తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

|| తల్లి నీకు ఇదిగొ హారతి ||

 

 


||ఓమ్ తత్ సత్ ||

|| తల్లి నీకు ఇదిగొ హారతి ||

తల్లి నీకు ఇదిగొ హారతి సీతమ్మతల్లీ |
దేవి నీకు ఇదిగొ హారతి||

తల్లి నిన్ను చూచినపుడే
తగిన వరుడు లేడనుచు
శివుని విల్లి విరచినవారికి
సీతా నిస్తామని ప్రాతిజ్ఞ చేసిరి|| తల్లి||1

దశరథేషు గర్భమందు
తమరు పుట్టిరి రామ లక్ష్మణులు|
దిన దినము ప్రవర్థిల్లగ
తేజరిల్లుచు పెరుగుచుండిరి||తల్లి||

విశ్వామిత్రులు రామలక్ష్మణులు పయనమై పోగానే
శిలయ పడియున్న గౌతముని భార్యా స్త్రీ యై నిలచె పాద ధూళికి|| తల్లి||

ఈ బాలలిద్దరెవ్వరనుచు ఎవ్వరనుచు అడిగె రాజు మునిని.
దశరథేషు తనయులు వీరు తాటకి నేశిన శూరులు వీరు||తల్లి||

చిరునవ్వు నవ్వుకొనుచు చిటికెన వేలు తొ ఆవిల్లు విరిచె|
సీతకు తగునని దేవతలందరు జయ జయ మనిరి||తల్లి||

భూమిదేవి గర్భమందు ఉతలమందున జన్మించి|
ప్రీతితోనూ జనకుని ముద్దుల కూతురువై వెలెసినావు|| తల్లి||

|| ఓమ్ తత్ సత్ ||