోగుణము జ్ఞానమును కప్పి వేచి
ప్రమాదే సంజయతి - ప్రమాదమునందు చేర్చును
ఉత- ఆశ్చర్యము

||శ్లోక తాత్పర్యము||

"ఓ భారత, సత్త్వము సుఖములో చేర్చును. రజో గుణము కర్మలయందుచేర్చును.
తమోగుణము జ్ఞానమును కప్పి వేచి ప్రమాదమునందు చేర్చును. ఎంత ఆశ్చర్యము".||9||

ఈ త్రిగుణములకు నిత్య నిర్మలుడైన జీవుడు వశుడై యుండుట ఆశ్చర్యము. ఇవి జ్ఞానదీపమును ఆత్మదీపమును ఏదోవిధముగ కప్పునటువంటి గుణములు.

శ్లోకము 10

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత|
రజస్సత్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా||10||

స|| భారత ! సత్త్వం రజః తమః చ అభిభూయ భవతి | రజః సత్త్వం తమః చ ( అభిభూయ భవతి) | తథా తమః సత్త్వం రజః ఏవచ ( అభిభూయ భవతి)

శ్లోకార్థములు

సత్త్వం రజః తమః చ - సత్త్వము గుణము, రజము, తమస్సు లను కూడా .
అభిభూయ భవతి - అణిచి ప్రవర్తించును
రజః సత్త్వం తమః చ - రజోగుణము సత్త్వము తమోగుణములను (అణిచి ప్రవర్తించును)
తథా తమః సత్త్వం రజః ఏవచ - అదే విధముగా తమో గుణము సత్త్వ రజో గుణములను (అణిచి ప్రవర్తించును)

||శ్లోక తాత్పర్యము||

"ఓ భారత , సత్త్వము గుణము, రజోగుణమును, తమో గుణమును కూడా .అణిచి ప్రవర్తించును
రజోగుణము సత్త్వము తమోగుణములను, అదే విధముగా తమో గుణము సత్త్వ రజో గుణములను అణిచి ప్రవర్తించును."||10||

ఒక్కొక్క గుణము అధికముగానున్నపుడు జీవుడు ఒనర్చు కర్మము దానికి అనుగుణముగనె యుండును .అయితే ఎప్పుడు ఏగుణం వృద్ధిలో వుందో తెలుసు కోవడానికి గుర్తులేవి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానముగా కృష్ణుడు ఆ మూడుగుణముల గుర్తులు ఫలాలు చెపుతాడు.

శ్లోకము 11

సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే|
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత||11||

స|| యదా అస్మిన్ దేహే సర్వద్వారేషు ప్రకాశః జ్ఞానం ఉపజాయతే తదా సత్త్వం వివృద్ధం ( భవతి ఇతి) విద్యాత్||

||శ్లోకార్థములు||

యదా అస్మిన్ దేహే - ఎప్పుడు ఈ దేహములో
సర్వద్వారేషు ప్రకాశః జ్ఞానం - సమస్త ద్వారములలో ప్రకాశమగు జ్ఞానము
ఉపజాయతే - కలుగుచున్నదో
తదా సత్త్వం వివృద్ధం విద్యాత్- అప్పుడు సత్త్వగుణము వృద్ధినొందినది అని తెలుసుకొనుము.

||శ్లోక తాత్పర్యము||

"ఎప్పుడు ఈ దేహములో సమస్త ద్వారములలో ప్రకాశమగు జ్ఞానము కలుగుచున్నదో
అప్పుడు సత్త్వగుణము వృద్ధినొందినది అని తెలుసుకొనుము".||11||

సత్వగుణము అభివృద్ధి పొందినపుడు జీవుని సమస్త చర్యలు సాత్వికముగ ప్రకాశయుతముగ జ్ఞానవంతముగ నుండును. ప్రశాంతముగ మాట్లాడుట సాత్వికాహారము తినుట ఉత్తమగ్రంధములను చదువుటయు చేయును . సాత్విక గుణమునకు ఉదాహరణగా విభీషణుడిని తీసికొనవచ్చును.(14.11)

