Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 74

Parasurama !!

||om tat sat ||

బాలకాండ
డెబ్బది నాలుగవ సర్గ

 

అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః|
అపృష్ట్వా తౌ రాజానౌ జగామోత్తర పర్వతమ్ ||
ఆశీర్భిః పూరయిత్వాచ కుమారాంశ్చ స రాఘవాన్ ||

స|| అథ రాత్ర్యాం వ్యతీతాయాం మహామునిః విశ్వామిత్రః కుమారాంశ్చ స రాఘవాన్ ఆశీర్భిః పూరయిత్వా చ తౌ రాజానౌ అపృష్ట్వాఉత్తరపర్వతమ్ జగామ ||

తా|| ఆ రాత్రి గడిచిన పిమ్మట మహాముని అగు విశ్వామిత్రుడు రాఘవునితో సహా కుమారులు అందరినీ ఆశీర్వదించి రాజులను వీడ్కొని ఉత్తరముగానున్న పర్వతములవేపు వెళ్ళెను.

విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపమ్ |
అపృష్ట్వాsథ జగామాశు రాజా దశరథః పురీమ్ ||

స|| విశ్వామిత్రే గతే అథ రాజా దశరథః రాజా వైదేహం మిథిలాధిపమ్ అపృష్ట్వా పురీమ్ జగామాశు||

తా|| విశ్వామిత్రుడు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాథిపతి అగు జనకుని వీడ్కొలి తన పురమునకు బయలుదేరెను.

గచ్ఛంతం తం తు రాజానం అన్వగచ్చన్ నరాధిపః |
అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహుత్ ||

స|| గచ్ఛంతం రాజానం నరాధిపః అన్వగచ్ఛన్ | అథ విదేహానాం రాజా బహుత్ కన్యాధనం దదౌ ||

తా|| వెళ్ళుచున్న ఆ మహారాజుని ఆ నరాధిపుడు అనుసరించెను. అ విదేహమహరాజు చాలా కన్యాధనము ఇచ్చెను.

గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః|
కంబళానాం చ ముఖ్యానాం క్షౌమకోట్యంబరాణీ చ ||

స|| బహూని శతసహస్రాణి గవాం కంబళానాం క్షౌమకోట్యంబరాణి చ మిథిలేశ్వరః (దదౌ)||

తా|| అనేకమైన వంద వేల ఆవులను కంబళులను పట్టువస్త్రములను ఇచ్చెను.

హస్త్యశ్వరథపాదాతాం దివ్యరూపం స్వలంకృతమ్|
దదౌ కన్యాసితా తాసాం దాసీదాసమనుత్తమమ్ ||

స|| దివ్యరూపం స్వలంకృతం హస్త్యశ్వరథపాదాతాం అనుత్తమమ్ దాసీదాసం తాసాం కన్యాసితా దదౌ ||

తా|| దివ్యరూపముగల అలంకరింపబడిన ఉత్తమమైన గజ ఆశ్వ రథములను దాసదాసీ జనములతో వారికి ఇచ్చెను.

హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ |
దదౌ పరమసంహృష్టః కన్యాధనమనుత్తమమ్ ||

స|| ( స రాజా) పరమసంహృష్టః అనుత్తమమ్ హిరణ్యస్య సువర్ణస్య విద్రుమస్య ముక్తానాం కన్యాధనం దదౌ ||

తా|| ఆ రాజు పరమసంతుష్ఠుడు అయి ఉత్తమమైన వెండి బంగారములను ముత్యములు పగడములను కన్యాధనముగా ఇచ్చను.

దత్వా బహుధనమ్ రాజా సమను జ్ఞాప్య పార్థివమ్|
ప్రవివేశ స్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః ||

స|| బహుధనమ్ దత్వా రాజా పార్థివం సమనుజ్ఞాప్య మిథ్లేశ్వరః మిథిలాం స్వనిలయం ప్రవివేశ ||

తా|| చాలా ధనము ఇచ్చి ఆ రాజు యొక్క అనుమతిని స్వీకరించి ఆ మిథిలేశ్వరుడు తన అంతఃపురమును ప్రవేశించెను.

రాజా ప్యయోధ్యాధిపతిః సపుత్త్రైర్మహాత్మభిః |
ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ స బలానుగః ||

స|| అయోధ్యాధిపతిః సబలానుగః సపుత్త్రైః మహాత్మభిః సర్వాన్ ఋషీన్ పురస్కృత్య రాజా జగామ||

తా|| ఆ అయోధ్యాధిపతి తన బలములతోనూ పుత్త్రులతోనూ మహాత్ములైన ఋషులతోనూ కలిసి వెళ్ళెను.

