Sundarakanda Chapter 67
Hanuman Recounts Sita's message !
Chapter 67:
Summary : Hanuman recounts all his conversatiosn with Sita and conveys Sita's message that she should be saved by SriRama
Om
!! సుందరకాండ !!
అఱువది ఏడవ సర్గము !
ఏవముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మనా |
సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే ||
తా|| ఈ విధముగా మాహాత్ముడైన రాఘవుడు పలుకగా , హనుమంతుడు సీతాదేవి తో జరిగిన సంభాషణ అంతయూ రాఘవునకు నివేదించెను
ఇదముక్తవతీ దేవీ జానకీ పురుషర్షభ |
పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథాతథమ్||
తా|| "ఓ పురుషోత్తమా ! జానకీ దేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును గుర్తుచేయుటకై యథా తథముగా తెలిపెను ".
ఏవమస్త్రవిదాంశ్రేష్ఠః సత్వవాన్ శీలవానపి |
కిమర్థ మస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః||
తా|| " అస్త్ర విద్యాకోవిదులలో శ్రేష్ఠుడు బలశాలి ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు ?"
న నాగా నాపి గంధర్వా నాసురా న మరుద్గణాః |
న చసర్వే రణే శక్తా రామం ప్రతి సమాసితుమ్ ||
తస్య వీర్యవతః కశ్చిత్ యద్యస్తి మయి సంభ్రమః |
క్షిప్రం సునిశితైర్బాణైః హన్యతామ్ యుధి రావణః ||
తా|| నాగులు కాని గంధర్వులుకాని అసురులుగాని, దేవగణములుగాని వీరందరూ కలిసిగాని రణరంగమున శ్రీరాముని ఎదిరించుటకు సమర్థులు కారు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు నాపై ఏమాత్రము కనికరమున్నచో వెంటనే సునిశితమైన బాణములతో రావణుని యుద్దహములో హతమొనర్చవలెను
భ్రాతురాదేశమాస్థాయ లక్ష్మణో వా పరంతపః|
స కిమర్థం నరవరో న మాం రక్షతి రాఘవః ||
శక్తౌ తౌ పురుషవ్యాఘ్రౌ వాయ్వగ్ని సమతేజసౌ |
సురాణామపి దుర్ధర్షౌ కిమర్థమ్ మాముపేక్షతః ||
మమైవ దుష్కృతం కించిన్మహదస్తి న సంశయః |
సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ ||
తా|| భ్రాతుని ఆదేశమును బడసి శతృభయంకరుడైన హనుమంతుడు నన్ను రక్షించుటకు ఏందుకు వచ్చుటలేదు ? వాయువు అగ్నితో సమానమైన తేజస్సుగలవారు , మహా శక్తి మంతులు దేవతలకును అజేయులు అట్టి మహావీరులు నా విషయములో ఎందుకు ఉపేక్షించుచున్నారు? వారిద్దరూ కలిసియుండియూ నా విషయమును గురించి అపేక్షించుటకు కారణము సందేహము లేకుండా నా వలన ఎదో దుష్కర్మ అయి ఉండవచ్చు.
.
వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్ |
పునరప్యహమార్యాం తామ్ ఇదం వచనమబ్రవీత్ ||
తా|| వైదేహి కన్నీరుగార్చుచూ పలికైన ఈ మాటలను విని నేను మఱల ఆ పూజ్యురాలితో ఇట్లు పలికితిని
తావుభౌ నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ |
త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భష్మీకరిష్యతః ||
హత్వా చ సమరే రౌద్రం రావణం సహబాంధవమ్ |
రాఘ వస్త్వాం వరారో హే స్వాం పురీమ్ నయతే ధ్రువమ్||
తా|| ఆ నరశార్దూలురు ఇద్దరూ నీ దర్శనముకై ఉత్సాహముతో తహతహ లాడుచున్నారు. వారు లంకను భస్మము చేయగలరు. సమరములో రావణుని బంధువర్గముతో సహా హతమొనర్చి నిన్ను తమ నగరమునకు తీసుకొని వెళ్ళేదరు.ఇది తథ్యము.
