తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

|| శ్రీరామ నామ మంత్ర పఠనా||

 

 


||ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| శ్రీరామ నామ మంత్ర పఠనా||

శ్రీరామ నామ మంత్ర పఠనాసేయవే మనసా |
ఘోరాంధకార దురితములనూ గూల్చునే మనసా ||శ్రీ|| 1||

సంసార జలధిలోన మునిగి చెడకే ఓ మనసా|
కంసారి పాద కమల సేవ కోరవే మనసా|| శ్రీ|| 2||

కౄరాత్ములైన వారి చెంతా చేరకే మనసా||
నారాయణామృతంబు మదిని కోరవే మనసా || శ్రీ|| 3||

దురితాత్ములైన వారి చెంతా చేరకే మనసా |
క్షిరాబ్ధి శయనుడైన హరిని చేరవే మనసా ||శ్రీ|| 4||

సిరులిచ్చి వరములొసగునట్టి శ్రీహరే మనసా|
వరరంగ దాసు నేలి నట్టి వరదుడే మనసా ||శ్రీ||5||


|| ఓమ్ తత్ సత్ ||