తెలుగు లో ప్రార్థన !!

శ్రీరామ స్తోత్రాలు !

భద్రాచల శ్రీరామ స్తోత్రమ

 

 


|| ఓమ్ తత్ సత్ ||

||భద్రాచల శ్రీరామ స్తోత్రమ్||

కౌసల్యాసుత కుశికాత్మజమఖ రక్షణదీక్షిత రామ |
మాముద్ధర శరణాగతరక్షక రవికులదీపక రామ || 1 ||

దశరథనన్దన దితిసుతఖణ్డన దీనజనావన రామ |
పురహరకార్ముక విదలనపణ్డిత పురుషోత్తమ రఘురామ || 2 ||

ఖరదూషణముఖ దితిసుతకానన దావానలనిభ రామ |
శబరీగుహముఖ భక్తవరార్చిత పాదామ్భోరుహ రామ || 3 ||

వాలిప్రమథన వాతాత్మజముఖ కపివరసేవిత రామ |
వాసవవిధిముఖ సురవరసంస్తుత వారిజలోచన రామ || 4 ||

దశకన్ధరముఖ దానవమర్దన రక్షితభువన రామ |
సీతానాయక శీఘ్రవరప్రద సర్వజగన్నుత రామ || 5 ||

భర్మవిభూషణ భూషితవిగ్రహ భాధీశానన రామ |
భక్తభారతీ తీర్థసుసేవిత భద్రగిరీశ్వర రామ || 6 ||

కౌసల్యాసుత కుశికాత్మజమఖ రక్షణదీక్షిత రామ |
మాముద్ధర శరణాగతరక్షక రవికులదీపక రామ || 1 ||

||ఇతి భద్రాచల శ్రీరామ స్తోత్రమ్ సమాప్తం||

||ఓమ్ తత్ సత్||