!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 266-267

||ఓమ్ తత్ సత్||

వివేక చూడామణి 266-267 శ్లోకములు

శ్లోకము 266:

స్వం బోధమాత్రం పరిశుద్ధతత్త్వమ్
విజ్ఞాయ సంఘే నృపవత్ చ సైన్యే।
తదాత్మనైవాత్మని సర్వదా స్థితో
విలాపయ బ్రహ్మణి దృశ్య జాతమ్ ॥266॥

1 స్వం బోధమాత్రం పరిశుద్ధతత్త్వమ్ విజ్ఞాయ-
పరిశుద్ధమైన తత్త్వము గల ఆత్మను బోధించగల దానిని గా తెలిసికొని ;

బోధమాత్రం అంటే బోధించగల, అంటే అన్నింటిని ప్రకాశింపచేయు జ్ఞాన స్వరూపముగా అని ; అంటే ఆత్మని జ్ఞానస్వరూపముగా గ్రహించి
 
3 సంఘే నృపవత్ చ సైన్యే -
రథగజతురగ సంఘములతో కూడిన సైన్యములో రాజు వలె;

సంఘే అన్న మాట ఆత్మకి కూడా వర్తిస్తుంది - రాజుకి రథగజతురగ సంఘముల లాగా - ఆత్మకి శరీరము ఇంద్రియములు, ప్రాణము అహంకారము అన్నీ సైన్యములావుంటాయి - సైన్యములో రాజు ఎలాముఖ్యుడో అలాగే, శరీరము ఇంద్రియములు, ప్రాణము, అహంకారములలో ఆత్మ జ్ఞానస్వరూపముగా గ్రహించి ముందుకు వెళ్ళాలి అన్నమాట.

4 తదాత్మనైవ ఆత్మని సర్వదా స్థితో
ఆ ఆత్మ చేతనే ఆత్మలో ఎల్లప్పుడూ నిలిచి;

ఆ జ్ఞానస్వరూపమైన బుద్ధితో ఆత్మలో నిలిచి, ఏం చెయ్యాలి ? అంతా కనపడేది అంతా బ్రహ్మమే అని గ్రహించాలి. ఆ మాట ఆఖరి పాదములో వస్తుంది.

5 విలాపయ బ్రహ్మణి దృశ్య జాతమ్ -
 దృశ్యరూపములో పుట్టిన సమస్తము బ్రహ్మములో విలీనము చేయుము;

అంటే దృశ్యరూపములో పుట్టిన సమస్తము బ్రహ్మమే అని గ్రహించుము అని.

266 శ్లోక తాత్పర్యము:

"రథగజతురగ సంఘములతో కూడిన సైన్యములో రాజు వలె, పరిశుద్ధమైన తత్త్వము గల, శరీరము, ఇంద్రియములు, ప్రాణము, అహంకారములతో కూడిన ఆత్మను అన్నింటిని ప్రకాశింపచేయు జ్ఞానస్వరూపముగా గ్రహించి; ఆ జ్ఞానస్వరూపమైన బుద్ధితో ఆత్మలో నిలిచి, దృశ్యరూపములో పుట్టిన సమస్తము బ్రహ్మముమే అని గ్రహించుము".

శ్లోకము 267:

బుద్ధౌ గుహాయాం సదసద్విలక్షణమ్
బ్రహ్మాస్తి సత్యమ్ పరమద్వితీయమ్।
తదాత్మనా యోఽత్ర వసేద్గుహాయాం
పునర్న తస్యాంగగుహాప్రవేశః॥267॥

బుద్ధౌ గుహాయాం సదసద్విలక్షణమ్-
బుద్ధి అనేగుహలో సత్ అసత్ ల కన్న భిన్నమైన

బ్రహ్మ అస్తి సత్యమ్ పరమద్వితీయమ్ -
అద్వితీయమైన, సత్యస్వరూపమైన బ్రహ్మము కలదు:

తదాత్మనా యోఽత్ర వసేద్గుహాయాం -
ఆ బ్రహ్మస్వరూపమైన ఆత్మతో ఎవరు ఆ గుహలలో నివశించునో

ఇక్కడ గుహ అంటే స్థూలసూక్ష్మదేహాత్మకము అగు శరీరములో వుండే హృదయము అనబడే గుహ అన్న మాట. ఆ బ్రహ్మమునే ధ్యానిస్తూ ఆ గుహలో వుంటే మోక్షము వస్తుంది ; ఆమాట ఆఖరి పాదములో వస్తుంది.

4 పునః న తస్య అంగగుహాప్రవేశః -
  తస్య పునః న అంగగుహాప్రవేశః -
  అట్టివాడికి మళ్ళీ ఆ స్థూలసూక్ష్మదేహాత్మకము అగు గుహలో ప్రవేశము వుండదు:

అంటే అట్టి వానికి మొక్షము వస్తుంది అని.

267వ శ్లోక తాత్పర్యము:

బుద్ధి అనేగుహలో సత్ అసత్ ల కన్న భిన్నమైన అద్వితీయమైన, సత్యస్వరూపమైన బ్రహ్మము కలదు; ఆ బ్రహ్మస్వరూపమైన ఆత్మతో ఎవరు, స్థూలసూక్ష్మదేహాత్మకము అగు శరీరములో వుండే హృదయము అనబడే ఆ గుహలో నివశించునో, అట్టివాడికి మళ్ళీ ఆ స్థూలసూక్ష్మదేహాత్మకము అగు గుహలో ప్రవేశము వుండదు అంటే మోక్షము వచ్చును.

॥ఓమ్ తత్ సత్॥


_____________________________________________




















 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267

Om tat sat !

 

 

 

    •