Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 41

Story of Sagara 4 ( contd )!

బాలకాండ
నలుబదియొకటవ సర్గము
( సగరుని పుత్రుడు అంశుమంతుడు యజ్ఞాశ్వము తీసుకొని వచ్చుట)

పుత్త్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరో రఘునందనః |
నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా ||

స|| (హే)రఘునందనః ! సగరో పుత్రాన్ చిర గతాన్ జ్ఞాత్వా స్వ తేజసా దీప్తమానం నప్తారమ్ రాజా అబ్రవీత్|

తా|| ఓ రఘునందన! సగరుడు పుత్రులు వెళ్ళి చాలా కాలము అయినదని చింతనతో సగర మహారాజు , తేజస్వి అయి వెలుగొందుచున్న తన పౌత్రునితో తో ఇట్లుపలికెను.

శూరశ్చ కృతవిద్యశ్చ పూర్వైస్తుల్యో sసి తేజసా |
పితౄణాం గతిమన్విచ్ఛ యేన చాశ్వోs పవాహితః ||

స|| (త్వం) శూరశ్చ కృతవిద్యశ్చ తేజసా పూర్వైః తుల్యోసి . పితౄణాం గతిం చ యేన చ అశ్వో అపవాహితః అన్విచ్చ !

తా||( నాయనా) నీవు శూరుడవు , అన్ని విద్యలూ నేర్చుకొనినవాడవు, తేజస్సు లో నీవు పూర్వీకులతో సమానము . నీ పినతండ్రులు ఎక్కడికి వెళ్ళిరో వారినీ , అశ్వమును , దానిని అపరించినవారినీ వెదుకుము.

అంతర్భౌమాని సత్త్వాని వీర్యవంతి మహంతి చ |
తేషాం త్వం ప్రతిఘాతార్థం సాసిం గృహ్ణీష్వ కార్ముకమ్ ||

స|| భౌమాని అంతరే సత్వాని వీర్యవంతి మహంతి చ | త్వం తేషాం ప్రతిఘాతార్థమ్ సాసిం కార్ముకం చ గృహ్ణీష్వ |

తా|| 'భూమిలోపల మహా బలముగల పెద్ద ప్రాణులు వుండును. నీవు వానిని హతమార్చుటకు ఖడ్గమును ధనస్సునూ తీసుకొనిపొమ్మ'.

అభివాద్యాభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి |
సిద్ధార్థస్సన్ నివర్తస్వ మమ యజ్ఞస్య పారగః ||

సా|| త్వం అభివాద్యా అభివాద్యాం త్వం విఘ్నకరాన్ అపి హత్వా , సిద్ధార్థః ( భూత్వా) నివర్తస్వ| మమ యజ్ఞస్య పారగః ||

తా|| 'నీవు అభివాదము చేయ తగినవారికి అభివాదము చేసి, విఘ్నము కలిగించువారిని హతమార్చి, లక్ష్యము సాధించి తిరిగి రమ్ము. నా యజ్ఞమును పూర్తిచేయుమ'.

ఏవముక్తోంసుమాన్ సమ్యక్ సగరేణ మహాత్మనా |
ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమః ||

సా||(సః) మహాత్మనా సగరేణ ఏవం సమ్యక్ ఉక్తః అంసుమాన్ ఖడ్గం చ ధనుః ఆదాయ (సః) విక్రమః లఘు జగామ |
తా|| 'మహాత్ముడైన సగరునిచే ఇట్లు సముచితముగా చెప్పబడిన ఆ అంశుమంతుడు ఖడ్గమును ధనస్సు నూ తీసుకొని వేగముగా వెళ్ళెను'.

స ఖాతం పితృభిర్మార్గం అంతర్భౌమం మహాత్మభిః|
ప్రాపద్యత నరశ్రేష్ఠ తేన రాజ్ఞాభిచోదితః ||

స|| (హే) నరశ్రేష్ఠ ! రాజ్ఞాభిః చ ఉదితః సః మహాత్మభిః పితృభిఃఅంతర్బౌమం ఖాతం మార్గం తేన ప్రాపద్యత |

తా|| ' ఓ నరోత్తమా ! రాజుచేత అదేశించబడిన అతడు( ఆంశుమంతుడు) పినతండ్రులు భూమిలో త్రవ్వి వెళ్ళిన మార్గమునే అనుసరించెను'.

