Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 62

Story of Sunahsepha- 2 !!

|| om tat sat ||

బాల కాండ
అఱువది రెండవ సర్గము.

శునశ్శేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః |
వ్యశ్రామ్యత్ పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన ||

స|| హే నరశ్రేష్ఠ ! రఘునందన ! మహాయశాః రాజా శునశ్శేఫమ్ గృహీత్వా మధ్యాహ్నే పుష్కరే వ్యశ్రామ్యత్ ||

తా|| 'ఓ నరశ్రేష్ఠా ! రఘునందన ! మహా యశస్సు గల ఆరాజు శునశ్శేఫుని తీసుకుని వెళ్ళుతూ మధ్యాహ్న సమయమున పుష్కరక్షేత్రములో విశ్రమించెను'.

తస్య విశ్రమమాణస్య శునశ్శేఫో మహాయశాః |
పుష్కరక్షేత్ర మాగమ్య విశ్వామిత్రం దదర్శ హ ||
తప్యంతమ్ ఋషిభిస్సార్థం మాతులం పరమాతురః ||

స|| తస్య విశ్రమమాణస్య శునశ్శేఫో పుష్కర క్షేత్రం ఆగమ్య ఋషిభిస్సార్థం తప్యంతం మాతులం పరమాతురః మహాయశాః విశ్వామిత్రం దదర్శ హ ||

తా|| 'ఆ రాజు విశ్రమించుచుండగా శునశ్శేఫుడు పుష్కర క్షేత్రములో ఋషులతో తపము చేయుచున్న తన మేనమామ యగు మహా యశస్సు గల విశ్వామిత్రుని చూచెను'.

వివర్ణవదనో దీనః తృష్ణయా చ శ్రమేణ చ||
పపాతాంకే మునేఆశు వాక్యం చేద మువాచ హ ||

స|| వివర్ణవదనో దీనః తృష్ణయా చ శ్రమేణ చ మునే అంకే పపాత | ఇదం ఆశు వాక్యం చ ఉవాచ ||

తా|| 'బిక్కపోయి, దీనుడై , శ్రమచేత దప్పిక గలవాడై అ ముని యొక్క కాళ్లపై పడెను. అనంతరము ఇట్లు పలికెను'.

న మే అస్తి మాతా న పితా జ్ఞాతయో బాంధవాః కుతః||

స|| మే మాతా న అస్తి న పితా జ్ఞాతయో బాంధవాః కుతః ||

తా|| "నాకు తల్లీ లేదు. తండ్రి బంధువులు తెలిస్న వాళ్ళూ ఎక్కడా లేరు".

త్రాతు మర్హసి మాం సౌమ్య ధర్మేణ ముని పుంగవ|
త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః ||

స||హే సౌమ్య ! మునిపుంగవ ధర్మేణ త్రాతు మర్హసి | హే మునిశ్రేష్ఠ ! సర్వేషాం త్రాతా త్వం హి | త్వం హి భావనః ||

తా|| "ఓ శౌమ్యుడా ! మునిపుంగవ ధర్మానుసారముగా నన్ను రక్షింప గలవు. ఓ మునిశ్రేష్ఠ అందరికీ నీవే దిక్కు. అందరికి రక్ష ."

రాజా చ కృతకార్యః స్యాత్ అహం దీర్ఘాయురవ్యయః|
స్వర్గలోక ముపాశ్నీయాం తపస్తప్త్వాహ్యనుత్తమమ్ ||

స|| రాజా చ కృత కార్యః స్యాత్ | అహం అవ్యయః దీర్ఘాయుః | ఉత్తమమ్ తపః తప్త్వా సవర్గ లోక ముపాశ్నీయాం |

తా|| "ఆ రాజుయొక్క కార్యము సఫలము కావలెను. నాకు దీర్ఘాయువు కావలెను. ఉత్తమమైన తపస్సు ఒనరించి నేను స్వర్గ లోకము పొందవలెను".

త్వం మే నాథో హ్యనాథస్య భవ భవ్యేన చేతసా |
పితేవ పుత్త్రం ధర్మాత్మన్ త్రాతుమర్హసి కిల్బిషాత్ ||

స|| భవ్యేన చేతసా అనాధస్య మే త్వం హి నాథో భవ | ధర్మాత్మన్ కిల్బిషాత్ పితేవ పుత్త్రం త్రాతు మర్హసి ||

తా|| "భవ్యమైన మనస్సుతో అనాధుడైన నన్ను నీవే కాపాడవలెను. ధర్మాత్మా ఈ కష్ఠమునుంచి తండ్రి పుత్త్రులను కాపాడినట్లు నీవు నన్ను కాపాడగలవు".

