Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 3 ... Valmiki composes !

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

Balakanda

Chapter 3

బాలకాండ
సర్గ 3

శ్రుత్వా వస్తు సమగ్రం తత్ ధర్మాత్మా ధర్మ సంహితమ్ |
వ్యక్త మన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః ||

తా || ఆ ధర్మాత్ముడు ధర్మసమ్మితమైన రామకథను సమగ్రముముగా వినియుండెను , అయిననూ ఆ వృత్తాంతములో ఇంకా విశేషాంశములను గురించి అలోచింపసాగెను.

ఉపస్వృశ్యోదకం సమ్యక్ మునిః స్థిత్వా కృతాంజలిః |
ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిమ్ ||

తా|| తూర్పుదిశగా దర్భాసనముపై కూర్చుని విధి ప్రకారము ఆచమనము చేసి అంజలి ఘటించి ఆ ముని తన తపశ్శక్తితో జరిగిన వృత్తాంతము గురించి ఆలోచించసాగెను.

రామలక్ష్మణసీతాభీ రాజ్ఞా దశరథేన చ |
సభార్యేణ సరాష్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్త్వతః ||
హషితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్ |
తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్ర పస్యతి ||
తా || అప్పుడు రామ లక్ష్మణ సీతాదేవి ఇంకా దశరథమహారాజు ఆయన భార్యలు , ఆయన రాజ్యము, వారి ప్రసన్న దరహాసనములు , వారి భాషణలు , వారి గతి కార్యకలాపములూ అవి అన్నీ యథాతథముగా అ మహామునికి తెలియవచ్చెను.

స్త్రీతృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతా వనే |
సత్య సంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత ||

తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః |
పురా యత్ తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా ||

తా|| సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి వనమునకు పోవుట అ విధముగా జరిగిన సంఘటనలన్నింటినీ ఆ మహాముని దర్శించెను. ఆ యోగ శక్తి ప్రభావమున పుర్వముగా జరిగిన కథాంతయు అ మునికి తరతలామలకమయ్యెను .

తత్సర్వం తత్త్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః |
అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః ||

కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరమ్ |
సముద్రమివ రత్నాఢ్యం సర్వ శ్రుతి మనోహరమ్ ||ి

తా|| అ విధముగా ఆ కథ అంతయూ యోగదృష్టితో చూచి అభిరాముడైన శ్రీరాముని చరితము రచించుటకు పూనుకొనెను.. ఆ కథ కామార్థగుణములతో కూడి ధర్మార్థగుణములను విస్తారముగా విశదీకరించును. అది సముద్రమువలె రత్నములతో గూడినది వినుటకు అతి మనోహరముగా నుండును.

స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా |
రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషిః ||

తా|| నారదమహర్షి పూర్వము చెప్పిన విధముగా రఘువంశ చరితమును అ మహర్షి రచించెను>

జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతామ్ |
లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతామ్ ||

తా|| మహత్తరమైన శ్రీరాముని జన్మము , అందరికి అనుకూలముగా వుండెడి ఆయన ప్రవర్తన , లోకము లో అందరి ప్రేమలూ పొందుట. ఇతరుల క్షమించగలుగుట ఆయన సౌమ్యత్వము , ఆయన సత్యశీలతా ఈ కావ్యము నందు వర్ణింపబడినవి.

నానా చిత్ర కథాశ్చాన్యాః విశ్వామిత్ర సమాగమే |
జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్ ||
రామరామవివాదం చ గుణాన్ దాశరథేః తదా |
తథాsభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతామ్ ||
విఘాతం చ అభిషేకస్య రాఘవస్య నివాసనమ్ |
రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చ ఆశ్రయమ్ ||

విశ్వామిత్రునితో కలిసి అనేక చిత్రమైన కథలు , ధనుస్సుని భంగపరచుట ,జానకీ వివాహము , అలాగే రామ పరశురాముల సంవాదము , దాశరథి ఉదాత్త గుణముల వర్ణన , రామపట్టాభిషేక ప్రయత్నము , కైకేయి దుష్ట ప్రవర్తన , అభిషేకమునకు విఘ్నము , రాముని వనవాసము , దశరథుని శోకము ఆ శోకముతో స్వర్గస్థుడగుట ఈ కావ్యము నందు వర్ణింపబడినవి .

ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనమ్ |
నిషాదాది సంవాదం సూతోపావర్తనం తథా ||
గంగాయశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనమ్ |
భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనమ్ ||
వాస్తు కర్మ నివేశం చ భరతాగమనం తథా |
ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిల క్రియాం ||
పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామ నివాసాయనమ్ ||

తా|| సమస్తప్రాణులకు విషాదము , శ్రీరాముడు వారిని తప్పించుకొని వెడలిపోవుట , నిషాదునితో ( గుహునితో) సంవాదము , రథసారథి మరలి వచ్చుట కూడా వర్ణింపబడెను. సీతారామలక్ష్మణూలు గంగానదిదాటుట, భరద్వాజ దర్శనము ,భరద్వాజుని ఆజ్ఞప్రకారము చిత్రకూటము పోవుట , వాస్తు ప్రకారము అచ్చట పర్ణశాలానిర్మాణము , భరతుడుఅచటికి వచ్చుట , రాముని ప్రసన్నుని చేసికొనుట, స్వర్గస్తుడైన తండ్రికి తర్పణములు ఇచ్చుట , అగ్రజుని పాదుకాపట్టభిషేకము , భరతుని నందిగ్రామ నివాసము కూడా వర్ణింపబడినవి.

దండకారణ్యగమనం విరాధస్య వథం తథా |
దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమమ్||
అనసూయా సహాస్యామప్యంగరాగస్య చ అర్పణమ్ |
అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసంగమమ్ ||
పంచవట్యాశ్చగమనం శూర్పణఖాశ్చ దర్శనమ్ |||
శూర్పణఖాశ్చ సంవాదం విరూపకరణం తథా |
వథం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ ||

తా|| పంచవటినుండి దండకారణ్యముపోవుట , విరాధ వథ , శరభంగుని అదేవిధముగా సుతీక్ష్ణుని దర్శనము , అనసూయాదేవి దివ్యచందనాదులు సమర్పించుట, అగస్త్య మహాముని దర్శనము , జటాయువుతో సమాగమము , పంచవటిలో నివాసము . శూర్పణఖను చూచుట , ఖర త్రిశిరుల వథ, రావణుడు ఇవిషయములో ఉత్తేజిత్తుడగుట వర్ణింపబడినవి.

మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా |
రాఘవస్య విలాపం చ గృధరాజ నిబర్హణమ్ ||
కబంధదర్శనం చైవ పంపాయాశ్చ దర్శనమ్ |
శబర్యా దర్శనం చైవ హనుమద్దర్శనం తథా |
విలాపం చైవ పంపాయాం రాఘవస్య మహాత్మనః ||

తా|| మారీచునివథ , జానకీ అపహరణము , రాముని విలాపము , జటాయు మరణము , కబంధుని దర్శనము. శబరి దర్శనము , పంపాతీరములో హనుమంతుని కలయుట శ్రీరాముని దుఃఖము ఈ కావ్యములో వర్ణింపబడినవి.

ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్ |
ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవ విగ్రహమ్ ||
వాలి ప్రమథనం చైవ సుగ్రీవ ప్రతిపాదనమ్ |
తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్||
కోపం రాఘవ సింహస్య బలానామ్ ఉపసంగ్రహమ్ |
దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్ ||

తా|| ఋష్యమూక పర్వతము చేరుట , సుగ్రీవునితో కలయుట , పరస్పరమైత్రికి ప్రతిజ్ఞలుచేయుట, సుగ్రీవునికి వాలివధపై విశ్వాసము కలిగించుట , వాలిసుగ్రీవుల యుద్ధము , వాలి వధ, తారావిలాపము , సుగ్రీవపట్టాభిషేకము , వర్షరాత్రులు గడపుట , సుగ్రీవుని ఆలసత్వమునకు రాముని కోపము , సేనలను రప్పించుట , సుగ్రీవుడు వారిని నలుదిక్కులు పంపించుట , వారికి భౌగోళికాంశములు చెప్పుట కుడా ఇందు వర్ణింపబడినది