దైత్య దానవ రక్షోభిః పిశాచపతగోరగైః |
పూజ్యమానం మహాతేజా దిశాగజ మపశ్యత ||

స|| (సః) మహాతేజా దైత్య దానవ రక్షోభిః పిశాచ పతగ ఉరగైః పూజ్యమానం దిశాగజం అపస్యత |

తా|| అచట దైత్య దానవ రాక్షసులచేత పిశాచ పక్షి నాగులచేత పూజింపబడుచున్న మహాగజమును చూచెను.

సతం ప్రదక్షిణీ కృత్వా పృష్ట్వాచాపి నిరామయమ్ |
పితౄన్ స పరిపృచ్ఛ వాజిహర్తారమేవ చ ||

స|| సః తం ప్రదక్షిణీ కృత్వా నిరామయం పృష్ట్వాచ సః పితౄన్ వాజ హర్తారమేవ చ పరిపృచ్చ |

తా|| అతడు దానికి ప్రదక్షిణము చేసి , కుశలములు అడిగి , తన పినతండ్రులు ఆ యజ్ఞాశ్వముగురించి అడిగెను.

దిశాగజస్తు తచ్ఛ్రుత్వా ప్రత్యాహాంశు మతో వచః |
అసమంజ కృతార్థస్త్వం సహాశ్వశ్శీఘ్రమేష్యసి ||

స|| తత్ అంశుమతో వచో శ్రుత్వా దిశాగజస్తు ప్రత్యాహ | (హే) అసమంజస ! త్వం కృతార్థః ( భవసి) శీఘ్రం సహ అశ్వం ఏష్యసి ||

తా|| ఆ దిగ్గజము అంశుమంతుని వచనములను విని ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను." ఓ అంశుమంతా త్వరలోనే కృతార్థుడవై యజ్ఞాశ్వముతో సహా వెళ్ళగలవు" అని.

తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశాగజాన్ |
యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే ||

స|| (సః) తస్య తత్ వచనం శ్రుత్వా సర్వాన్ దిశాగజాన్ యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం ఏవ సముపచక్రమే.

తా|| అతడు ఆ దిగ్గజముయొక్క ఆ మాటలను విని , అదే క్రమములో అన్ని దిగ్గజములను అదే విధముగా వినయపూర్వకముగా ప్రశ్నించెను.

తైశ్చ సర్వైర్దిశాపాలైః వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః |
పూజితస్సహయశ్చైవ గంతాసిత్యభిచోదితః ||

స|| తైః సర్వైః దిశాపాలైః వాక్యజ్ఞైః వాక్యకోవిదైః పూజితః సహయశ్చ ఏవ గంతాసి ఇతి అభిచోదితః |

తా|| వాక్యజ్ఞులు , వాక్య కోవిదులను , దేశకాలానుగుణముగా భాషించు తీరును గ్రహిమపగల ఆ దిగ్గజములు అతనిని పూజించి ,' నీవు త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళెదవు' అని చెప్పిరి.

తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘువిక్రమః |
భస్మరాశీ కృతా యత్ర పితరస్తస్య సాగరాః ||

స|| తేషామ్ తత్ వచనం శ్రుత్వా స విక్రమః లఘు ( తత్ర) జగామ యత్ర సాగరాః తస్య పితరః భశ్మరాశీకృతా ( ఆసీత్) |

తా|| వాటియొక్క ఆ వచనములను విని అ విక్రముడు త్వరిత గతిలో ఎక్కడ తన పినతండ్రులు భశ్మరాసి చేయబడినారో అచటికి వెళ్ళెను.

స దుఃఖవశమాపన్నః త్వసమంజసుతస్తదా |
చుక్రోశ పరమార్తస్తు వధాత్ తేషాం సుదుఃఖితః |

స|| తదా త్వ సమంజససుత దుఃఖవశమాపన్నః తేషామ్ వధాత్ సుదుఃఖితః పరమార్తస్తు చుక్రోశ |

తా|| అప్పుడు ఆ అసమంజసుని పుత్రుడు వారి వధతో మిక్కిలి దుఃఖితుడై దుఃఖముతో ఏడవసాగెను.

