తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

|| రామ రామ యనరాదా ||

 

 


||ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| రామ రామ యనరాదా ||

రామ రామ యనరాదా
రఘుపతి రక్షకుడని వినలేదా|
కామజనకుని కథ వినువారికి
కైవల్యమె కాదా || రామ||1||

నారదాది మునులెల్ల భజించెడి
నారాయణుడే కాదా |
కోరిన కోరిక లెల్ల నొసంగెడి
గుణశాలి యని వినలేదా ||రామ|| 2||

ఆపద్భాందవుడగు శ్రీరాముని
ఆరాధించగ రాదా |
నీరజాక్శుని నిరతము నమ్మితె
నిత్యానందమె కాదా || రామ||3||

సారహీన సంసార భవాంబుధి
సరగున దాటగ రారా|
పాపంబులు పరిహారమొనర్చెడి
పరమ పురుషుడే కాదా || రామ|| 4||

వసుధన గుడి మెళ్ళంకన వెలసిన
వరగోపాలుడె కాదా|
పశివాడగు శ్రీ రంగదాసుని
పాలించుట వినలేదా ||రామ|| 5||


|| ఓమ్ తత్ సత్ ||