Sundarakanda Chapter 56

Hanuman starts on return journey !!

Chapter 56:

Summary : Having decided to leave Hanuman meets Sita. Sita tells Hanuman that he alone is enough to defeat Ravana but that she wants to SriRama to come free her . Hanuman again reassures her that Rama Lakshmana will soon come back to free from her captivity. Then Hanuman mounts the mountain Arishta for the return journey to the northern shores. As he flies into the sky the mountain becomes flat unable to bear the pressure exerted by Hanuman in his jump !!

For telugu Home page

click here


సంక్షిప్త సుందరకాండ
ఏబది ఆఱవ సర్గము

తతస్తు శింశుపామూలే జానకీం పర్యుపస్థితామ్|
అభివాద్యబ్రవీద్ర్విష్ట్యా పశ్యామి త్వామిహాక్షతామ్ ||

తా|| పిమ్మట హనుమంతుడు శింశుపావృక్షముమూలములో కూర్చునిఉన్న సీతాదేవికి అభివాదమొనర్చి " అమ్మా! దేవానుగ్రహమము వలన క్షేమముగానున్న నిన్ను చూడగలిగితిని"

తతస్థం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః |
భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంత మభాషత ||
యదిత్వం మన్యసే తాత వసైకాహమిహానఘా|
క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంతః శ్వోగమిష్యసి ||

తా|| పిమ్మట సీతాదేవి పయనముకు సిద్ధముగానున్న హనుమంతుని మళ్ళీ మళ్ళీ చూచుచూభర్తపైగల ప్రేమను ప్రకటించుచూ ఇట్లు పలికెను. "ఓ హనుమాన్ ! నీ కిష్టమైనచో ఇక్కడ మఱియొక దినము ఉండుము. ఒక రహస్యమైన ప్రదేశమున విశ్రాంతి గైకొని రేపు వెళ్ళుదువుగాక".

కామస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే |
పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః ||
శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః|
మాం నయేద్యది కాకుత్స్థః తత్తస్య సదృశం భవేత్ ||
తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనా |
భవత్యాహవ శూరస్య తథా త్వముపపాదయ ||

తా|| "నిజముగా ఈ కార్యము సాధించుటకు నీవుఒక్కడివే చాలును . దీనివలన కీర్తి ప్రతిష్టలు నీకే దక్కును. అరివీర భయంకరుడైన శ్రీరాముడు తన బాణములచే లంకను సంకులము గావించి నన్ను తీసుకొని వెళ్ళినచో అదియే ఆయన పరాక్రమమునకు తగును. ఓ కపివరా ! రణధీరుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్య విధానము నీవు ప్రతిపాదింపుము".

తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతుసంహితమ్|
నిశమ్య హనుమాంస్తస్యా వాక్యముత్తర మబ్రవీత్ ||

తా|| సీతాదేవి చెప్పిన అర్థవంతములైన సహేతుకములైన వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు సమాధానమిచ్చెను.

దేవీ హర్యృక్ష సైన్యానామ్ ఈశ్వరః ప్లవతాం వరః |
సుగ్రీవః సత్వసంపన్నః తవార్థే కృతనిశ్చయః ||
తౌ చ వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ |
ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధమిష్యతః ||
సగణం రాక్షసం హత్వా న చిరాత్ రఘునందనః |
త్వామాదాయ వరారోహే స్వాం పురీం ప్రతియాస్యతి ||

తా|| " ఓ సీతాదేవీ భల్లూక వానర సైన్యములకు ప్రభువు కపీశ్వరుడైన సుగ్రీవుడు మహాబలశాలి. ఈ కార్య సిద్ధికై కృతనిశ్చయుడైఉన్నాడు. వీరులు నరవరులైన రామలక్ష్మణులు ఇద్దరును ఇచటికివచ్చి తమ బాణములతో లంకా నగరమును ధ్వంసమొనర్చెదరు. శ్రీరాముడు త్వరలోనే రావణుని సపరివారముగా హతమార్చినీతో కలిసి స్వపురమైన అయోధ్యానగరికి నిన్ను తీసుకు వెళ్ళగలడు"

ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః|
గమనాయ మతిం కృత్వా వైదేహీ మభ్యవాదయత్ ||

తా ఈ విధముగా సీతాదేవిని ఓదార్చి తిరుగు ప్రయాణమునకు సిద్ధపడినవాడై సీతాదేవికి అభివాదమొనర్చెను.

ఆరురోహ గిరిశ్రేష్ఠం అరిష్ట మరిమర్దనః |
స తమారుహ్య శైలేంద్రం వ్యవర్థత మహాకపిః|
దక్షిణాదుత్తరం పారం ప్రార్థయన్ లవణాంభసః||

తా|| శత్రుసూదనౌఅడైన హన్నుమంతుడు అరిష్టమను పర్వతముని అధిరోహించెను. ఆ పర్వతమునెక్కి దక్షిణ దిశనుంచి ఉత్తర దిశ పోవదలిచినవాడై తన శరీరమును పెద్దదిగా చేసెను.

స లింఘయిషుర్భీమం సలీలం లవణార్ణవమ్|
కల్లోలాస్ఫాలవేలాంతం ఉత్పపాత నభోహరిః ||

తా|| తీరములను తన కెఱటములచే చఱచుచూ భయంకరముగానున్న ఆ సముద్రమును దాటగోరినవాడై అవలీలగా ఆ వానరోత్తముడు ఆకసమునకు ఎగిరెను.

సంక్షిప్త సుందరకాండ
ఏబది ఆఱవ సర్గము
సమాప్తము