!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 204-205
||ఓమ్ తత్ సత్||
వివేక చూడామణి శ్లోకములు 204-205
వినివృత్తిః భవేత్ తస్య
సమ్యగ్ జ్ఞానేన నాన్యథా|
బ్రహ్మాత్వైకత్వవిజ్ఞానం
సమ్యగ్ జ్ఞానం శ్రుతేః మతమ్|| 204||
తదాత్మా ఆనాత్మనోఃసమ్యక్
వివేకేనైవ సిద్ధ్యతి|
తతో వివేకః కర్తవ్యః
ప్రత్యగాత్మాఽసదాత్మనోః ||205||
ముందు శ్లోకములో - ఆత్మకి జీవత్వముతో సంబంధము లేదు. బుద్ధి కి పుట్టిన మిథ్యా జ్ఞానము వలన ఆత్మకి జీవత్వముతో సంబంధము వున్నది అని అనుకుంది. మరి మిథ్యా జ్ఞానము ఎలా పోతుంది ?
గురువు ఈ మాట, అంటే మిథ్యా జ్ఞానము పోవడము ఎలా అన్నది, విశదీకరిస్తున్నాడు 204 వ శ్లోకములో.
వినివృత్తిః భవేత్ తస్య
సమ్యగ్ జ్ఞానేన నాన్యథా|
తస్య వినివృత్తిః భవేత్ -
దాని ( మిథ్యాజ్ఞానము) నివృత్తి అవుతుంది
ఎప్పుడు?
సమ్యగ్ జ్ఞానేన నాన్యథా;
సరి అయిన జ్ఞానముతో , ఇంకో మార్గము లేదు.
అజ్ఞానము పోవడానికి జ్ఞానము కావాలి, ఇంకో మార్గము లేదు. అలాగే ఇక్కడ ఒక దాని గురించి మిథ్యా జ్ఞానము పోవడానికి దానికి సరితూగిన జ్ఞానము కావాలి. ఇక్కడ మనకి కావలసినది ఆత్మ గురించి .దానికి కావలసిన జ్ఞానము గురించి చెపుతాడు గురువు
బ్రహ్మాత్వైకత్వవిజ్ఞానం
సమ్యగ్ జ్ఞానం శ్రుతేః మతమ్|| 204||
బ్రహ్మాత్వైకత్వవిజ్ఞానం -
బ్రహ్మయు జీవాత్మయు ఒక్కటే అనే జ్ఞానము
సమ్యగ్ జ్ఞానం శ్రుతేః మతమ్-
తగిన జ్ఞానము అని శ్రుతులలో చెప్పబడినది.
అంటే బ్రహ్మయు జీవాత్మయు ఒక్కటే అనే జ్ఞానము, తగిన జ్ఞానము అని శ్రుతులలో చెప్పబడినది అని.
శ్రుతులలో అహం బ్రహ్మాస్మి అని ; ’అయం అత్మా బ్రహ్మ’, అని విన్నాము. అదే సరి అయిన జ్ఞానము. అట్టి సమ్యక్ జ్ఞానమే మిథ్యా జ్ఞానము తొలగించకలదు అని గురువు చెపుతున్నాడు.
ఈ 204 తాత్పర్యము:
"సరి అయిన జ్ఞానముతో దాని ( మిథ్యాజ్ఞానము) నివృత్తి అవుతుంది , ఇంకో మార్గము లేదు. దానికి బ్రహ్మయు జీవాత్మయు ఒక్కటే అనే జ్ఞానము, సరి అయిన జ్ఞానము అని శ్రుతులలో చెప్పబడినది."
శ్రుతులలో చెప్పబడిన మాట ఎలా ఉపయోగించాలి అంటే 205 వ శ్లోకము విందాము
తదాత్మా ఆనాత్మనోః
సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి|
తతో వివేకః కర్తవ్యః
ప్రత్యగాత్మాఽసదాత్మనోః||205||
తదాత్మా ఆనాత్మనోః
సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి|
తదాత్మా ఆనాత్మనోః -
ఆత్మ అనాత్మల జ్ఞానము ( వాటి భేదములు)
సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి
మంచి వివేకము చేతనే సిద్ధించును
అంటే ఆత్మ అనాత్మల జ్ఞానము, వాటి భేదములు, వివేకము ( బుద్ధి) చేతనే సిద్ధించును.
తతో వివేకః కర్తవ్యః
ప్రత్యగాత్మాఽసదాత్మనోః||
తతః - అందువలన
ప్రత్యగాత్మాఽసదాత్మనోః -
ఆత్మా జీవాత్మల ( అంటే మన అంతః కరణ గా వుండే ఆత్మ లాగే జీవాత్మల గురించి
వివేకః కర్తవ్యః -
వివేకము సంపాదించతగినది.
అందువలన ఆత్మ జీవాత్మల వివేకము సంపాదించతగినది..
అంటే పూర్తి శ్లోకము 205 తాత్పర్యము
అంటే ఆత్మ అనాత్మల జ్ఞానము, వాటి భేదములు, వివేకము ( బుద్ధి) చేతనే సిద్ధించును. అందువలన ఆత్మ జీవాత్మల వివేకము సంపాదించతగినది. అది తాత్పర్యము.
అంటే 194 వ శ్లోకములో శిష్యుడు అడిగిన ప్రశ్న, ఆత్మ నాత్మల భేదము తెలిసి కోకుండా అడిగిన ప్రశ్న అన్నమాట. ఆత్మ నాత్మలబేధము తెలిస్తే , ఆదిలేని జీవత్వమునకు అంతము వుండదు అని నిర్ధారించుకొని , మోక్షము రాదా అన్నప్రశ్న వచ్చేది కాదు.
గురువు , ఆత్మ నాత్మల భేదము తెలిసికొనిరా అని చెప్ప కుండా , మొదట ఆ ప్రశ్నలో వున్న మిడి మిడి జ్ఞానము తొలగించి ( ఆది లేకపోయినా అంతము వుండవచ్చు అని చెప్పి, దానికి ఉదాహరణలు కూడా ఇచ్చి) , గురువు నువ్వు ఆత్మ నాత్మ జ్ఞానము ఇంకా సంపాదించాలి అని చెపుతాడు.
అంటే ముందు శ్లోకములలో ఆత్మ నాత్మల భేదము గురించి ఇంకా గురువు బొధిస్తాడన్నమాట.
||ఓమ్ తత్ సత్||
||ఓమ్ తత్ సత్||