SriRama embraces Hanuman

to express his gratitude !!

From Chapter 1 of Yuddhakanda :

Summary : After hearing Hanuman tell all about what happened in Lanka , SriRama says Hanuman has done things no body else can do. He, Lakshmana and Raghuvamsa are all in debited to Hanuman for protecting Dharma. The only thing he can offer to Hanuman is the pleasure of a deep embrace of Love. Then SriRama hugs Hanuman. !

.

For telugu Home page

click here

 

!! యుద్ధ కాండము !!

!! ప్రథమ సర్గలోని శ్లోకాలు !!

శ్రుత్వా హనుమతో వాక్యం యథావదభిభాషితమ్ |
రామః ప్రీతి సమాయుక్తో వాక్యముత్తరమబ్రవీత్ ||

తా|| హనుమంతుడు యథాతథముగా పలికిన మాటలను విని శ్రీరాముడు చాలాసంతోషముతో ఇట్లు పలికెను.

కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభమ్ |
మనసా అపి యదన్యేన న శక్యం ధరణీతలే ||

తా|| హనుమంతుడు చేసిన కార్యములు ఘనకార్యములు. లోకములో అత్యద్భుతమైనవి, ఊహకి అందనివి , ఇంకెవరికీ సాధ్యముకానివి.

నహితం పరిపశ్యామి యస్తరేత మాహార్ణవమ్ |
అన్యత్ర గరుడాద్వాయోః అన్యత్ర చ హనూమతః ||

తా|| గరుత్మంతుడు , వాయుదేవుడూ హనుమంతుడు , ఈ ముగ్గురికి తప్ప ఇతరులెవ్వరూ ఆ మహాసముద్రమును లంఘింపజాలరు.

దేవదానవ యక్షాణాం గంధర్వోరగరక్షసామ్|
అప్రధృష్యాం పురీం లంకాం రావణేన సురక్షితామ్|

తా|| రావణునిచే రక్షింపబడిన లంకానగరమును . దేవ దానవ యక్ష గంధర్వులు మొదలగువారు తేరిపారజూడజాలరు.

ప్రవిష్టస్సత్త్వమాశ్రిత్య శ్వసన్ కోనామ నిష్క్రమేత్ |
కో విశేత్ సుదురాదర్షాణ్ రాక్షసైశ్చ సురక్షితామ్ ||

తా|| రాక్షసయోధుల రక్షణ కారణముగా దుర్భేద్యమైన ఈ లంకలో స్వశక్తితో ప్రవేశింపగలవారెవ్వరు ? ప్రవేశించిననూ ప్రాణములతో బయటపడగల వీరుదెవ్వడు ?

యో వీర్య బలసంపన్నో న సమస్స్యాత్ హనూమతః |
భృత్యకార్యం హనుమతా సుగ్రీవశ్చ కృతం మహత్ ||

తా|| హనుమంతునితో సమానమైన తేజోమయుడు ఎవ్వడునూ లేడు.మహావీరుడైన సుగ్రీవునకు నిజమైన సేవకునిగా ఆ ప్రభువు కార్యము సఫలమొనర్చెను.

స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ |
యో హి భృత్యో నియుక్తస్సన్ బర్త్రా కర్మణి దుష్కరే |
కుర్యాత్ తదనురాగేణ తమాహుః పురుషోత్తమమ్ ||

తా|| ప్రభువు తనకు ఎంతటి దుష్కర కార్యము అప్పగించిననూ దానిని తన బలపరాక్రమములచే సాధించుటయే గాక , దానికి భంగము కలుగకుండా తదనురూపౌలైన ఇతరకార్యములను కూడా నెఱవేర్చువాడు భృత్యులలో అత్యుత్తముడు.

నియుక్తో యః పరం కార్యం నకుర్యానృపతేః ప్రియమ్ |
భృత్యో యుక్తస్సమర్థశ్చ తామాహుర్మధ్యమం నరం ||

తా|| ఇతర కార్యముకను చేయగల యోగ్యతయూ సామర్థ్యము ఉన్నప్పటికిని కేవలము ప్రభువు తనకు అప్పగించిన కార్యమును మాత్రము చేయగలవాడు మధ్యమశ్రేణికి చెందినవాడు.

నియుక్తే నృపతేః కార్యం నకుర్యాద్సమాహితః |
భృత్యో యుక్తస్సమర్థశ్ఛ త మాహుః ప్రుషాధమమ్ ||

తా|| తనకు యోగ్యతయూ సమర్థతయూ ఉన్నప్పటికినీ యజమాని తనకు అప్పగించిన కార్యము పూర్తి చేయనివాడు సేవకులలో అథముడు .

తన్నియోగే నియుక్తేన కృతం కృత్యం హనూమతా |
న చాత్మా లఘుతాం నీతః సుగ్రీవశ్చాపి తోషితః ||

తా|| ప్రభువుయొక్క ఆదేశానుసారము హనుమంతుడు సీతాన్వేషణ కార్యమును శ్రద్ధాసక్తులతో పూర్తిగా నెఱవేర్చెను, ఇంకా తనగౌరవమునకు భంగము రాకుండా ఇతరకార్యౌలను సాధించి వానరరాజైన సుగ్రీవుని సంతుష్టుని గావించెను.

అహం చ రఘువంశశ్చ లక్ష్మణశ్చ మహాబలః |
వైదేహ్యా దర్శనేనాద్య ధర్మతః పరిరక్షితాః||

తా|| నేనూ , మహబలవంతుడైన లక్ష్మణుడు, సుగ్రీవుడు ఇంకా రఘువంశము కూడా ధర్మమార్గమును రక్షించినవారమైతిమి . ఆ విధముగా మేమును రక్షింపబడితిమి

ఇదం తు మమదీనస్య మనోభూయః ప్రకర్షతి |
యదిహాస్య ప్రియాఖ్యాతుః న కుర్మి సదృశం ప్రియమ్ ||

తా| సీతాదేవి కుశలవార్తలను చెప్పి మహోపకారమొనర్చిన ఈ మారుతికి తగిన ప్ర్త్యుపకారము చేయలేక దీనుడనై యుంటిని. అందువలన నా మనస్స్సు మిక్కిలి పరితపించుచున్నది.

ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనూమతః |
మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః ||

తా|| ఈ సందర్భమున మాహాత్ముడైన హనుమంతునికి గాఢాలింగనసౌఖ్యమును మాత్రమే ఇయ్యగలను. ఇదియే అతనికి పరమసుఖానుభవములను కలిగింపగలదు.. ప్రస్తుతము నేను ఇవగలిగిన నా సర్వస్వమిదియే.

ఇత్యుక్త్వా ప్రీతి హృష్టాంగో రామస్తం పరిషస్వజే |
హనూమంతం మహాత్మానం కృతకార్యముపాగతమ్ ||

తా|| ఇట్లు పలికి శ్రీరాముడు పులకితగాత్రుడై తాను అప్పగించిన కార్యమును సఫలమొనర్చి , పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుని తన హృదయమునకు హత్తుకొనెను.

 

!! యుద్ధకాండములో ని ప్రథమ సర్గములోని స్లోకములు సమాప్తము !!

!! ఓమ్ తత్ సత్ !!