Sundarakanda Chapter 51

Hanuman advises Ravana to return Sita !

Chapter 51:

Summary : Hanuman starts by conveying the best wishes of Sugriva the King of Vanaras on whose behalf he is giving the message. Then he recounts the story of SriRama and the friendship of SriRama and Sugriva . He tells Ravana that no body can face the might of SriRama and Lakshmana. He praises Ravana's own efforts and the boon he acquired through penance of being free of death from Devas, Gandharvas etc. Hanuman tellingly reveals that Sugriva being a Vanara belongs none of those groups. SriRama too is only Human. Then he tells Ravana that he cannot escape death at the hands of Srirama !!

For telugu Home page

click here

సుందరకాండ
ఏబదిఒకటవ సర్గము

తం సమీక్ష్య మహాసత్త్వం సత్త్వవాన్ హరిసత్తమః|
వాక్యమర్థవదవ్యగ్రః తమువాచ దశాననమ్ ||

తా|| మహా పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి బలవంతుడగు ఆ రావణునిచూచి ఎట్టి భయములేకుండా అర్థవంతములైన మాటలతో ఇట్లు పలికెను.

అహం సుగ్రీవ సందేశాత్ ఇహప్రాప్త స్తవాలయమ్ |
రాక్షసేంద్ర హరీశస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్ ||
భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః|
ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర చ క్షమమ్ ||

తా|| సుగ్రీవుని సందేశముతో నీ లంకానగరమునకు వచ్చితిని. సోదరునివలె హితము గోరు వానరరాజైన ఆ సుగ్రీవుడు రాక్షరాజైన నీ క్షేమసమాచారములను అడిగెను. మహాత్ముడు నీ సోదరతుల్యుడైన సుగ్రీవుని సందేశము వినుము. ఇది ధర్మార్థములతో గూడినది. ఇహపలోకములందు శ్రేయస్సును గూర్చునది"

రాజా దశరథో నామ రథ కుఙిరవాజిమాన్ |
పితేవ బంధుః లోకస్య సురేశ్వర సమద్యుతిః ||
జ్యేష్ఠస్తస్య మహాబాహుః పుత్రః ప్రియకరః ప్రభుః |
పితుర్నిదేశాన్నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనమ్ ||
లక్ష్మణేన సహ భ్రాతా సీతాయా చాపి భార్యయా|
రామోనామ మహాతేజా ధర్మ్యం పన్థానమాశ్రితః ||

తా|| దశరథుడను పేరుగల ఒక మహారాజు గలడు. ఆతడు రథాశ్వగజబలములు కలవాడు. లోకమునకు తండ్రివంటి వాడు. బంధువు ఇంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు. అతని పెద్దకుమారుడు ఆజానుబాహువు, ఎల్లఱకు ప్రియము గూర్చువాడు , రాముడను పేరు గలవాడు , మాహాతేజస్సు గలవాడు, ధర్మమార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతాదేవితో రాజ్యమువీడి దండకావనము ప్రవేశించెను.

తస్య భార్యా వనే నష్టా సీతా పతిమనువ్రతా |
వైదేహాస్య సుతా రాజ్ఞో జనకస్య మహాత్మనః ||
స మార్గమాణాస్తం దేవీం రాజపుత్రస్సహానుజః |
ఋష్యమూక మనుప్రాప్తః సుగ్రీవేణ సమాగతః||
తస్యతేన ప్రతిజ్ఞాతం సీతాయాః పరిమార్గణమ్ |
సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితమ్ ||

తా|| ఆయన భార్య సీతాదేవి మాహాసాధ్వి, వైదేహి రాజైన జనకుని కూతురు. ఆమె దండకారణ్యమునందు అపహరింపబడినది. ఆ రాజపుత్రుడు తమ్ముడైన లక్ష్మణునితో గూడి సీతాదేవిని వెదకుచూ ఋష్యమూకపర్వతము చేరి సుగ్రీవునితో కలిసెను. సీతాదేవిని వెదకించుటకు సుగ్రీవుడును వానరరాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతిజ్ఞలను పూనిరి

