Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 49

Story of Ahalya ( contd.)!

బాలకాండ
నలుబదితొమ్మిదవ సర్గము
( అహల్యా శాప విముక్తి )

అఫలస్తు తత శ్సక్రో దేవాన్ అగ్నిపురోధసః |
అబ్రవీత్ త్రస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్ ||

స|| తతః అఫలస్తు శక్రః త్రస్తవదనః స ఋషిసంఘాన్ స చారణాన్ దేవాన్ పురోధసః అగ్నిం అబ్రవీత్.

తా|| అప్పుడు వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై చారణులతోనూ మహర్షులతో కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను.

కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః |
క్రోధముత్పాద్య హి మయా సురకార్యం ఇదం కృతమ్||

స|| మహాత్మనః క్రోధముత్పాజ్య గౌతమస్య తపసో విఘ్నం కుర్వత | మయా ఇదం సురకార్యం కృతం |

తా|| క్రోథము తెప్పించి మహాత్ముడైన ఆ గౌతముని తపస్సు భంగపరిచితిని.ఈ దేవతల కార్యము నాచేత చేయబడినది.

అఫలోsస్మి కృతస్తేన క్రోధాత్ సా చ నిరాకృతా |
శాపమోక్షేణ మహతా తపోsస్యాపహతం మయా ||

స|| తేన క్రోధాత్ అఫలోస్మి | సా ( అహల్యాచ) నిరాకృతా | మయా శాప మోక్షేణ అస్య మహతా తపః అపహుతం |

తా|| అయన క్రోథముతో నేను అఫలుడను అయితిని. ఆ అహల్య కూడా ఆకారము లేనిది అయ్యెను. శాప కారణముగా ( గౌతముని యొక్క) మహత్తరమైన తపోశక్తి నష్టమయ్యెను.

తస్మాత్ సురవరాస్సర్వే సర్షిసంఘా స్సచారణాః |
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ ||

స|| హే సురవరాః ! తస్మాత్ సర్వే స ఋషిసంఘాః స చారణాః సురసాహ్యకరం సఫలం కర్తుం అర్హథ |

తా|| ఓ సురవరులారా అందువలన ఋషిసంఘములు చారణులతో కూడి మీరందరూ నన్ను అఫలత్వమునుండి సఫలునిచేయుటకు తగును.

శతక్రతోర్వచశ్శ్రుత్వా దేవాస్సాగ్నిపురోగమాః |
పితృదేవానుపేత్యాహుః సహ సర్వైర్మరుద్గణైః ||

స|| శతక్రతోః వచనం శ్రుత్వా అగ్ని పురోగమాఃస మరుద్గణైః సహ పితృదేవాన్ అనుపేత్య దేవాః ఆహుహుః |

తా|| ఇంద్రుని యొక్క ఆ వచనములను విని అగ్ని మొదలగు దేవతలు మరుద్గణములతో కూడి పిత్రుదేవతలకడకు వెళ్ళిరి.

అయం మేషః సవృషణః శక్రో హ్యవృషణః కృతః |
మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత ||

స|| శక్రో హ్య వృషణః కృతః | అయం మేషః స వృషణః | మేషస్య వృషణౌ గృహ్య శక్రయాశు ప్రయచ్ఛత |

తా|| ఇంద్రునకు వృషణములు లేవు. ఈ మేషము నకు వృషణములు కలవు. ఆ మేషముయొక్క వృషణములు తీసుకొని ఇంద్రునికి ఇవ్వవలెను.

అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి |
భవతాం హర్షణార్థాయ యే చ దాస్యంతి మానవాః ||

స|| భవతాం హర్షణార్థాయ మానవాః యే దాస్యంతి | మేషః అఫలస్తు కృతో అపి పరాం తుష్టిం ప్రదాస్యతి చ|

తా|| మీ ఆనందముకోసము మానవులు దీనిని ఇచ్చున్నారు. మేషము నకు వృషణములు లేనప్పటికి మీకు తృప్తిని ఇచ్చును.

అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాస్సమాగతాః |
ఉత్పాట్య మేష వృషణౌ సహస్రాక్షే న్యవేశయన్ ||

స|| అగ్నేస్తు వచనం శ్రుత్వా సమాగతాః పిత్రుదేవాః మేష వృషణౌ ఉత్పాట్య సహస్రాక్షే న్యవేశయన్ |
తా|| అగ్నియొక్క ఆ వచనములను విని అక్కడ సమాగతులైన పిత్రుదేవతలు ఆ మేషముయొక్క వృషణములను తీసి ఇంద్రుని కి ఇచ్చిరి.

తదా ప్రభృతి కాకుత్ స్థ పితృదేవాః సమాగతాః |
అఫలాన్ భుజంతే మేషాన్ ఫలైస్తేషామ్ అయోజయన్ ||

స|| హే కాకుత్ స్థః ! తదాప్రభృతి సమాగతాః పితృదేవాః అఫలాన్ మేషాం భుజంతే | తేషాం ఫలైః అయోజయన్ |

తా|| ఓ కాకుత్స్థ ! అప్పటి నుండి సమాగతులైన పిత్రుదేవతలు వృషణములు లేని మేషములను భుజించి వారికి ఫలములను ఇచ్చుచుండిరి.

ఇంద్రస్తు మేష వృషణః తదా ప్రభృతి రాఘవ |
గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః ||

స|| హే రాఘవ ! తదాప్రభృతి మహాత్మనః తపసశ్చ గౌతమస్య ప్రభావేన ఇంద్రస్తు మేష వృషణః ( భవతి) |

తా || ఓ రాఘవ !అప్పటినుండి మహత్ముడైన గౌతముని ప్రభావము వలన ఇంద్రుడు మేషవృషణుడు అయ్యెను.

తదాగచ్ఛ మహతేజ ఆశ్రమం పుణ్యకర్మణః |
తారయైనాం మహాభాగామ్ అహల్యాం దేవరూపిణీమ్||

స|| హే మహాతేజ ! తదా పుణ్యకర్మణః ఆశ్రమం ఆగచ్ఛ| ఏనాం మహాభాగామ్ దేవరూపిణీమ్ అహల్యాం తారయ |

తా|| ఓ మహాతేజా | అందువలన పుణ్యభూమియగు ఆ ఆశ్రమమునకు రావలయును. దేవరూపిణి మహాభాగా అగు అహల్యను తరింపచేయుడు ".

విశామిత్ర వచశ్శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః |
విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమ మథావిశత్ ||

స|| విశ్వామిత్రస్య వచః శ్రుత్వా రాఘవః స లక్ష్మణః విశ్వామిత్రం పురశ్కృత్య్ తం ఆశ్రమం అథ ఆవిశత్ |

తా|| విశ్వామిత్రుని యొక్క ఆ వచనములను వినిన రాఘవుడు, విశ్వామిత్రుని ముందు ఉంచుకొని ఆ ఆశ్రమము ప్రవేశించెను.

దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్ |
లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః ||

స|| ( తదా) లోకైరపి సురాసురైః దుర్నిరీక్ష్యాం తపసా ద్యోతిత ప్రభాం మహాభాగాం దదర్శ

తా|| లోకులకు సురాసురులకు కూడా కనపడని ఆ తపస్సుచే తనప్రభావముచే వెలుగొందుచున్న ఆ మహాభాగిని ని చూచిరి.

ప్రయత్నా న్నిర్మితాం ధాత్రా దివ్యాం మాయా మయీ మివ|
సతుషారవృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ ||
( ధూమేనాపి పరీతాంగీం దీప్తాం అగ్నిశిఖామివ )||

స|| మాయా మయీం ఇవ స తుషారవృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభాం ఇవ ధాత్రా ప్రయత్నాత్ నిర్మితాం ( తాం దదర్శ)
తా|| మాయా మయిలాగా , నీటితో నిండిన మేఘములతో కప్పబడిన పూర్ణచంద్రుని కాంతి వలె నున్న, సృష్టి కర్త ప్రయత్నముతో నిర్మించిన ( ఆ అహల్యను చూచిరి)

మధ్యేంభసో దురాదర్షాం దీప్తాం సూర్యప్రభామివ |
సా హి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్యా బభూవ హ ||
త్రయాణమపి లోకానాం యావద్రామస్య దర్శనమ్ |
శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శన మాగతా ||

