!! Viveka Chudamani of Shankaracharya !!
Slokas 256-257
||ఓమ్ తత్ సత్||
వివేక
చూడామణి 256-257
శ్లోకములు
శ్లోకము
256:
యత్పరం
సకలవాగగోచరమ్
గోచరం
విమలబోధ చక్షుషః।
శుద్ధ
చిద్ఘనమనాది వస్తు
యద్
బ్రహ్మతత్త్వమసి
భావయాత్మని॥
యత్పరం
సకలవాక్ అగోచరమ్-
సర్వోత్కృష్టమైనది
సమస్త
వాక్కులకి అగోచరమైనది
గోచరం
విమలబోధ చక్షుషః -
విమలబోధ
చక్షుషః గోచరం
-
నిర్మలమైన
జ్ఞాన నేత్రమునకు
గోచరమగునది
శుద్ధ
చిద్ఘనమనాది వస్తు
యద్-
శుద్ధ
చిద్ఘనం అనాది వస్తుః
యత్ ( బ్రహ్మమ్) -
పరిశుద్ధమైన
చిత్తము కలది
, ఆదిలేని వస్తువు ఏ బ్రహ్మము కలదో
తత్త్వమసి
భావయాత్మని-
తత్ త్వం
అసి ఆత్మని భావయ
అది నీవే
అని మనస్సులో
భావన చేయుము:
తాత్పర్యము:
సర్వోత్కృష్టమైనది
సమస్త
వాక్కులకి అగోచరమైనది, నిర్మలమైన జ్ఞాన నేత్రమునకు
గోచరమగునది, పరిశుద్ధమైన చిత్తము
కలది , ఆదిలేని వస్తువు ఏ బ్రహ్మము కలదో అది నీవే
అని మనస్సులో భావన చేయుము
సర్వోత్కృష్టమైనది
సమస్త
వాక్కులకి అగోచరమైనది, నిర్మలమైన జ్ఞాన నేత్రమునకు
గోచరమగునది, అనే మాటలన్నీ శృతులలో
( అంటే వేదాలలో) చెప్పబడిన మాటలు. "యతో వాచా
నివర్తన్తే" అని మనము చాలాసార్లు
విన్నమాట. అంటే ఆ బ్రహ్మము వాక్కులతో చెప్పబడలేనిది
అని. అంటే అన్ని ఇన్ద్రియములకు
అతీతమైనది అని.
పరిశుద్ధమైన చిత్తము అంటే విషయములవేపు
పరిగెత్తని మనస్సు అని. అలాంతి మనస్సే బ్రహ్మము
గురించి గ్రహించగలిగినది. ఆ బ్రహ్మమే
తుది మొదలు లేనిది.
ఆ బ్రహ్మమే వేరేకాదు. ఆ బ్రహ్మమే నీవు అని
మనస్సులో
భావన చేయుము అని ఈ శ్లోక తాత్పర్యము.
ఇది గురువు
తత్ త్వమ్ అసి
అని చెప్పిన తరువాత - ఆ 'తత్' అనే బ్రహ్మము ఎలా
గుర్తించాలో, ఆ బ్రహ్మము యొక్క లక్షణముల
ద్వారా బోధిస్తున్నాడు.
తత్త్వమసి
- ఆ బ్రహ్మము
నీవే అంటూ , ఇది గురువు శిష్యుడికి చెపుతున్న ఉపదేశము.
ఈ ఉపదేశము ఇలాగే బ్రహ్మ ము చెపుతూ
ముందుకు సాగుతుంది.
శ్లోకము
257
షడ్భిరూర్మిభిః
అయోగి యోగిహృత్
భావితం న
కరణైః విభావితమ్।
బుద్ధ్యవేద్యమనవద్యభూతి
యద్
బ్రహ్మ
తత్త్వమసి భావయాత్మని॥
షడ్భిః
ఊర్మిభిః అయోగి -
ఆరు
ఊర్మములతో సంబంధము
లేనిది
యోగిహృత్
భావితం -
యోగుల
హృదయమువచేత ధ్యానింపబడినది
న కరణైః
విభావితమ్ -
ఇన్ద్రియములచే
గ్రహింపబడనిది
బుద్ధ్యా
అవేద్యమ్ -
బుద్ధిచేత
తెలియబడనిది
అనవద్యభూతి
యద్ బ్రహ్మమ్
-
నిర్దుష్టమైన
విభూతులు
కలది ఆ బ్రహ్మము
తత్త్వమసి
భావయాత్మని -
ఆ బ్రహ్మము
నీవే అని భావన
చేయుము
తాత్పర్యము:
ఆరు
ఊర్మములతో సంబంధము
లేనిది, యోగుల హృదయముచే ధ్యానింపబడినది ,
ఇన్ద్రియములచే గ్రహింపబడనిది, బుద్ధిచేత
తెలియబడనిది,
నిర్దుష్టమైన విభూతులు కలది ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మము
నీవే అని భావన చేయుము
ఆరు
ఊర్మములు అంటే ఆకలి,
దప్పులు, శోకము , మోహము, జరా , మృత్యువులు ఆరు -
వీటితో సంబంధము లేనిది మన ఆత్మ . అదే
బ్రహ్మము. ఆ బ్రహ్మమే నిర్మలమైన మనస్సుతో యోగులచేత
ధ్యానించబడినది. ఆ బ్రహ్మమే ఇన్ద్రియములచే
గ్రహింపబడనది, అంటే మాటలకి అందనిది, కంటికి కనపడనది,
పట్టుకొనడానికి వీలు లేనిది, కాని
జ్ఞానము అనే నేత్రమునకు కనపడునది.
ఇక్కడ
గురువు - బుద్ధ్యా
అవేద్యమ్ - బుద్ధిచేత తెలియబడనిది అని కూడా
అంటాడు. ఇక్కడ బుద్ధి చేత తెలియబడనిది
అన్నప్పుడు - గురువు మందబుద్ధి, వివేక జ్ఞానము
లేని అవివేకుని బుద్ధి , మంచి చెడు
తెలియని బుద్ధి అని గురువు మాట. అలాంటి బుద్ధి
బ్రహ్మము ను గుర్తించలేదు అని భావము.
వివేక
జ్ఞానము వున్నవాడి
బుద్ధి, జీవుడిని ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము వేపు
తీసుకు వెడుతుంది
ఇవన్ని
గురువు ఆత్మగురించి
బ్రహ్మము గురించి ముందు చెప్పినమాటలే. ఇప్పుడు గురువు
ఆ బ్రహ్మమే నీవు అని గ్రహించుము
అంటూ శిష్యుడికి మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాడు.
॥ఓమ్ తత్
సత్॥