అంగుళీయక దానం చ ఋక్షస్య బిల్వ దర్శనమ్ |
ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనమ్ ||
పర్వతారోహణం చైవ సాగరస్య చ లంఘనమ్ |
సముద్రవచనాచ్చైవ మైనాకస్య దర్శనమ్ ||
రాక్షసీ తర్జనం చైవ చాయాగ్రాహస్య దర్శనమ్ |
సింహికాయాశ్చ నిథనం లంకామలయ దర్శనమ్ ||
రాత్రౌ లంకాప్రవేశం చ ఏకస్యాఅపి విచింతనమ్ ||

తా || శ్రీరాముడు హనుమంతునికి అంగుళీయ ప్రదానము , వానరులు స్వయంరభను దర్శించుట, వానరులు నిరాశతో ప్రయోపవేసమునకు సిద్ధపడుట , సంపాతిని కలయుట , హనుమంతుని పర్వతారోహణము , సాగర లంఘనము , సముద్రునిచే ప్రేరేపింపబడిన మైనాకుని ప్రయత్నము, సురసను జయించుట , సింహిక వథ , లంకా మలయ పర్వత దర్శనము , లంకలో రాత్రి హనుమంతుని ప్రవేశించి వంటరిగా ఆలోచన ఇత్యాది విశయములు వర్ణింపబడినవి.

అపానభూమి గమనం అవరోధస్య దర్శనమ్ |
దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్ ||

అశోకవనికాయామ్ సీతాయాశ్చాపి దర్శనమ్ |
అభిజ్ఞాన ప్రదానం చ సీతాయాశ్చాభిభాషణమ్ ||

రాక్షసీ తర్జనం చైవ త్రిజటా స్వప్న దర్శనమ్ |
మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ ||

తా|| పానభూమిలో అంతః పురములో సీతాన్వేషణ , రావణుని చూచుట , పుష్పక విమాన దర్శనము , అశోకవనములో సీతను చూచుట, అమెకు గుర్తుగా అంగుళీయ ప్రదానము , సీతాదేవితో సంభాషణ , రాక్షసస్త్రీల తర్జనభర్జనలు, త్రిజటా స్వప్న వృత్తాంతము , సీతాదేబి చూడామణి ఇచ్చుట , అశోకవనములో హనుమంతునిచే వృక్షములు ధ్వంసము వర్నీంపబదినవి.

రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణమ్ |
గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహాభిగర్జనమ్ ||

ప్రతిప్లవనమేవాథ మథూనాం హరణం తథా |
రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా ||

తా|| భయపడిన రాక్షసస్త్రీల పలాయనము, హనుమంతునిచే కింకరాది రాక్షసుల వధ, హనుమంతుని బందీ చేయుట, లంకాదహనము , తిరుగుప్రయాణము , మధుబక్షణము , రాఘవునకు హనుమంతుని ఆశ్వాసనము , చూడామణిని రామునకు ఇచ్చుట కూడా వర్ణిఫబడినది.

సంగమం చ సముద్రేణ నళసేతోశ్చబంధనమ్ |
ప్రతారం సముద్రస్య రాత్రౌ లంకావరోధనమ్ ||

విభీషణేన సంసర్గం వథోపాయనివేదనమ్ |
కుంభకర్ణస్య నిథనం మేఘనాధ నిబర్హణమ్ ||

రావణస్య వినాశం చ సీతావాప్తిం అరేః పురే |
విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనమ్ ||

అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్ |
రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనమ్ |

సముద్రునితో సంగమము , నలుడు సముద్రముపై సేతువు నిర్మించుట , సముద్రము దాటి లంకపై దాడి,విభీషణుని శరణాగతి, రాక్షసవధకు ఉపాయములు , కుంభకర్ణవధ , మేఘనాథుని వధ , రావణ సంహారము , సీతాదేవినిపొందుట . విభీషణ పట్టాభిషేకము , పుష్పకవిమానము ఎక్కుట , అయోధ్యపునరాగమనము , భరతునితో కలయుట , రామపట్టాభిషేకము , వానరసైన్యములను పంపివేయుట మొదలగునవి వర్ణింపబడినవి.

స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం |
అనాగతిం చ యత్కించిత్ రామస్య వసుధాతలే ||
తత్ చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషిః |||

తా|| ప్రజానురంజకముగా రాముని పరిపాలన, జానకీ పరిత్యాగము తదితర ఘట్టములు వాల్మీకిభగవానుడు ఉత్తకాండలో రచించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే
తృతీయ సర్గః
సమాప్తం ||