స|| అంభసే మధ్యే దీప్తాం సూర్య ప్రభామ్ ఇవ సా గౌతమ వాక్యేన త్రయాణామపి లోకానాం దుర్నిరీక్ష్యా బభూవ హ | యావత్ రామస్య దర్శనం శాపస్య అంత ముపాగమ్య తేషాం దర్శనం ఆగతా |

తా|| నీటిమధ్యలో వెలుగొందుచున్న సూర్యకాంతివలె నున్న ఆమె, గౌతముని వచనములవలన మూడు లోకములకు కనిపించనిది అయ్యెను.శ్రీరాముని దర్శనము అయినవెంటనే శాపము యొక్క అంతమై ఆమె మరల కనపడసాగెను.

రాఘవౌ తు తతః తస్యాః పాదౌ జగృహతు తదా |
స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహ సా చ తౌ ||

స|| తతః రాఘవౌ తస్యాః పాదౌ జగృహతు | తదా సా చ గౌతమః వచః స్మరంతి ప్రతిజగ్రాహ |

తా|| అప్పుడు ఆమలక్ష్మణులు ఆమె పాదాములను పట్టుకొనిరి ( భక్తి పూర్వకముగా). అప్పుడు ఆమెకూడా గౌతముని వచనములు స్మరిస్తూ వారి కి పాదాభివందనము చేసెను.

పాదమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితః |
ప్రతిజగ్రాహ కాకుత్ స్థ విధి దృష్టేన కర్మణా ||

స|| సుసమాహితా పాద్యం అర్ఘ్యం తథా ఆతిథ్యం చకార ! కాకుత్ స్థోకర్మణా విథి దృష్టేన ప్రతిజగ్రాహ |

తా|| ఆమె అర్గ్యపాద్యములతో వారికి అతిథ్యమిచ్చెను. ఆ కకుత్స వంశజులు విధి ప్రకారము వాటిని తీసుకొనిరి.

పుష్పవృష్టి ర్మహత్యాసీత్ దేవదుందుభినిస్స్వనైః |
గంధర్వాప్సరసాం చాపి మహానాసీత్ సమాగమః ||

స|| మహత్ పుష్పవృష్ఠిః ఆసీత్ | గంధర్వ అప్సరసాంచ అపి దేవ దుందుభి నిస్స్వనైః సమాగమః మహాన్ ఆసీత్ |

తా|| అప్పుడు మహత్తరమైన పుష్ఫవృష్టి కురుసెను. గంధర్వులు, అప్సరసలు , దుందుభీలు మొగిస్తూ దేవతలు అచట సమాగమమైరి.

సాధు సాధ్వితి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ |
తపోబలవిశుద్ధాంగీం గౌతమస్య వశానుగామ్ ||

స|| తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వశానుగాం తాం అహల్యాం దేవాః సాధు సాధు ఇతి సమపూజయన్ |
తా|| తపోబలముచే శుచి అయిన , గౌతమునిని చేరిన ఆ అహల్యను దేవతలందరూ బాగు బాగు అని పూజించిరి.

గౌతమోపి మహాతేజా అహల్యాసహితస్సుఖీ|
రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాః ||

స|| మహాతేజా గౌతమః అపి అహల్యా సహిత రామం విధివత్ సంపూజ్య స్సుఖీ మహాతపాః తేపే |

తా|| మహాతేజోవంతుడైన గౌతముడు కూడా ఆహల్య తో కలిసి శ్రీరామునకు విధివత్తరముగా ఆనందముగా పూజించి , ఆ మహాతపోవంతుడు మరల తపస్సు చేయసాగెను.

రామః అపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః |
సకాశాద్విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః ||

స|| రామః అపి సకాశాత్ విధివత్ మహామునేః గౌతమస్య పూజాం ప్రాప్య తతః మిథిలాం జగామ |

తా|| రాముడు కూడా ఆ మహామునియొక్క పూజలను అందుకొని పిమ్మట మిథిలానగరమునకు వెళ్ళెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ఏకోనపంచాశస్సర్గః ||
సమాప్తం ||

|| Om tat sat ||