!! Viveka Chudamani of Shankaracharya !!
వివేక చూడామణి
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి
వివేకము అంటే జ్ఞానము లేక తెలివి. చూడామణి శిరోభూషణమైన రత్నము. వివేక చూడామణి అధ్యాత్మిక జ్ఞానము ప్రతిపాదించడములో పెంపొందించడములో శిరోభూషణమైన రత్నము లాంటిది అని అనవచ్చు. అధ్యాత్మిక జ్ఞానము విచారానికి సంబంధించిన పుస్తాకాలన్నిటిలోకి, శంకరాచార్యులవారి వివేక చూడామణి , ఒక మణి రత్నము అని కూడా అనవచ్చు. వివేకచూడామణి చదవగలిగే అధికారము లేకపోయినా, గ్రంధ పఠనములో రాగల కష్టాలని గుర్తిస్తూ, అది చదవాలనే ఉత్సాహము తో ముందుకు సాగడమైనది
ఇంతక ముందు, అధాతోబ్రహ్మజిజ్ఞాస అన్న శీర్షిక క్రింద కాసరబాద ఆర్గ్ లో రాయబడిన గ్రంధాలు కథోపనిషత్తు, ఆత్మ బోధ , శ్రీమద్భగవద్గీత. అందులో భగవద్గీత చిన్నప్పటినుంచి చదివిన గ్రంధమైనా , అర్థతాత్పర్యాలతో కాసరబాద ఆర్గ్ లో రాయడముతో వచ్చిన అనుభూతి వేరు. అదే ఉత్సాహముతో దేశవిదేశాలలోనున్న కుటుంబ సభ్యులతో ప్రతివారము పారాయణ తో కూడిన చర్చ , జూమ్ (Zoom) మాధ్యములో , రెండు సార్లు చేయబడడమైనది. జూమ్ (Zoom) మాధ్యములో ఆధ్యాత్మిక చర్చకి , మళ్ళీ గీత కాకుండా ఇంకో గ్రంధము తీసుకోవాలి అన్న అభిప్రాయముతో , వివేక చూడామణి కష్టమైనాగాని చదువగలమనే ధైర్యముతో, ఉత్సాహముతో మొదలెట్టబడినది. వివేక చూడామణి చదవడానికి ,చాలావరకు అందరము పుల్లెలవారి గ్రంధము ఉపయోగిస్తున్నాము.
ఎన్నో పుస్తకాలున్నా, ప్రతివారము మాకు అర్థమయ్యేటట్లుగా, అర్థతాత్పర్యాలకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతివారము రెండు శ్లోకాలు వేరేగా రాసుకొని చదవడమైనది. మాకోసము రాసుకున్నది అర్థవంతముగా వున్నది అని , కుటుంబసభ్యుల ప్రోత్సాహముతో ఇది కాసరబాద ఆర్గ్ లో పెట్టాలి అని అనుకొని , ఈ శ్లోకతాత్పర్యాలు కాసరబాద ఆర్గ్ లో 194 శ్లోకమునుంచి పెడుతున్నాము. మొదటి 194 శ్లోకాలు కూడా పెట్టాలి అన్న ఆలోచన కూడా వుంది . అది తదుపరి కార్యక్రమము.
ఈ పేజీ , వివేకచూడామణి పుష్పమాలిక, ప్రతివారము ఆవారానికి సంబంధించిన శ్లోకాల లింకుతో పాఠకులకి అందించబడుతుంది
||ఓమ్ తత్ సత్||