!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 202-203

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 202-203


ఆదిలేని జీవత్వము అంతము అవదు కదా అప్పుడు మోక్షము ఎలావస్తుంది అని, శిష్యుడి అనుమానము ( శ్లోకము 194), ప్రశ్న కూడా. దానికి సమాధానముగా  గురువు భ్రాన్తిలో ఆదిలేనిది, భ్రాన్తి పోతే  అంతమౌతుంది.  అని చెప్పి, తను చెప్పిన మాటని బలపరచే ఉదాహరణలు చెపుతాడు. ఉదాహరణలు (199-201) చెప్పి, ఇక ఆ ఉదాహరణలు కలిపి శిష్యుడికి పూర్తి సమాధానము ఇస్తాడు గురువు 202-203 శ్లోకాలలో.


శ్లోకములు 202 -203


అనాదేరపి విధ్వంసః 

ప్రాగభావస్య వీక్షితః|

యత్ బుద్ధ్యుపపాధిసంబన్ధాత్  

పరికల్పిత మాత్మని|| 201||


జీవత్వం న తతోఽన్యత్ తు

 స్వరూపేణ విలక్షణమ్ |

సమ్బన్ధఃస్వాత్మనో బుధ్యా 

మిథ్యా జ్ఞానపురస్సరః ||203||


సమాధానము రెండు శ్లోకాలలో వస్తుంది. ఇక్కడ రెండు శ్లోకాలలో నాలుగు పాదములు ఒకదాని తరువాత ఇంకోటి విడమరిచి పరీక్షిద్దాము, లేక అర్థము చేసుకుందాము.


అనాదేరపి  ప్రాగభావస్య -

ఆదిలేకపోయినప్పటికి ప్రాగభావములాగా


విధ్వంసః వీక్షితః - 

అంతము చూశాము కదా !


అంటే ఇక్కడ గురువు మళ్ళీ చెపుతున్నాడు.

ఆ అది లేని దాని అంతము చూశాము కదా.  

(అలాగే ఇక్కడ ఆది లేని  జీవత్వముకు కూడా అంతము వుండును అని గురువు చెప్పకుండా చెప్పిన మాట ).


ఇప్పుడు జీవత్వము ఆత్మ ల గురించి చెపుతాడు


యత్ - అది ( ఆ జీవత్వము)

బుద్ధ్యుపపాధిసంబన్ధాత్  -  

బుద్ధి వలన కలిగిన సంబంధము 



విజ్ఞాన కోశములో ఆత్మకి జీవుడితో సంబంధము వుంది అని అనుకున్న మాట -  ఎలావచ్చింది? 

బుద్ధి వలన వచ్చిన సంబంధము.

బుద్ధి కి అ ఆలోచన ఎలా వచ్చింది ?


 పరికల్పిత మాత్మని  -  

ఆత్మతో కాల్పనికముగా కల్పించుకున్నది ( సంబంధము)

.

ఆత్మకి జీవత్వముతో బుద్ధి కల్పించిన సంబంధము బుద్ధి కల్పన. ( ఆది లేని దానికి అంతములేదు, అంతమలేనిది ఆత్మ కనుక .. ఈ సంబంధము బుద్ధి ఊహించింది)


విజ్ఞానకోశములో  ఆత్మకి జీవత్వము వుంది అని బుద్ధి వలన కల్పించబడినది ఆ సంబంధము. ( జీవత్వము అనాది వస్తున్నది కాబట్టి.)


అంటే ఇక్కడ గురువు చెపుతున్నమాట - ఆత్మకి జీవత్వముతో సంబంధము బుద్ది వలన  ( పొరపాటుగా) కలిగినది ఈ  సంబంధము అని:


గురువు ఇది పొరపాటు అని ఎలా చెపుతున్నాడు?. పొరపాటా కాదా అన్న సందేహము వుంటే అసలు సంగతి చూడాలి. అలాగే గురువు ఆత్మ యొక్క అసలు స్వరూపము విశదీకరించి - జీవత్వము ఆత్మ యొక్క సహజమైన లక్షణము కాదు అని చెప్పి, చేసిన పొరపాటు ముందు పెడతాడు..  


జీవత్వం న తతోఽన్యత్ - జీవత్వం న తతో అన్యః తు - తతః అన్యత్ జీవత్వమ్ న తు -

ఆ ఇంకోటిది  (అంటే) ఆత్మ, జీవత్మము లా కాదు>


ఎందుకు కాదు ? అది జీవత్వము ఆత్మ లక్షణము కాదు కాబట్టి : 


స్వరూపేణ విలక్షణమ్  - 

అత్మస్వరూపమునకు ( జీవత్వము) విరుద్ధము. 


ఇక్కడ చెప్పినది, మళ్ళీ మెల్లిగా అర్థము చేసుకుందాము.

ఆత్మ అంటే అందరికి తెలిసిన మాట. అందులో ఒకమాట ఆత్మ సుఖదుఃఖాలకి అతీతము. జీవత్వము సుఖదుఃఖాల మూట. అంటే ఆత్మ, జీవత్వము లా కాదు. అంటే జీవత్వము ఆత్మ స్వరూపమునకు విరుద్ధము.