యజ్ఞీయం చ హయం తత్ర చరంతం అవిదూరతః |
దదర్శ పురుషవ్యాఘ్రో దుఃఖశోక సమన్వితః ||

స|| సః దుఃఖశోక సమన్వితః పురుషవ్యాఘ్రః తత్ర అవిదూరతః యజ్ఞీయం హయం చరంతం దదర్శ |

తా|| ఆప్పుడు పురుషవ్యాఘ్రుడు దుఃఖశోకసమన్వితుడు అయిన ఆ అంశుమంతుడు దగ్గరలో అటునిటు తిరుగుచున్న యజ్ఞాశ్వమును చూచెను.

స తేషాం రాజపుత్త్రాణాం కర్తుకామో జలక్రియామ్ |
సలిలార్థీ మహాతేజా న చాపశ్యత్ జలాశయమ్ ||

స|| తేషాం రాజ పుత్రాణాం జలక్రియాం కర్తుకామో సలిలార్థీ , మహాతేజా సః జలాశయం న చ అపస్యత్ |

తా|| ఆ రాజపుత్రులకు తర్పణములు ఇచ్చుటకు నీరు కోసము వెదుకుచున్న ఆ మహతేజొవంతునకి జలాశయము అచట కనపడలేదు.

విసార్య విపులాం దృష్టిం తతోsపస్యత్ ఖగాధిపమ్ |
పితౄణాం మాతులం రామ సుపర్ణం అనిలోపమమ్ ||

స|| (హే) రామా ! తతః విపులాం దృష్టిం విసార్య పితౄణాం మాతులం సుపర్ణం అనిలోపమం ఖగాధిపతిం అపస్యత్.

తా|| 'ఓ రామా ! అప్పుడు తన దృష్టిని అటునిటు ప్రసారింపగా తన పినతండ్రులకు మేనమామ వాయువేగముకలవాడు అగు ఖగరాజు కనిపించెను.

స చైవమబ్రవీద్వాక్యం వైనతేయో మహాబలః |
మాశుచః పురుషవ్యాఘ్ర వధోsయం లోకసమ్మతః ||

స|| స మహాబలః వైనతేయః వాక్యమ్ అబ్రవీత్ . " పురుషవ్యాఘ్ర ! మా శుచః అయం లోక సమ్మతః వధః".

తా|| ఆ మహబలవంతుడగు వైనతేయుడు ఇట్లు పలికెను. ' ఓ పురుషవ్యాఘ్ర ! శోకింపకుము. ఈ వథ లోకసమ్మతము ప్రకారము జరిగెను'.

కపిలే నా ప్రమేయేణ దగ్ధా హీమే మహాబలాః |
సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతు మేషాం హి లౌకికమ్ ||

స|| అప్రమేయేణ కపిలేన ఇమే దగ్ధాః హి ! లౌకికం ప్రాజ్ఞ ఏషాం సలిలం దాతు న అర్హసి |

తా|| ' అప్రమేయుడగు కపైలమహాముని చే వీరు దగ్ధము చేయబడిరి . లోకమర్యాదానుసారము వీరికి తర్పణములు విడువతగదు '

గంగా హిమవతో జ్యేష్ఠా దుహితా పురుషర్షభ |
తస్యాం కురు మహాబాహో పితౄణాం తు జలక్రియామ్||

స|| (హే) పురుషర్షభ ! హిమవతో జ్యేష్ఠా దుహితా గంగా |మహాబాహో తస్యాం ( గంగాయాం) కురు పితౄణాం తు జలక్రియాం |

తా|| ఓ పురుషర్షభ ! గంగ హిమవంతుని జ్యేష్ట పుత్రిక. ఓ మహాబాహో ఆ గంగా నదిలో పిత్రుతర్పణములను విడువుము.

