Sundarakanda Chapter 68

Hanuman gives Sita's message !!

Conclusion of Sundarakanda !!

Chapter 68:

Summary :Summary : Hanuman recounts all his conversations with Sita. Hanuman conveys how he removed Sita's misgivings about the ability of the Vanaras and the the two princes in crossing and reaching Lanka. He repeats Sita's message that SriRama coming along with Vanara army killing Ravana and then taking her back to Ayodhya is the proper way. Hanuman said that with his words he has been able to provide peace to Sita who has been troubled by separation from SriRama.

For telugu Home page

click here

!! సుందరకాండ !!
అఱువది ఎనిమిదవ సర్గము

అథాహముత్తరం దేవ్యా పునరుక్తస్సంభ్రమః |
తవస్నేహాన్నర వ్యాఘ్ర సౌహార్దాదనుమాన్యవై ||

తా|| ఓ నరేంద్రా నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్దము ఉండుటవలన ఆ దేవియూ నాతో సాదరముగా మఱల ఇట్లు పలికెను !

ఏవం బహువిథో వాచ్యో రామో దాశరథిస్త్వయా |
యథా మామాప్నుయాచ్ఛీఘ్రం హత్వా రావణ మాహవే ||
యది వా మన్యసే వీర వసైకాహమరిందమ|
కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతశ్వో గమిష్యసి ||

తా|| " దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున హతమార్చి శీఘ్రముగా నన్ను గొనిపోవునట్లు ఆయనతో బహువిధములుగా చెప్పుము . ఓ మహావీరా ! శత్రువులను పరిమార్చువాడా నీకు సమ్మతమైనచో ఒక దినము ఉండుము. ఒక రహస్యమైన ప్రదేశములో విశ్రాంతి తీసుకొని వెళ్ళవచ్చును.

అయం చ వీర సందేహః తిష్ఠతీవ మమాగ్రతః |
సుమహాంస్త్వత్సహాయేషు హర్యృక్షేషు హరీశ్వరః ||
కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహో దధిమ్ |
తాని హర్యృక్షుసైన్యాని తౌ వా నరవరాత్మజౌ ||
తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే |
కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్యవిదాం వర ||

తా|| "ఓ వీరుడా నీ సహాయకులైన భల్లూక వానరులుపై నాకు ఒక సందేహమున్నది. దాటశక్యముగాని ఆ మహోదధిని వానర భల్లూక సైన్యములతో అ రాజకుమారులిద్దరూ ఎట్లు దాటగలరు. కార్యసాధకులలో శ్రేష్ఠుడైన ఓ మహావీరా ! అందువలన అతిక్రమించశక్యముగాని ఆ మహోదధిని దాటుటకు ఏ ఉపాయము ఆలోచించుచుంటివి ? "

కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే |
పర్యాప్తః పరవీరఘ్నః యశస్యస్తే బలోదయః ||
బలైసమగ్రైః యది మాం హత్వా రావణమాహవే |
విజయీ స్వాం పురీం రామో నయేత్ తత్ స్యాద్యశస్కరమ్ ||
యథాహం తస్య వీరస్య వనాదుపథినా హృతా |
రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవః ||
బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దవః |
మాం నయేద్యది కాకుత్ స్థః తత్ తస్య సదృశం భవేత్ ||

తా|| ఓ మారుతీ ఈ కార్యము సాధించుటకు సర్వసమర్థుడవైన నీవొక్కడివే చాలును . కాని నీ బలప్రదర్శన వలన నీ కీర్తి పెరుగునే కాని శ్రీరామునకు గాని నాకుగాని కలగవు. శ్రీరాముడు సమస్త బలములతో రణరంగమున రావణుని హతమార్చి నన్ను స్వపురమునకు తీసుకుపోయినచో అది యే ఆ ప్రభువుకును నాకును శ్రేయస్కరము. శ్రీరామునకు భయపడి ఆ రాక్షసుడు నన్ను వంచనతో అపహిరించెను. అటులనే ఇప్పుడు నన్ను తీసుకొనిపోవుట శ్రీరామునికి తగదు. శత్రుబలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోల పఱిచి నన్ను స్వయముగా తీసుకొని పోవుటయే అ మహావీరునకు తగును .

తదర్థోపహితం వాక్యం ప్రశ్రితం హేతుసంహితమ్ |
నిశమ్యాహం తతస్సేషం వాక్యముత్తరమబ్రవీత్ ||

తా|| అర్థముగూడిఅ హేతుబద్ధమైన వినయముతో గూడిన ఆమె మాటలను విని నే ఈవిధముగా ప్రత్యుత్తరమిచ్చితిని.

