Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 48

Story of Ahalya !

 

బాలకాండ
నలుబది ఎనిమిదవ సర్గము
( అహల్యాశాప వృత్తాంతము)

పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పర సమాగమే |
కథాంతే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్ ||

స|| తత్ర పరస్పర సమాగమే కుశలం పృష్ట్వా కథాంతే సుమతిః మహామునిం వ్యాజహార |

తా|| అక్కడ పరస్పర సమాగమనములో కుశలములను అడిగి చివర సుమతి మహామునిని ఇట్లు అడిగెను.

ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ |
గజసింహగతీ వీరౌ శార్దూల వృషభోపమౌ ||

స|| తే భద్రం (భవతు) | ఇమౌ కుమారౌ దేవతుల్య పరాక్రమౌ శార్దూల వృషభోపమౌ గజసింహగతీ వీరౌ |

తా|| మీకు శుభమగు గాక . ఈ కుమారులిద్దరూ దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు శార్దూలము వృషభముల సదృశముగానున్నవారు , గతిలో గజ సింహములవలె నున్నవారు.

పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతూణీ ధనుర్థరౌ |
అశ్వినావివ రూపేణ సముపశ్థితయౌవనౌ ||

స|| (తే) పద్మ పత్ర విశాలాక్షౌ | ఖడ్గతూణీ ధనుర్ధరౌ | రూపేణ అశ్వినా ఇవ | సముపస్థిత యౌవ్వనౌ |

తా|| పద్మ పత్రములవలే విశాలమైన నేత్రములు కలవారు, ఖడ్గము ధనస్సు బాణములను ధరించినవారు. రూపములో అశ్వినీ దేవతలవలె నున్నవారు. యౌవ్వనమునకు తగిన వయస్సు కలవారు.

యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ |
కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే ||

స|| ( తే) దేవలోకాద్ అమరౌ ఇవ | యదృచ్చయఏవ గాం ప్రాప్తౌ | కథం పద్భ్యాం ఇహ ప్రాప్తః | కిమర్థం కస్య వా |

తా|| వీరు దేవలోకమునుంచి వచ్చిన అమరులవలె నున్నవారు, భాగ్యవశముననే ఇచ్చటికి వచ్చినవారు. ఇచటికి పాదములతో (నడుచుచూ) ఎట్లు వచ్ఛిరి ? వీరెవరు ఎందుకు వచ్చిరి ?

భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరమ్ |
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః |

స|| అంబరం చంద్రసూర్యావివ ఇమం దేశం భూషయంతా | తే ప్రమాణాంగిత చేష్టితైః పరస్పరస్య సదృసౌ |

తా|| ఆకాశములో సూర్యచంద్రుని వలె వీరు ఈ దేశమునకు భూషణము వలె నున్నవారు.తమ చేష్టలతో కదలికతో ఒకరికినొకరు సమానరూపముగలో నున్నవారు.

కిమర్థం చ నరశ్రేష్ఠౌ సంప్రాప్తౌ దుర్గమే పథి |
వరాయుధధరౌ వీరౌ శ్రోతుమిఛ్ఛామి తత్త్వతః ||

స|| వరాయుధధరౌ వీరౌ నరశ్రేష్టౌ కిమర్థం దుర్గమ్ పథి. | శ్రోతుమిచ్చామి తత్త్వతః |

తా|| శ్రేష్ఠమైన ఆయుధములను ధరించి ఎందుకు ఈ దుర్గమమైన అరణ్యమునుంచి వచ్చుచున్నారు. అది అంతయూ వినుటకు కోరికగాఉన్నది.

తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్ |
సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వధం తథా ||

స|| తస్య తత్ వచనం శ్రుత్వా సిద్ధాశ్రమ నివాసం తథా రాక్షసానాం వథం చ యథావృత్తం న్యవేదయత్ |

తా|| ఆయనయొక్క ఆ మాటలను విని ఆ మునిపుంగవుడు సిద్ధాశ్రమ నివాసము , రాక్షస వథ జరిగినదంతయూ చెప్పెను.

విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః |
అతిథీ పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ |
పూజయామాస విధివత్ సత్కారార్హౌ మహాబలౌ ||

స|| విశ్వామిత్రః వచః శ్రుత్వా రాజా తౌ దశరథస్య పుత్రౌ పరమౌ అతిథీ ప్రాప్తౌ పరమహర్షితః విధివత్ సత్కారార్హౌ మహాబలౌ పూజయామాస |

తా|| విశ్వామిత్రుని వచములను విని ఆ రాజు దశరథపుత్రులు అతిథులుగా పొందినందుకు అత్యంత ఆనందముతో మహాబలవంతులు సత్కారమునకు అర్హులైన వారిని యథావిథిగా పుజించెను.

