Sundarakanda Chapter 59

Hanuman proposes to bring back Sita!

Chapter 59:

Summary : After elaborating what all happened in his search for Sita, Hanuman proposes that he on his own defeat Ravan along with his cohorts. He asks for permission to do so .

For telugu Home page

click here

సంక్షిప్త సుందరకాండ
59 వ సర్గము

ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః |
భూయస్సముపచక్రామ వచనం వక్తుముత్తరమ్ ||

తా|| మారుతాత్మజుడైన హనుమంతుడు తాను జరిగినదంతా చెప్పిన తరువాత ఇంకనూ చెప్పుటకు సిద్ధమయ్యెను.

జాంబవత్ప్రముఖామ్ సర్వాన్ అనుజ్ఞాప్య మహాహరీన్ |
అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే |
న్యాయం స్మ సహ వైదేహ్యా ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ ||

తా|| " జాంబవంతుడు ఇతరు ప్రముఖవానరోత్తములందరి అనుజ్ఞనుగైకొని ఇప్పటివఱకు జరిగిన కార్యములను మీకు వివరించియుంటిని . ఇప్పుడు సీతామాతను తీసుకొనివచ్చి ఆమెతో కలిసి రామలక్ష్మణులను దర్శించుట యుక్తము గదా !!"

అహం తు రావణం యుద్ధే ససైన్యం సపురస్సరమ్ |
సహపుత్రం వధిష్యామి సహోదరయుతం యుధి ||
బ్రాహ్మమైంద్రంచ రౌద్రంచ వాయవ్యం వారుణం తథా |
యది శక్రజితో స్త్రాణి దుర్నిరీక్ష్యాణి సంయుగే ||
తాన్యహం విధమిష్యామి నిహనిష్యామి రాక్షసాన్ |
భవతా మభ్యమజ్ఞాతో విక్రమో మేరుణద్ధి తమ్ ||

తా|| "రావణుని అతని సైన్యమును భటులను పుత్రులను సహోదరులను యుద్ధమున నేనొక్కడినే వధించగలను . ఇంద్రజిత్తు యుద్ధమున బ్రహ్మాస్త్రము , ఇంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయవ్యాస్త్రము, వరుణాస్త్రము మొదలగు దుర్నిరీక్శ్యములైన అస్త్రములను ప్రయోగించినప్పటికిని నేను వాటిని నిష్ప్రయోజనము చేయగలను. రాక్షసులను వధీమ్పగలను. మీ ఆజ్ఞ అయినచో అచటికి వెళ్ళుటకు నా పరాక్రమము నన్ను తొందరపెట్టుచున్నది. మీ ఆజ్ఞయే ఆలస్యము".

మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృత పునః |
రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా ||
జయత్యతిబలోరామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
అహం కోసలరాజస్య దాసః పవన సంభవః |
హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా ||

తా|| " నేనే లంకానగరమును ధ్వంసమొనర్చితిని . దానిని క్భస్మీకృతము చేసితిని . అచటి రాజమార్గమంతను నా స్వామిపేరు మాఱుమోగినది. బలవంతుడైన శ్రీరామునకి జయము మహాబలవంతుడైన లక్ష్మణూనికి జయము. శ్రిఆముని అనుగ్రహపాత్రుడైన సుగ్రీవునకు జయము. నేను వాయుపుత్రుడను. నాపేరు హనుమంతుడు. శ్రీరాముని బంటును. అని అంతటను చాటించితిని ".

అశోకవనికా మధ్యే రావణస్య దురాత్మనః|
అధస్తాత్ శింశుపావృక్షే సాధ్వీ కరుణమాస్థితా ||
సా ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాచ్చ కర్శితా |
ప్రతిపాఠ శీలస్య విద్యేవ తనుతాం గతా ||

తా|| " దుష్టుడైన రావణునియొక్క అశోకవనమునందు శింశుపావృక్షచ్ఛాయలో సీతా మహాసాధ్వి దైన్యముతోనుండెను. సీతాదేవి సహజముగనే సన్నని శరీరముగలది. పైగా శ్రీరాముని ఎడబాటువలన ఆమె పాడ్యమినాడి వేదాధ్యయనము చేయువాని విధ్యవలె సన్నగిల్లి యుండెను "

ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణా |
యదత్ర ప్రతికర్తవ్యం తత్సర్వముపపద్యతామ్ ||

తా|| " పూజ్యురాలైన సీతాదేవి సోకపాయణయై ఇట్లు దీనావస్థలో ఉన్నది. కనుక ఈ విషయములో మనము చేయవలసిన పని గురించి ఆలోచించవలెను ".

సంక్షిప్త సుందరకాండ
59 వ సర్గము
సమాప్తము