!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 214-216

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి  శ్లోకములు 214- 216


శ్లోకము 214


212-213 శ్లోకాలలో గురువు పంచకోశములకు అతీతమైన ఆత్మ గురించి చెప్పాడు. దాని మీద శిష్యుడు కి మళ్ళీ ఒక్క అనుమానం వస్తుంది . అది 214 శ్లోకములో  శిష్యుడు  ప్రశ్నలాగా వస్తుంది. 215-216 లో గురువు సమాధానము వింటాము. 


శ్లోకము 214

శిష్య ఉవాచ,


మిధ్యాత్వేన నిషిద్ధేషు కోశేషు ఏతేషు పంచసు|

సర్వ అభావం వినా కించిత్ న పశ్యామత్ర హే గురో|

విజ్ఞేయం కిము వస్వస్తి స్వాత్మానాత్ర విపశ్చితా||


మొదటి పాదము:

మిధ్యాత్వేన నిషిద్ధేషు కోశేషు ఏతేషు పంచసు


కోశేషు ఏతేషు పంచసు - ఈ పంచ కోశములలో 

మిధ్యాత్వేన నిషిద్ధేషు  - మిధ్యతో కూడినదగుటచే నిషేధింపబడి


రెండవ పాదము:

సర్వ అభావం వినా కించిత్ న పశ్యామత్ర హే గురో |


సర్వ అభావం వినా  - 

సర్వ అభావము తప్ప లేక శూన్యత్వము  తప్ప


కించిత్ న పశ్యామత్ర హే గురో - 

ఓ గురువర్యా, ఇంకేమీ చూడజాలకున్నాను


అంటే ఇక్కడ రెండుపాదాల తాత్పర్యము- 

ఓ గురువర్యా ఈ పంచకోశములలో మిధ్యతో కూడినదగుటవలన ఆత్మ లేదు అని , పంచకోశములు నిషేధింపబడగా, మిగిలినది శూన్యత్వము తప్ప ఇంకేమి చూడజాలకున్నాను . ( అంటే ఆత్మ వస్తువు అన్నది ఏది  అని?


మూడవ పాదము:

విజ్ఞేయం కిము వస్వస్తి స్వాత్మానాత్ర విపశ్చితా||


అంటే 


విజ్ఞేయం కిము వస్తుః అస్తి 

స్వ ఆత్మనా అత్ర విపశ్చితా||


స్వ ఆత్మనా అత్ర విపశ్చితా -

విపశ్చితా అత్ర స్వ ఆత్మనా 

పండితునిచే ఇక్కడ స్వయముగా 


విజ్ఞేయం కిము వస్తుః అస్తి -

తెలిసికొనతగిన వస్తువు ఏది?


అంటే ఇక్కడ శిష్యుడు అడుగుతున్నమాట:


"ఓ గురువర్యా ఈ పంచకోశములలో మిధ్యతో కూడినదగుటవలన ఆత్మ లేదు అని , పంచకోశములు నిషేధింపబడగా, మిగిలినది శూన్యత్వము తప్ప ఇంకేమి చూడజాలకున్నాను . 

ఇక్కడ పండితునిచే స్వయముగా  తెలిసికొనతగిన వస్తువు ఏది? "


కోశములన్నీ నిషేధింపబడినప్పుడు మిగిలిన శూన్యత్వములో ఏమీకనపడ లేని అవస్థలో తెలిసికొనతగినది ఏది  అని శిష్యుడి అనుమానము ప్రశ్న.


