||భగవద్గీత ||
||నాలుగవ అధ్యాయము ||
||జ్ఞాన యోగము - శ్లోకాల సారాంశము
||
|| Om tat sat ||
భగవద్గీత
నాలుగవ అధ్యాయము
జ్ఞాన యోగము - శ్లోకముల సారాంశము !
ఒకప్పుడు మా వచన వ్యాఖ్యానము చదివిన తరువాత అన్నీ శ్లోకాల తాత్పర్యము తీసుకు రాగలిగామా లేక మాకు నచ్చిన భావాలమీద శ్లోకాలమీదనే ధ్యాస వుంచి మిగిలినవి మరచి పోయామా అని అనుమానం వస్తుంది. ఓక భావము మీద ధ్యాస పడినప్పుడు , అదే భావములోకి సరిపడని మాటలు దాటేసి ఆభావాని కి అనుగుణమైన మాటలమీదే రాయదము అవుతుంది
అది నిజం
కాని ఆ అధ్యాయములో ఉన్న అన్ని మాటలూ ముందుకు తీసుకు రావాలి అన్నది భాద్యత !
అందుకని ఇఆ అధ్యాయములో అంటే జ్ఞాన యోగములో శ్లోక రీతిలో ప్రధాన అంశాలు ఏమిటి అని మళ్ళీచూద్దాము.
శ్లోకములు 1- 3
- భగవానువాచ తో మొదలెట్టి నిష్కామకర్మ పుట్టు పూర్వోత్తరాలు. భగవంతుడు ముందు సూర్యునికి , సూర్యునిద్వారా మిగిలిన వారికి నిష్కామక్రమ వచ్చినట్లు చెప్పడము.
శ్లోకములు 4 -8
- అర్జునుని అనుమానం ఎవరీకృష్ణుడు అని , శ్రీకృష్ణుడు తన భగవదవతారాలు ఎందుకు ఏప్పుడు అన్న సంగతి " యదా యదా హి ధర్మ స్య గ్లానిర్భవతి భారత" అంటూ చెప్పడము
శ్లోకములు 9-18
- నిష్కామకర్మ , కర్మ ,అకర్మ, వికర్మ లగురించి. ఏవరు ఏవిథముగా ప్రార్థించెదరో వారిని ఆవిధముగా అనుగ్రహించబడుదురు అని.
"యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్" అంటూ
శ్లోకములు 19- 23
- పండితుడు అంటే ఏవరు ? జ్ఞాని ఆచరణ :
శ్లోకములు 24 - 32
యజ్జములో సమస్తము బ్రహ్మమే ( బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః .. ) అంటూ పన్నెండు యజ్ఞముల వర్ణన - "ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ జ్ఞానయజ్ఞ థా అపరే" అంటూ ! అవి 1 దైవ యజ్ఞము (4.25) ;2 బ్రహ్మ యజ్ఞము (4.25) ;3 ఇన్ద్రియసంయమ యజ్ఞము (4.26) ;4 శబ్దాది విషయ నిరోధ యజ్ఞము (4.26); 5 మనోనిగ్రహ యజ్ఞము (4.27) ; 6 ద్రవ్య యజ్ఞము ( 4.28); 7 తపోయజ్ఞము: (4.28); 8 యోగయజ్ఞము (4.28); 9 స్వాధ్యాయ యజ్ఞము (4.28) ;10 జ్ఞాన యజ్ఞము: (4.28); 11 ప్రాణాయామ యజ్ఞము (4.29) ;12 ఆహారనియమ యజ్ఞము (4.30)
శ్లోకములు 33-34
- జ్ఞాన యోగముయొక్క అధిక్యత - జ్జానయోగము పొందు ఉపాయములు ( తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ..!) అంటూ గురు సేవ ద్వారా జ్ఞానము సంపాదించమని చెప్పడము.
శ్లోకములు 35 -42
- జ్ఞాన యోగముయొక్క మహిమ.
"జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్ కురుతే"
-జ్ఞానము అన్ని కర్మలను భస్మము చేస్తుంది(4.37)
" పాప కృత్తమః జ్ఞాన ప్లవేనైవ’" .. మోక్షం ఆప్నోతి;
-పాపములు చేసిన వాడు కూడా జ్ఞానముతో పాపములను దాటగలడు(4.36)
" నహి జ్ఞానేన సదృశమ్ పవిత్ర మిహ విద్యతే
-జ్ఞానముతో సమానమైనది ఏదీ లేదు(4.38)
"జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమ్"...
జ్ఞానము సంపాదించి శాంతి పొందు తాము (4.39)
చివరి శ్లోకములో జ్ఞానము అనే ఖడ్గముతో "సంశయము" అనే అజ్ఞానానిని చేదించుము అని చెప్పడముతో జ్ఞానయోగము సమాప్తము అవుతుంది.
మొత్తాని కి అన్ని మాటలూ వచన వ్యాఖ్యానములో వచ్చాయి.
అయితే ఒక శ్లోకము సందర్భము రాక మనము దాటవేశామా అని అనుమానం వుంది. ఆ శ్లోకము లో మొదటి పాదము :
"చాతుర్వర్ణ్యం మయా సృష్ఠమ్ గుణ కర్మ విభాగయోః"
"ఈ నాలుగు వర్ణములూ నా చేత వారి వారి గుణములబట్టి విభజించబడినవి" అని.
దీని మీద ఇంకోసారి రాస్తాము
||ఓమ్ తత్ సత్ ||