మరి ఈ సంబంధము ( శిష్యుడు అడిగిన ప్రశ్న) ఎలా వచ్చింది అన్నది , సమాధానము పూర్తి చెయ్యడానికి , గురువు ఈ శ్లోకములో చివరి మాట చెపుతున్నాడు.


సమ్బన్ధఃస్వాత్మనో బుధ్యా - 

సంబన్ధః తు ఆత్మనం బుధ్యా

ఆ ఆత్మతో సంబంధము బుద్ధి చేత కలిగినది 


బుద్ధి కి ఎలా కలిగింది ఈ ఆలోచన? - 


మిథ్యా జ్ఞానపురస్సరః

మిథ్యా జ్ఞానము వలన కలిగిన ది


ఆత్మకి జీవత్వముతో సంబంధము లేదు. 

అది బుద్ధి కి పుట్టిన మిథ్యా జ్ఞానము వలన ఆత్మకి జీవత్వముతో సంబంధము వున్నది అని అనుకుంది.


అడుగులో అడుగు పెట్టి చిన్నబాలుని నడిపించినట్లు,

ఈ రెండు శ్లోకాలలో మనకి గురువు చెప్పినది, చాలా సులభమైన మాట. 


ఆత్మకి జీవత్వము లేదు. ఆత్మ జీవుడి సుఖదుఃఖాలకి అతీతము. ఆత్మకి జీవత్వము వున్నది అనుకోవడము మిథ్యా జ్ఞానము వలన కలిగినది. అది తెలిసిన వెంటనే మనకి తెలిసేది , ఈ జీవత్వానికి ఆది లేకపోయినా అంతము వుంది. ఆ అంతమే మోక్షము. ఆ మోక్షప్రాప్తి తో కూడిన అంతము ఎలావస్తుంది అన్నది ముందు శ్లోకాలలో.


||ఓమ్ తత్ సత్||

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            


ఆదిలేని జీవత్వము అంతము అవదు కదా అప్పుడు మోక్షము ఎలావస్తుంది అని, శిష్యుడి అనుమానము ( శ్లోకము 194)  అదే ప్రశ్న కూడా. 


 దానికి సమాధానముగా  గురువు భ్రాన్తిలో ఆదిలేనిది, భ్రాన్తి పోతే  అంతమౌతుంది.  అని చెప్పి, తను చెప్పిన మాటని బలపరచే ఉదాహరణలు చెపుతాడు. 


ఏమిటా ఉదాహరణలు అంటే  అవి - ఆది లేక పోయినా అంతము అయ్యే విషయాలు. 


ఉదాహరణలలో ముఖ్యమైనది అజ్ఞానము. 


అజ్ఞానముకు మొదలు లేదు. ఆ అజ్ఞానము పోయే దాకా దానికి అంతము లేదు. కాని జ్ఞానము వచ్చినవెంటనే అజ్ఞానము పోతుంది ( నాశనమౌతుంది !!!). 


అంటే ఆది లేని అజ్ఞానము, జ్ఞానము వచ్చినవెంటనే పూర్తిగా నశించి పోతుంది. 


అలాగే ఆదిలేని జీవభావము కూడా, బ్రహ్మ జ్ఞానము రాగానే, జీవభావము నశించి పోతుంది అన్నమాట.


అలాగే ఇంకో ఉదాహరణ. మనము నిద్రలో నిజము అనిపించే స్వప్నము చూస్తాము. స్వప్నము చూస్తున్నంతవరకూ , నిద్రలో వున్నమనకు ఎప్పటినుంచి చూస్తున్నామో తెలియదు. ఆ స్వప్నానికి మొదలు లేదు. .. కాని..   నిద్ర లేవగానే ఆ స్వప్నము పూర్తిగా పోతుంది మనము మన శయనమందిరములోనే లేస్తాము.   


 మూడవ ఉదాహరణ కొంచెము కఠినముగా వుండవచ్చు. ఈ ఉదాహరణలలో మట్టి  మట్టికుండ కూడా వస్తాయి. వేదాంత పరిభాషలో మట్టి, మట్టికుండ అన్న మాటలు చాలా ప్రఖ్యాతి గలవి.  వీటికి తోడుగా ( ఏదో ఒకటి)  వున్నది’, ’లేదు’ అన్నమాటలు కూడా వస్తాయి. ఇక ఉదాహరణ విందాము.


ఒక వస్తువు లేదు అన్నమాటకి మొదలులేదు. కుండ లేనప్పుడు కుండలేదు అన్నమాటకి మొదలు అంటూ లేదు ( కుండ లేక ముందు ఎప్పుడు అలోచించినా కుండ లేదు. ఇక్కడ ( కుండ) లేదు అన్నభావము నకు  మొదలు కనపడదు...  కాని.... ఎప్పుడైతే కుమ్మరి ఒక కుండ చేస్తాడో ...  అప్పుడు కుండలేదు అన్న భావము పోయి అహా ఇక్కడ కుండ వుంది అనే భావము మొలస్తుంది.   