స సీతా మార్గణే వ్యగ్రః సుగ్రీవ సత్యసంగరః |
హరీన్ సంప్రేషయామాస దిశస్సర్వా హరీశ్వరః ||
అహం తు హనుమాన్నామ మారుతస్యౌరసస్సుతః |
సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతమ్ ||
సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగతః |
భ్రమతా చ మయా దృష్టా గృహే తే జనకాత్మజా ||

తా|| "సత్యసంధుడు వానరరాజైన ఆ సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్నిదిశలకును తన వానరులను పంపెను. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొఱకై నూఱుయోజనములు పొడవుగల సముద్రమును దాటి ఆమెజాడను తెలిసి కొనుటకై తీవ్రవేగముతో ఈ లంకకు వచ్చితిని. ఆమెను అన్వేషించుచూ తిరుగుచున్న నాకు ఆమె ఇచట కనపడినది "

కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినామ్ |
శరణామగ్రతః స్థాతుం శక్తోదేవాసురేష్వపి ||
న చాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన|
రాఘవస్య వ్యలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్||
తత్ త్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుబంధి చ|
మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతామ్ ||

తా|| కోపములోగల రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురలతో సైతము ఎవరికి శక్తి లేదు. ఓ రాజా ! ధర్మస్వరూపుడైన శ్రీరామునకు అపకారము తలపెట్టినవానికి ముల్లోకములందు సుఖము ఉండదు. అందువలన సర్వకార్యము లందు హితము గూర్చునది యు ధర్మబద్ధమైనదియూ అర్థవంతమగు నా మాటను వినుము. నరులలో దేముడైన ఆ శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము.

తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహః |
న స నాశయితుం న్యాయ్య ఆత్మప్రాణ పరిగ్రహః||

తా|| నీవు ధర్మమును ఆచరించుచూ పెక్కుకష్టములను ఓర్చుకొని తపస్సు చేసితివి. తత్ఫలితముగా మరణములేని వరము పొందితివి. అట్టి తపః ప్రభావము చేతులారా నాశనము చేసికొనుట మంచిదికాదు.

సుగ్రీవో నహిదేవోయం నాసురో న చ రాక్షసః |
న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః||
మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః|
తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి ||

తా|| సుగ్రీవుడు దేవతవర్గమునకు గాని అసురవర్గమునకు గాని , రాక్షసవర్గమునకు గాని అలాగే దానవ , గంధర్వ, యక్ష, పన్నగ వర్గములకు గాని చెందడు. శ్రీరాముడు మానవుడు. సుగ్రీవుడు కపీశ్వరుడు. కనుక రాజా నీప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు?

సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ |
రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః ||

టా|| ఓ రాక్షసరాజా నేను శ్రీరాముని దాసుడను, దూతను. ముఖ్యముగా వానరుడను . శ్రద్ధగా వినుము. నావచనములు సత్యము

బ్రహ్మ స్వయంభూశ్చతురాననో వా
రుద్రస్త్రినేత్ర స్త్రిపురాంతకో వా |
ఇంద్రో మహేంద్ర స్సురనాయకో వా
త్రాతుం న శక్తా యుధి రామవధ్యమ్ ||

తా|| శ్రీరామునిచేతిలో చావుమూడినవానిని స్వయంభువు చతుర్ముఖుడైన బ్రహ్మగాని , త్రినేత్రుడు త్రిపురాంతకుడైన రుద్రుడుగాని, మహేంద్రుడు సురపతి అయిన దేవేంద్రుడుగాని రక్షింపజాలరు.

స సౌష్ఠవోపేతమదీనవాదినః
కపేర్నిశమ్యా ప్రతిమోప్రియం వచః |
దశాననః కోప వివృత్త లోచనః
సమాదిశత్ తస్య వధం మహాకపేః ||

తా|| నిర్భయముగా మాట్లాదుచున్న హనుమంతునియొక్క స హేతుకములైన తనకు అప్రియములైన హితవచనములను విని కోపముతో ఆ రాక్షస రాజు ఆ వానరోత్తముని వధించుటకు ఆదేశించెను.

సుందరకాండ
ఏబదిఒకటవ సర్గము
సమాప్తము