తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

'ఆనందమనియేటి ఆభరణములు తొడిగి'

 

 


||ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| అనందమనియేటి..||

జయమంగళం నిత్య శుభమంగళం||

ఆనందమనియేటి ఆభరణములు తొడిగి,
భక్తి అనియే పట్టు చీరగట్టి
నారాయుడని యేటి నామమును ధరయించి
శ్రీకృష్ణుడూ పాలు తెచ్చి అమ్మె|| జయ||1||

శ్రీకృష్ణుడనియేటి చెలి పాలు వచ్చినవి
అచ్యుతుండనియేటి ఆవు పాలు
మాధవుండనియేటి మందపాలొచ్చినవి
అమ్మలారా మీరు పాలు కొనుడీ|| జయ||2||

ఆశపాశలు రెండు అణచునే ఈ పాలు
కామ క్రోధములను ఖండించు ఈ పాలు
కావలసినా పదవి ఇచ్చునే ఈ పాలు
కాగిన పాలు కమ్మనీ పాలు || జయ||3||

అమ్మలారా మీరు ఆకళ్ళు కొన్నారు
భయపడావద్దు పాలు తెచ్చి తీ నీ
ఈ పాలు కొని మీరు ఇంపు హర్షములతోన
పరమాత్మ పాదములు పూజింపుడీ || జయ||4||


|| ఓమ్ తత్ సత్ ||