దేవీ హర్యృక్షసైన్యానాం ఈశ్వరః ప్లవతాం వరః |
సుగ్రీవః సత్యసంపన్నః తవార్థే కృతనిశ్చయః ||
అసకృతైర్మహభాగైః వానరైర్బలగర్వితైః |
ప్రదక్షిణీకృతాభూమిః వాయుమార్గానుసారిభిః ||
మద్విశిష్థాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః |
మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ ||
అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః |
న హి ప్రకృష్టాః ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః ||

తా||| ఓ దేవీ వానరభల్లూకసైన్యములకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలి అగు సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకొని యున్నాడు. సుగ్రీవుని సన్నిధిలో వున్న వానరులు నాతో సమానులు లేక నాకంటెనూ గొప్పవారేకాని నాకన్న తక్కువ వారు లేరు. నేనే ఇచటికి రాగలిగినప్పుడు ఆ మహాబలశాలుర విషయము చెప్పనేల. సాధారణముగా యజమానులు ఏ కార్యమునకైననూ చిన్నవారినే పంపుదురు. పెద్దవారిని పంపరుగదా !

తదలం పరితాపేన దేవీ మన్యుర్వ్యపైతు తే |
ఏకోత్పాతేన తే లంకామ్ ఏష్యంతి హరియూథపాః ||

తా|| ఓ దేవీ ఇక నీవు పరితపింపవలదు. విచారమును వీడుము. ఆ వానరులందరూ ఒక గంతులో వచ్చి లంకలో వాలగలరు.

మమపృష్ఠగతౌ తౌచ చంద్రసూర్యావివోదితౌ |
త్వత్సకాశం మహాభాగే నృశింహావాగమిష్యతః ||
అరిఘ్నం సింహసంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ |
లక్ష్మణం చ ధనుష్పాణీం లంకాద్వారముపస్థితమ్ ||

తా|| పవిత్రమైన మనస్సుగల ఓ దేవీ ఉదయించుచున్న సూర్య చంద్రు లవలె తేజోమూర్తులూ నరేంద్రులు అయిన ఆ రామలక్ష్మణులను నా భుజములపై ఎకి ఇచటికి రాగలరు. శత్రుసూదనుడు సింహపరాక్రముడు అయిన శ్రీరాముని, ధనుష్పాణి అయిన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారము కడ నీవు దర్శింపగలవు>

నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూలవిక్రమాన్ |
వానరాన్ వారనేంద్రాభాన్ క్షిప్రమ్ ద్రక్ష్యసి సంగతాన్ ||
శైలాంబుద నికాసానామ్ లంకామలయసానుషు |
వర్ధతామ్ కపిముఖ్యానామ్ అచిరాచ్ఛ్రోష్యసి స్వనమ్ ||

తా|| నఖములు దంతములు ఆయుధములుగా గలవారు, సింహము పులులవలె పరాక్రమము గలవారును మాహావీరులు , గజేంద్రునివలే బలశాలురైన వానరులను త్వరలోనే ఇచట చూడగలవు. పర్వతమువలె , మేఘములవలె ఉన్నతులు లంకా పర్వతసానువులయందు గర్జించుచుండు వారును అగు వానరులయొక్క ధ్వనులను నీవు శీఘ్రముగనే వినగలవు.

నివృత్తవనవాసం చ త్వయా సార్థమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ||

తా|| శత్రుమర్దనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతో గూడి అయోధ్యలో పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలోనే చూడగలవు.

తతో మయా వాగ్భిరదీన భాషిణా
శివాభిరిష్ఠాభిరభిప్రసాదితా |
జగామ శాంతిం మమ మైథిలాత్మజా
తవాతిశోకేన తథాతిపీడితా ||

తా|| నీ ఎడబాటువలన శోకముచేతనూ , రాక్షసుల పీడించుటవలన పరితాపమునకు లోనైన సీతాదేవికి ధైర్యముగూర్చితిని అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతిని పొందినది

!! ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకియే ఆదికావ్యే
సుందరకాండే అష్ఠషష్ఠితమసర్గః
సమాప్తం !!

!! వాల్మీకిచే రచించబడిన ఆదికావ్యమైన
రామాయణమునందలి
సుందరకాండము
అఱువది ఎనిమిదవ సర్గము
సమాప్తము !!

Om Tat Sat