Sundarakanda Chapter 54

Burning of Lanka

Chapter 54:

Summary : Having successfully completed what he started out for Hanuman thought for a while on what more he can do. He decided that he should burn down Lanka to reduce their strength and proceeds to accomplish the same

For telugu Home page

click here

సంక్షిప్త సుందరకాండ
ఏబది నాల్గవసర్గము:

వీక్షమాణస్తతో లంకాం కపిః కృతమనోరథః |
వర్ధమానసముత్సాహః కార్యశేషమచింతయత్ |

తా|| కృత మనోరథుడైన హనుమంతుడు లంకానగరమునుచూచుచూ ఉప్పొంగుచున్న ఉత్సాహముతో మిగిలిన కార్యముగురించి ఆలోచింప సాగెను.

వనం తావత్ ప్రమధితం ప్రకృష్టా రాక్షసా హతాః |
బలైకదేశః క్షపితః శేషం దుర్గవినాశనమ్ |
దుర్గేవినాశితే కర్మ భవేత్ సుఖపరిశ్రమమ్|
అల్పయత్నేన కార్యే అస్మిన్ మమస్యాత్ సఫలశ్శ్రమః|

తా| ఆ వనము ధ్వంసమైనది. ప్రముఖులైన రాక్షసులు నిహతులైరి. సైన్యములో ఒక భాగము నశించినది. దుర్గనాశనము మిగిలనిది. దుర్గము నశింపజేసినచో నేను ఇంతవరకు చేసిన కార్యముల సుఖము లభించును. స్వల్పయత్నముతో ఈ కార్యముకూడా పూర్తిచేసినచో నా శ్రమ అంతయూ సఫలము.

తతః ప్రదీప్త లాంగూలః సవిద్యుదివతోయదః |
భవనాగ్రేషు లంకాయ విచచార మహాకపిః ||

తా|| అఫ్ఫుడు వాలాగ్ని జ్వాలలతో గూడిన హనుమంతుడు విద్యుత్కాంతులతో మెఱయుచున్న మేఘమువలె విలసిల్లుచు లంకానగరమందలి భవనాగ్రములపై సంచరింపసాగెను.

సర్వేషాం సమతిక్రమ్య రాక్షశేంద్రస్య వీర్యవాన్ |
అససాదాధ లక్ష్మీవాన్ రావణస్య నివేశనమ్ ||
తతస్మిన్ గృహేముఖ్యే నానారత్నవిభూషితే|
మేరుమందరసంకాశే సర్వ మంగళ శోభితే ||
ప్రదిప్తమగ్నిముత్సృజ్య లాంగూలాగ్రే ప్రతిష్టితమ్|
ననాద హనుమాన్ వీరో యుగాంత జలదోయదా ||

తా|| సర్వలక్షణ సంపన్నుడైన హనుమంతుడు రాక్షసవీరులందరి గృహములను అగ్నికి ఆహుతియొనరిచ్చిన పిమ్మట రాక్షసరాజైన హనుమంతుని ప్రాసాదమునకు చేరెను.అప్పుడు హనుమంతుడు నానా రత్న విభూషితమైనది , మేరుమందర పర్వతముఅలవలే ఉన్నతమైనది అన్నీ శుభలక్షణములతో మంగళమైనదియూ అగు ఆ ముఖ్యగృహమునకు లాంగూలాగ్రముతో అగ్నిని అంటించి హనుమంతుడు ప్రళయకాల మేఘమువలె గర్జించెను.

సంజజ్ఞే తుములశ్శబ్దోరాక్షసానాం ప్రధావతామ్ |
స్వగృహ్యస్య పరిత్రాణేభగ్నోత్సాహోర్జితశ్రియామ్ |
నూనమేషోగ్ని రాయాతః కపిరూపేణ హాఇతి ||

తా|| స్వగృహమును రక్షించుటకై పరుగులిడుచున్నవారునూ, ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయినవారునూ అయిన రాక్షసులు " నిజముగా అగ్ని దేవుడే వానరుని రూపములో వచ్చినాడు" అని హహా కారములు చేసిరి.

హనుమతా వేగవతా వానరేణ మహాత్మనా
లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా ||

తా|| మహాత్ముడు మహాబలపరాక్రమము గలవాడు అగు హనుమంతునిచే ఆ లంకానగరము రుద్రునిచే త్రిపురము దగ్ధమైనటుల వలె దగ్ధమాయెను.

వజ్రీ మహేంద్ర స్త్రిదశేశ్వరో వా
సాక్షాద్యమోవా వరుణోనిలోవా |
రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో
న వానరో అయమ్ స్వయమేవ కాలః |
ఇత్యేవమూచుర్బహవో విశిష్టా
రక్షోగణాస్తత్ర సమేత్య సర్వే||
స ప్రాణి సంఘాం సగృహాం సవృక్షాం
దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష్య ||

తా| ఈతడు వజ్రాయుధము ధరించినవాడు దేవతలకు ప్రభువు అగు దేవెంద్రుడో లేక సాక్షాత్తు యముడో వరుణుడో , వాయుదేవుడో , రుద్రుడో , అగ్నియో కుబేరుడో సూర్యుడో కావచ్చును . లేనిచో స్వయముగా కాలపురుషుడో అయివుండవచ్చును. ఈతడు వానరుడు మాత్రము కాదు. గుంపులుగా గుమిగూడిన ధీశాలురూ రాక్షసులు ప్రాణి సంఘములతో , గృహములతో ,వృక్షములతో క్షణములో దగ్ధమైన లంకానగరిని చూచి ఆ విధముగా అనుకొనిరి

హా తాత హా పుత్రక కాంత మిత్ర
హా జీవితం భోగయుతం సుపుణ్యమ్|
రక్షోభిరేవంబహుధా బ్రువద్భిః
శబ్దః కృతో ఘోరతరస్సుభీమః||

తా| "అయ్యో తండ్రీ , హా కుమారా | హా నాధా | హా మిత్రా|" అని విలవిలలాడుచూ రాక్షసులందరూ రోదింపసాగిరి. వారి విఆప ధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరముగా నుండెను.

తత్ర దేవాస్సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః
దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమం గతాః||
తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకపిమ్ |
కాలాగ్నిరితి సంచింత్య సర్వభూతాని తత్రసుః ||

తా|| అంతట దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అగ్నిజ్వాలలో దగ్ధమగుచున్న లంకాపురిని చూచి చకితులైరి. సకలప్రాణులూ ఆ వానరోత్తముని చూచి ప్రళయకాలాగ్ని స్వరూపముగా భావించి భయభ్రాంతులైనవి.

దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ
గంధర్వ విద్యాధరనాగయక్షాః |
భూతాని సర్వాణి మహాంతి తత్ర
జగ్ముః పరాం ప్రీతితుల్యరూపామ్ ||

తా|| సమస్త దేవతలు మునీశ్వరులు గంధర్వులు విధ్యాధరులు నాగులు, యక్షులు పరమప్రీతినొందిరి. ఆచటనున్న సకలప్రాణులూ మహానంద భరితములాయెను

సంక్షిప్త సుందరకాండ
ఎబదినాలుగవ సర్గము
సమాప్తము