Sundarakanda Chapter 52

Hanuman advises Ravana to return Sita !

Chapter 52:

Summary : hearing the words of Hanuman , an enraged Ravana orders that Hanuman be killed. Then Vibhishana tells Ravana that it is not proper to kill a messenger thus dissuading him from an evil venture.

For telugu Home page

click here

సంక్షిప్త సుందరకాండ
ఏబదిరెండవ సర్గము

తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః|
ఆజ్ఞాపయద్వధం తస్య రావణః క్రోధమూర్చితః ||

తా|| మహాత్ముడైన ఆ వానరుని ఆ మాటలువిని క్రోధముతో ఉద్రిక్తుడైన రావణుడు అతనిని వధించుటకు ఆజ్ఞాపించెను.

వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా |
నివేదితవతో దౌత్యం నానుమేనే విభీషణః||
నిశ్చితార్థస్సామ్నా పూజ్య శత్రుజిదగ్రజమ్ |
ఉవాచ హిత మత్యర్థం వాక్యం వాక్యవిశారదః ||

తా|| యజమాని మాటలు వినిపించుటయే దూతధర్మము. అందువలన దురాత్ముడైన రావణునిచేత అతనిని వధింపమని ఇచ్చిన ఆజ్ఞను విభీషణుడు అంగికరింపలేదు. అంతః శ్శత్రువులను జయించినవాడు మాటనేర్పుగలవాడు కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుని ప్రశంసించుచూ మిక్కిలి హితకరమైన వచనములను సగౌరముగా పలికెను,

క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర
ప్రసీద మద్వాక్య మిదం శ్రుణుష్వ |
వధం న కుర్వంతి పరావరజ్ఞాః
దూతస్య సంతో వసుధాధిపేంద్రః ||

తా|| ఓ రాక్షసరాజా క్షమింపుము. కోపము వీడుము.నేను చెప్పబోవు వచనములను వినుము. ఉచితాఅనుచితములనెఱిగిన వారు వచ్చిన దూతలను వధించరు.

రాజధర్మ విరుద్ధం చ లోకవృత్తేశ్చ గర్హితమ్ |
తవ చాసదృశం వీర కపేరస్య ప్రమాపణమ్ ||

తా|| దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము. లోక మర్యాద కాదు మరియు నిందింపబడు పని. ఇతడు వానరుడు. నీ వంటివానికి ఇది తగని పని.

విభీషణ వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః|
రోషేణ మహతావిష్టో వాక్య ముత్తరమబ్రవీత్ ||

తా|| రాక్షసరాజైన రావణుడు విభీషణుని మాటలు విని మిక్కిలి కోపముకలవాడై ఇట్లు ఉత్తరమిచ్చెను.

న పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన |
తస్మాదేవం వధిష్యామి వానరం పాపకారిణమ్ ||

తా|| ఓ శత్రుమర్దనా ! పాపులను వధించుట పాపము కాదు. అందువలన పాపకృత్యములొనరించిన ఈ వానరుని తప్పక వధించెదను.

అధర్మ మూలం బహుదోష యుక్తం
అనార్యజుష్టం వచనం నిశమ్య |
ఉవాచ వాక్యం పరమార్థ తత్వం
విభీషణో బుద్ధిమతాం వరిష్థః ||

తా|| అధర్మమునకు మూలము, పెక్కు దోషములుగలదియు సజ్జనులకు సమ్మతముకాని రావణుని మాటలువిని బుద్ధిమంతులలో వరిష్ఠుడైన విభీషణుడుమిక్కిలి హితకరమైన వచనములతో ఇట్లు పలికెను.

ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర
ధర్మార్థయుక్తం వచనం శ్రుణుష్వ|
దూతా న వధ్యాః సమయేషు రాజన్
సర్వేషు సర్వత్ర వదంతి సంతః ||

తా|| "లంకేశ్వరా ! ఓ రాక్షసరాజా | మన్నింపుము. ధర్మార్థయుక్తమైన నా మాటలను వినుము . ఓ ప్రభూ ఏ కాలమందైననూ ఏదేశమందైననూ ఎట్టిపరిస్థుతలలోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదరు".

సాధుర్వా యది వా సాధుః పరై రేష సమర్పితః |
బ్రువన్ పరార్థం పరవాన్ న దూతో వధమర్హతి ||
అపిచాస్మిన్ హతే రాజన్ నాన్య పస్యామి ఖేచరమ్|
ఇహ యః పునరాగచ్చేత్ పరం పారం మహోదధేః||
తస్మాన్నాస్య వధేయత్నః కార్యః పరపురంజయః|
భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్థాతు మర్హతి||

తా|| "ఇతడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువులచే పంపిబడినవాడు. ఇతడు అస్వతంత్రుడు. పరులమాటలను మాత్రమే వినిపించుచున్నాడు. కనుక ఇతడు వధార్హుడు కాడు. మరియూ ఓ రాక్షసప్రభూ ఇతనిని చంపినచో మఱియొకడు ఎవ్వడును ఈ మహోదధిని దాటి ఇటు రాగలవాడి ఉండడు అని నాకు తోచుచున్నది. ఓ శత్రుమర్దనా ! అందువలన మనము ఈతనిని వధించు ప్రయత్నము చేయరాదు. నీవు ఈ ప్రయత్నము ఇంద్రాది దేవతలపైన జఱుపుట తగును".

పరాక్రమోత్సాహమనస్వినాం చ
సురాసురాణామపి దుర్జయేవ|
త్వయామనోనందన నైరృతానాం
యుధాయతిర్నాశయితుమ్ న యుక్తా ||

తా|| "రాక్షసులకు ఆనందమును కలగించువాడా ! నీవు సురాసురులకు అజేయుడవు. పరాక్రమము ఉత్సాహము మనోబలము గల ఈ రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధావకాశమును చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు ".

నిశాచరాణామధిపోనుజస్య
విభీషణస్యోత్తమవాక్యమిష్టమ్ |
జగ్రాహ బుధ్వా సురలోకశత్రుః
మహాబలో రాక్షసరాజముఖ్యః||

తా|| రాక్షసులకు ప్రభువు దేవతలకు శత్రువు మహాబలశాలి రాక్షసరాజులలో ప్రముఖుడు అయిన రావణుడు తమ్ముడైన విభీషణుని సూచనను ఉతమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించెను.

సంక్షిప్త సుందరకాండ
ఏబదిరెండవ సర్గము
సమాప్తము