తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

||ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ||

 

 


 

|| ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| ఘల్లు ఘల్లున పాద గజ్జెలందెలు మ్రోయ||

ఘల్లు ఘల్లున పాద
గజ్జెలందెలు మ్రోయ
కలహంస నడకల
కలికీ ఎక్కడికే ?

జడలోనూ గంగాను
ధరయించు కున్నట్టి
జగములేలే సాంబ శివుని సన్నిధికే |
మంగళం మంగళం||1||

తళ తళమను రత్న
తాటంకములు మెరయ
పశిడి కుండలముల
పడతి ఎక్కడికే?

కరిచర్మాంబర ధరుడు
పురహారుడైనట్టి
గురుడైన బోళా శంకరుని సన్నిధికే|
మంగళం మంగళం||2||

చెంగావీ చీరయూ
కొంగులు జారంగ
రంగైన నవ మోహ
నాంగీ ఎక్కడికే?

పులితోలూ వస్త్రము
(వి) భూతి ధరించిన
మండలమేలు జగదీశు సన్నిధికే|
మంగళం మంగళం||3||

బొడ్డు మల్లెలు
జాజి దండలు మెడనిండ
అందమెరిగిన
జగదంబా ఎక్కడికే?

అందము విపూది
నలరు శ్రీగంధము అలరిన
నీలకంఠేషు సన్నిధికే|
మంగళం మంగళం||4||

హెచ్చు పాపిట బొట్టు
రత్న కిరీటము
ఈవేళా కరుణా కటాక్షి ఎక్కడికే?

కడుపెద్ద రుద్రాక్ష
మెడలోను హారము
శిరమున వెలసిన శివుని సన్నిధికే|
మంగళం మంగళం||5||

||ఓమ్ తత్ సత్||