!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 206-207

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 206-207


జలం పంకవద్ అత్యంతమ్ 

పంకాపాయే జలస్ఫుటం|

యథా భాతి తథాత్మాపి

దోష అభావే  స్ఫుటప్రభః|| 206||


అసన్నివృత్తౌతు సదాత్మనః స్ఫుటమ్

ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః|

తతో నిరాసః కరణీయ ఏవ

సదాత్మనః సాధ్వహమాది వస్తునః|| 207||


శ్లోకము 206


జలం పంకవద్ అత్యంతమ్ 

చాలా పంకము ( మాలిన్యము) తో కూడిన జలము, 


పంకాపాయే జలస్ఫుటం 

పంకము( మాలిన్యము)  తీయబడగానే జలము స్పష్టముగా ప్రకాశించును.


యథా భాతి - ఎలా ప్రకాశించునో

తథాత్మాపి - అలాగే ఆత్మకూడా


దోష అభావే  స్ఫుటప్రభః

దోషము లేకున్నప్పుడు స్పష్టముగా ప్రకాశించును.


అంటే  శ్లోకము యొక్క తాత్పర్యము - 

- అత్యంత మాలిన్యము తో కూడిన జలము మాలిన్యము తీయబడగానే, జలము స్పష్టముగా  ఎలా ప్రకాశించునో - అలాగే ఆత్మకూడా దోషము లేకున్నప్పుడు స్పష్టముగా ప్రకాశించును.


ఈ తాత్పర్యముతో మనకి తెలిసేది -  ఆత్మలో అహంకారము లాంటి అన్ని దోషాలు వదిలేయాలి , అప్పుడే ఆత్మ ప్రకాశించును. అదే మాట ముందు శ్లోకములో చెపుతాడు గురువు.


శ్లోకము 207


అసన్నివృత్తౌతు సదాత్మనా స్ఫుటమ్

ప్రతీతిరేతస్య భవేత్ ప్రతీచః|

తతో నిరాసః కరణీయ ఏవ

సదాత్మనః సాధ్వహమాది వస్తునః|| 207||



అసన్నివృత్తౌతు - 

అసత్తులన్నీ నివర్తించిన పిమ్మట


సదాత్మనః స్ఫుటమ్ ప్రతీతిః 

పరమాత్మయొక్క స్ఫుటమైన స్వరూపము (జ్ఞానము)


భవేత్ ప్రతీచః -  ప్రకాశించును


అంటే అసత్తులు , అదే అనాత్మకి సంభంధించిన  వస్తువులు విడతీస్తే, అంటే వదిలేస్తే, పరమాత్మ యొక్క స్ఫుటమైన స్వరూపము ప్రకాశించును.


అయితే మనము చేయవలసినది ఏమిటి?


తతో నిరాసః కరణీయ ఏవా

అందువలన వదలివేయడము చేయవలసినదే


ఏవి వదిలేయాలి?


సదాత్మనః సాధు అహమాది వస్తునః|

ఆత్మ భావమునుండి అనిత్యమగు అహం అనబడే వస్తువులను


అంటే, ఇక్కడ తాత్పర్యము -  అసత్తులన్నీ నివర్తించిన పిమ్మట పరమాత్మయొక్క స్ఫుటమైన స్వరూపము (జ్ఞానము) ప్రకాశించును కనుక ,   ఆత్మ భావమునుండి అనిత్యమగు అహం అనబడే వస్తువులను వదలి వేయవలసినదే.


రెండు శ్లోకాలు కలిపితే,


అతంత మాలిన్యము తో కూడిన జలము, మాలిన్యము తీయబడగానే,  స్పష్టముగా  ఎలా ప్రకాశించునో - అలాగే ఆత్మకూడా దోషము లేకున్నప్పుడు స్పష్టముగా ప్రకాశించును. అందువలన మనము ఆత్మలో దూరే అనాత్మవస్తువులను  వదిలి వేయవలెను అని. 

అనాత్మ ఎప్పుడు అంతమౌతుందో అప్పుడు మనకి ఆత్మ స్వరూపము స్పష్టముగా కనిపించును.


అందుకని , అనాత్మ వస్తువులను ఇవి కాదు కాదు అనుకుంటూ వదలివేయవలెను.


ఇదంతా విజ్ఞానకోశము లో వచ్చిన మాటలు. మరి, విజ్ఞానకోశము అత్మా స్థానమా అన్నమాటకి, సమాధానము ముందు శ్లోకములో వింటాము


___________________________________________________

 

||ఓమ్ తత్ సత్||















 






 







వివేక చూడామణి

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207

Om tat sat !

 

 

 

    •