శ్లోకము 12

లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా|
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ||12||

స|| భరతర్షభ ! రజసి వివృద్ధే (సతి) లోభః ప్రవృత్తిః కర్మణాం ఆరమ్భః అశమః స్పృహా ఏతాని జాయన్తే||12||

||శ్లోకార్థములు||

రజసి వివృద్ధే (సతి) - రజో గుణము వృద్ధిలో ఉన్నప్పుడు
లోభః ప్రవృత్తిః - లోభ ప్రవృత్తి
కర్మణాం ఆరమ్భః - కామ్య కర్మల ప్రారంభము
అశమః స్పృహా - అశాంతి , ఆశ
ఏతాని జాయన్తే- ఇవన్నీ పుట్టును.

||శ్లోక తాత్పర్యము||

"ఓ భరతర్షభ, రజో గుణము వృద్ధిలో ఉన్నప్పుడు లోభ ప్రవృత్తి, కామ్య కర్మల ప్రారంభము,
అశాంతి , ఆశ మొదలగువన్నీ పుట్టును".||12||

రజోగుణము ప్రభావమువలన జీవుడు లేనిపోని కర్మలను వ్యవహారములను పైనవేసుకొనుచూ నిత్యము శాంతి లేకుండా యుండును. అంటే అశాంతి పరుడై యుండును. (14.12) రావణాసురుని రజోగుణము వృద్ధి్గా ఉన్నవారిలో ఉదాహరణగా తీసికొన వచ్చును.

శ్లోకము 13

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయన్తే విరుద్ధే కురునన్దన||13||

స|| కురునన్దన ! తమసి వివృద్ధే (సతి) అప్రకాశః అప్రవృత్తిః చ ప్రమాదః మోహః ఏవ చ జాయన్తే||13||

||శ్లోకార్థములు||

తమసి వివృద్ధే (సతి) - తమో గుణము వృద్ధిలో వున్నప్పుడు
అప్రకాశః అప్రవృత్తిః చ - అవివేకము, అలాగే సోమరితనము
ప్రమాదః మోహః ఏవ చ - ప్రమాదము, మోహమును
జాయన్తే- కలుగుచున్నవి

తమోగుణమువలన బుద్ధి మాంద్యము సోమరితనము మూఢత్వము వచ్చును.(14.13) కుంభకర్ణుడు తమోగుణమునకు ప్రతీక.

||శ్లోక తాత్పర్యము||

"ఓ కురునన్దనా, తమో గుణము వృద్ధిలో వున్నప్పుడు అవివేకము, అలాగే సోమరితనము,
ప్రమాదము, మోహమును కలుగుచున్నవి".||13||

శ్లోకము 14

యద సత్త్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ప్రతిపద్యతే||14||

స|| యదా తు సత్త్వే ప్రవృద్ధే సతి దేహభృత్ ప్రళయమ్ యాతి తదా ఉత్తమవిదామ్ అమలాన్ లోకాన్ ప్రతిపద్యతే||14||

||శ్లోకార్థములు||

యదా తు సత్త్వే ప్రవృద్ధే సతి - ఎప్పుడు సత్త్వగుణము వృద్ధిలో ఉండునప్పుడు
దేహభృత్ ప్రళయమ్ యాతి - దేహములోవుండువాడు మరణమును పొందునో
తదా ఉత్తమవిదామ్ - అప్పుడు ఉత్తమ గుణములు కలవారి యొక్క
అమలాన్ లోకాన్ ప్రతిపద్యతే- మలము లేని ( పరిశుద్ధమైన) లోకములను పొందును.

||శ్లోక తాత్పర్యము||
"ఎప్పుడు సత్త్వగుణము వృద్ధిలో ఉండునప్పుడు జీవుడు మరణమును పొందునో
అప్పుడు అతడు ఉత్తమ గుణములు కలవారి యొక్క పరిశుద్ధమైన లోకములను పొందును".||14||