గచ్ఛంతం తం నరవ్యాఘ్రం సర్షి సంఘం స రాఘవం |
ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరంతి తతస్తతః ||

స|| స ఋషి సంఘం స రాఘవం గచ్ఛంతం తం నరవ్యాఘ్రం తతః తతః ఘోరాః పక్షిణః వాచో వ్యాహరంతి స్మ|

తా|| అలాగ ఋషిసంఘములతోనూ రాఘవునితోనూ ఆ రాజు వెళ్ళుచుండగా పక్షులు ఘోరముగా శబ్దముచేయుచుండెను.

భౌమాశ్చైవ మృగాస్సర్వే గఛ్చన్తి స్మ ప్రదక్షిణమ్|
తాన్ దృష్ట్వా రాజ శార్దూలో వసిష్ఠం పర్యపృచ్చత ||

స|| మృగాస్సర్వే భౌమాశ్చైవ ప్రదక్షిణమ్ గచ్ఛన్తి స్మ| తాన్ దృష్ట్వా రాజ శార్దూలః వసిష్ఠం పర్యపృఛ్ఛత ||

తా|| మృగములన్నియూ భూమిమీద ప్రదక్షిణ పూర్వకముగా తిరుగుచుండెను. వానిని చూచి ఆ రాజశార్దూలము వసిష్ఠుని ప్రశ్నించెను.

అసౌమ్యాః పక్షిణో ఘోరాః మృగాశ్చాపి ప్రదక్షిణాః |
కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి||

స|| పక్షిణో ఘోరాః అసౌమ్యాః మృగాశ్చాపి ప్రదక్షిణాః | మమ హృదయోత్కంపి మనః విషీదతి కిమిదం (ఇతి)||

తా|| "పక్షులు ఘోరముగా శబ్దములు చేయుచున్నవి. మృగములు ప్రదక్షిణ పూర్వకముగా తిరుగుచున్నవి. నాహృదయముకంపించుచున్నది. మనస్సు కలవరపడుతున్నది".

రాజ్ఞో దశరథస్యైతత్ శ్రుత్వా వాక్యం మహాన్ ఋషిః |
ఉవాచ మథురాం వాణీం శ్రూయతామ్ అస్య యత్ఫలమ్ ||

స|| రాజ్ఞః దశరథస్య ఏతత్ వాక్యం శ్రుత్వా మహాన్ ఋషిః మధురాం వాణీం ఉవాచ | శ్రూయతాం అస్య యత్ ఫలమ్ ||

తా|| రాజైన దశరథుని ఈ మాటలను విని మహా ఋషి మధురమైన మాటలతో ఇట్లు పలికెను. "దీని ఫలమును వినుము"

ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షి ముఖాచ్యుతమ్ |
మృగాః ప్రశమయంత్యేతే సంతాపః త్యజతామయమ్ ||

స|| దివ్యం పక్షి ముఖాత్ ఘోరం భయం ఉపస్థితం | ఏతే మృగాః ప్రశమయంతి| అయమ్ సంతాపః త్యజతాం||

తా|| "పక్షిముఖముగా వచ్చినది రాబోవు ఘోరమైన భయమును, ఈ మృగములు దాని ఉపశమును సూచించుచున్నవి.కావున సంతాపము వలదు".

తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవ హ |
కంపయన్ పృథివీం సర్వాం పాతయంశ్చ ద్రుమాన్ శుభాన్ ||

స|| తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవ హ | పృథివీం కంపయన్ సర్వాన్ ద్రుమాన్ పాతయంశ్చ||

తా|| వారు అట్లు మాట్లాడుచుండగా పెద్ద గాలి వీచెను. భూమి కంపించెను. ఆన్ని చెట్లూ పెకిలింపబడెను.

తమసా సంవృతస్సూర్యః సర్వా న ప్రబభుర్దిశః |
భస్మనాచావృతం సర్వం సంమూఢమివ తద్బలమ్||

స|| సూర్యం తమసా సంవృతః | సర్వా దిశః న ప్రబభుః | సర్వం భస్మనా ఆవృతం చ తత్ బలం సంమూఢమివ ||

తా|| సూర్యుడు చీకట్లలో మునిగెను. అన్ని దిక్కులకాంతులు పోయెను. అంతా భస్మముతో కప్పబడిన ఆ సైన్యములన్నియూ నిశ్చేష్ఠులాయెను.

వసిష్ఠశ్చర్షయశ్చాన్యే రాజా చ ససుతస్తదా |
ససంజ్ఞా ఇవ తత్రాసన్ సర్వమన్యత్ విచేతనమ్||

స|| వసిష్ఠశ్చ అన్యే ఋషయశ్చ స సుత రాజా చ స సంజ్ఞా ఇవ తత్ర ఆసన్ | అన్యత్ సర్వం విచేతనమ్||

తా|| వసిష్ఠుడు తదితర ఋషులు రాజపుత్రులు రాజు చైతన్యముగలవారై ఉండిరి. మిగిలవారందరూ చైతన్యము కోల్పోయిరి.