తతః పరమసత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ|
ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుః మిథిలాం తతః ||

స|| తతః రాఘవౌ సుమతేః పరమ సత్కారం ప్రాప్య తత్ర నీశాం ఏకామ్ ఉష్య మిథిలాం జగ్మతుః |

తా|| పిమ్మట రామ లక్ష్మణులు ఇద్దరూ మంచి సత్కారములను అందుకొని, అచట ఒక రాత్రి గడిపి మిథిలకు పయనమైరి.

తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీమ్ శుభామ్ |
సాధు సాధ్వితి శంసంతో మిథిలాం సమపూజయన్ ||

స|| జనకస్య పురీం శుభాం మిథిలాం దృష్ట్వా సర్వే మునయః సాధు సాధ్వితి శంసంతో తాం సమపూజయన్ |

తా|| శుభకరమైన జనకునియొక్క నగరమైన మిథిలానగరమును చూచి మునులందరూ బాగు బాగు అని కొనియాడుతూ పూజించిరి.

మిథిలోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః |
పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుంగవమ్ ||

స|| రాఘవః తత్ర మిథిలోపవనే ఆశ్రమం పురాణం నిర్జనం రమ్యం దృశ్య మునిపుంగవం ప్రపచ్ఛ |

తా|| అక్కడ రాఘవుడు మిథిలాసమీపములో నున్న పురాతనమైన నిర్జనముగానున్న ఆశ్రమమును చూచి మునిపుంగవుని ఇట్లు అడిగెను.

శ్రీమదాశ్రమసంకాశం కిన్విదం మునివర్జితమ్ |
శ్రోతు మిచ్ఛామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః ||

స|| హే భగవన్ కిన్విదం శ్రీమదాశ్రమ సంకాశం మునివర్జితం | కస్య అయం పూర్వ ఆశ్రమః | శ్రోతుమిచ్ఛామి |

తా||ఓ భగవన్ ! ఆశ్రమ లక్షణములతో వున్న ఈ ఆశ్రమము ఎందుకు మునివర్జితమైనది ? ఇది పూర్వము ఎవరి ఆశ్రమము ? అది వినుటకు కోరికగా నున్నది.

తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్యవిశారదః |
ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః ||

స|| రాఘవేణ ఉక్తం తత్ వాక్యం శ్రుత్వా వాక్య విశారదః మహాతేజాః విశ్వామిత్రః మహామునిః ప్రత్యువాచ |

తా|| రాఘవుడు చెప్పిన ఆ వాక్యములని విని మహాతేజోవంతుడు, వాక్య విశారదుడు అయిన మహాముని విశ్వామిత్రుడు ఇట్లు ప్రత్యుత్తమిచ్చెను.

హంత తే కథయిష్యామి శ్రుణు తత్త్వేన రాఘవ |
యస్యైతదాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా ||

స|| హే రాఘవ | హంత తే కథయిష్యామి తత్త్వేన | ఏతద్ ఆశ్రమపదం మహాత్మనా యస్య కోపాన్ శప్తం (ఇతి) |

తా|| ఓ రాఘవా ! నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను. ఈ ఆశ్రమపదము ఒక మహాత్ముని కోపకారణముగా శపించ బడినది.

గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైరపి సుపూజితః ||

స|| హే నరశ్రేష్ఠ ! పూర్వం గౌతమస్య దివ్య సంకాశః సురైరపి సుపూజితః ఆశ్రమం ఆసీత్ |

తా|| ఓ నరశ్రేష్ఠ | పూర్వము ఇది దేవతలచే పూజింపబడి దివ్య శోభలతో విలసిల్లుచూ ఉండెడి గౌతముని ఆశ్రమము.

స చేహ తప అతిష్ఠత్ అహల్యా సహితః పురా |
వర్షపూగాననే కాంశ్చ రాజపుత్త్ర మహాయశః ||

స|| హే రాజపుత్ర ! పురా స చ ఇహ మహాయశః అహల్యా సహితః అనేకాంశ్చ వర్షపూగాన్ తప అతిష్ఠత్|

తా|| ఓ రాజపుత్ర ! పూర్వము ఆ మహాయశోవంతుడు అహల్యతో సహ చాలా సంవత్సరములు ఇచట తపస్సు చేసెను.