అంటే ఇక్కడ ఆది లేని, అంటే మొదలు లేని (కుండ)"లేదు" అన్న భావము, (నాశనమై) పోయి - కుండ "వున్నది" అన్న సరికోత్త భావము వచ్చింది కదా ! 


ఆ ( కుండ ) వున్నది అని తెలిసినవెంటనే ,  (కుండ) లేదు అన్నభావము నాశనమౌతుంది.


ఈ మాటలే ,  రెండు శ్లోకాలలో ( 201, 202)  గురువు శిష్యుడికి చెపుతున్నాడు. ఈ శ్లోకాలలో గురువు విశదీకరించినది   ఒకటే మాట అది -  ఆది లేకపోయినా అంతము వుండవచ్చు అని మాత్రమే. అంతము తర్వాతమోక్షము గురించి వేరే చెపుతాడు  



శ్లోకము 200

అనాదిత్వం అవిద్యాయాః

కార్యస్యాపి తథేష్యతి|

ఉత్పన్నా తు విద్యాయామ్

అవిద్యకమ్ అనాద్యపి ||200||


ఇక్కడ అవిద్య అంటే అజ్ఞానము. గురువు అజ్ఞానము గురించి  చెపుతున్నాడు.


అనాదిత్వం అవిద్యాయాః -

అవిద్యయొక్క అనాదిత్వము


కార్యస్యాపి తథేష్యతి|

దాని కార్యములు కూడా అదేవిధముగా వుండును.


అవిద్య లేక అజ్ఞానము యొక్క అనాదిత్వము తెలిసినదే. అజ్ఞానము వలన వచ్చే కార్యములు కూడా అదే విధముగా అంటే ఆది లేకుండా వుంటాయి. 


ఉత్పన్నా  తు విద్యాయామ్

విద్య ( జ్ఞానము) ఉత్పన్నమౌగానే


అవిద్యకమ్ అనాద్యపి

ఆదిలేకపోయిననూ అవిద్య( అజ్ఞానము)   నాశనమౌతుంది.


అంటే విద్య ఉత్పన్నమౌగానే, అంటే జ్ఞానము రాగానే, ఆది లేకపోయిననూ అవిద్య అంటే అజ్ఞానము నాశనమౌతుంది.  (జ్ఞానము రాగానే అజ్ఞానము పోతుంది అన్నమాటకి సాక్ష్యము గాని ధృవీకరణ గాని అక్కరలేదు - ఇది తెలిసిన మాట)


దీని తాత్పర్యము :  ఆది లేని అజ్ఞానము, జ్ఞానము రాగానే  ఎలాగపోతుందో అలాగే ఆది లేని జీవభావము కూడా,  జ్ఞానము లేక బ్రహ్మ జ్ఞానము రాగానే నశించి పోతుంది అని.


ఇక రెండవ శ్లోకము.


||శ్లోకము 201||


ప్రబోధే స్వప్నవత్ సర్వం

సహమూలం వినశ్యతి|

అనాద్యపి ఇదం నో నిత్యమ్

ప్రాగభావ ఇవ స్ఫుటమ్ ||201||


ఈ శ్లోకములో ముందు స్వప్నము గురించి వింటాము.


ప్రబోధే స్వప్నవత్ సర్వం

లేచిన వెంటనే స్వప్నము అంతా


సహమూలం వినశ్యతి|

మూలముతో సహా పూర్తిగా నశించిపోవును


అనాద్యపి ఇదం నో నిత్యమ్

ఆదిలేకపోయినప్పటికీ  అది నిత్యము కాదు


ప్రాగ్ అభావ ఇవ స్ఫుటమ్|

 వచ్చినవెంటనే నాశనమైన "లేనిది" అనే అభావము వలె, స్పష్టముగా ( స్పష్ఠముగా అంటే అనుమానము లేకుండా అభావము నాశనమౌతుంది అని) .


నిద్ర నుంచి లేచిన వెంటనే స్వప్నము అంతా మూలముతో సహా పూర్తిగా నశించిపోవును. ఆది లేకపోయినప్పటికీ  అది నిత్యము కాదు.  ఎలాగ?


ఒక విషయము లేనిది అన్న భావము, అంటే  అభావము,  ఆ విషయము వచ్చిన వెంటనే  "లేనిది" అనే అభావములాగా అంతము అవుతుంది. అలాగ నిద్రలో వచ్చిన స్వప్నము నిద్రలేవగానే నాశనమౌతుంది  


ఇక్కడ ఆది లేకపోయినా నాశనమైన ఉదాహరణలతో మనకి తెలిసేది, జీవభావము ఆది లేకపోయినా  అది నాశనము కాదేమో అన్న భయము అక్కర లేదు అని. 


ఇక్కడ చెప్పినది జీవభావము నకు ఆది లేకపోయినా దానికి అంతము వుండవచ్చు అని. 


జీవభావముకి మోక్షము ఎలావస్తుంది?  అన్నప్రశ్నలకి ముందు శ్లోకాలలో సమాధానము చెపుతాడు గురువు.


||ఓమ్ తత్ సత్||






||ఓమ్ తత్ సత్||










 






 






వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203

Om tat sat !

 

 

 

    •