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః |
సాంత్వయిత్వా బహువిథం పుత్త్రాన్ ఇదం ఉవాచ హ ||

స|| విశ్వామిత్రః మహాతపాః తస్య తత్ వచనం శ్రుత్వా బహువిథం సాంత్వయిత్వా పుత్త్రాన్ ఇదం వచనమ్ ఉవాచ హ ||

తా|| 'మహాతపోవంతుడైన విశ్వామిత్రుడు అతనియొక్క ఆ మాటలను విని అతనిని అనేకవిథములుగా ఓదార్చి తన పుత్త్రులతో ఇట్లు పలికెను'.

యత్కృతే పితరః పుత్త్రాన్ జనయంతి శుభార్థినః |
పరలోక హితార్థాయ తస్య కాలో అయం ఆగతః ||

స|| పితరః యత్కృతే శుభార్థినః పరలోకహితార్థాయ పుత్త్రాన్ జనయంతి | తస్య కాలః అయం ఆగతః ||

తా|| "తండ్రులు తముచేసిన కార్యముల శుభము కొఱకు, పరలోక హితము కొఱకు,పుత్త్రులను కోరెదరు. ఇప్పుడు అట్టి కాలము వచ్చినది".

అయం మునిసుతో బాలో మత్తః శరణమిచ్ఛతి |
అస్య జీవిత మాత్రేణ ప్రియం కురుత పుత్త్రకాః ||

స|| అయం మునిసుతో బాలో మత్తః శరణం ఇచ్ఛతి | హే పుత్త్రకాః అస్య జీవిత మాత్రేణ ప్రిఅయం కురుత |

తా|| "అ మునికుమారుడు బాలుడు నా శరణు కోరుచున్నాడు. ఓ పుత్త్రులారా ఇతని జీవితము నిలుపుటకు ప్రియము చేసెదరు గాక"

సర్వే సుకృత కర్మాణః సర్వే ధర్మ పరాయణాః |
పశుభూతా నరేంద్రస్య తృప్తి మగ్నేః ప్రయఛ్ఛత ||

స|| (తే) సర్వే సుకృత కర్మాణః సర్వే ధర్మ పరాయణః | నరేంద్రస్య పశు భూతా అగ్నేః తృప్తి ప్రయచ్ఛత |

తా|| "మీరు అందరూ మంచిపనులు చేసిన వారు. అన్ని ధర్మములను పాటించువారు. నరేంద్రునియొక్క యజ్ఞపశువు గా అగ్నిని తృప్తి పరచెదరు గాక".

నాథనాంశ్చ శునశ్శేఫో యజ్ఞశ్చావిఘ్నితో భవేత్ |
దేవతా స్తర్పితాశ్చ స్య్ః మమచాపి కృతం వచః ||

స|| శునశ్శేఫః నాథనాం చ దేవతాః తర్పితాః చ యజ్ఞశ్చ అవిఘ్నితో భవేత్ | మమాపి స్యుః కృతం వచః ||

తా|| "శునశ్శేఫుడు రక్షింపబడును. దేవతల తర్పింపబడుదురు. యజ్ఞము అవిఘ్నముగా జరిగి పోవును. నాయొక్క మాటలు నిలబెట్టినవారగుదురు".

మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యందాదయస్సుతాః|
సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్ ||

స|| హే నరశ్రేష్ఠ ! మధుష్యందాదయః సుతాః మునేస్తు వచనం శ్రుత్వా స అభిమానం స లీలం ఇదం అబ్రువన్ ||

తా|| 'ఓ నరశ్రేష్ఠ ! సుతులగు మధుష్యందాదులు ముని యొక్క వచనములను విని కొంచెము అభిమానము తోనూ కొంత లీలగను భావించి ఇట్లు చెప్పిరి'.

కథమాత్మసుతాన్ హిత్వా త్రాయసే అస్య సుతం విభో|
అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే ||

స|| హే విభో కథం ఆత్మ సుతాన్ హిత్వా అస్య సుతం త్రాయసే | భోజనే శ్వమాంసం ఇవ అకార్యమ్ ఇవ పశ్యామః ||

తా||" ఓ విభో ! తన స్వంతమైన సుతులను చంపి అన్యుల పుత్త్రులను ఏట్లు రక్షించెదవు ?బోజనములో కుక్క మాంసము వలె ఇది అకార్యము కదా" .

