!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 232-233

||ఓమ్ తత్ సత్||


వివేక చూడామణి  శ్లోకములు 232- 233 


ముందు శ్లోకాలలో ( 230,231 లో) గురువు మట్టి కుండల ఉదాహరణతో , ఒకే మట్టి పదార్థము వేరు వేరు కుండల బొమ్మల రూపములతో భిన్నముగా కనిపించినా,  యదార్థానికి అవన్నీ మట్టి తో కూడినవే కదా, బ్రహ్మకి కూడా ఆ కుండలలో  మట్టిలేదు అవి మట్టివి కావు అని చెప్పడము సాధ్యముకాదు అని చెపుతూ,  ఆ ఉదాహరణతో ప్రపంచానికి బ్రహ్మముకు సారూప్యము విశదీకరిస్తాడు ముందు శ్లోకాలలో . 


శ్లోకము 232 


సత్ బ్రహ్మ కార్యం సకలం సదైవ

సన్మాత్రమేతత్ న తతోఽన్యత్ అస్తి |

అస్తీతి యో వక్తి  న తస్య మోహో

వినిర్గతో నిద్రితవత్ జల్పః||232||


సత్ బ్రహ్మ కార్యం సకలం - 

సద్రూపమైన బ్రహ్మయొక్క కార్యమైన ఈ సకల ప్రపంచమూ;


సదైవ - సద్రూపమే;   


అంటే మట్టి తో చేయబడిన కుండల సముదాయమంతా  మట్టియే  అన్నట్లు, సద్రూపమైన బ్రహ్మయొక్క కార్యమైన ఈ సకల ప్రపంచమూ సద్రూపమే, బ్రహ్మమే.


సన్మాత్రమేతత్ న తతోఽన్యత్ అస్తి 


సత్ మాత్రం ఏతత్ , తతః అన్యత్ న అస్తి -

ఇది బ్రహ్మ రూపమే, ఇంకొకటి కాదు.


అస్తీతి యో వక్తి  న తస్య మోహో

వినిర్గతో నిద్రితవత్ జల్పః


అస్తీతి యో వక్తి   - బ్రహ్మము కన్నా భిన్నము గా వున్నది  అని ఎవరు చెపుతాడో


న తస్య మోహో వినిర్గతో  - 

అట్టివాడి మోహము ( అజ్ఞానము) తొలగి పోలేదు.


నిద్రితవత్ జల్పః - నిద్రించినవాడి  ప్రేలాపనల వలె.


తాత్పర్యము:


అంటే మట్టి తో చేయబడిన కుండల సముదాయమంతా  మట్టియే  అన్నట్లు, సద్రూపమైన బ్రహ్మయొక్క కార్యమైన ఈ సకల ప్రపంచమూ సద్రూపమే. బ్రహ్మము కన్నా భిన్నమైనది అని ఎవరు చెపుతాడో, అట్టివాడి  అజ్ఞానము తొలగి పోలేదు. అట్టివాడి మాటలు నిద్రలో ఉన్నవాడి  ప్రేలాపనల వలెన( అర్థము లేనివి అని)


కొన్నిచోటల ఉపాదానము ఉపాదేయము అన్న మాటలగురించి వింటాము. ఉపాదానము అన్నది ఒక వస్తువు కు కారణము. కుండకావాలి అంటే మట్టి కావాలి. అంటే మట్టి ఉపాదాన కారణము. మట్టిలోంచి పుట్టిన కుండ ఉపాదేయము. ఉపాదేయములు ( కుండలు),  ఉపాదాన కారణము ( మట్టికన్నా) భిన్నముగా వుండవు.  కుండలు మట్టి ఉదాహరణ లో, అన్ని కుండలలో మట్టి వున్నది కాబట్టి , మట్టి యే సత్యము. అంటే ఉపాదేయము ఉపాదానములలో , ఉపాదానకారణమే సత్యము.


కుండలు బదులు ప్రపంచము, మట్టి బదులు బ్రహ్మము రాస్తే  మనము వినేది -  ఉపాదేయములు ( ప్రపంచము),  ఉపాదాన కారణము ( బ్రహ్మము) భిన్నముగా వుండదు. అంటే ప్రపంచము బ్రహ్మ స్వరూపమే.  అపాదాన కారణమే సత్యము అన్నది ఇక్కడ బ్రహ్మమే సత్యము అని.  అదే బ్రహ్మ సత్యం జగత్ మిధ్యా అని అంటారు.


అది ముందు శ్లోకములో.


 శ్లోకము -233


బ్రహ్మైవ ఇదం విశ్వమిత్యేవ వాణీ

శ్రౌతీ బ్రూతే అథర్వనిష్ఠా వరిష్ఠా|

తస్మాత్ ఏతత్ బ్రహ్మమాత్రం హి విశ్వం

న అధిష్ఠానాత్ భిన్నతా అరోపితస్య ||233||


బ్రహ్మైవ ఇదం విశ్వమితి- 

ఈ ప్రపంచము అంతయూ బ్రహ్మమే అని 


వాణీ శ్రౌతీ బ్రూతే అథర్వనిష్ఠా వరిష్ఠా- 

అథర్వవేదముతో కూడిన శ్రేష్ఠమైన వాక్కు చెప్పబడుచున్నది


అంటే ఈ ప్రపంచము అంతయూ బ్రహ్మమే అని అథర్వవేదముతో కూడిన శ్రేష్ఠమైన వాక్కు చెప్పబడుచున్నది. 


తస్మాత్ - అందువలన


 ఏతత్ బ్రహ్మమాత్రం హి విశ్వం - 

ఈ ప్రపంచము బ్రహ్మము మాత్రమే.


న అధిష్ఠానాత్ భిన్నతా అరోపితస్య - 

అధిష్టానముకన్నా భిన్నమైన అరోపింపబడినది కాదు.


అరోపింపబడినది కాదు అంటే పైపైకి కనపడే వస్తు స్వరూపము కాదు.  అధిష్టానము కన్నా అంటే సృష్టికి కారణమైన బ్రహ్మము కన్నా అని. 


అంటే, ఈ ప్రపంచము బ్రహ్మము మాత్రమే. సృష్టికి కారణమైన బ్రహ్మము కన్నా పైపైకి కనపడే వస్తు స్వరూపము కాదు అని. 


ఈ ప్రపంచము అంతయూ బ్రహ్మమే అని అథర్వవేదముతో కూడిన శ్రేష్ఠమైన వాక్కు చెప్పబడుచున్నది.  అందువలన ఈ ప్రపంచము బ్రహ్మము మాత్రమే. సృష్టికి కారణమైన బ్రహ్మము కన్నా పైపైకి కనపడే వస్తు స్వరూపము కాదు అని. 


|| ఓమ్ తత్ సత్||









































































































 






 








వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233

Om tat sat !

 

 

 

    •