తస్మిం స్తమసి ఘోరే తు భగ్నచ్ఛన్నేవ సా చమూః |
దదర్శ భీమ సంకాశం జటామండలధారిణమ్ ||

స|| సా చమూః తస్మిన్ భగ్నచ్ఛన్నేవ ఘోరే తమసి భీమ సంకాసమ్ జటామండలధారిణం దదర్శ ||

తా|| ఆ ఘోరమైన చీకట్లలో భస్మముతో కప్పబడిన ఆ సైన్యము భయంకరరూపముతో జటామండలములను ధరించిన వానిని చూచెను.

భార్గవం జామదగ్న్యం తం రాజరాజవిమర్దినమ్ |
కైలాసమివ దుర్దర్షం కాలాగ్ని మివ దుస్సహమ్||

స|| జామదగ్న్యం భార్గవం రాజరాజవిమర్దినం కైలాసమివ దుర్దర్షం కాలాగ్నిమివ దుస్సహమ్ (దదర్శ) ||

తా|| (అతడు) జమదగ్నికుమారుడు అయిన పరశురాముడు, కైలాసమువలే దుర్జయుడు, కాలాగ్ని వలే సహింపబడలేని వాడు

జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్షం పృథక్జనైః |
స్కంధేచాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్||
ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్||

స|| తేజోభిః జ్వలంత మివ పృథక్జనైః దుర్నిరీక్షం పరశుం స్కంధే చాసజ్య విద్యుత్గణోపమమ్ ధనుః శరముఖ్యం చ ప్రగృహ్య యథా శివం త్రిపురఘ్నం ||

తా|| జ్వలించుచున్న అగ్నిరాశులతేజస్సు కల , జనులకు నిరీక్షింపబడలేని వాడు భుజముపై గొడ్దలితోనూ, మెఱుపుతీగలవలె విద్యుత్కాంతిగల ధనుర్బాణములను ధరించి త్రిపరాంతకుడైన శివుని వలె నుండెను.

తం దృష్ట్వా భీమసంకాశమ్ జ్వలంత మివ పావకమ్ ||
వసిష్ఠ ప్రముఖా విప్రా జపహోమ పరాయణాః |
సంగతా మునయస్సర్వే సంజజల్పురథో మిథః ||

స|| వసిష్ఠ ప్రముఖాః జపహోమ పరాయణాః జ్వలంత మివ పావకం భీమసంకాశం తం దృష్ట్వామునయః సర్వే సంగతా అథో మిథః సంజజల్పుః ||

తా|| జపహోమపరాయణులగు వసిష్ఠ ప్రముఖులు ఆ మునులందరూ భయంకరమైన రూపముగల అగ్నివలే తేజరిల్లు చున్నవానిని చూచి తమలో తామే తర్కిచుచుండిరి.

కచ్చిత్ పిత్రువధామర్షీ క్షత్రం నోత్సాదయిష్యతి |
పూర్వం క్షత్రవథం కృత్వా గతమన్యుర్గతజ్వరః ||
క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితమ్ ||

స|| కచ్చిత్ పిత్రువధామర్షీ క్షత్రం న ఉత్సాదయిష్యతి | పూర్వం క్షత్ర వథం కృత్వా గతజ్వరః గతం అన్యుః ||భూయః క్షత్రస్య ఉత్సాదనం అస్య చికీర్షితం న ఖలు ||

తా|| "చంపబడిన తండ్రిని వలన కలిగిన కోపముతో క్షత్రియులను చంపుటకు వచ్చినవాడా ఏమి? పూర్వము క్షత్రియులను వధించి శమించిన వాడు. మళ్ళీ క్షత్రియుల పరిమార్చవలెనను కోరికతో రాలేదు కదా" .

ఏవముక్త్వా అర్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనమ్|
ఋషయో రామరామేతి వచో మథురమబ్రువన్ ||

స|| ఏవం ఉక్త్వా భార్గవం భీమదర్శనం అర్ఘ్యం ఆదాయ ఋషయః "రామ రామ" ఇతి మథురం అబ్రువన్ ||

తా|| ఇట్లు అనుకొని భయంకరరూపూడైన భార్గవునకు అర్ఘ్యపాద్యములిచ్చి ఋషులు "రామా రామా" అని మథురముగా పలికిరి.

ప్రతిగృహ్య తు తాం పూజాం ఋషిదత్తాం ప్రతాపవాన్ |
రామం దశరథిం రామో జామదగ్న్యో అభ్యభాషత ||

స|| ఋషిదత్తాం తాం పూజాం ప్రతిగృహ్య ప్రతాపవాన్ జామదగ్న్యః రామో అభ్య భాషత ||

తా|| ఋషులచే ఇవ్వబడిన ఆ పూజలను గ్రహించి ప్రతాపవంతుడైన ఆ జమదగ్ని కుమారుడు రాముని తో ఇట్లు పలికెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలాకాండే చతుస్సప్తతి తమ స్సర్గః||

ఈ విథముగా వాల్మీకి రామాయణములో ని డెబ్బది నాలుగవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

||om tat sat ||

 

 


||om tat sat ||