భస్మరాశీ కృతాన్ ఏతాన్ ప్లావయేల్లోకపావనీ |
తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా |
షష్టిం పుత్త్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి ||

స|| భస్మరాశీకృతాన్ ఏషాన్ లోకపావని ప్లావయేత్ | ఇదం భస్మం లోకకాంతయా గంగాయా క్లిన్నం షష్టిం సహస్రాణి పుత్రాణి స్వర్గలోకం నయిష్యతి |

తా|| భస్మము చేయబడిన వీరిని లోకపావని అయిన గంగ పావనము చేయును. భస్మము గంగాజలముచే తడుపబడగా ఆ అరువదివేల రాజకుమారులు స్వర్గమునకు చేరుదురు.

గచ్ఛచాశ్వం మహాభాగ తం గృహ్య పురుషర్షభ |
యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి ||

స|| (హే) మహభాగా ! పురుషర్షభా !తం అశ్వం గృహ్య చ గచ్చ ! వీర ! పితామహం యజ్ఞం సంవర్తయితుం అర్హసి|

తా|| ఓ మహాభాగా ! పురుషర్షభా ! ఆ అశ్వమును తీసుకొని పొమ్ము. ఓ వీరా ! పితామహును యజ్ఞము పూర్తిచేయుంచుటకు నీవు అర్హుడవు.

సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమానతి వీర్యవాన్ |
త్వరితం హయ మాదాయ పునరాయాన్మహాయశాః ||

స|| సః వీర్యవాన్ అంశుమాన్ సుపర్ణ వచనమ్ శ్రుత్వా హయం ఆదాయ మహాయశాః త్వరితం పునరాయాన్ |

తా|| ఆ వీరుడైన అంశుమంతుడు ఆ ఖగరాజు వచనములను విని ఆ అశ్వమును తీసుకొని మరల యజ్ఞభూమికి వచ్చెను.

తతో రాజానమాసాద్య దీక్షితం రఘునందనః |
న్యవేదయత్ యథావృత్తం సుపర్ణ వచనం తథా ||

స|| (హే) రఘునందన ! దీక్షితం రాజానం ఆసాద్య యథావృత్తం తథా సుపర్ణ వచనం (అపి) న్యవేదయత్ ||

తా|| ఓ రఘునందన ! యజ్ఞదీక్షలోనున్న ఆ రాజుకు ఆవృత్తాంతమంతయూ , ఖగరాజు వచనములను కూడా చెప్పెను.

తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం వాక్యమంశుమతో నృపః |
యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి ||

స|| అంశుమతో ఘోరసంకాశం వాక్యం తత్ శ్రుత్వా నృపః యథాకల్పం యథావిథి యజ్ఞం నిర్వతయామాస|

తా|| అంశుమంతుడు చెప్పినె అ భయంకరవార్తను వినిన ఆ రాజు యథావిథి గా యజ్ఞమును నిర్వర్తించెను.

స్వపురం చాగమత్ శ్రీమాన్ ఇష్టయజ్ఞో మహీపతిః |
గంగాయా శ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత ||

స|| మహీపతిః ఇష్టయజ్ఞో ( కృతవాన్) స్వపురం చ ఆగమత్ | రాజా గంగాయాశ్చ ఆగమే నిశ్చయం అ అధ్య గచ్చత |

తా|| ఆ శ్రీమంతుడైన ఆ మహీపతి యజ్ఞకర్మలను పూర్తిచేసి తన పురమునకు వచ్చెను. గంగను తీసుకువచ్చుటగురించి ఒక నిశ్చయమునకు రాలేకపోయెను.

అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్ |
త్రింశద్వర్ష సహస్రాణి రాజ్యం కృత్వా దివంగతమ్ ||

స|| త్రింశద్వర్ష సహస్రాణి రాజ్యమ్ కృత్వా , ( గంగాయాశ్చాగమనే) నిశ్చయం అకృత్వా మహాన్ రాజా మహతా కాలేన దివంగతమ్ |

తా|| ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేసి , గంగగురించి నిశ్చయము చేయకుండా ఆ మహారాజు కాలవశమున దివంగతుడాయెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకచత్వారింశస్సర్గః |
సమాప్తం ||

ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలభై ఒకటి స్వర్గ సమాప్తము |

|| ఓమ్ తత్ సత్||



|| Om tat sat ||