శ్లోకము 15

రజసి ప్రళయం గత్వా కర్మసఙ్గిషు జాయతే|
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే||15||

స||రజసి (ప్రవృద్ధే సతి) ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా తమసి ( ప్రవృద్ధే సతి) ప్రలీనః మూఢయోనిషు జాయతే ||

||శ్లోకార్థములు||

రజసి (ప్రవృద్ధే సతి) - రజో గుణము వృద్ధిలో ఉన్నప్పుడు
ప్రళయం గత్వా - మరణము పొందినచో
కర్మసంగిషు జాయతే - కర్మలయందు ఆసక్తి కలవారియందు పుట్టుచున్నాడు.
తథా తమసి ( ప్రవృద్ధే సతి) - అలాగే తమో గుణము ఆధిక్యతలో ఉన్నవారు
ప్రలీనః మూఢయోనిషు జాయతే - మరణము పొంది మూఢుల గర్భమునందు పుట్టుచున్నాడు.

||శ్లోక తాత్పర్యము||

"రజో గుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణము పొందినచోకర్మలయందు ఆసక్తి కలవారియందు పుట్టుచున్నాడు.
అలాగే తమో గుణము ఆధిక్యతలో ఉన్నవారు మరణము పొంది మూఢుల గర్భమునందు పుట్టుచున్నాడు".||15||

శ్లోకము 16

కర్మణస్సుకృతస్యాహు సాత్త్వికం నిర్మలం ఫలమ్|
రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్||16||

స|| సుకృతస్య కర్మణః సాత్త్వికమ్ నిర్మలమ్ ఫలమ్ (భవతి) | రజసస్తు దుఃఖం ఫలమ్ ( భవతి)| తమసః అజ్ఞానం ఫలం భవతి | ఇతి (సజ్జనాః) ఆహుః||

||శ్లోకార్థములు||

సుకృతస్య కర్మణః - సాత్వికమైన కర్మలకు
సాత్త్వికమ్ నిర్మలమ్ ఫలమ్ - సత్త్వగుణముతో కూడిన నిర్మలమైన ఫలము వచ్చును
రజసస్తు దుఃఖం ఫలమ్ - రజో గుణ కర్మలకు దుఖము ఫలము
తమసః అజ్ఞానం ఫలం - తమోగుణముతో కూడిన కర్మలకు అజ్ఞానము ఫలము
ఇతి (సజ్జనాః) ఆహుః - అని చెప్పుదురు.

||శ్లోక తాత్పర్యము||

"సాత్వికమైన కర్మలకు సత్త్వగుణముతో కూడిన నిర్మలమైన ఫలము వచ్చును.
రజో గుణ కర్మలకు దుఖము ఫలము, తమోగుణముతో కూడిన కర్మలకు అజ్ఞానము ఫలము అని చెప్పుదురు".||16||

శ్లోకము 17

సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ |
ప్రమాదమోహో తమసో భవతోఽజ్ఞానమేవచ||17||

స||సత్త్వాత్ జ్ఞానం సంజాయతే | రజసః లోభ ఏవ చ ( సంజాయతే)| తమసః ప్రమాద మోహో భవతః| అజ్ఞానం ఏవ భవతి||17||

||శ్లోకార్థములు||

సత్త్వాత్ జ్ఞానం సంజాయతే - సత్త్వగుణముతో జ్ఞానము కలుగుచున్నది
రజసః లోభ ఏవ చ - రజోగుణము వలన లోభమే.
తమసః ప్రమాద మోహో భవతః- తమో గుణము వలన అజాగ్రత భ్రమ కలుగుచున్నది
తస్మాత్ అజ్ఞానం ఏవ భవతి- అజ్ఞానమే కలుగుచున్నది.

||శ్లోక తాత్పర్యము||

" సత్త్వగుణముతో జ్ఞానము కలుగుచున్నది రజోగుణము వలన లోభమే.
తమో గుణము వలన అజాగ్రత భ్రమ కలుగుచున్నది అజ్ఞానమే కలుగుచున్నది".||17||