తేషాం తద్వచనం శ్రుత్వా పుత్త్రాణాం మునిపుంగవః |
క్రోధ సంరక్త నయనో వ్యాహర్తుముపచక్రమే ||

స|| మునిపుంగవః తేషామ్ పుత్త్రాణాం తద్వచనం శ్రుత్వా క్రోథ సంరక్త నయనః వ్యాహర్తుం ఉపచక్రమే ||

తా|| 'ఆ మునిపుంగవుడు ఆ పుత్త్రుల ఆటి వాక్యములను విని క్రోథముతో మడిపడుతున్న కళ్ళు కలవాడై ఇట్లనెను'.

నిస్సాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితమ్ |
అతిక్రమ్య తు మద్వాక్యం దారుణం రోమహర్షణమ్ ||

స|| మత్ వాక్యం అతిక్రమ్య ఇదం నిస్సాధ్వసం ప్రోక్తం దారుణమ్ రోమహర్షణమ్ ధర్మాత్ అపి విగర్హితమ్ |

తా|| "నా మాటను దాటి ఇట్లు అమర్యాదకపూర్వముగా చెప్పినది దారుణము,దిగ్భ్రాంతికరము, ధర్మమునకు విరుద్ధము".

శ్వమాంసభోజినస్సర్వే వాశిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణమ్ వర్ష సహస్రం తు పృథివ్యామనువత్స్యథ ||

స|| (తే) సర్వే వాశిష్ఠా ఇవ జాతిషు శ్వమాంస భోజినః వర్ష సహస్రం పూర్ణమ్ పృథివ్యాం అనువత్స్యథ ||

తా|| "మీరందరూ వసిష్ఠపుత్రుల వలె కుక్కమాంసము తింటూ వెయ్యి సంవత్సరములు భూమిపై పడియుండెదరు గాక" ||

కృత్వా శాప సమాయుక్తాన్ పుత్త్రాన్ మునివరస్తథా |
శునశ్శేఫం ఉవాచార్తం కృత్వా రక్షాం నిరామయమ్ ||

స|| మునివరః పుత్త్రాన్ శాప సమాయుక్తాన్ కృత్వా ఆర్తం నిరామయం శునశ్శేఫం రక్షాం కృత్వా ఉవాచ ||

తా|| "ఆ ముని వరుడు పుత్త్రులను శపించి పిమ్మట ఆర్తుడైయున్న శునశ్శేఫునకు రక్షణ కుదిర్చి ఇట్లు పలికెను".

పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః |
వైష్ణవం యూప మాసాద్య వాగ్భిరగ్నిముదాహర ||

స|| పవిత్ర పాశైః ఆశక్తో రక్తమాల్యాను లేపనః వైష్ణవం యూపమ్ ఆసాద్య వాగ్భిః అగ్నిం ఉదాహర ||

తా|| "పవిత్రమైన పాశములతో బంధించబడి ఎరుపు రంగుగలపూలమాలలతో అలంకరింపబడి విష్ణు యూపస్తంభము చేరి వాక్కుతో అగ్నిని స్తుతింపుము".

ఇమే తు గాధే ద్వే దివ్యే గాయేథ మునిపుత్త్రక |
అంబరీషస్య యజ్ఞే అస్మిన్ తతస్సిద్ధిమవాప్స్యసి ||

స|| హే మునిపుత్త్రక ! అంబరీషస్య యజ్ఞే అస్మిన్ ద్వే దివ్యే గాథే గాయేథ | తతః ఇమే సిద్ధిం అవాప్స్యసి ||

తా|| "ఓ మునిపుత్త్రక ! అంబరీషుని యజ్ఞములో రెండు దివ్యమంత్రములను గానము చేయుము. అప్పుడు వాని వలన నీ కోరిక తీరును",

శునశ్శేఫో గృహీత్వా తే ద్వే గాధే సుసమాహితః |
త్వరయా రాజసింహం తమ్ అంబరీషమువాచహ||

స|| శునశ్శేఫః తే ద్వే గాధే గృహీత్వా త్వరయా రాజసింహం అంబరీషం తం ఉవాచ హ

తా || శునశ్శేపుడు ఆ రెండు మంత్రములను తీసుకొని్ వెంటనే ఆ రాజసింహము అయిన అంబరీషునితో ఇట్లు పలికెను.

రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్ఛావహే సదః |
నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ ||

స|| హే రాజసింహ ! మహాసత్వ ! సదః శీఘ్రం గచ్ఛావహే | హే రాజేంద్ర ! సముపావిశః దీక్షాం చ నిర్వర్తయస్వ ||

తా|| " ఓ రాజసింహా !మహాబలశాలి ! సభకు శీఘ్రముగా పోయెదము. ఓ రాజేంద్ర ! అచట కూర్చుని వెంటనే దీక్ష తీసుకొనుము "

తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః |
జగామ నృపతిశ్శీఘ్రం యజ్ఞవాటం అతంద్రితః ||

స|| ఋషిపుత్రస్య తత్ వాక్యం శ్రుత్వా నృపతిః హర్షసముత్సకః అత్ంద్రితః శీఘ్రం యజ్ఞవాటమ్ జగామ ||

తా|| ముని కుమారుని ఆ మాటలను విని ఆ రాజు సంతోషముతో వెంటనే యజ్ఞవాటికకు వెళ్ళెను.

సదస్యానుమతే రాజా పవిత్ర కృతలక్షణమ్|
పశుం రక్తాంబరం కృత్వా యూపే తం సమబంధయత్ ||

స|| రాజా సదస్య అనుమతే పవిత్ర కృత లక్షణం పశుం రక్తాంబరం కృత్వా యూపే తం సమబంధయత్ ||

తా|| ఆ రాజు సదస్యుల అనుమతితో యజ్ఞపశువును పవిత్ర మొనర్చి , ఎర్రని మాలతో అలంకరించి యూపస్తంభమునకు కట్టిరి.

స బద్ధోవాగ్నిరగ్ర్యాభిః అభితుష్టావ తౌ సురౌ |
ఇంద్రం ఇంద్రానుజం చైవ యథావన్మునిపుత్త్రకః ||

స|| స బద్ధః అగ్నిరగ్ర్యాభిః మునిపుత్త్రకః తౌ సురౌ ఇంద్రం ఇంద్రానుజం చైవ యథావత్ అభితుష్టావ |

తా|| అట్లు కట్టబడి ముని పుత్త్రకుడు ఇంద్రుని అగ్నిని యథావిథిగా స్తుతించెను.

తతః ప్రీతిసహస్రాక్షో రహస్య స్తుతి తర్పితః |
దీర్ఘమాయుః తదా ప్రాదాత్ శునశ్శేఫాయ రాఘవ ||

స|| హే రాఘవ ! తతః సహస్రాక్షః రహస్య స్తుతి తర్పితః తదా శునశ్శేఫాయ దీర్ఘమ్ ఆయుః ప్రాదాత్ ||

తా|| ఓ రాఘవ ! అప్పుడు ఇంద్రుడు రహస్యమైన ఆ స్తుతితో తృప్తి పడి శునశ్శేఫునకు దీర్ఘాయువు ప్రసాదించెను.

స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య చ సమాప్తవాన్ |
ఫలం బహుగుణం రామ సహస్రాక్ష ప్రసాదజమ్ ||

స|| హే నరశ్రేష్ఠ ! రామ ! స రాజా యజ్ఞస్య సమాప్తవాన్ బహుగుణం ఫలం సహస్రాక్ష ప్రసాదజం ||

తా|| ఓరామ ! ఓ నరశ్రేష్ఠా | యజ్ఞము సమాప్తము అవగనే ఆ రాజు ఇంద్రునిచే బహుగుణములైన ఫలితములతో ప్రసాదింపబడెను.

విశ్వామిత్రోsపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ దస వర్ష శతాని చ ||

స|| హే నరశ్రేష్ఠ ! ధర్మాత్మా విశ్వామిత్రః భూయం పుష్కరేషు దశ వర్ష శతాని చ తేపే మహాతపాః ||

తా|| ఓ నరశ్రేష్ఠా ! ధర్మాత్ముడగు విశ్వామిత్రుడు మళ్ళీ పదివేల సంవత్సరములు తపస్సు చేసెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే ద్విషష్టితస్సర్గః ||

|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణము లో బాలకాండలో అరువది రెండవ సర్గము సమాప్తము ||.

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||