యత్తురామోవిజానీయాత్ అభిజ్ఞానమనిందితే |
ప్రీతి సంజననం తస్య ప్రదాతుమ్ త్వమిహార్హసి ||
సాభివేక్ష్య దిశస్సర్వా వేణ్యుద్గ్రథనముత్తమమ్ |
ముక్త్వా వస్త్రాద్దదౌ మహ్యం మణిమేతం మహాబలా ||
తా|| పూజ్యురాలా శ్రీరాముడు గుర్తింపగల ఆనవాలుని నాకు ఒసంగుము. దానిని చూచి ప్రభువు మిక్కిలి ప్రీతిచెందును.. ఓ రామా ! అప్పుడు ఆమె అన్ని దిక్కులనూ పరికించి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈ చూడామణిని తనకొంగుముడినుండి తీసి నాకు ప్రసాదించెను
గమనే చ కృతోత్సాహమ్ అవేక్ష్య వరవర్ణినీ |
వివర్థమానం చ హి మామ్ ఉవాచ జనకాత్మజా ||
అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పసందిగ్ధ భాషిణీ |
మమోత్పతన సంభ్రాంతా శోకవేగసమాహతా |
మామువాచ తతః సీతా సభాగ్యోసి మహాకపే ||
యద్రక్షసి మహాబాహుం రామం కమలలోచనమ్ |
లక్ష్మణం చ మహాబాహుం దేవరం మే యశస్వినమ్ ||
తా|| ఉత్సాహముతో తిరుగుప్రయాణమునకు సన్నద్ధుడై శరీరమును పెంచుచున్న నన్నుచూచి ఆ సీతాసాధ్వి మరల ఇట్లు పలికెను. నేను వెళ్ళుచున్నానని సంభ్రమము వలన అశువులతో నిండిన ముఖముతో, బాష్పములచే తడబడిన మాటలతో శోకముతో ఇట్లు పలికెను. 'నీవు అదృష్టవంతుడవు. కమలలోచనుడు మాహాబాహువులు గల శ్రీరాముని, భుజసంపన్నుడు మిక్కిలి కీర్తిగలవాడు , నా భర్తకు సోదరుడైన అయిన లక్ష్మణుని దర్శించనున్న నీవు అదృష్ఠవంతుడవు'
సీతాయాప్యేవముక్తోహమ్ అబ్రవమ్ మైథిలీమ్ తథా |
పృష్థమారోహ మే దేవీ క్షిప్రం జనకనందిని ||
యావత్తే దర్శయామ్యద్య ససుగ్రీవమ్ సలక్ష్మణం |
రాఘవం చ మహాభాగే భర్తార మశితేక్షణే ||
తా|| సీతాదేవి ఈ విధముగా చెప్పినప్పుడు నేను ఆమెకు ఇట్లుచెప్పితిని. " ఓ జానకీదేవీ నావీపును అధిరోహింపుము. ఓ మహాత్మురాలా నేను ఈ క్షణమే నిన్ను శీఘ్రముగా తీసుకుపోయెదను. నీస్వామి అయిన శ్రీరాముని , లక్ష్మణుని , సుగ్రీవుని నేడే దర్శించగలవు"
సాబ్రవీన్మాం తతో దేవీ నైష ధర్మో మహాకపే |
యత్తేపృష్ఠం సిషేవేహం స్వవశా హరిపుంగవ ||
పురా చ యదహం వీర స్ప్రుష్టా గాత్రేషు రక్షసా |
తత్రాహ కింకరిష్యామి కాలేనోపపీడితా ||
తా|| అంతట ఆ దేవి నాతో ఇట్లనెను. " ఓ వానరోత్తమా నేను నీవీపు ఎక్కుట ధర్మముకాదు .ఓ మహావీరా కాలముచే పీడింపబడిన నేను రాక్షసుడైన రావణునిచే తాకబడితిని . ఆట్టి దుస్సహాయస్థితిలో నేనేమి చేయగలను ?
గచ్చత్వం కపి శార్దూల యత్రతౌ నృపతేః సుతౌ |
ఇత్యేవం సా సమభాష్య భూయః సందేష్టుమాస్థితా ||
యథా చ మహాబాహుఃమాం తారయతి రాఘవః |
అస్మాదుఃఖాంబుసంరోధాత్ త్వం సమాధాతుమర్హసి ||
తా || "ఓ కపివరా ! నీవు అ రాజకుమారులున్న ప్రదేశమునకు వెళ్ళుము" ఇట్లుపలికి మఱల ఆమె నాకు ఒక సందేశము ఇయ్యసాగెను !" ఒ కపివరా మహాబాహువుడైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖసముద్రమునుండి గట్టెక్కించునట్లు చూడుము".
ఏతత్తనార్యా నృపరాజసింహ
సీతావచః ప్రాహ విషాదపూర్వమ్|
ఏతచ్చ బుద్ద్వా గదితం మయా త్వం
శ్రద్ధత్స్వ సీతాం కుశలాం సమగ్రామ్ ||
తా|| 'ఓ మహారాజా ! సీతాదేవి నీ కొఱకై ఈ వచనములను అతి దుఃఖముతో చెప్పెను.నేను చెప్పిన ఈ మాటలను తెలిసికొని ఆమె కుశలముగా వున్నట్లు భావించుము'.
!! సుందరకాండ !!
అఱువది ఏడవ సర్గము
సమాప్తము
ఓమ్ తత్ సత్ !