తస్యాంతరం విదిత్వా తు సహస్రాక్షశ్శచీపతిః
మునివేషధరో అహల్యామ్ ఇదం వచనమబ్రవీత్ |

స|| తస్య అంతరం విదిత్వా సహస్రాక్షః శచీపతిః మునివేషధరః అహల్యాం ఇదం వచనం అబ్రవీత్ |

తా|| ఆ ముని లేని సమయము చూచి సహస్రాక్షుడైన ఇంద్రుడు ఆ ముని వేషములో వచ్చి ఆహల్య తో ఇట్లు పలికెను.

ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినస్సుసమాహితే |
సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే ||

స|| హే సుమధ్యమే ! అర్థినః ఋతుకాలం న ప్రతీక్ష్యంతే | అహం త్వయా సహ సంగమం ఇచ్ఛామి |

తా|| "ఓ సుందరీ ! కోరికగలవారు ఋతుకాలములకు ప్రతీక్షచేయరు. నే నీతో సంగమించ కోరుచున్నాను".

మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్ ||

స|| హే రఘునందన ! మునివేషం సహస్రాక్షం దేవరాజ విదిత్వాదుర్మేథా కుతూహలాత్ మతిం చకార |

తా|| ఓ రఘునందన ! మునివేషమును ధరించినది సహస్రాక్షుడని తెలిసి కుతూహలముతో మనస్సులో ఆలోచించెను.

అథాబ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్థేనాంతరాత్మనా |
కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్ర మితః ప్రభో ||
అత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష మానద |

స|| అథ కృతార్థేనాంతరాత్మనా సురశ్రేష్ఠం అబ్రవీత్ " ప్రభో కృతార్థాస్మి. గచ్ఛ శీఘ్రం ఇతః |దేవేశ ఆత్మానంచ మాంచ సర్వథా రక్ష మానద |

తా|| అప్పుడు తన కోరిక తీర్చుకొని ఇంద్రునితో ఇట్లు పలికెను. " ఓ ప్రభో నేను కృతార్థురాలను. శీఘ్రముగా ఇచటినుండి వెళ్ళుము. ఓ ఇంద్రా నీ యొక్క నా యొక్క గౌరవములను నిలుపుము ".

ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్ |
సుశ్రోణీ పరితుష్టోsస్మి గమిష్యామి యథాగతమ్ ||

స|| ఇంద్రస్తు ప్రహసన్ అహల్యాం ఇదం వాక్యం అబ్రవీత్ | హే సుశ్రోణీ పరితుష్టోస్మి గమిష్యామి యథా గతం |

తా|| ఇంద్రుడు కూడా నవ్వి ఇట్లు పలికెను." ఓ సుందరీ !సంతోషము. వచ్చిన విథముగనే పోయెదను".

ఏవం సంగమ్య తు తదా నిశ్చక్రామోటజాత్ తతః |
స సంభ్రమాత్ త్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి ||

స|| హే రామ ! తదా ఏవం సంగమ్య గౌతమం ప్రతి శంకితో స సంభ్రమాత్ తతః త్వరన్ నిశ్చక్రామ ఉటజాత్ |

తా|| ఓ రామ ! అవిధముగా సంగమించిన తర్వాత , ఆప్పుడే గౌతమముని వచ్చు నేమో అని భయముతో త్వరగా ఆశ్రమమునుండి బయతకు వచ్చెను.

గౌతమం సదదర్శాథ ప్రవిశంతం మహామునిమ్|
దేవదానవ దుర్దర్షం తపోబలసమన్వితమ్ ||

స|| అథ స దేవదానవ దుర్దర్షం తపోబలసమన్వితం ప్రవిశంతం మహామునిం గౌతమం దదర్శ |

తా|| అప్పుడు అతడు దేవదానవులకు అజేయుడు తపోబలసమన్వితుడు అగు మహాముని గౌతముడు ప్రవేశించుట చూసెను.

తీర్థోదకపరిక్లిన్నం దీప్యమానమివానలమ్ |
గృహీత సమిధం తత్ర సకుశం మునిపుంగవమ్ ||
దృష్ట్వా సురపతిః త్రస్తో వివర్ణsవదనో భవత్ |||

స|| తత్ర తీర్థోదక పరిక్లిన్నం అనిలమివ దీప్యమానం సకుశం గృహీత సమిధం మునిపుంగవం (తం) దృష్ట్వా త్రస్తః సురపతిః వివర్ణ వదనో అభవత్ |

తా|| తీర్థ జలములలో స్నానమొనరించి , అగ్నివలే తేజరిల్లు చున్న , కుశలను సమిథలను తీసుకు వచ్చుచున్న ఆ మునిపుంగవుని చూచి త్రస్తాసురుని చంపిన సురపతి వివర్ణవదనుడాయెను.

అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః |
దుర్వృత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్ ||

స|| అథ మునిః మునివేషధరం దుర్వృత్తం సహస్రాక్షం దృష్ట్వా రోషాత్ వృత్త సంపన్నో (ఇదం) వచనమ్ అబ్రవీత్ |

తా||అప్పుడు ఆ ముని , మునివేషము ధరించిన దుష్టవర్తన గల సహస్రాక్షుని చూచి కోపముతో ఇట్లు పలికెను.

మమరూపం సమాస్థాయ కృతవానపి దుర్మతే |
అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్త్వం భవిష్యసి ||

స|| హే దుర్మతే మమరూపమ్ సమాస్థాయ అకర్తవ్యం కృతవాన్ తస్మాత్ విఫలత్వం భవిష్యసి |

తా|| ఓ దుర్బుద్ధి కలవాడా ! నారూపము ధరించి చేయకూడని పని చేసినవాడవు. నీవు విఫలత్వము పొందెదవు గాక !

గౌతమేనైవముక్తస్య సరోషేణ మహాత్మనా |
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ ||

స|| గౌతమేన సరోషేణ ఏవముక్తస్య తత్ క్షణాత్ సహస్రాక్షస్య వృషణౌ పేతతుః |

తా|| గౌతమునిచే కోపములో ఇట్లు చెప్పబడిన వెంటనే ఆ ఇంద్రునియొక్క వృషణములు భూమిపై బడినవి .

అథ శప్త్యా స వై శక్రం అహల్యామపి శప్తవాన్ |
ఇహ వర్షసహస్రాణి బహూని త్వం నివత్స్యసి ||

స|| స అథ శక్రం శప్త్యా అహల్యం అపి శప్తవాన్ | త్వం ఇహ బహూని వర్ష సహస్రాణి నివత్స్యసి|

తా|| ఆ ముని అవిధముగా ఇంద్రుని శపించి పిమ్మట అహల్యను కూడా శపించెను. " నీవు ఇక్కడ చాలా వేలకొలది సంవత్సరములు నివశించెదవు"

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ |
అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేsస్మిన్ నివత్స్యసి ||

స|| అస్మిన్ ఆశ్రమే వాయుబక్షా నిరాహారా సర్వభూతానాం అదృశ్యా తప్యంతీ నివత్స్యసి |

తా|| ఈ ఆశ్రమములో వాయువునే భక్షిస్తో ఆహారములేకుండా , అన్ని భూతములకు అదృశ్యముగా తపముచేస్తూ నివశించెదవు.

యదాచైతద్వనం ఘోరం రామో దశరాథత్మజః |
ఆగమిష్యతి దుర్దర్షః తదా పూతా భవిష్యసి ||

స|| యదా దుర్దర్షః రామః దశరథాత్మజః ఏతత్ ఘోరం వనమ్ ఆగమిష్యతి తదా పూతా భవిష్యసి |

తా|| ఎప్పుడు అజేయుడు దశరథాత్మజుడు అయిన రాముడు ఈ ఘోరమైన వనమునకు వచ్చునో అప్పుడు నిజ స్వరూపము పొందెదవు.

తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జితా |
మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి ||

స|| దుర్వృత్తే తస్య అతిథ్యేన లోభ మోహ వివర్జితా ముదా యుక్తా మత్సకాశే స్వం వపుః ధారయిష్యసి |

తా|| ఓ దుష్ఠవర్తన గలదానా ! ఆయన ఆతిథ్యముతో లోభ మోహములు పోయి సంతోషముతో నన్నుకలిసి నీ రూపమును ధరించెదవు.

ఏవముక్త్వా మహతేజా గౌత మో దుష్ఠచారిణీమ్|
ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణసేవితే |
హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః ||

స||మహాతపాః మహాతేజా గౌతమః దుష్ఠచారిణీం ఏవమ్ ఉక్త్వా ఇమం ఆశ్రమమ్ ఉత్సృజ్య పుణ్యే సిద్ధ చారణ సేవితే హిమవత్ శిఖరే తపః తేపే |

తా|| మహాతపోవంతుడైన మహాతేజస్సుగల గౌతముడు అ దుష్ఠ చారిణితో అట్లు చెప్పి ఈ ఆశ్రమమును వదిలి సిద్ధులు చారణులు సేవించు హివత్ శిఖరములపై తపము ఆచరించెను.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే అష్టచత్వారింశ స్సర్గః సమాప్తం ||

|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలో నలభైఎనిమిదవ సర్గ సమాప్తము ||

|| ఒమ్ తత్ సత్ ||

|| Om tat sat ||