శ్లోకము 18

ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|
జఘన్యగుణవృత్తిస్థా అథో గచ్ఛన్తి తామసాః||18||

స|| సత్త్వస్థాః ఊర్ధ్వం గచ్ఛన్తి | రాజసాః మధ్యే తిష్ఠన్తి | జఘన్య( నీచ) గుణ వృత్తిస్థాః తామసాః అధః గచ్ఛన్తి|| 18||

||శ్లోకార్థములు||

సత్త్వస్థాః ఊర్ధ్వం గచ్ఛన్తి - సత్త్వ గుణము కలవారు ఊర్ధ్వ లోకములకు పోవుచున్నారు.
రాజసాః మధ్యే తిష్ఠన్తి - రజోగుణము కలవారి మధ్యమ లోకములకు పోవుచున్నారు.
జఘన్య( నీచ) గుణ వృత్తిస్థాః - నీచగుణములు కల
తామసాః అధః గచ్ఛన్తి- తామసులు అధో లోకములకు పోవుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||

"సత్త్వ గుణము కలవారు ఊర్ధ్వ లోకములకు పోవుచున్నారు.
రజోగుణము కలవారి మధ్యమ లోకములకు పోవుచున్నారు.
నీచగుణములు కల తామసులు అధో లోకములకు పోవుచున్నారు".||18||

శ్లోకము 19

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి|
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి||19||

స|| యదా ద్రష్టా (భూత్వా) గుణేభ్యః అన్యం కర్తారమ్ న అనుపశ్యతి (తథైవ ఆత్మానం ) గుణేభ్యః చ పరం వేత్తి - సః మద్భావం అధిగచ్ఛతి ||19||

||శ్లోకార్థములు||

యదా ద్రష్టా భూత్వా - ఎప్పుడు సాక్షి గా
గుణేభ్యః అన్యం కర్తారమ్ - గుణములకన్నా వేరే అయిన కర్తను
న అనుపశ్యతి - చూడడో
గుణేభ్యః చ పరం వేత్తి - గుణములు కన్న ఉత్తమమైనవానిని తెలిసికొనుచున్నాడో
సః మద్భావం అధిగచ్ఛతి - అతడు నా స్వభావమును పొందుచున్నాడు.

||శ్లోక తాత్పర్యము||

" ఎవరు సాక్షి గా గుణములనే కర్తగ చూచునో, గుణములు కన్న ఉత్తమమైనవానిని తెలిసికొనుచున్నాడో
అతడు నా స్వభావమును పొందుచున్నాడు".||19||

శ్లోకము 20

గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహసముద్భవః|
జన్మమృత్యుజరాదుఃఖై ర్విముక్తోఽమృతమశ్నుతే||20||

స|| దేహీ దేహసముద్భవాన్ ఏతాన్ త్రీని గుణాని అతీత్య జన్మమృత్యు జరా దుఃఖైః విముక్తః అమృతం అశ్నుతే||20||

||శ్లోకార్థములు||

దేహీ దేహసముద్భవాన్ - దేహి దేహము ఉత్పత్తికారణభూతములగు
ఏతాన్ త్రీని గుణాని - ఈ మూడు గుణములను
అతీత్య- దాటి
జన్మమృత్యు జరా దుఃఖైః - జననము, మరణము, వృద్ధాప్యము, దుఃఖములచేత
విముక్తః - విడువ బడినవాడై
అమృతం అశ్నుతే - మోక్షమును పొందును

||శ్లోక తాత్పర్యము||

"జీవుడు దేహము ఉత్పత్తికారణభూతములగు ఈ మూడు గుణములను దాటి నచో, జననము, మరణము, వృద్ధాప్యము, దుఃఖములచేత
విడువ బడినవాడై, మోక్షమును పొందును".||20||

శ్లోకము 21

అర్జున ఉవాచ:
కైర్లింగైస్త్రీన్గుణానేతాన్ అతీతో భవతి ప్రభో |
కిమాచారం కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతే ||21||

