సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

!! చాలా కాలం తరువాత !!

 

 

 

@సంక్షిప్త రామాయణము !

ఇది వరకు సుందరాకాండ ప్రతి సర్గ అనువదించి రాసి నట్లు గానె ఈ సారి బాలకాండతో మొదలు పెడుతున్నాము. బాలకాండలోని డెబ్భైఏడు సర్గలు మీకు అందించాలని మా ఆశ . శ్రీభాష్యము అప్పలాచర్యులుగారు రాసిన బాలకాండ మూలాధారముగా ఈ సమర్పణ చేయబడుతుంది.

బాల కాండలోని ప్రథమ సర్గ మహర్షి వాల్మీకి నారదమహామునిని అడిగిన ప్రశ్నతో మొదలవుతుంది.

మహర్షి వాల్మీకి అడిగిన ఆ ప్రశ్న ఏమిటి ? ముల్లోకాలలో శ్రేష్ఠుడైన నరుడు ఎవడు అని !

దానికి సమాధానముగా నారద మహాముని ఇక్ష్వాకు వంశములోని శ్రీరాముని గురించి చెపుతాడు. నారద మహాముని దాదాపు తొమ్భైఐదు శ్లోకాలలో శ్రీరామకథా అంతా మహర్షి వాల్మీకికి వివరిస్తాడు . అందుకనే ఈ సర్గను సంక్షిప్త రామాయణము అని చెప్పబడుతుంది. రామయణమంతా వంద శ్లోకాలలో ఇమిడ్చడంతో రామాయణము అత్యంత క్లుప్తముగా ఉన్నదనిపిస్తుంది. నారదులవారు అంత క్లుప్తముగా చెప్పారనమాట !!! దానినే మహర్షి వాల్మీకి తన అవగాహన చేసికొని బ్రహ్మ ఇచ్చిన జ్ఞానచక్షువుతో సంపూర్ణ రామాయణముగా విశదీకరిస్తాడు !!

ఈ సంక్షిప్త రామాయణము వంద శ్లోకాలను తెలుగు లిపిలో , తాత్పర్యసహితముగా సమర్పిస్తున్నాము. ఆ వంద శ్లోకాల తాత్పర్యమును తెలుగు లోనే చదవాలనే ఆసక్తి గలవారికోసము అ వంద శ్లోకాల తాత్పర్యము తెలుగు వచనములో సమర్పించడమైనది.

ఈ వంద శ్లోకాల సంక్షిప్త రామయణము లో ఫలస్తుతి కూడా చెప్పబడినది . ఆది కూడా మీ అందరి ఆనందం కోసము సమర్పించబడినది

సంస్కృత శ్లోకాలమీద ఆశక్తి లేని వారకోసము ప్రథమ సర్గ అనగా నారదమహమునిచే చెప్పబడిన సంక్షిప్త రామాయణము వచన రూపములో సమర్పించబదినది

ఓమ్ తత్ సత్