శ్లోకము 215- 216

గురు ఉవాచ,

సత్యముక్తం త్వయా విద్వన్ 

నిపుణోఽసి విచారణే|

అహం ఆది వికారాః తే 

తదభావోఽయమప్యథ||215||


సత్యముక్తం త్వయా విద్వన్ -

ఓ విద్వాంసుడా నీవు సత్యమే చెప్పితివి


నిపుణోఽసి విచారణే - 

ఆలోచించుటలో నేర్పరి కలవాడవు


తే అహం ఆది వికారాః తే -  

ముందు అనుభవింపబడిన  ఆ అహంకారము మున్నగు వికారములు 


తదభావోఽయమప్యథ - 

తత్  అభావో  అపి అయం - అవి లేనప్పటికి ఈ మిగిలినది 


"ఓ విద్వాంసుడా, ఆలోచించుటలో నేర్పరి కలవాడవు, నీవు సత్యమే చెప్పితివి. ముందు  అనుభవింపబడిన  ఆ అహంకారము మున్నగు వికారములు లేనప్పటికి , ఇది మిగిలినది .." 

ఇక్క ఆ మిగిలిన వస్తువు గురించి రెండవ శ్లోకములో వస్తుంది.

 


సర్వే యేనానుభూయన్తే  

యః స్వయం నానుభూయతే|

తం ఆత్మానం వేదితారం విద్ధి

 బుధ్యా సుసూక్ష్మయా||216||


సర్వే యేనానుభూయన్తే  -  

సర్వే ఏన అనుభూయన్తే

అవన్నీ ఎవరిచేత అనుభవింపబడినవో


యః స్వయం నానుభూయతే - 

యః స్వయం న అనుభూయతే 

ఏది స్వయముగాఆనుభవించదో


తం ఆత్మానం వేదితారం విద్ధి

తం వేదితారం ఆత్మానం విద్ధి

దానిని అన్నీతెలిసిన ఆత్మ గా తెలిసికొనుము


బుధ్యా సుసూక్ష్మయా - మిక్కిలి సూక్ష్మమైన బుద్ధితో ..

అంటే అది ఆత్మ అని ఎలా తెలుస్తుంది అంటే ఏకాగ్రచిత్తముతో పై చెప్పినమాటను  అర్థము చేసికొనవలెను అని.


అంటే  ఈ శ్లోక తాత్పర్యము -


"ఏది అహంకారము మొదలగువానిని స్వయముగా అనుభవించదో, అవన్నీ ఎవరిచేతనో అనుభవింపబడినవి అని సాక్షిగా చూచునో, దానిని  సునిశితమైన సూక్ష్మమైన  బుద్ధితో,  అన్నీ తెలిసిన అత్మగా తెలిసికొనుము".


ఇక్కడ కొన్ని ఆలోచనలు వున్నాయి వస్తాయి కూడా.


ఇది కాదు  ఇది కాదు అంటూ అన్నింటినీ  (ఐదు కోశములను) నిషేధించబడిన తరువాత మిగిలేది శూన్యత్వమే. 


అది శూన్యత్వము అని గ్రహించినది ఏవరు? 


ఆ మిగిలినది శూన్యత్వము అని గ్రహించినదే ఆత్మ .


ఈ అలోచన సునిశితమైన బుద్ధి యొక్క ఆలోచనతో వస్తుంది.


ఇక్కడ ఒక చిన్న మాట.

శిష్యుడు , పంచకోసములు నిషేధింపగా తనకి శూన్యత్వమే కనిపించుచున్నది అని అన్నాడు.

ఆ శూన్యత్వమును  గ్రహించినదే ఆత్మ అని అన్నప్పుడు, శూన్యత్వాన్ని గ్రహించిన్ అశిష్యుడే సాక్షి , ఆత్మ అని. 


గురువు శిష్యుడిని ఆత్మ విచారణలో విద్వాంసుడా అన్నప్పుడు , కొంచెము వెటకారము ధ్వని వినపడినా, శిష్యుడు మిగిలినది శూన్యత్వము అని గ్రహించాడు; అలాగ మనలో వుండు శూన్యత్వము గ్రహించిన శిష్యుడే సాక్షి అని ,


||ఓమ్ తత్ సత్|| 



















||ఓమ్ తత్ సత్|| 































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216

Om tat sat !

 

 

 

    •