స|| ప్రభో ఏతాన్ త్రీన్ గుణాన్ అతీతః కైః లింగైః (ఉపలక్షితః ) భవతి| కిమాచారః ( భవతి)| ఏతాన్ త్రీన్ గుణాన్ కథం చ అతివర్తతే||

||శ్లోకార్థములు||

ఏతాన్ త్రీన్ గుణాన్ అతీతః - ఈ మూడు గుణముల దాటినవాడు
కైః లింగైః (ఉపలక్షితః ) భవతి- ఎటువంటి లక్షణములు కలవాడు అగుచున్నాడు
కిమాచారః ( భవతి) - ఎట్టి ఆచారములు కలవాడు అగుచున్నాడు
ఏతాన్ త్రీన్ గుణాన్ - ఈ మూడు గుణములను
కథం చ అతివర్తతే- ఎట్లు అధిగమించుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

అర్జునుడు అడిగెను.
"ఈ మూడు గుణముల దాటినవాడు ఎటువంటి లక్షణములు కలవాడు అగుచున్నాడు?
ఎట్టి ఆచారములు కలవాడు అగుచున్నాడు?
ఈ మూడు గుణములను ఎట్లు అధిగమించుచున్నాడు?"||21||

ఈ ప్రశ్నకి కారణము అర్జునిని సందేహము. ప్రకృతికి సంబంధించిన ఈ మూడు గుణములగురించి , ఈ మూడు గుణములు ఎలాగ జీవుని బంధిస్తున్నాయో , జీవుడు ఈ మూడుగుణములను దాటి అమృతత్త్వము పొందగలడు అని వినిన అర్జునిని కి మళ్ళీ గుణములనుంచి జీవుడు తనంతత తానే ఎట్లా బయటపడగలడు అన్న సందేహము వస్తుంది.

అప్పుడు కృష్ణ భగవానుడు గుణాతీతుని లక్షణములు గుణములను అతిక్రమించడానికి ఉపాయములు చెపుతాడు.

శ్లోకము 22

శ్రీభగవానువాచ:

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ|
నద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి||22||

స|| పాణ్డవ! యః సంప్రవృత్తాని ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహం ఏవ చ నద్వేష్టి , తథైవ నివృత్తాని నకాంక్షతి||21||

||శ్లోకార్థములు||

యః సంప్రవృత్తాని - ఎవరు సంప్రాప్తములైన
ప్రకాశం చ ప్రవృత్తిం చ - ప్రకాశమును, ప్రవృత్తిని,
మోహం ఏవచ - మోహము కూడా
నద్వేష్టి- ద్వేషించడో
తథైవ నివృత్తాని నకాంక్షతి - అదేవిధముగా విడిచినవానిని కోరడో

||శ్లోకతాత్పర్యములు||

"ఓ పాండవ,ఎవరు సంప్రాప్తములైన ప్రకాశమును, ప్రవృత్తిని, మోహము కూడా ద్వేషించడో
అదే విధముగా విడిచినవానిని కోరడో ( అట్టివాడు గుణములకు అతీతుడు అని చెప్పబడుచున్నాడు)".||21||

ప్రకాసము అంటే సత్వగుణ సంబంధమగు ప్రకాశము. ప్రవృత్తి అంటే రజో గుణ సంబంధమైన కార్య ప్రవృత్తి. మోహము అంటే తమో గుణ ప్రధానమైనమోహము. ఈ మూడిని దాటి మళ్ళీ వాటిని ఆశించని వాడు అలాగే వాటిని ద్వేషించని వాడు అని అర్థము.

శ్లోకము 23

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|
గుణావర్తన్త ఇత్యేవ యోఽవతిష్ఠతి నేఙ్గతే||23||

స|| ఉదాసీనవత్ ఆసీనః, గుణైః న విచాల్యతే , గుణాః వర్తన్తే ఇతి యః అవతిష్ఠతి న ఇఙ్గతే||22||

||శ్లోకార్థములు||

ఉదాసీనవత్ ఆసీనః- ఉదాసీనుని( తటస్థుని) వలె కూర్చునివున్నవాడై
గుణైః న విచాల్యతే - గుణములచేతో చలింప బడడో
గుణాః వర్తన్తే ఇతి - గుణములు ప్రవర్తించుచున్నవి అని
అవతిష్ఠతి- తెలిసికొని వున్నాడో
న ఇఙ్గతే -చలించడో
( అట్టివాడు.. గుణములను అతిక్రమించినవాడు)

||శ్లోకతాత్పర్యములు||

"ఉదాసీనుని( తటస్థుని) వలె కూర్చునివున్నవాడై గుణములచేతో చలింప బడడో,
గుణములు ప్రవర్తించుచున్నవి అని తెలిసికొని వున్నాడో, ఎట్టి పరిస్థితుల లోను చలించడో
( అట్టివాడు.. గుణములను అతిక్రమించినవాడు)".||23||

శ్లోకము 24

సమదుఃఖసుఖస్స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిన్దాత్మ సంస్తుతిః||24||

స|| సమదుఃఖసుఖః స్వస్థః, సమలోష్టాశ్మకాఞ్చనః తుల్యప్రియాప్రియః, ధీరః, తుల్యనిన్దాత్మ సంస్తుతిః||24||

||శ్లోకార్థములు||

సమదుఃఖసుఖః - సుఖదుఃఖములందు సమ భావము కలవాడు
స్వస్థః - ఆత్మయందే నిలచినవాడు
సమలోష్టాశ్మకాఞ్చనః - మట్టిగడ్డ రాయి, బంగారము లను సమముగా చూచువాడు
తుల్యప్రియాప్రియః - ప్రియ అప్రియములను సమముగా చూచువాడు
ధీరః- ధీరుడు
తుల్యనిన్దాత్మ సంస్తుతిః - దూషించిననూ భూషించినను సమ దృష్టి కలవాడు

||శ్లోకతాత్పర్యములు||

సుఖదుఃఖములందు సమ భావము కలవాడు, ఆత్మయందే నిలచినవాడు, మట్టిగడ్డ రాయి, బంగారము లను సమముగా చూచువాడు
ప్రియ అప్రియములను సమముగా చూచువాడు, ధీరుడు, దూషించిననూ భూషించినను సమ దృష్టి కలవాడు,
(అట్టివాడు.. గుణములను అతిక్రమించినవాడు)

శ్లోకము 25

మానావమానయోః తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః|
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే||25||

స|| మానావమానయోః తుల్యః, మిత్రారిపక్షయోః తుల్యః, సర్వారమ్భపరిత్యాగీ సః గుణాతీతః ఉచ్యతే||25||

||శ్లోకార్థములు||

మానావమానయోః తుల్యః - మాన అవమానములను సమబుద్ధి కలవాడు
మిత్రారిపక్షయోః తుల్యః- మిత్రులు శత్రువులయందు సమబుద్ధి కలవాడు
సర్వారమ్భపరిత్యాగీ- సమస్త కార్యములందు కర్తృత్వము వదిలిన వాడు
సః గుణాతీతః ఉచ్యతే - అట్టివాడు గుణములను అతిక్రమించినవాడు అని చెప్పబడుచున్నాడు.

||శ్లోకతాత్పర్యములు||

" మాన అవమానములను సమబుద్ధి కలవాడు, మిత్రులు శత్రువులయందు సమబుద్ధి కలవాడు,
సమస్త కార్యములందు కర్తృత్వము వదిలిన వాడు, అట్టివాడు గుణములను అతిక్రమించినవాడు అని చెప్పబడుచున్నాడు".
||25||

ఈ నాలుగు శ్లోకాలలో మూడు గుణములు అతిక్రమించిన వారి లక్షణములు చెప్పబడినవి. ఇవన్నీ జ్ఞానము తో సమానము. ప్రతీవారును తమతమ హృదయములను శోధించుకొనీ తమయందు యే గుణముల లక్షణములున్నవో చూచుకొని సాధనచేత ఊర్ధ్వస్థితిని పొందుటకు ప్రయత్నము చేయవచ్చును . చేయవలను కూడా.

శ్లోకము 26

మాం చ యోఽవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే|
స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే||26||

స||యః మాం చ అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే - సః ఏతాన్ గుణాన్ సమతీత్య బ్రహ్మ భూయాయ కల్పతే||

||శ్లోకార్థములు||

యః మాం చ - ఎవరు నన్ను
అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే - అచంచలమైన భక్తి యోగముతో సేవించుచున్నాడో
సః ఏతాన్ గుణాన్ సమతీత్య - అట్టివాడు ఈ గుణములను దాటి
బ్రహ్మ భూయాయ కల్పతే -బ్రహ్మత్వము పొందుటకు సమర్థుడగుచున్నాడు

||శ్లోక తాత్పర్యము||

"ఎవరు నన్ను అచంచలమైన భక్తి యోగముతో సేవించుచున్నాడో, అట్టివాడు ఈ గుణములను దాటి
బ్రహ్మత్వము పొందుటకు సమర్థుడగుచున్నాడు".||26||

ఇది "కథంచ ఏతాన్ త్రీన్ గుణాన్" - అయితే ఈ మూడు గుణములను "అతివర్తతే" దాటుట ఎట్లు అన్న అర్జుని ప్రశ్నకి సమాధానము. .

భక్తిమార్గము అందరికి సులభమైనది. తద్వారా భవత్కృప , బ్రహ్మజ్ఞానము అలాగే భగవదనుభూతి పొందడానికి అనుకూలముగా వుండును.
అంటే అ గుణములను దాటడానికి కూడా భక్తి మార్గము అవసరము అన్నమాట.

శ్లోకము 27

బ్రహ్మణో హి ప్రతిష్టాఽహమ్ అమృతస్యావ్యయస్య చ|
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ||27||

స|| హి అహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య ధర్మ్యస్య చ ఏకాన్తికస్య సుఖస్య చ నిరతిశయ బ్రహ్మణః ప్రతిష్ఠా ( భవామి)||

||శ్లోకార్థములు||

అహం అమృతస్య అవ్యయస్య - నేను నాశరహితమును నిర్వికారమును
శాశ్వతస్య ధర్మ్యస్య చ - శాశ్వత ధర్మ స్వరూపమును
ఏకాన్తికస్య సుఖస్య చ నిరతిశయ - దుఃఖములేని అచంచల ఆనంద స్వరూపమును
బ్రహ్మణః ప్రతిష్ఠా - బ్రహ్మమునకు ఆశ్రయము అగుచున్నాను

||శ్లోక తాత్పర్యము||

"నేను నాశరహితమును నిర్వికారమును, శాశ్వత ధర్మ స్వరూపమును, దుఃఖములేని అచంచల ఆనంద స్వరూపమును
అగు బ్రహ్మమునకు ఆశ్రయము అగుచున్నాను".||27||

ఈ మూడు గుణములను అతిక్రమించినవాడు బ్రహ్మము ను పొందుచున్నాడు అన్నమాటకి - బ్రహ్మము అంటే మళ్ళీ కృష్ణుడు విశదీకరిస్తాడు.
బ్రహ్మము నాశరహితమైనది వికారము లేనిది , శాశ్వత ధర్మస్వరూపమైనది , నిరతిశయ ఆనంద రూపమమైనది. అదే సత్ (నాశరహితమైనది) చిత్ (శాశ్వత ధర్మస్వరూపమైనది) ఆనంద ( నిరతిశయ ఆనందరూపమైనది) స్వరూపము.అదే సత్ చిదానంద స్వరూపము. అదే నా స్వరూపము అని.(14.27)

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగోనామ
చతుర్దశోఽధ్యాయః
ఓం తత్ సత్

||

|| om tat sat||